అన్నిటి కంటే ఆవల —–2
హాప్కిన్ అనే శాస్త్రజ్ఞుడు హైపెర్ డైమెన్షనల్ వస్తువులు తయారు చేశాడు .హెచ్.జి .వేల్స్ కాలము ,స్పేస్ రెండు ఒకే ఎంటిటి (సత్వం ) యొక్క భాగమే అని అభిప్రాయ పడ్డాడు .కాలమ్ లో ప్రయాణం (స్పేస్ ట్రావెల్)సాధ్యమే నన్నాడు .ఆయన కాలాన్ని నాలుగో డైమెన్షన్ గా గుర్తించాడు .
1905 లో ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ చాలా ఆశ్చర్య కర మైన విషయాలు కని పెట్టాడు .ఆయన జీవితం లో ఈ సంవత్చరానికి చాలా ప్రాముఖ్యత వుంది .కదిలే వస్తువుల్లోని ఎలెక్ట్రో డైనమిక్స్ ,సాపేక్ష సిద్ధాంతం ,వస్తువులలోని జడత్వం ,అందు లోని శక్తి పై ఆధార పడి ఉంటుందా ?అనే విషయాలపై విష్ట్రుతం గా పరిశోధనా వ్యాసాలు రాశాడు .దీని తోనే E=mc2 అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు .మాలిక్యూల్స్ సైజ్ ను లెక్క కట్టటం ,బ్రౌనియన్ మోషన్ గాపిలువ బడే మాలిక్యులర్ మోషన్ ,ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అయిన అటామిక్ బిహేవియర్ ల పై విస్తృతం గా రాశాడు .దీనికే 1921 లో నోబెల్ బహుమతి వచ్చింది.సాపేక్ష సిద్ధాంతానికి రా లేదు .
హిల్బర్ట్ మిన్ కోవస్కి అనే శాస్త్ర వేత్త ఫోర్త్ డైమెన్షన్ పై చాలా ప్రయోగాలు చేశాడు .ఫోర్త్ డైమెన్షన్ ఆలోచన సరైనదే అన్నాడు .మూడు డైమెన్షన్ ల భావం ఒక మిధ్య అన్నాడు .అయితే ఆ తర్వాత త్రీ డైమెన్షన్ భాష లోనే ప్రపంచాన్ని అర్ధం చేసుకో గలం అని అన్నాడు .పాయిన్కేర్ అనే శాస్త్రజ్ఞుడు టైం ,స్పేస్ విడి సత్తాలు అన్నాడు .మిన్కోస్కి మాత్రం టైం ,స్పేస్ అనేవి ఒకే వస్తువు యొక్క వేర్వేరు అవస్థలు అని ముగించాడు .ఇతని అభిప్రాయం లో సాపేక్షత అంటే స్పేస్ -టైం మాని ఫోల్డ్ .దీనికే కంటిన్యుం అని పేరు పెట్టారు .అంటే అన్ని కాలాల్లో ను ఆవిష్కరిమ్పబడే వస్తువులు .ఇది వరకు జరిగినవి ,తర్వాత జరుగ బోయేవి అన్నీ శాశ్వతత్వం లోనివే . ఐన్స్టీన్ గొప్ప మేధావే కాని బద్ధకిస్టు అన్నాడు గురువు మిన్కోవిస్కి .అయితే గురువు చెప్పే పాఠాలు శిష్యుడైన ఐన్స్టీన్ కు బోరుగా ఉండేవి .అందుకని వినే వాడు కాదు .గురువు గారి సిద్ధాంతం నచ్చేది కాదు .ఫోర్త్ డైమెన్షన్ ఆలోచన గందర గోళానికి దారి తీస్తుందనే వాడు ఐన్స్టీన్ .అదంతా ,మిడి మిడి జ్ఞానం అని తేలిగ్గా కొట్టి పారేశాడు .1910 ,వచ్చేసరికి శిష్యుడి అభిప్రాయమే సరైనది అని తన అభిప్రాయం తప్పేనని గురువు ప్రకటించాడు .ప్రపంచ సంఘటనలు4D కంటిన్యుం ను ఎర్పరుస్తాయన్నాడు .స్పేస్ కోసం క్యూబిజం ,టైం కోసం ఫ్యూచరిజం చిత్ర రచన లో తోడ్పడి నట్లే కని పిస్తుంది .క్యూబిజం ,ఫ్యూచరిజం వంటి అనేక శైలులు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి జవాబులే .
స్టీన్ వీన్ బెర్గ్ ,అనే ఆయన texaas (అమెరికా )నుంచి వచ్చి డైమెన్షన్ల ఉత్చాహం తో మరింత కంగారు పెట్టాడు పార్టికల్ తీరిస్ట్ అయిన హోవార్డ్ జార్జ్” మూడు కంటే ఎక్కువ గా భావించే దైమేన్షన్లు ఒక బంతిలో చుట్టుకు పోయాయి .అవి మనపై ప్రభావం చూపని శూక్ష్మాతి శూక్ష్మ మైనవి ”అని తేల్చాడు .దీనిపై టోల్కీన్ రాసిన కవిత కు పేరడీ కవిత వచ్చింది .”ఒకే సిద్ధాంతం వాళ్ళందర్నీ పాలిస్తోంది .వాళ్ళు కనుక్కోవటానికి ఒకటే సిద్ధాంతం .ఒకే సిద్ధాంతం వాళ్ళందర్నీ kvaantaiz చేస్తోంది .చీకట్లో వాళ్ళను బంధిస్తోంది అదీ బ్రౌన్ ప్రదేశం లో –నీడలు నర్తించే చోట ”.
. అధిక దైమేన్శాన్లు వున్నాయి అనే సిద్ధాంతం ఒక విప్లవాత్మక భావమే .ఒక వేళ ఆ దైమేన్షన్లు నిజం గా వుంటే ,ఇప్పుడు కని పిస్తున్న విశ్వం ఒక చిన్న తునక మాత్రమే .మిగిలింది అంతా అజ్ఞాత ,ప్రచ్చన్న దేశమే ”అన్నాడు భౌతిక శాస్త్ర వేత్త జోసెఫ్ లైకేన్ .
పోతన గారు భాగవతం లో ”లోకంబులు .లోకేశులు —–అనే పద్యం లో పెంజీకటికి ఆవల ”అని ఏదో పరమాద్భుత మైనది వుంది అని చెప్పిన సంగతి గుర్తుంది కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-01 -11 -11 –