శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతామృతం —1

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల లో అద్వైతామృతం —1
                                                                     జీవితం
                         ”భజరే రఘువీరం –మానస భజరే రఘువీరామ్ ”–”సర్వం బ్రహ్మమయం రేరే ”—బ్రూహి ముకున్దేతి ”—క్రీడతి వనమాలీ ”—”పిబరే రామ రసం ”–”మానస సంచరరే ”మొదలైన భక్తీ కీర్తనలతో భక్తీ,జ్ఞాన ,వైరాగ్యాలు అనే త్రివేణీ సంగమాన్ని సృష్టించిన భక్త మహాకవి శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రులు ..ఆ కీర్తనలను తన స్వరమాధుర్యం తో అమృతమయం చేసి గానంతో సకల జనులను భక్తి లహరి లో ముంచి తేల్చిన ప్రముఖ వాగ్గేయకారులు పద్మవిభూషణ్ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ .బంగారానికి తావి అద్దారు .వింటుంటే మానసం ఎక్కడికో సంచారానికి వెళ్తుంది .ఎక్కడి కేమిటి ఆ పరబ్రహ్మ సందర్శనకే .బ్రహ్మ పదానికి చేరువ చేస్తుంది .అట్టి మహనీయ కేర్తనలో ఆధ్యాత్మిక భావం అంతరంగాన్ని ప్రక్షాళనం చేసి రసోవై సహ అనిపిస్తూ  అద్వైతామృత వర్షాన్ని కురిపించి తనియిమ్పజేసి ,తరింప జేస్తుంది .ఆ మహామహుని దివ్య జీవిత తరంగినిని దర్శించి ధన్యులమవుదాం.
                       బ్రహ్మేన్డ్రుల అసలు పేరు శివ రాముడు .ఆంధ్రుల ముద్దు బిడ్డ మన సదాశివుడు .తండ్రి మోక్ష సుందర అవధాని .తల్లి పార్వతమ్మ .18 వ శతాబ్దం లో తమిళనాడు లో కాఎరి తీరం లో కుంభకోణం దగ్గర చిన్న గ్రామం లో జన్మించారు .చిన్నతనం నుంచే వైరాగ్యం అలవడింది పిల్లాడు .ఎమైపోతాదేమో నని భయం తో పెళ్లి చేశారు .భార్య పుష్పవతి అయిందని కబురు వచ్చింది తల్లి పిండివంటలు చేస్తోంది .ఇంటికి వచ్చిన బ్రహ్మేన్ద్రుని ఆత్రం చూసి కాసేపు ఆగమనీ ,అత్తవారింటికి వాటిని తీసుకు వెళ్లాలనీ చెప్పింది .అప్పటికప్పుడు ఆయన మనో కవాటం తెరుచుకుంది .విషయవాసనలు వుంటే పడిగాపులు తప్పవు అని జ్ఞానోదయమయింది .ఏదో తెలుసుకోవాలనే కాంక్ష మిన్ను ముట్టింది .పరమశివేంద్ర గురు దర్శనం చేసి ,అనుగ్రహం పొందాడు ఆయన ”సదాశివ బ్రహ్మెంద్రుడు ”అనే పేరు పెట్టి ,శాస్త్ర బోధ చేశాడు .తర్కం అంతు చూశాడు .అందరిని వాదానికి పిలిచి గెలిచి,ఓడినవారిని హేళన చేశాడు .అతని అతి ప్రవర్తనను ,వాచాలత్వాన్ని గ్రహించిన గురువు ”సదాశివా !నీ నోరు ఎప్పుడు మూత పడుతుంది ?అని తీవ్రం గా అన్నాడు .వెంటనే శిష్యుడు ”ఇదిగో ఇప్పుడే ”అనినమస్కారం చేసి బయటకు వెళ్లి పోయాడు .ఇలావైరాగ్యమూ  ,మౌనము ఆయనకు క్షణాలమీద కలగటం ఆశ్చర్యం .మౌన ముద్రాలన్క్రుతుదయాడు . .మనస్సును పరబ్రహ్మం పై లగ్నం చేసి ,పర్సమహంస లా ఉన్మత్తునిలా సంచరించ సాగాడు .గురువుకు విషయం తెలిసి తన కంటే తన శిష్యుడు ధన్యుడయాడని భావించి పరవశించాడు .
                  పుదుక్కొట సంస్థానాదీశుడు సదాశివులను దర్శించి మహిమను గుర్తించి ఉపదేశం కోరాడు .ఇసుక మీద మంత్రం రాసి మౌన ఉపదేశం చేశాడు .ఆ పవిత్ర అక్షరాలున్న ఇసుకను ,మట్టితో సహా తవ్వించి తన పూజా మందిరం లో భద్రపరచుకున్నాడు రాజు .బ్రహ్మేన్డ్రుల ఆత్మ జ్యోతి ప్రకాశిస్తున్న కొద్దీ ఆయన చేష్టలన్నీ మహిమాన్వితమవుతున్నాయి .ఒక రైతు ధాన్యం నూర్చి రాసిగా పోసిన చోట అసంగతం గా బ్రహ్మేన్ద్రులు వెళ్లి కూర్చుని ధ్యానం లో మగ్నమయారు .రైతు రాత్రి కాపలాకు వచ్చి ఆయన్ను దొంగగా బావించి కొట్టబోతే చెయ్యి అలాగే స్తంభించి పోయిందట .తెల్లవారి సమాధిలోంచి లేచి రైతువంక చూస్తూ,వెళ్ళిపోగానే రైతు చెయ్యి మళ్ళీ స్వాధీనం లోకి వచ్చిందట .ఇంకోసారి ఒక పెళ్ళికూతుర్ని పాము కరిస్తే సదాశివుల అనుగ్రహం తో ఆమె లేచి కూర్చుందట .మరోసారి తన్మయత్వం లో పాడుకుంటూ వెళ్తుంటే ,ఒక డేరా లో నిద్రిస్తున్న నవాబుకు నిద్రాభంగమయి ,పిచ్చి కోపంతో బ్రహ్మేన్డ్రుల చేతిని కత్తి తో   నరికేశాడట .రక్తం ప్రవాహం గా కార్తోంది .నగ్నం గా నడిచి పోతున్న ఆయనకు బాహ్య స్పృహ లేదు .తప్పు తెలుసుకున్న నవాబు పాదాలపై పది క్షమించమని ప్రార్దిన్చాదట .”దేనికి క్షమాపణ ?అన్నారట యతీంద్రులు. ”మీరెవరో ఎలీక మీ చేయి నరికాను స్వామీ ”అని ఏడ్చాడట నవాబు .”నా చేయినా ”అంటూ చేతి వంక చూసుకున్నాడట .చెయ్యి కనిపించలేదు .క్రింద .పడి వుంది .దాన్ని తీసుకొని యద్గాస్తానం లోపెట్టుకోగానే  పెటు  అతుక్కు పోయిందట .మళ్ళీ పాడుకుంటూ ,తనకేమీ తెలియని స్థితిలో వెళ్లిపోయారట బ్రహ్మేన్ద్రులు .
కొడుమూడు అనేఉపనది   ఒడ్డున సమాధి స్థితి లో వుండగా ,అకస్మాత్తుగా వరద వచ్చి అంతా ముంచేసింది .అందరు హెచ్చరిస్త్యన్నా ,సదాశివులకు ఏమీ పట్ట లేదు .శరేరం వరదలో కొట్టుకు పోయి ఇసుక లో కూరుకు పోయింది .నాలుగు నెలల తర్వాత రైతులు ఇసుక మేట ను తవ్వు తుంటే శరీరం బయట పడింది .జనమంతా ఆశ్చర్య పోయారు .ఆయన సమాధి నుంచి లేచి ,మాట్లాడ కుండా వెళ్లి పోయారు .బ్రహ్మేన్ద్రులు చిన్న పిల్లల తో చాలా సరదాగా గడిపే వారట .ఒకసారి పిల్లలంతా ఆయన చుట్టూ చేరి తిరువాలూర్ లో జరిగే సంబరాలు చూపించమని కోరారట .వాళ్ళందర్నీ తన దగ్గర కూర్చో పెట్టుకుని ,తాకుతూ ,కళ్ళు మూసుకో మాన్నాడట /.కళ్ళు తెరిచేసరికి అందరు తిరువళ్లూర్ లో ఉన్నారట .ఉత్చవాలు చూపించి ప్రసాదాలు ,తినుబండారాలు కొనిచ్చి మళ్ళీ కళ్ళు మూసుకో మన్నారట .కళ్ళు తెరిచే సరికి వాళ్ల వూరు ”కరూర్ ”లో ఉన్నారట .ఆయన ఆ గ్రామం లోనే స్థిర పడ్డారు .పిల్ల లంతా పెద్దవాళ్ళకు చెప్పి ,తాము తెచ్చినవాన్నే చూపిస్తే అందరు ఆశ్చర్య పోయారట .
                 జ్యేష్ట శుద్ధ దశమి నాడు తాను దేహ త్యాగం చేస్తానని ,కరూర్ లోనే తనను సమాధి చేయమని ,కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగాన్ని తెస్తాదనీ ,దాన్ని తన సమాధిపై ప్రతిష్టించమని భక్తులకు ముందే చెప్పి బ్రహ్మైక్యం చెందిన పరమ హంస సదాశివ బ్రహ్మేన్ద్రులు .పుదుక్కొట సంస్తానాదీశులే ఇప్పటికీ సమాధి సంరక్షణ చేస్తూ వుంటారు .
                        సదాశివెంద్రులు చాలా గ్రంధాలు రాశారు .బ్రహ్మసూత్రాలకు   అద్భత వ్యాఖ్యానం రాశారు .”ఆత్మ విద్యావిలాసం ”,’శివ మానషిక పూజ ‘వారి ప్రఖ్యాత రచనలు .వీటన్నిటికంటే బాగా ప్రచారం లో వున్నవి వారి కీర్తనలు .అవి ఇరవై నాలుగు మాత్రమే .వాటి లోని భాషా మాధుర్యం ,శైలి ,భావం ,గాంభీర్యం ,భక్తి,ఆధ్యాత్మిక సంపద ముగ్ధుల్ని చేస్తాయి .అద్వైతామృత వర్షం కురిపించారు ..ఆత్మ బోధ చేశారు .అర్ధ గాంభీర్యం తో పాటు సంగీతా మాధుర్యం తొణికిసలాడే కీర్తనలు అవి .”అద్వైతం త్రిషు లోకేషు–నా ద్వైతం గురునా సహా ”అన్నది శ్రీ సదాశివుల బ్రాహ్మీ భావం .అలాంటి పరమ గురువు ప్రణామం చేస్తూ ,ఆఅద్వైత భావ   లహరి లో తరిద్దాం ..ఆరస గుళిక లను  ఆస్వాదిద్దాం .
                      ఇందులోఅయిదు  శ్రీరాముని పరంగా ,ఎనిమిది  కీర్తనలు శ్రీ కృష్ణునిపై ,మనసును ఉద్దేశించి ఆత్మబోదగా అయిదు గురువు పరమశివెంద్రులను కీర్తిస్తూ ఒకటి ,గంగానది పరంగా ఒకటి మిగిలిన నాలుగు బ్రహ్మానందానుభవం గా రాశారు .ఇవి సోపాన క్రమం లో వుండి మోక్ష సాధనకు మెట్లుగా కనిపిస్తాయి .గురు సాన్నిధ్యం లోనే చిత్త వికారాలు తొలగి మనసు పరిపూర్నమవుతుందని  చెప్పారు .చివరి కీర్తన గంగామతల్లి పై రాసిన సంగతి చెప్పాను .భారతీయ ఆధ్యాత్మిక భావనకు ,అనుభవాలకు తర తరాల సాక్షీభూతం గా నిలిచింది పవిత్ర భాగీరధి .బ్రహానందం,అమ్రుతానందం.ప్రణవమే సర్వార్ధ సాధకంఅన్నార బ్రహ్మేన్ద్రులు .అమేయమైన అనుబూతి కలిగించే ఆ కీర్తనా వైభవాన్ని ”రామ రసాయనం ”గా .”క్రిష్ణామ్రుతం ‘గా ,”ఆత్మానందం ”గా ,”బ్రహ్మానుభూతి ”గా వింగడించి తెలుసు కోని ,ఆ అమ్రుతానందాన్ని అందుకొందాం .మానషిక పున్డరీకాన్ని శత పత్ర వికసనం చేసు కుందాం .దివ్యానందాన్ని అనుభవిద్దాం .శ్రీ సదా శివ బ్రహ్మేంద్ర పరమహంస పవిత్ర కీర్తనామ్రుతాన్ని తనివి తీర గ్రోలి మోక్షాన్ని పొందుదాం .
                                             సశేషం
                                                                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -10 -1

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.