అన్నిటి కంటే ఆవల —1
అయిదు పరిమాణాల (dimention )విశ్వం ఒక ఊహ .1927 లో ”కలూజ ”అనే శాస్త్రజ్ఞుడు ప్రకృతి లోని అన్నిటిని ఏకీ కృతం చేసి నట్లు కనుగొన్నట్లు నమ్మాడు .1924 లో ఆస్కార్ క్లీన్ అదే భావాన్ని ,సిద్దాన్తీక రించాడు .అందువల్ల అధిక పరిమాణాల (higher dimentional )శక్తుల ఏకీకరణ సిద్ధాంతాన్ని ”కలూజ -క్లెన్ ” సిద్ధాంతం అన్నారు .చివరికి అందరు కలిసి అయిదవ పరిమాణం అక్కర లేదని తేల్చారు .
పొడవు ,వెడల్పు ,ఎత్తు అనేవి అనాదిగా వస్తున్న మూడు పరిమాణాలు .”కాలమ్ ”కూడా నాల్గవ పరిమాణం లోకి చాలా కాలమ్ కిందటే వచ్చింది .దీన్ని హెచ్ .జి .వేల్స్ కూడా తన ”టైం మెషిన్ ”గ్రంధం లో పేర్కొన్నాడు .ఈ విషయాలపై ,ఇమ్మానుఎల్ కాంట్ మొత్త మొదటి సారిగా దృష్టి సారించాడు .ఆయన 1747 లో thoughts on the true estimation of living force అనే గ్రంధం లో ప్రపంచం ను మూడు పరిమాణాల ఆధారం గా ఎలా అర్ధం చేసుకో వచ్చో తెలియ జేశాడు .వస్తువులు ఒక దానిపై ఒకటి గురుత్వాకర్షణ వల్ల పని చేస్తాయి అని చెప్పాడు . అవి పరస్పరం వున్న దూరాల వర్గాల విలోమాను పాఠం లో మారుతాయి అని కూడా తెలిపాడు (vary ).ఈ సూత్రం ప్రకారం అంతరిక్షం (స్పేస్ )మూడు పరి మాణాలకు బద్ధమై వుంటుంది .
అయితే వీటికి విరుద్ధం గా వున్న సూత్రాలు ఇతరమైన పరిమాణాలు వున్న వేరే అంత రిక్షా ప్రదేశాలు వుండే అవకాశాలు వున్నాయని చెప్పాడు మేధావి కాంట్.దేవుడు దేనినైనా సృష్టించ గలడు ,కనుక అలాంటి ప్రపంచాలు ఉండటానికి అవకాశం వుంది అన్నాడు .అవి మన ప్రపంచానికి సంబంధం లేకుండా ,విడి పోయి ఉండ వచ్చు .వాటిని కలిపే ఏ అవకాశమూ లేకుండా పోయి ఉండవచ్చు .నని అభిప్రాయ పడ్డాడు .భగవంతుడు విశ్వాన్ని త్రీ దిమెన్తిఒనల్ సత్వం గానే సృష్టించాడు తప్ప ,ఎన్నో దిమెన్తిఒన్ ల ప్రపంచం గా సృష్టించి గందర గోల పరిచిఉ ఉండదని నమ్మాడు కాంట్.
1777 లో జర్మించిన Carl Freidrich Gauss కు మూడు ఏళ్ళ కే అద్భుత గణిత మేదావిత్వం కన్పించింది .(power of computation ).ఒక సారి అతని తండ్రి ఉద్యోగస్తుల జీతాల పట్టిక ను కూడుతూ వుంటే (total )”సరిగ్గా ఇంత వుండాలి చూడండి ”అన్నాట్ట .తండ్రి కూడి అంతే వచ్చినందుకు ఆశ్చర్య పడ్డాడట.సరిగ్గా మాటలే రాని వయసు లో ,అతని కి గణితం స్వంత మై పోవటం అబ్బుర పరిచే విషయం .ఆయన కళల్లో భగవద్దట్ట మేధావి తనం కన్పించేది .స్కూల్ కు వెళ్లి నపుడు అతని లెక్కల మేష్టారు ఇతని ప్రతిభను చూసి అమితాస్చర్య పడ్డాడట .మనసు లో ఒకటి నుంచి ,వంద వరకు వున్న అంకెలని కూడి ఎంతో చెప్పాడట .లెక్కల పుస్తకం మొదలు పెట్టక ముందే దాని లో ఏముందో అవపోసన పట్టాదట .12 ఏళ్ళకే యూక్లిడ్ జామెట్రీ కి సవరణలు (alternatives )ప్రతి పాదిన్చాదట (వికల్పాలు )అతని అంకుల్ కి వున్న విమర్శనా జ్ఞానం ఇతని పై బాగా పనిచేసిందట .14 ఏళ్ళ వయసు లో గణిత శాస్త్రజ్ఞుడు ”జోహాన్ బార్తీస్ ”గాస్ కున్న మేధావి తనాన్ని చూసి అబ్బుర పది గణిత మేదావులైన Nichelm Ferdinand ,Duke of Brunswick లకు పరిచయం చేశాడు .గాస్ కున్న నమ్రతను గుర్తించి ,చదువుకు సాయం చేశాడు .Gotten gin University లో 18 ఏళ్ళ వయసు లో చేరాడు .అక్కడ Wolfang Bolzai తో పరిచయం కలిగింది .గాస్ తల్లి ఆయన దగ్గరకు వెళ్లి ఒక సారి తన కొడుకు చదువు ఎలా సాగుతోంది అని అడిగింది .దానికి ఆయన The only greatest mathematician in Europe ”అని ఆనందం గా మెచ్చుతూ చెప్పాడట .అంటే ఐరోపా ఖండం లో వున్న ఏకైక గణిత శాస్త్రజ్ఞుడు,మేధావి గాస్ అని అర్ధం .1806 లో డాక్టరేట్ అయాడు .నెపోలియన్ కు ఎదురు నిల్చి ,దేశం కోసం పోరాడాడు .తర్వాత gottengin లో ప్రొఫెసర్ అయాడు గాస్.non Euclidian Geometry పై పరిశోదాహన చేశాడు .దీని పై bolzai కొడుకు జానోస్ ,nicholas lobacheshky
కూడా పరిశోధన చేశారు .1854 లో హైపెర్ స్పేస్ ఆవిషకరణ జరిగింది .
హెన్రి స్లాదేస్ అనే శాస్త్రజ్ఞుడు పొడవు ,వెడల్పు ,ఎత్తు లను దాటి వేరే dimention లో వస్తువులు కదలటం జరుగుతుందని భావించాడు .జోల్నార్ శాస్త్ర వేత్త higher dimention లు వున్నాయని చెప్పాడు .రహస్య జ్ఞాన వేత్తలు (occultists ) నాలుగో dimention ఉందన్నాడు .థియోసాఫికల్ సొసైటీ స్థాపకు రాలు madam blavaatski 1875 లో higher dimentions విషయం పై వున్న మార్మిక విషయాలను తెలియ జేశారు .వీళ్ళందరికీ కాబాలిస్తిక్ గ్రంధాలు ,వెద ,ఉపనిషత్తులు ,గ్రీకు కు చెందిన సర్వోత్క్రుష్ట రచనలు ఆధారం .మేడం గారి విధానం లో వస్తువులు ఒక దాని లోనుంచి ఇంకొక దాని లోకి ప్రవేశిస్తాయి .ఈ విషయాన్నే slade కూడా చెప్పాడు .దీనితో ఇరువైపులా ప్రధాన ధర్మాలలో మార్పులు సంభ విస్తాయి .ఆమె రాసిన The secret Doctrine లో ఫోర్త్ డైమెన్షన్ అయిన స్పెసియాల్ డైమెన్షన్ ను ఖండించింది .పదార్ధం పై ఆరో ధర్మాన్ని గురించివివ రించింది .డైమేన్స్హళ్ అనేది ఒక స్థాయి లోని ఆలోచన ,ఒక పరిణామం లో ని వి భాగం,పదార్ధం లోని ఒక గుణం .లేద బీటర్ శాస్త్ర వేత్త astral plane గురించి చెప్పాడు .1882 లో The society of physical research ” అనేది ఏర్పడింది .వీరంతా ,para normal experiences (బుద్ధి ఉన్మాదం )పొందిన వాళ్ళే .జోల్నార్ చెప్పిన దాన్ని సమర్ధించారు .ఈ ముఠాను oscaar wild ఎద్దేవా చేస్తూ ”ది కాంటర్ విల్లె ఘోస్ట్ ”అన్నాడు ”.అంటే దయ్యం ఒక గది లోంచి నాల్గవ పరిమాణం ద్వారా పారి పోయినట్టుంది ”.అని లైట్ తీసుకున్నాడు .
తరువాయి భాగం మరోసారి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31 -10 -11 .