శ్రీ సదాశివబ్రహ్మేన్డ్రుల కీర్హనలలోఅద్వాతా మృతం —2
”రామరసం ”
శ్రీరాముని పై రాసిన మొదటి కీర్తన భజరే రఘువీరం .ఆ కీర్తనను పూర్తిగా అందిస్తాను
పల్లవి —భజరే రఘువీరం ,మానస –భజరే రఘు ధీరం
అనుపల్లవి –అం బుద డింభ విడంబన గాత్రం —అం బుద వాహన నందన దాత్రం
చరణం –01 -కుశిక సుతార్పిత కార్ముక వేదం –వశి హృదయాంబుజ భాస్కర పాదం
కుండల మండల మండిత కర్ణం –కుండల మంచక మద్భుత వర్ణం
చరణం –02 -దండిత సుంద సుతాదిక వీరం –మండిత మనుకుల మాశ్రయ శౌరిం
పరమహంస మఖిలాగమ వేద్యం —పరమ వేద మకుటీ ప్రతి పాద్యం .
భావం —-మన మనసును ఉద్దేశించి బ్రహ్మేన్ద్రులు ఉపదేశం చేస్తున్నారు .బహు ధీరుడైన రఘు వీరుణ్ణి భాజించమని మనసు బోధ చేస్తున్నారు .నీల మేఘ శకలం (ముక్క )కాంతిని వాదించే శరీర వర్ణం కలవాడు ,భక్తుడైన హనుమ కోర్కెలు తీర్చే వాడు ,విశ్వామిత్ర గురు అనుగ్రహం తో విలు విద్యను పొంది ,భక్తుల హృదయ పద్మాలకు వికాసాన్నిచ్చే సూర్య కిరణం అయిన వాడు ,చెవులకు వుండే కుండలాల శోభ చేత కనువిందు చేసే కర్ణాలు (చెవులు )వున్న వాడు ,ఆది శేషుని పాన్పుగా చేసుకుని నిద్రించే వాడు ,మారీచాది రాక్షసులను సంహరించిన వాడు ,మను వంశానికే వన్నె తెచ్చిన వాడు ,పరమహంస అయిన వాదూ ,వేదాల ద్వారా మాత్రమే తెలుసుకో తగిన వాడు ,వేదం ప్రతిపాదించిన వాటిలో మకుటాయమాన (peak )మైన వాడు ,అయిన శ్రీ రఘు రాముని భాజించమని హితవు చెప్పాడు
నిరా కారం అయిన బ్రహ్మ బుద్ధి శూక్ష్మం వల్ల,వేదం లో ప్రతి పాదించిన దాన్ని తెలుసుకోవటం వల్లనే తెలియ బడ తాడు .ఆకారం వున్న వాడు గా ఆకారం లేని వాడుగా రెండు రకాలుగా శ్రీరామ పరబ్రహ్మం కని పిస్తాడు .ఆయనను సేవించటం ఉత్తమం .”కుండల మండల మండిత కర్ణం –కుండల మంచక మద్భుత వర్ణం ”అనటం లో కుండల మంచక అంటే చుట్లు చుట్లు కోని వున ఆదిశేషుని పడక గా వున్న వాడు అని అంటే అనంత పద్మనాభుడు అని భావం .పదాల పరుగు మనసును శ్రీ రాముని మనోహర రూపం దగ్గరకు చేరుస్తుంది శబ్దాలన్నీ చెవులకు నాద శోభను కలిగిస్తాయి .పద నర్తనం ప్రత్యక్షం గా చూడ గలం .పదం ఎంత సాభిప్రాయం గా ప్రయోగించాడో ,అందులోని భావం కూడా అంత లోతుగా వుండటం బ్రహ్మేన్డ్రుల ప్రత్యేకత ..హాయిగా వినచ్చుఅర్ధం తెలియక పోయినా ఆ శబ్దాలు మనసు లో నర్తిస్తాయి .చెవులకు ఇంపు కలిగించే పద శౌరభం లయ తో కూడిన నడక సదాశివుల రచనా వైభవం .మనసు తో రాస్తారు కనుక మహా మహిమాన్వితం గా వుంది కీర్తన . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —26 -10 -11 .