అవసర రచనలతో అందరి వాడైన” అవసరాల .రామ కృష్ణ రావు ”
విశాఖ లో ఇంకో సాహితీ శిఖరం కూలి పోయింది .హాస్య ద్వయం గా విశాఖను ఏలిన జంట రచయితల్లో భ.రా.గో .మరణించిన తరువాత ఇప్పుడు అవసరాల రామ కృష్ణా రావు గారి మరణం ఆంద్ర దేశానికి తీవ్ర శోకమే మిగిల్చింది లెక్కలు అంటే భయమున్న రోజుల్లో ,ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనుకొనే కాలం లో ,అన్కగనితం అంటే వెర్రి కుంకలు మాత్రమే నేర్చేది అన్న అభి ప్రాయం ఉన్న సమయం లో ,జామెట్రి అంటే ”జా మెన్త్రి ” అని తప్పుగా పలికే కాలం లో లెక్కలు అంటే భయం లేకుండా చేసి ,అది అందరు నేర్వ దగిన్దేనని ధైర్యం చెప్పి ,హాయిగా గణితాన్ని ఏలా నేర్చుకోవచ్చో నని తెలియ జెప్పి ”METHAME TRIKS ” గా దాన్ని దివి నుండి భువికి దింపి అందుబాటు లోకి తెచ్చారు రావు గారు .ఇంగ్లీష్ చదువు చదువు తున్నా ,అది గ్రీక అండ్ లాటిన్ గా భావించే వారికి ఆ భయాన్ని పోగొట్టి ,అభయం ఇచ్చి ”AANGREJI MADE EASY ”అని వెన్ను తట్టి అందులో ప్రవేశం కల్గించారు రామ కృష్ణా రావు గారు .ఈ రెండు ఆ నాటి జనాలకు అవసరమైన వె .అందుకే అవసరానికి తగిన రచనలు చేశారు అవసరాల వారు అన్నాను .ప్రాస కోసంకాదని మనవి .అట్లాగే ,మునిమాణిక్యం ,భమిడి పాటి తర్వాత తెలుగు హాశ్యం తగ్గింది ,పలచబడింది ,ఎబ్బెట్టు గా వుంది అనుకున్నప్పుడు భమిడి పాటి రామ గోపాలం ,అవసరాల రామ కృష్ణా రావు గార్లు సున్నితమైన హాశ్యాన్ని వ్యంగ్యం తో రంగరించి అంగ రంగ వైభవం కలిగించారు .విభిన్న మార్గాలలో దాన్ని పండించారు ..విశాఖలో రావి శాస్త్రి ,భ.రా గో .,,అవసరాల హాష్య త్రయం గా నిలిచారు .ఆ త్రాయం క్రమం గా ద్వాయమై ,ఒంటరి ఆయీ అదీ నిన్న నిష్క్ర మించింది .ఏంచేద్దాం .మన దురదృష్టం .
ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఆంగ్లం లో డాక్ట రేట్ సాధించారు రామ కృష్ణా రావు గారు .ఒరిస్సా లో ని ”బలన్గీర్ ”ప్రభుత్వ కళా శాలలో ముప్ఫై ఏళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసి రీడర్ గా రిటైర్ అయారు .విశాఖ లో స్థిర పడ్డారు .వీరు 1931 డిసెంబర్ 21 న మద్రాస్ లో జన్మించారు .తండ్రి జగన్నాధ రావు ,తల్లి తిరుపతమ్మ గార్లు .వీరిది తూర్పు గోదావరి జిల్లా తుని .17 వ ఏటనే 1947 లో పొట్టి పిచ్చుక ”అనే కధ తో వీరి సాహితీ జీవితం ప్రారంభ మైంది .అది చందమామ మాస పత్రిక లో ప్రచ్రితమైంది .600 లకు పైగా కధలు రాశారు ”పేక ముక్కలు ‘అనే పేరుతో మొదటి యాభై రెండు కదల సంపుటి తెచ్చారు ..మొత్తమ్మీద ఎనిమిది కదా సంపుటులను వెలువరించారు .”సంపెంగలు -సన్న జాజులు ,సహజీవన భాగ స్వామ్యం ,రామ చిలుక ,అదుగో మామయ్యా –ఆ వెనుక మేం ,జై కు బహు వచనం జైలు మొదలైన ఎనిమిది నవలలు రాశారు .వివిధ పత్రికల లో చాలా కాలం శీర్షికలు నిర్వ హించారు .ఆయన హాస్య వ్యంగ్య రచనా నిర్మాణానికి ”కేటు -డూప్లికేటు ”గొప్ప ఉదాహరణ.అవసరాల .ఆవ అనగానే ఆ పేరు జ్ఞాపకం వస్తుంది ముందు .అదొక చక్కని COINAGE WORD .ఆయన గణిత విశారద అనేపుస్తకం రాశారు .అందుకే లెక్కల్ని అంత సులభం గా అందరి ముందుకు లాక్కొచ్చారు .
1985 లో అవసరాల వారికి ఆంద్ర విశ్వ విద్యాలయం డాక్టరేట్ నిచ్చి సత్కరించింది .1994 లో తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ హాస్య రచయిత గా గుర్తించి సన్మానించింది 1996 లో జ్యేష్ట లిటరరీ అవార్డును పొందారు .2000 సంవత్చారం లో కేంద్ర సాహిత్యఅకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .అదే సంవత్చారం లో చండీఘర్ ఆంద్ర సారస్వత సంఘం విశేషం గా సన్మానించి గౌరవించింది 2004 లో అమెరిక లోని తెలుగు సంఘం ఆయన్ను ఆహ్వానించి ఘనం గా సత్కరించింది .విజయనగర తెలుగు భాషా పురస్కారాన్ని అందించి విజయ నగర వాసులు ధన్యులయారు .ఇలా వారికి అన్ని రకాల అవార్డులు రివార్డులు ,లభించాయి . ఇది ఆంధ్రులందరికీ గర్వ కారణం .ఒక సాహితీ శిఖరం గావున్నారు .తన అభిప్రాయాలను నిర్మోహ మాతం గా పత్రికా ముఖం గా వెలువరిస్తూనే వున్నారు . .
మధ్య తరగతి మంద హాసాన్ని పుణికి పుచ్చుకున్న రచయిత అవసరాల వారు .వారి జీవితా లలోని చీకటి ,వెలుగులనుహాయిగా ,కవ్విస్తూ ,నవ్విస్తూ ,వ్యంగ్యవైభవం జోడిస్తూ రచనలు చేశారు .ఆయన కధ చెప్పే తీరు పరమ రమణీయం గా వుంటుంది అందుకే ఆయనను””కదా కదన భీష్ముడు ”అన్నారు .ఆయన తన మనోభావాలను చక్కగా తెలియ జేశారు ”దుఖాన్ని బిగ బట్టి -సుఖాన్ని బయట పెడితే జీవితం బాలన్స్ అవుతుంది .హాస్యం ఆర్త హృదయానికి దివ్యౌషధం .అనుభవాలు ఆనందాన్నిస్తాయి .అదే బ్రహ్మానంద సదృశ రసానందం .ఏమి రాశాము అన్నది ముఖ్యం కాదు .ఎలా రాశాము అన్నది ముఖ్యం ” అదేఆదర్శం గా ఆయన రచనలు చేశారు .అందుకే అవి అంత పాపులర్ అయాయి ..
రామ కృష్ణా రావు గారు అభ్యుదయ వాది .తాను నాస్తికుడిని అనేచెప్పే వారు .మానవీయ మూర్తి అవసరాల వారు .తాము మరణించిన తర్వాతతమ పార్ధివ దేహాన్ని వైద్య కళా శాలకు అప్పగించాలని 2005 లోప్రచ్రించిన తమ కదా సంపుటి ”ఆస్థి పంజరం ” లో కోరిన పుణ్య పురుషులు ఆయన .పరోప కారార్ధం ఇదం శరీరం అని జీవితం అంతమైన తరువాతకూడా రుజువు చేసిన సమాజ హితైషి . ”నేను -నేనే ”అని చెప్పుకునే అవసరాల రామ కృష్ణా రావు గారు నిజం గానే ఆ మాటను నిలుపు కున్నారు .81 యొక్క ఏళ్ళు నిండు గా జీవించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29 -10 -11 .