పద్మ ప్రాభ్రుతకం (తామర పువ్వు కానుక )–అలంకార సంపద –3
పేర్లు పెట్టటం లోను మహాకవి శూద్రకుడు మంచి చమత్కారం చేశాడు .ఒక విటుడి పేరు ”హ్రీ రమ్యుడు ” అంటే సిగ్గుతో శోభించేవాడు అని అర్ధం .కాని ఇక్కడ వీడు పట్టపగలే శృంగారక్రీద చేసే వాడు . అందుకే వాడికి ”పట్టపగటి ప్రణయ కళా పట్టభద్రుడు ”అని సరదా బిరుదు తగిలించాడు .ఎగతాళి చేయటం ఒక కళ అట .అది ఎలాంటిది అంటే ”ఆకారం పైన వేసిన ముసుగు కూడా అదే ఆకారాన్ని ధరించి నట్లుందట ””నడుస్తున్న కామ రధం కాడి విరుగకొట్ట రాదు ”అనే విట సామెత కూడా చక్కగా సరిపోయేట్లు చెప్పాడు .దీవెన కోద్కా అదే స్థాయిలో వుండాలి కదా ”అవిరళ కామోత్చవోస్తూ ”
అని గార్గి గారి అబ్బాయిని ఆశీర్వదిస్తాడు .సందర్భానికి తగినట్లుగా .ఇదే విధం గా మగధసుందరి అనే గణిక (వేశ్య ) బ్రహ్మచారి గా ఉంటూ వసంతుడిని ఉపాశిస్తోందని తెలిసి ”దంతపు గాట్లతో నీ పెదవులు నలిగినట్లున్నాయి.నీ అంతకు నీవే నియమాలు పెట్టుకోవటం ఎలా వుందంటే ”వ్రతము భంగంము కాని చాన్ద్రాయనమున ముద్దులు ఉద్యాపనంమగు సుద్ది తోచే ”అంటాడు .వ్రతభంగం లేని చాంద్రాయణం లో ముద్దులే వ్రతం చివర చేసే ఉద్యాపనం అని భలే చాకచక్యం గా ,వ్రాతభాష లో సమర్ధించాడు కవి .”తోట అంటే మదన కర్మాంత భూమి ”అని చక్కని పేరు పెట్టాడు .
సిగ్గు అనేది యుక్త వయసు వచ్చిన ఆడడానికి ,పైపెచ్చు ప్రౌఢ కాని ముద్దు గుమ్మకు అరణపు సొమ్ము లాంటిది .అంటే సహజమైనది కాదు .–ఎరువు తెచ్చుకున్నది అంటాడు చమత్కారం గా .ఒకడే అనేకమంది స్త్రీలను కట్టుకోవటం కొత్తకాడని చెబుతూ దక్షప్రజాపతి కూతుళ్ళు ఇరవైఏడు మంది చంద్రుని భార్యలు అయారు కదా అంటాడు .అలాగే మామిడి చెట్టుకు ఒకే వేరు నుంచి రెండు తీగలు సాగి అల్లుకోవటం సహజమే కదా అని సమర్ధించాడు .దేవసేన అనే వేశ్య ఆప్యాయం గా తామర పువ్వును కానుకగా కర్నిపుత్రుడికి ఇవ్వమని ఈ విటుడికి అంటే మన భాణం లోని బాణం లాంటి వాడైన వాడికి అందిస్తుంది .ఇదే కారని పుత్రుడైన ఆచార్య మూలదేవుడికి సంజీవి ఆగా పనిచేస్తుందన్న ఆశను వేలిబుచ్చటం తో భాణం ముగుస్తుంది .
రజనీకాంత రావు గారి తెనుగు సేత రజనీ గంధం లా సువాసనలీనింది .పద్యం ,గద్యం హృద్యం గా సాగాయి .అసలవి తెలుగు లోనే ఉన్నాయా అన్నంత సహజం గా ,ఆశ్చర్య జనకం గా వున్నాయి .చతుర్భాని నేడు జనరంజకంగా లేకపోయినా ఆ నాడు జనఃరుదయాలను గెలిచినవే .శూద్రకుని భాణం తెలుగు పత్రికా సరస్వతి ”భారతి ”లో ప్రచురితమైంది .భాణం రాసిన వాళ్ళలో వరరుచి ముందు వాడు .రజని గారు వరరుచి రాసిన భాణం ”ఉభాయాభిసారిక ”ను ఆంద్ర ప్రాధ్యాపకులు ,హైదరాబాద్ లోని శారదానగర్ పారదర్శి విద్వ్కద్వరెన్యులు ,చాతుర్భానిని తెలిగిమ్పప్రోత్చాహించిన వారు అయిన శ్రీ ఇప్పగుంట స్సయిబాబా గారికి అంకితమిచ్చారు .ఋణం తీర్చుకున్నారు .
శ్రీ సాయిబాబా గారు నా అడ్రస్ యెట్లా సంపాదించారో నాకు తెలియదు కాని పుస్తకాన్ని పోస్ట్ లో పంపారు (ఆంద్ర చతుర్భాని) .నేను అందిన వెంటనే వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలను చెప్పి నా అడ్రస్ ఎలా తెలిసింది అని అడిగాను .వారు నేను రాసిన పుస్తకం ఎవరో ఇస్తే చదివానని అందులోని అడ్రెస్స్ చూసి మంచి సాహితీ సేవ చేసే వారి గా గుర్తించి పంపాను అని చెప్పారు .నేను సరసభారతి ప్రచురించిన అయిదు పుస్తకాలను వారికి పంపాను .వారు అందినట్లు జాబు రాసి తమ సహ్రుదయతను చాటారు .ఇది అంతా యాదృచ్చికం గా జరిగిన విషయం .ఎవరు ఎప్పుడు ఎలా చేరువవుతారో మనకే తెలీదు .పుస్తకం చదువు తుంటే శూద్రకుని భాణం అడుగడుగునా నన్ను ఆశ్చర్య పరిచింది,మనసుకు పట్టేసింది .అందులోని అలంకారం,నిర్వహణ ,లోకోక్తులు ఆకర్షించాయి .దీనిపై చిన్న వ్యాసం రాయాలనిపించింది .అది క్రమం గా పెరిగి ఇంత అయింది .ఈ వ్యాసం శ్రీ సాయిబాబా గారికి రజనీ కాంత రావు గారి భాష లో ‘హరిచందనపు పూత.”గా అందిస్తూ ,వారికే అంకితం చేస్తున్నాను .
చక్కని ముద్రణ ,ఆకర్షణీయమైన ముఖచిత్రం ఈ పుస్తకానికి వన్నె చిన్నెలు .మొదటి ముద్రణ 2005 లోనే జరిగినా ,శ్రీ సాయిబాబా గారి వల్ల ఇప్పుడే చూడగలిగాను .ఇప్ప పూవు ఒక రకమైన రుచిగా ,మత్తునిచ్చే ద్రవ్య నిదిగా ,భద్రాచల శ్రీరాముని ప్రసాదం గా మనందరికీ తెలుసు .మరి ఇది ”ఇప్పగుంట ”కదా .శృంగార ఖని గా భాసించింది .దాన్ని ఆడరించ్ ప్రోత్చాహించింది .శూద్రక కవి ”తామరపువ్వుకానుక ”లో పుష్పవీది లోని వసంత వధువును నానా కుసుమ సముదాయం గా వర్ణించిన తీరు ,దాన్ని రజని గారి అనువాదం పుష్పసుగందాన్ని రాశీభూతం చేస్తే ,దాన్ని అత్యంత సుందరం గా చిత్రించారు ”బ్నిం ”.ముఖ చిత్రం ,ఉజ్జయిని లో ఒజ్జల వద్ద విద్యనేర్చే చాత్రవరుల లోపలి చిత్రం ,అట్టచివర సంగీత సాహిత్య బయకారుడు ,ఉభయకారుడు ,వాగ్గేయకారుడు అయిన మాన్యశ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి చిత్రం ఆకట్టు కుంటాయి .శూద్రుని భాణం ”పద్మ ప్రాభ్రుతకం ”ను స్నిగ్ధ హృదయుడు ,కళా హృదయుడు అయిన సొగసు కాడు స్వర్గీయ ఆచంట జానకి రాం గారికి అంకితమిచ్చారు. ఈశ్వరదత్తభానం ‘ ధూర్త విట సంవాదం ”ను ఆకాశవాణి పూర్వ సంచాలకులు కీర్తిశేషులు పెనుబోలు బాల గురుమూర్తి (బాలు )గారికి అంకితం చేసి సహృదయత చాటుకున్నారు సౌమిల్లకునిభాణం ”పాద తాడితం ”ను ప్రముఖ పరిష్కర్త ,85 ఏళ్ళ క్రితమే ”పాటలీపుత్ర చతుర్భాని ” పేర ముద్రించి వెలుగులోకి తెచ్చిన కీర్తి శేషులు మానవల్లి రామ క్రిష్నయ్య కవి పంతులు గారికి అంకితమిచ్చి తన కృతజ్ఞతను తెలియ జేసుకున్నారు .
ఇవన్నీ పాటలీపుత్రం లో జరిగే శృంగార కధలే ఇవి .పాటలీపుత్రానికే కుసుమపురం అనే పేరుంది .అదే నేడు పాట్నా అయింది .ఆందరూ లబ్ధ ప్రతిష్టులైన కవీశ్వరులే నవరత్న కవుల సరసన వున్న వారే .శ్రీ ఇప్పగుంట సాయిబాబా గారు విస్తృతమైన ”భూమిక ”కూర్చి ,తమ సంస్కృత ,ఆంద్ర భాషా శేముషిని ఎరుక పరచారు .నాలుగు భాణాల్లో” పుష్ప భాణం ”గా ఎదను తాకిన శూద్రక భాణం నిజం గా రసజ్ఞులకు ”పద్మ ప్రాభ్రుతకమే ”అంటే ”తామర పువ్వు కానుకే ”.
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -10 -11 .