ఇరవ్యవ శతాబ్దపు మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ –1
అరుదైన వ్యక్తిత్వం తో ,తనను తాను ఆవిష్కరించుకున్న మహా మేధావి మార్టిన్ గార్దేనేర్ .చాలా కష్టతర మైన విషయాలంటే అతనికి మహా ఇష్టం .,ఆకర్షణ కూడా .దాదాపు డెబ్భై సంవత్చరాల రచనా వ్యాసంగం లో పండిన వాడు .ఇరవయవ శతాబ్దపు గార్దేనేర్ లలో గార్దేనేర్ ఒకరు .సాహిత్యం ,సైన్సు ,గణితం ల పై 1930 నుంచి అమెరికా లోని చికాగో విశ్వ విద్యాలయం లో ఉంటూ ,సాదిఆరిక వ్యాసాలు రాశాడు .అమెరికా లో సాఫల్యవంతమైన రచనా ప్రవీణుడు గా గుర్తింపు పొందాడు .”సమాధానాలు దొరకని ప్రశ్నలు ”కు అద్భుత విశ్లేషణ చేసి సంతృప్తికరం గా సమాధానాలు చెప్పిన ఆలోచనా పరుడు .సైన్సు లోని క్వాంటం సిద్ధాంతం దగ్గర నుంచి భగవంతుని అస్తిత్వం దాకా విశ్లేషణ చేసిన మేదోత్పన్న బుద్ధి జీవి .చాలా తెలివిగల వాడిగా వున్నా .ఆటకోలు తనం కూడా వుండేది .అయితే మంచి అణకువ గలవాడు అని పేరు .ఒక తరం పాతకులకు ,రచయితలకు ప్రేరణ గా నిఇచిన మేధోమధన జీవి గార్దేనేర్ .
సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ లో 25 సంవత్చరాల పాటు మతేమతిచ్స్ గేమ్స్ ఏకధాటిగా నిర్వహించాడు .The unoted Alice ,The whys of a philosophical scrivener అనే గొప్ప పుస్తకాలు రాశాడు .మేధో జీవులను నిరంతరం తట్టి లేపే వ్యాస పరంపర రాశాడు .1914 లో జన్మించి అమెరికా లోని నార్త్ కెరొలినా లో హిందేర్సన్ విల్లీ లో జీవితం గడిపాడు .thenewyork రివ్యూ కు నిరంతర సమీక్షకుడు .సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ కు చాయా వ్యాసాలు ,పుస్తకాలు రాశాడు .నీటికి వృత్త సౌష్టవం (spherical symmetry ) వుందని చెప్పాడు .అంతరిక్ష నౌక లోని కాలం కు భోమి మీద కాలమ్ కు తేడా ఉంటుందని వివరించాడు .దీనినే టైం dilation అంటారు .దీనికి ఒక కధ కూడా చెపాడు ”bright అనే యువతీ వుండేది .ఆమె కాంతి వేగం కంటే వేగం గా ప్రయానించేది .ఒక రోజూ ఆమె ప్రయాణం ప్రారంభించి ,ఆ ముందు రోజూ రాత్రికే బయల్దేరిన చోటుకు తిరిగి వచ్చింది .ఇదే సాపేక్ష సిద్ధాంతం అంటే ”అన్నాడు .ముందు రోజుకే తిరిగి రావటం తో తన dooplicate నే చూసిందని భావం .టైం travel లో జ్ఞాపక శక్తి పోవటం వల్ల అలా జరిగిందంటాడు బుద్ధి గ్రహించక పోతే ఏ వస్తువు కు అస్తిత్వం వుండదు .వుండటం అంటే గ్రహించటం .(Nothing can exist unless it is perceived by a mind .To be is to perceive .)దేవుడు విశ్వం తో పాచికలు ఆడుతాడు అని Einstein చెప్పలేదు అంటాడు గార్దేనేర్ .అలాగే ఎలేక్ట్రోన్ ను కొలిస్తే తప్ప దాని ఉనికిని చెప్పలేము అన్నాడు
సశేషం
మీ దుర్గా ప్రసాద్ –21 -10 -11