డాంబికుడు మాల్-రక్స్ —1

డాంబికుడు మాల్-రక్స్ —1
                    ఫ్రెంచ్ రచయిత ,విమర్శకుడు ,కళాచరిత్ర కారుడు ,,యుద్ధ వీరుడు ,రాజకీయనాయకుడు ,మంత్రి డాంబికుడు ఆండ్రే మాల్ రక్స్ .జననం-03 -11 -1901 -మరణం -23 -11 -1976
la condition humane ,the voice of silence ,history and philosophy of world art ,museum without walls మొదలైన గ్రంధాలు రాశాడు .సంపన్న కుటుంబం జన్మించాడు .౧౯౨౯ లో ఆఫ్ఘనిస్తాన్ లో గ్రీకో బుద్ధిష్ట్ కళను గుర్తించాడు .౧౯౩౪ లో అరబియా లో queen sheebaa  నగరాన్ని కనుగొన్నాడు .1926 లో మొదటి నవల The temptations of the West రాశాడు .ల కండిషన్ హుమనే కు మంచి పేరు వచ్చింది .మాస్టర్ పీస్ అన్నారు  అంతా .ఫ్రెంచ్ నవలాకారులలో అగ్రేసరుడు అయాడు .ఆయన వచన రచన కవిత్వం లాగా వుంటుంది .అద్భుత జ్ఞాపకశక్తి కలవాడు .అపారజ్ఞాన సంపన్నుడు .1936  లో స్పానిష్ యుద్ధం తర్వాత స్పైన్ వెళ్లి అక్కడినుంచి అమెరికా చేరి ,స్పైన్ కు వైద్య సేవ అందేట్లు చేశాడు .L-espoir సినిమా కు దర్శకుడయాడు .ఆ సినిమా రెండవ ప్రపంచయుద్ధం తర్వాతే విడుదల అయింది .ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫ్రెంచ్ ట్యాంక్ unit లో చేరాడు .1944 కాల్పుల్లో గాయపడ్డాడు .బందీ కూడా అయాడు .ఫ్రీ ఫ్రెంచ్ brigadior  ఏర్పరచి కమాన్దర్ అయాడు .చాలా ప్రతిభ తో శక్తివంత మైన నవలలు రాశాడు .1945    తర్వాత చరిత్రకారునిగా ,క్రిటిక్ గా మారాడు .కళా విమర్శకుడు గా మంచి పేరు వచ్చింది .తన జీవిత చరిత్రను Antimemoirs   గా 1967 లో రాశాడు  ఇదంతా ఒక పార్శ్వ్యం .దీనికి మించి అతనిలోని ఇంకా చాలా పార్శ్వ్యాలు వున్నాయి .వాటిలోకి ప్రవేశిద్దాం .
                            1920  లో కళలకు పుట్టినిల్లు అయిన పారిస్ నగరం నుంచి మిలిటరీ ప్రభుత్వాలైన కంబోడియా ,చైనా ,స్పైన్ దేశాల మీదుగా ,అంతర్యుద్ధ కాలమ్ లో మారాడు .సరదాగా అబదాలాడే నైజం వున్న వాడు .గొప్పలు చెప్పుకోవటం మహా ఇష్తం .చైనా కమ్యూనిస్ట్ అధినేత మావో తనకు మంచిమిత్రుడు అనే వాడు .అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ను ఒక్కసారి మాత్రమే చూసినా ,ఆయన తనను ట్యూటర్ గా వున్దమన్నాడని కోతలు కోసేవాడు .యుద్ధభూమికి దగ్గరలో తనే చేసుకున్న గాయం తో ఫ్రెంచ్ యుద్ధవీరుడు అయి పోయాడని చెప్పుకుంటారు .అతని రేనైసేన్స్ కధలు ,గాధలు విపరీతం గా ప్రచారం పొందాయి .అక్షదేశాలు యుద్ధం ప్రారంభించాతానికి కొన్ని వారాల క్రితమే అతను సైన్యం లో చేరాడు అనీ ,ఒక విమర్శ కూడా వుంది .తనను గురించి చెప్పుకున్న గొప్పలుకోతలు దాటే టట్లు చెప్పే నేర్పున్న వాడు . ..
                          మాల్ రాక్స్ మంచి చిత్రకారుడు .వందకు పైగా అద్భుత చిత్రాలు గీశాడు .అవి మ్యూజియం లలో ,యాత్రా ప్రదర్శనల లో వన్నె కెక్కాయి .ఫ్రాన్సు దేశ సైన్యాధ్యక్షుడు (జనరల్),ఆ తర్వాత దేశాధ్యక్షుడు అయిన డేగాల్లీ కు తానే దిక్కు అని బడాయి కబుర్లు చెప్పేవాడు .దేగాలీ ఏ పనీ సరిగ్గా చేయడు ,చేయలేదు అని ఒక statement పారేశాడు ఫ్రాన్సు ప్రజలకు యామి కావాలో దాన్ని డేగాల్లి చేయలేదని విమర్శించాడు .మాల్ రాక్స్ అంటేనే wine ,whisky  తాగుడు గాడు అని అభిప్రాయం వుంది .జనరల్ డేగాల్లి ని ఆరు ఏళ్ళు ఆరాధించి ,ఆ తర్వాత మళ్ళీ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాడు .కంయూనిస్తులనే ఎందుకో చిరాకు .వాళ్ళు కోరుకొనేది సరైనదే నని అయితే వారు చేసే తీరు నీచం గా వుంటుంది అనే వాడు .మాల్ రాక్స్ charactor  అపకేంద్రగామి (సెంట్రిఫుగల్ )గా కంటే (centripetal )కేంద్రాకర్షణ గామి గా వుండే వాడు .1958  లో డేగాల్లి అధికారం హస్తగతం చేసుకోవటం ప్రారంభించాడు .డేగాల్లి మంత్ర్వర్గం లో మాల్ రాక్స్ సంస్కృతి శాఖ మంత్రి గా పని చేశాడు .దాన్ని గురించి పత్రికల   వారికి చెబుతూ ”నేను చేబట్టే మంత్రిత్వ శాఖ శ్మశానం లాంటిది .దాని పని అయిపోగానే ,నన్ను కలిసి మాట్లాడమని కోరుతాను ”అన్నాడు .అతని దృష్టి లో ఫ్రాన్సు దేశం లో రెండు విహార స్థలాలు  వునాయత .ఒకటి అధ్యక్షుడు డేగాల్లి ,రెండు తాను .
                    ఫ్రాన్సు దేశపు జనరల్ radio గురించి మాట్లాడుతూ ”ఇదొక దెయ్యపు నౌక -అది ఇంకా కుంచిన్చుకుపోలేదు .రాజకీయ పక్షాలకు ధర్మ సంస్థ గా వుంది .పదవిలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ ,తనకు అనుకూలం గా వున్న ప్రతి వారికీ ,ముఖ్యం గా కమ్యూనిస్టుల నుంచి వలస వచ్చిన వాళ్లకు నిలయం గా వుంది .”అన్నాడు .రాజకీయ సంమేలలో దీన్నే ప్రధానం గా ఎంచుకుంటారు .దీన్ని నడపటానికి కనీసం యాభై మంది సాంకేతిక నిపుణులు వుంటే చాలు .అన్నాడు
                     గాలిజం (డేగాలిజం )లోని వామ భావాలకు మాల్ రాక్స్ ప్రతినిధి .మాల్ రాక్స్ ను ”జనరల్ దేగాల్లి daancer ”అనే వారు .అంటే ఆయన చెప్పినట్లు ఆడేవాడు అని భావం .ప్రపంచం లోని ప్రజాస్వామ్య దేశాలలో సంస్కృతికి ఒక మంత్రి ని ఏర్పాటు చేసిన అతి కొద్ది దేశాల్లో ఫ్రాన్సు ఒకటి అయింది అని గొప్పగా చెప్పాడు .ఇందులో నిజం లేక పోలేదు .1958  డిసెంబర్ 21 న డేగాల్లి అయిదవ రిపబ్లిక్ అయిన ఫ్రాన్సు కు మొదటి అధ్యక్షుడు అయాడు .మాల్ రాక్స్ ” Ministre -da -etat”అంటే సాంస్కృతిక శాఖకు అమాత్యుడు అయాడు .కేబినేట్ సమేవేశాల్లో డేగాల్లి కుడి పక్కనే కూర్చునే వాడు .అంటే చాలా ప్రాముఖ్యమైన స్థానం అని అర్ధం చేసుకోవాలి .పదేళ్ళ పరిపాలన లో మంత్రిగా 26  సార్లు మాత్రమే అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఘనుడు .మాల్ రాక్స్ ను సహజ మేధావి గా ,ఆలోచనాపరుడు గా అందరు భావిస్తారు .”సంస్కృతి అంటే ఏమిటో తెలియని ఏకైక మంత్రిని నేనే ”అని గప్పాలు పలికాడు .అయితే డేగాల్లి అతన్ని తమ జాతి ఉత్తమోత్తమ రచయిత గా అందరికి చెప్పేవాడు .కళా చరిత్ర మంత్రిగా వున్నవాడు చివరికి ఉత్త చరిత్ర మంత్రి అయాడు పాపం ”.విషయాన్ని విష్పస్తం గా చెప్పలేని వారు హృదయం లేని వారు ”.అన్నాడు ఒక సారి .భావ వ్యక్తీకరణ ,ఆత్మ ,ఆధ్యాత్మికత క్రైస్తవ కళ లో వున్నాయని భావించాడు .జగత్ప్రసిద్ద చిత్రకారుడు డావిన్సి తాను గీసినా వర్జిన్ చిత్రం లో ,నవ్వులో వీటిని చూపాడు అని విశ్లేషించాడు .అందుకే దాన్ని secular చిత్రం గా మలిచాడని అభిప్రాయ పడ్డాడు .లియోనార్డో డావిన్సి స్త్రీల ఆత్మను మనోహరం గా దర్శింప   జేశాడుఅని నిర్ధారించాడు
              ”  రాజకీయాగ్ని లో ఇనుము ”అని మాల్ రాక్స్ ను అనే వారు .అధ్యక్షుడు దేగాల్లిని సరదాగా ”the girafee ”అన్నాడు .నిజం గా దేగాల్లిఅలానే   వుండే వాడు ఆరడుగులు పైన వుండే అందగానిలా .”జెనరల్ దేగాల్లి సాధించిన ఏకైక విజం మాల్ రాక్స్ ‘అని డబ్బా కొట్టుకొనేవాడు .”అయితే నేనెప్పుడు ఆయనకు ఆ మాట చెప్పలేక పోయాను ”అని మరోముక్తాయింపు ఇచ్చాడు .డేగాల్లి తనను” ఫ్రాన్సు దేశం తో అభిన్నుడు” .గా భావించుకొనే వాడు .పాపం మాల్ రాక్స్ తానే డేగాల్లి అనుకొనేవాడు .మాల్ రాక్స్ ఆఫీసు లోని లాంప్ నెపోలియన్ ది అని గర్వం గా చెప్పుకొనే వాడు .అలేక్జాన్దర్ ద్యూమాస్ కూర్చున్న చోటే తానూ కూర్చుని పని చేస్తున్నందుకు సంతోషం గా వుండేది ఆయనకు .తన పనిథేఎరు ను గురించి వివరిస్తూ ”నాకు కావలసింది దుస్సాహసం ,వెర్రి నేను చేయగలిగింది మాత్రం ఏమీ లేదు ”అని తనను ఆవిష్కరించుకునేవాడు .విపరీతం గా స్మోకే చేసే” SMO -కింగ్ ”అతను .తనకు నోబెల్ బహుమతి రాలేదని తెగ బాధ పడే వాడు .నోబెల్ పురస్కారం రా తగిన అర్హత తనకే ఉందనే వాడు .అమెరికా నవలా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే కు నోబెల్ పురస్కారం ప్రకటించినపుడు ,అతని కంటే తానే గొప్పవాడినని అన్నాడు .ఆనాటి సాటి రచయితలలో తానే సిఖరాయమానం అని ప్రగల్భాలు పలికాడు .జీన్పాల్ సాత్రే ,అలేగాన్ లు తన తర్వాతే అని చెప్పుకున్నాడు .అమెరికా రచయిత జాన్ స్తీన్బెక్ కు నోబెల్ వస్తే పెదవి విరిచిన ప్రబుద్ధుడు మాల్ రాక్స్ .
                                        మిగిలిన విషయాలు ఇంకో సారి .
                                              మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -20 -10 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.