శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన లలోఅద్వైతా మృతం —5
కృష్ణా మృతం
– బ్రహ్మేన్డ్రుల కృశా మృతం లో ని మూడవ కీర్తన
3—పల్లవి — బ్రూహి ముకున్దేతి రసనే –పాహి ముకున్దేతి ||
చరణాలు —-01 -కేశవా మాధవ గోవిన్దేతి —క్రిష్ణానంత సదా నందేతి ||
02 -రాదా రమణ హరే రామేతి –రాజీ వాక్ష ఘన శ్యామేతి ||
03 –గరుడ గమన నందక హస్తేతి –ఖండిత దశ కంధర మస్తేతి ||
04 –అక్రూర ప్రియ చక్ర ధరేతి –హంస నిరంజన కంస హరేతి ||
భావం —- వో నాలుకా! (రసనే ) ముకుందా అని పలుకు .ముకుందా రక్షించు (బ్రూహి )అని కోరు .కేశవా మాధవా ,గోవిందా ,కృష్ణా ,అనంతా,సదానందా ,రాదా రమణా ,హరే రామా ,రాజీ వాక్షా ,ఘన శ్యామా ,గరుడ గమనా ,నందక హస్తా ,రావణ సంహారా ,అక్రూర వరదా ,చక్ర ధారీ ,హంసా ,నిరంజనా ,కంసారీ అని నోరారా పలుకు .అని నాలుకకు ఉపదేశం చేశారు సదాశివులు
విశేషం —-గోవింద నామాలన్నీ ఏర్చి కూర్చిన కీర్తన ఇది .ప్రతి నామ వెనుక ఒక కధ వుందని మనకు తెలుసు .నామ మాహాత్మ్యాన్ని ఇందులో చూపారు పరమ హంస .పరవశించి పలికితే పరమ పదమే లభిస్తుందని తెలియ జేశారు .నాలుక ఏ నామాన్ని పలికితే ,మనసు ఆరూపాన్ని తలుచు కుంటుంది .నామానికీ ,రూపానికి వున్న సంబంధం ,అనుబంధం ఇది .మనసు దేనిని తలిస్తే దాని పై ప్రేమకూడా కలగటం సహజం .ప్రపంచం మీద ప్రేమ తగ్గించుకుని ,భగ వంతుని పై ప్రేమ పెంచుకోవ టానికి ఏకైక మార్గం కృష్ణ నామ స్మరణ అన్న సూక్ష్మాన్ని ఈ కీర్తన ద్వారాతెలియ జెప్పారు బ్రహ్మేంద్ర స్వామి .
నాల్గవ కీర్తన లోకి ప్రవేశిద్దాం
4—పల్లవి —–భజరే గోపాలం మానస –భజరే గోపాలం ||
చరణాలు —01 –భజ గోపాలం భజిత కుచేలం –త్రిజగన్మూలం దితి సుత కాలమ్ |\
02 –ఆగమ సారం యోగ విచారం –భోగ శరీరం భువనాధారం |\
03 –కదన కథోరం కలుష విదూరం –మదన కుమారం మధు సంహారం |
04 –నత మందారం నంద కిశోరం –హత చాణూరం హంస విహారం ||
భావం —-గోపాల కృష్ణుని భజించమని మనసుకు చేసే బోధ ఇది .”స్నేహితుడైన కుచేలుని చే సేవింప బడిన వానినీ ,మూడు లోకా లకుమూల మైన వాడినీ ,దితి కుమారులైన రాక్షసులను సంహరించిన వాడినీ ,భాజించవే మనసా !.వేద సారం అయిన వాడినీ ,యోగం ద్వారానే విచారించి తెలుసుకో వలసిన వాడినీ ,కేవలం భోగం కోసమే అవతారం ఎత్తిన వాడినీ భువనాలకు ఆధారం అయిన వాడినీ ,అయిన శ్రీ కృష్ణుని భజించు .శరణు అన వాడికి మందారం ,నందబాలం .చానూరాన్తకుడు ,హంస లాగా విహరించే గోపాల కృష్ణుని భజించి తరించు .
విశేషం —-కుచేలుడు శ్రీ కృష్ణుని చిన్న నాటి స్నేహితుడు .అతడు శ్రీకృష్ణున్ని శ్రీ కృష్ణుని భక్తునిగా ,స్నేహితునిగా భగవంతుని గా సేవించాడు .కృష్ణుడు కుచేలుడిని బాహ్యం గా ,అతిధి సత్కారాలు చేసి పూజించాడు .భగవంతునికి భక్తునికి భేదం లేదని తెలియ జేసే సందర్భం ఇది .శ్రీ క్రిష్ణునిది భోగ శరీరం .అంటే ఈ ప్రపంచం లో సంచ రించా టానికి శరీరం ..ఆయనే కల్పించ్కున శరీరం .”మదన కుమారం ‘అంటే మన్మధుని వంటి కుమారుడు అనీ ,మన్మధుని కుమారునిగా పొందిన వాడు అనీ శ్రీ కృష్ణ పరం గా రెండు అర్ధాలు వున్నాయి .”హంస ”అనే పదం చాలా విశేష మైనది .విచక్షణా జ్ఞానం తో వ్యవహరించే బుద్ధిని హంస అంటారు .ఈ హంస పై విహరించే వాడే భగ వంతుడు .అందుకే హంస విహారి అయాడు ..పదాలు అన్నీ నాదానుగునం గా నర్తనాను గుణం గా వుండి మనసు ను పరవశింప జేస్తాయి .rhytham మనలను విశేషం గా ఆకర్దిస్తుంది .క్షణం యెడ బాటు కని పించదు .ప్రవాహం లా పదాలు ప్రవహిస్తుంటాయి . శ్రవణ శుభగత్వం అంటే ఇదే .
”భజరే యదు నాదం ”అనే అయిదవ కీర్తన లో కి ప్రవేశిద్దాం
5— పల్లవి —భజరే యదునాధం మానస —భజరే యదు నాదం ||
చరణాలు —01 -గోప వధూ పరి రంభన లోలం –గోపా కిశోరక మద్భుత లీలం ||
02 –కపతాన్గీక్రుత మానుష వేషం —కపట నాట్య కృత కుత్చిత వేషం |||\
03 – పరమ హంస హ్రుత్తత్వ స్వరూపం –ప్రణవ పయోధర ప్రణవ స్వ రూపం -||
భావం ——యదు వంశ కిశోరాన్ని (శిశువు )భజించ మని మనసుకు బోధిస్తునాడు .”యదుకుల నాధుడు ,గోపికలను ,ఆలింగనం చేసుకోవటం లో ఆసక్తుడైన వాడు ,బాల క్రిషుడు ,అద్భుత లీలలను ప్రదర్శించిన వాడు ,లీలా మానుష విగ్రహుడు ,నాట కాల లో పాత్ర లాగ క్షుద్ర పాత్రలూ ధరించిన వాడు ,పరమ హంస హృదయాలలో ఆత్మ స్వరోపం గా వున్న వాడు ఓంకార స్వరూపుడు ,అయిన బాల కృష్ణ భగవానుడిని స్మరించు ”
విశేషం —-గోప వధూ అనటం లో త్రిగుణాలతో వున్న జీవు లందరూ స్త్రీ మూర్తులే అన భావం వుంది .స,ర ,త అనే మూడు అక్షరాలూ ఈ కారం తో కలిస్తే స్త్రీ అవుతుంది .అంటే కదిలే మూడుగుణా అని అర్ధం .ఈ జీవుల్లో భగవద్ భక్తులైన వాళ్ళు గోప వధువులు( స్త్రీలు ).వారినే భగ వంతుడు ప్రేమతో ఆలింగనం చేసు కుంటాడు .”కపతాన్గీక్రుత వేషం ”అంటే ప్రారబ్ధం వల్ల కాకుండా లీల కోసం శరీరాన్ని ధరించిన వాడు అని అర్ధం .”కపట నాట్య కృత కుత్చిత వేషం ”వేశాడు కృష్ణుడు .అంటే గొల్ల పిల్ల వాడుగా ,అల్లరి కన్నయ్య గా ,సామాన్య వేషం ధరించాడు .ఇది భగవంతుని కపట నాటకమే ”.ప్రణవ పయోధర ”శబ్దం లోను లోతైన భావం వుంది .ఓంకారం నిరాకారం గా వుండే పరమాత్మ మాత్రమే కాదు ,మనకు కని పించే ప్రపంచం కూడా ఆయనే ..నిశ్చల మైన పరమాత్మ ఆధారం గా చలించే ఈ ప్రపంచం మేఘం వంటిది .అందుకే మేఘాన్ని ప్రణవ పయోధరం అన్నారు బ్రహ్మేన్ద్రులు .పరమాత్మ ప్రణవ స్వరూపం .ఇంకో రహస్యం వుంది యోగ శాస్త్రం లో ”లయ ”అనే యోగం లో ,లోపల వినపడే పది రకాల నాదాలలో చివరిది మేఘ నాదం .అదే ప్రణవం అని పిలువ బడే ఓంకారం .,ఇన్ని యోగ ,శాస్త్ర ,వేద ,ఉపనిషద్ రహస్యాలన్నీనిక్షిప్తం చేసి రమ్య నాద భరితం గా చేసినకీర్తన ఇది .ఆ నాద బ్రహ్మ కు కై మోడ్చి అంజలి ఘటిద్దాం ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -10 -11 .
KALAGNANAM TELISINDHI