- ఓకె పుస్తకం రెండు కోన్నా వెందుకు ?—ఈ పుస్తకం కొంటె సగం మార్కులు వచ్చినట్లే అని రాసి వుంది పూర్తి . మార్కులు రావాలని రెండు కోన్నా
- విస్కీ తో పాటు స్ట్రా క్కూడా తీసుకు రా —-స్ట్రాఎందుకు సార్ —మందు ముట్టుకోనని మా ఆవిడకు ఒట్టేసి చెప్పా అందుకు
- ఏమండీ కాస్త మా ఆయన్ను పిలుస్తారా ?—నంబెర్ ప్లీజ్ —-నీ బొంద –నాకేమైనా పది మంది మోగుల్లున్నారను కున్నారా ?
- మీరు చూస్తె చిన్న లాయర్లా వున్నారు .నా కేసు ని వాదించ గలరా ?—–కంగారు పడ కండి మీ కేసు పూర్తి అయేసరికి పెద్ద లాయరునవుతాను .
- సిస్టర్ ఒక బాటిల్ రక్తం ఇవ్వండి —ఏ గ్రూపు రక్తం ?–ఏ గ్రూపుది అయినా పరవా లేదు .నా గర్ల్ ఫ్రెండ్ కు లవ్ లెటర్ రాయ టానికి
- పెళ్ళికి ముందు డబ్బు నీళ్ళ లాగా ఖర్చు పెడతానని బడాయిలు పోయారు .ఇప్పుడు మరీ ఏదడిగినా వెనకా ముందు చూస్తున్నా రేమిటి ?—అవును నీళ్ళను కూడా చాలా పొడుపు గా వాడుతాను నేను
- ఒక బకరా గాడికి దారిలో వెయ్యి రూపాయిల నోట్ కనిపించింది .దాని మీద ”హాపీ న్యూ య్వర్ ”అని రాసి వుంది .వీడు నోట్ ని జేబులో పెట్టు కోని ,పర్స్ లోంచి తన దగ్గరున్న ఇంకో వెయ్యి రూపాయిల నోట్ తీసి దాని మీద ”same to you ” అని రాసి దారిలో వదిలేసి వెళ్ళాడు వెంగళప్ప
- మహేష్ బాబు సినిమా పది సార్లు చూస్తాను —-నేను ఒక్క సారి చూస్తేనే నాకు అర్ధమై పోతుంది
- బైకు కాస్త నెమ్మది గా నడ పండి కళ్ళు తిరుగు తున్నాయి —- పిరికి దాని లా మాట్లాడకు నేను మూసుకున్నట్లు కళ్ళు గట్టి గా మూసుకో
- 2012 లో ప్రళయంవస్తుందట ప్రపంచం మునిగి పోతుందట —-నమ్మకు .నేను వాషింగ్ మెషిన్ మొన్ననే కొన్నాను దాని మీద 2014 వరకు గారంటీ అని వుంది
- అర్ధ రాత్రి ఎంత ఆలస్యం గా ఇంటికి వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు వేడి నీళ్ళు కాచి రెడీ గా ఉంచుతుంది —ఎంత అదృష్ట వంతుడివి రా ?—-చలికాలం కదా చన్నీటితో గిన్నెలు తోమటం కష్టమని నాకోసం వేన్నీళ్ళుకాస్తుందిరా తోమ టానికి
- మీ తాత గారు కనిపించగానే అందరు ”విరోధి,విరోధి ”అని పిలుస్తా రెందుకు ?—ఆయన విరోధి సంవత్చరం లో పుట్టినందుకు —–ఇంకా నయం” రాక్షసనామ సంవత్చరం లో పుట్టలేదాయన
- పెళ్ళికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండాలిగా? అవును వుండేది మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదు అందుకని పారిపోయింది –
- డాక్టర్ గారూ మళ్ళీ నన్ను ఎప్పుడురమ్మంటారు ? ?–ఆర్ధికం గా బాగా కోలుకున్న తర్వాత
- మమ్మీ డాడీలతో చాలా ఇబ్బంది గా వుందిరా __ఏమైంది ?—రాత్రి చదువు కొంటుంటే నిద్రపొమ్మని తిడ తారు .పొద్దుట పడుకుంటే లేపి చదువు కోమని వాయిస్తారు
- మిడత ,ఉడత ,పిడత ,మడత ,చిడత ఇవేమీ టైటిల్స్ అయ్యా ?—-అవన్నీ ప్రముఖ హీరో ల పుత్రరత్నాలు నటించ బోయే సినిమాలు .”.చిరుత ”హిట్అయింతర్వాత రిజిస్ట్రేషన్కోసం వచ్చిన పేర్లు అవి .
కాసేపైనా నవ్వు కోటానికి మీ కోసం సేకరించిన నవ్వుల పువ్వులు ఇవి .అనుభవించి ఆనందించండి దీపావళి రోజున .
గబ్బిట దుర్గా ప్రసాద్ దీపావళి శుభా కాంక్షలతో —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -10 -11 .
ఉయ్యూరు ఉపాధ్యాయులకు దీపావళి శుభా కాంక్షలు .
ఉయ్యూరు పాత విద్యార్ధి
మీ నవ్వుల తారా జువ్వలు ఇంకా దూసుకుపోనీ…
మీకూ…., మీ ఇంటిల్లిపాదికీ.. “దీపావళి” శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి…మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా……..?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై “దివిలె” వోలె!
Thanks for the nice jokes.Happy Deepavali to all.
Ha:-) Ha:-)
Good intention andi.