ఊసుల్లో ఉయ్యూరు –2 పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని

   ఊసుల్లో ఉయ్యూరు –2
                                               పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని
                       మా నాన్న గారికి అన్న దమ్ములు ,అక్క చెల్లెళ్ళు లేరు .ఆయనఒక్కరే  మా తాత గారి సంతానం .అంటే ఏక్ నిరంజన్ .అందుకని మాకు బాబాయి ,పెదనాన్న ,అత్తయ్య లంటే ,ఆనుబంధం అంటే తెలీదు ,.మా నాయనమ్మ ను మేము మామ్మ అంటాం .మామ్మ పేరు నాగమ్మ గారు .మా ప్రక్క ఇల్లు గుండు వారి ఆడ పడుచు .ఆమె అక్కయ్య మహాలక్ష్మమ్మ గారు రేపల్లె లో వుండేది .మాకు తెలిసిన దగ్గర్నించీ ఆమె వైధవ్యం లోనే వుంది .ఆమె కుమారుడు రాయప్రోలు శివ రామ దీక్షితులు గారు .ఆయనే మాకు బాబాయి .పొట్టిగా ,ఎర్రగా ,గోచీ పోసి పంచేకట్టే వాడు .త్రికాలాల్లో సంధ్యా వందనం చేసే వారు .దేవుడి పూజ అనుష్టానం దాదాపు నాలుగైదు గంటలు పట్టేది .వాళ్ళింట్లో కాఫీ అలవాటు లేదు ,మా పిన్న లక్ష్మి కాంతం మా అమ్మను అక్కయ్యా ,అని బాబాయి మా నాన్ననూ అన్నయ్యా అని చాలా ఆప్యాయం గా సంబోధించే వారు .రాక పోకలు బాగా ఉండేవి .బాబాయి అంటే గౌరవం తో కూడిన భయం .రైల్వే స్టేషన్ దగ్గరే వాళ్లకు డాబా వుండేది మంచి స్థితి పరులు బాబాయి పొట్టిగా ,పిన్ని పొడుగ్గా వుండే వారు .మా కుటుంబం అంటే తగని ఆపేక్ష .నాకు బాబాయి దగ్గర చనువు వుండేది .బాబాయి పావు గంటకో సారి గోచి సవరించుకోవటం బాగా గుర్తు ,.నవ్వుకొనే వాళ్ళం .అతిధి అభ్యాగాతులతో వాళ్ల ఇల్లు  ఎప్పుడు సందడి గా వుండేది .అసలు బాబాయి,పిన్ని  లేని లోటు ను   ఈ  బాబాయి పిన్ని కొంత వరకు తీర్చారు
                      మా మామ్మ పెద్ద చెల్లెలు అంటే మా చిన్న మామ్మ బ్రహ్మా జోశ్యుల వారి ఆడ పడుచు .మా ఇంటికి దక్షిణాన వారిల్లు .దాన్ని మేము త్కర్వాథ కోన్నా ,ఇంకా చిన్న మామ్మ గారి ఇల్లనీ ,బ్రహ్మా జోశ్యుల వారి ఇల్లని అంటాం .ఆవిడకు మెల్ల కన్ను పన్ను . కొంచెం ముందుకు వచ్చి నట్లుండేది .పెద్దమామ్మ పొడవుగా గంభీరం గా వుంటే ,ఈవిడ పొట్టిగా వుండేది .ఆవిడ పీట మీద చివరగా కూచుని భోజనం చేస్తుంటే నవ్వు వచ్చేది .ఆవిడా వితంతువే నాకు గ్రాహకం  వచ్చిన దగ్గర్నుంచి .ఆమె కు ఒక కొడుకు .ఆయనా చిన్న తనం లోనే పెండ్లి అయి ఒక కొడుకు పుట్టాక చని పోయాడు .కనుక మాకు ఈ బాబాయి గురించి వినటమే కాని మనిషిని నేను చూడ లేదు .ఈయన  భార్యయే నందిగామ యడ వల్లి వారి ఆడ పడుచు మహాలక్ష్మి గారు .ఆ పేరు తో ఎవరు పిలిచే వారు కాదు పాపాయమ్మ అనే వారు .ఆవిడే మా పాపాయి పిన్ని .ఆవిడకు చిన్న మూతి వుండేది .అందుకని బుల్లి మూతి పిన్ని అనే వాళ్ళం .నా అనుబంధం అంతా ఆవిడతోనే .ఆమె ప్రభావం నా మీద ఎక్కువ .ఆ వివ రాలు  తర్వాత తెలియ జేస్తాను ..
                  మా మామ్మ చివరి  చెల్లెలు సౌభాగ్యమ్మ గారు .ఆవిడా మాకు తెలిసిన  దగ్గరనుంచీ వితంతువే .ఆమెను బుల్లి మామ్మ అనటం మాకు అలవాటు .ఆమె ఉయ్యూరు లో సూరి వారి  బజారు లో స్వంత ఇంట్లో వుండేది.సూరి వారి కోడలు . .ఆమె కుమారుడే శ్రీ రామ మూర్తి బాబాయి .ఆయన లీలగా గుర్తున్నాడు నాకు .ఆయన భార్య సరస్వతి ..ఈ పిన్ని కొంత గుర్తుంది .ఈ బాబాయి మా ఇంట్లో నాన్న దగ్గర చదువు కొనే వాడట .భార్యా భర్తలిద్దరూ అమ్మా ,నాన్న అంటే పరమ ఆపేక్ష గా వుండే వారని అమ్మ చెప్పేది .ఆన్నయ్యా అంటూ నాన్నను ,అక్కయ్యా అంటూ అమ్మను మహా ఆపేక్షగా పిలిచే వారు .ఈ బాబాయికి తమ్ముడు లక్ష్మణ స్వామి వెలమ కన్ని వారికి పెంపుడు వెళ్ళాడు .చిన్న తనం లోనే ముగ్గురు పిల్లలు పుట్టింతర్వాత చని పోయాడు ..ఆయన అన్నయ్య ఒకాయన వుండే వాడు పెళ్లి అయి పిల్లలు లేకుండా నే చని పోయాడు .మాకు అసలు పరిచయం లేరు పై ఇద్దరు బాబాయిలు .ఈయన భార్య సీతా రామమ్మ పిన్ని .ఈ విడతో మా కు చాలా అనుబంధం వుంది .మా మామ్మ లంత వైధవ్యం లోనే వుండటం చిన్నతనం నుంచి చూశాం .పాపాయి పిన్ని ,సేఎథ పిన్ని కూడా వైధవ్యం లోనే వుండే వారు .నెత్తి మీద ముసుగు ,తేల్లా సైను బట్టలు .దేవుడు ,పురాణం ,పూజా ,పునస్కారం దేవుడు పాటలతోనే కాలక్షేపం వాళ్లకు .భగవంతుడు వీరందరికీ ఇలా ఎలా రాశాడో అని అనిపించేది
                         పాపాయి పిన్ని అంటే నాకు తగనిఆపేక్ష. a .ఆవిడకు ,నేనంటే వల్లమాలిన మమకారం .స్కూల్ కి వెళ్లేముందు ,స్కూల్ కు వెళ్లి వచ్చిన తరువాత ఆవిడతోనే నాకు కాల క్షేపం .ఆవిడను విడిచి ఒక్క క్షణం వుండే వాణ్ని కాదు .ఆవిడా నా కోసం ఎదురు చూసేది .ఆవిడ నాపై గొప్ప ప్రభావం కల్గించింది .బుల్లి మూతి తో ముద్దు ముద్దు గా మాట్లాడేది .ఆ మాటలు చాలా మధురం గా ఉండేవి .చెవుల మీద ముసుగు తరచుగా సవరించుకోవటం ఇప్పటికీ జ్ఞాపకమే .ఆమెకు ఎన్నో కధలు వచ్చు .మనసు కు నచ్చి నట్లు చెప్పేది .ఆ కధలను నేను మా చిన్నక్కయ్య దుర్గా ,మా తమ్ముడు మోహన్ ఆసక్తి గా వినే వాళ్ళం .చాలా కమ్మగా పాటలు పాడేది .వాళ్ల ఇల్లు ఎప్పుడూ అలికి ముగ్గు వేసి చాలా పరిశుభ్రం గా వుండేది .ఇదంతా పిన్ని చేసేది .మా చిన మామ్మ పరిశుభ్రత చాలా ఎక్కువ .ఇల్లంతా చాలా అందంగా వుంచేది
పాపాయి పిన్నిని బుల్లి మూతి పిన్నీ అని ఒక వేళ అన్నా కోపం వచ్చేది కాదు .నవ్వేది . రోజూ రాత్రి పూట పిన్ని దగ్గర కధలు చెప్పించుకోవటం అలవాటు .ఎన్ని కధలు చెప్పినా చివరికి ”ఆవు పులి ”కధ చెప్పాల్సిందే .అది విన్న తరువాతే నిద్ర .ఆ కధ చిన్నతనం లో నా సహచారి అయింది .బహుశా ఆవు సత్య సంధత మనసు పై గాఢ ముద్ర పడేట్లు పిన్ని చెప్పినందుకే ఆయి వుంటుంది .ఒకసారి కాదు కనీసం రెండు మూడు సార్లైనా నిద్ర పోయే ముందు ఆ కధ చెప్పేది .భారత ,భాగవత ,రామాయణ కధలు ఎన్ని చెప్పినా ఫినిషింగ్ టచ్ ఆవు పులి కధే వుండాలి .అందుకు పాపాయి పిన్నికి నేను ఎంతో రుణ పడి వున్నాను .ఆమె ఋణం తీర్చుకో లేనిది .ఇంకా రుణ గ్రస్తుడినే అనుకుంటాను .ఆమె కు తేలు మంత్రం వచ్చు .ఎవరికి తేలు కుట్టినా పిన్ని దగ్గరకు వచ్చి మంత్రం వేయించుకొనే వాళ్ళు .తక్కున తగ్గేది .దానితో పాత గ్రామ ఫోన్  రికార్డు ముక్కను ఆరగ దీసి ఆ గంధాన్ని కుట్టిన చోట పెట్టేది .నొప్పి తగ్గి నవ్వు కుంటు వెళ్ళే వారు
               ఒక సారి మా మామయ్య గంగయ్య గారింట్లో సావిట్లో తిరుగు తుండగా సాయంత్రం పూట  నాకు ,మా మామయ్య మొదటి భార్య ప్రంటే పెద్దత్తయ్య ప్రకాశమ్మ గారికి ఒకే సారి తేలు కుట్టింది .మా పాపాయి పిన్ని కి తెలిసి పరిగెత్తుకొచ్చి నన్ను చంకన వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్లి మంత్రం పెట్టి ,గంధం పూసి ఏడవ కుండా ఉండ టానికి సరదా గా కబుర్లు చెబుతూ ,నన్ను ఊర డించింది .నాకు తగ్గే దాకా ఆమె ప్రాణం విల విల లాడింది మా అత్తయ్యకు మంత్రం పెట్టి సపర్యలు చేసింది ..ఎందుకో నామీద ఆమెకు అంత ఆప్యాయత ?అసలైన పిన్ని అంటే ఏమిటో పాపాయి పిన్ని చూపించింది .నాకు ఆరాధ్య దైవం అయింది .ఆవు,పులి కధ నా నర నరాల్లో జీర్ణించుకు పోయింది .ఎన్ని వందల సార్లు విసుక్కో కుండా చెప్పిందో పిన్ని?అందుకే నేమో నిజం మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం ,మాట్లాడే వారంటే గౌరవం .నూటికి నూరు పాళ్ళు అబద్ధం చెప్పలేదని చెప్పలేను కాని దాదాపు అదొక నియమం గా నే పాటించే ప్రయత్నం చేస్తున్నాను .that is paapaayi pinni .నాకు జీవితం లో దొరికిన వరం పాపాయి పిన్ని .మా అమ్మను ”భవానక్కయ్యా”’.అని చాలా ప్రేమతో పిలిచేది .ప్రతిదానికి ఇంటికి వచ్చిం సహాయం చేసేది .
                కాని ఆవిడ జీవితం సవ్యం గా సాగ లేదు చివర్లో ఒక్క గానొక్క కొడుకు కృష్ణ మూర్తి చెడు అలవాట్లకు బానిసై హింసించాడు పాల్ఘాట్ పిల్లను పెళ్లి చేసు కోని కష్టాలు కోని తెచ్చుకున్నాడు .పాపాయి పిన్ని ఇవన్నేఎ భరించలేక ,అత్త గారు అంటే మా చిన్న మామ్మ చని పోగానే పుట్టిల్లు నంది గామ చేరి తమ్ముడి దగ్గరుండి .అప్పులు పాలైన కొడుకు ఇక్కడి ఇల్లు అమ్ముదామని ప్రయత్నం చేస్తుంటే చాలా రోజులు వారించింది .అయిన కాడికి అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఎవరికో అమ్మా లని చూశాడు .పిన్ని మనసు గిల గిల లాడింది .ఆ ఇల్లు ఎవరికో అమ్మటం ఆవిడకు ఇష్టం లేదు .చివరికి ఉయ్యూరు వచ్చి మమ్మల్ని ప్రోత్చ హించింది కొనమని .అప్పటికి మా నాన్న గారు చని పోయారు .మేమంతా చదువుల్లో వున్నాం .కొనే ధైర్యం లేదు .మా మామయ్యను మధ్య వర్తి గా చేసి మాకు అమ్మక పోతే తాను ఆత్మ హత్య చేసుకొంటానని కొడుకును బెది రించింది .వాదినిమేము అన్నయ్యా అని పిలుస్తాం .చాల ప్రేమగా నే వుండే వాడు .భోజనం అదీ మా ఇంట్లోనే .కాని అప్పుల బాధా ,తాగుడు వ్యసనం వాడిని నిలవ నీయ లేదు .మామయ్య నచ్చచెప్పిన తర్వాత ఇల్లు మాకు అమ్మాడు .అప్పుడు మా పాపాయి పిన్ని మనసు శాంతించింది రాత కోత లయిన్తర్వాత నందిగామ వెళ్లి పోయింది .ఇది చాలా విషాద సంఘటన .పగ వారికి కూడా వద్దు అనిపించేది .పాపం పిన్ని ఎంత మానసిక క్షోభానుభావిన్చిందో .’ఆ తర్వాత్ ఆ డబ్బుతో కొడుకు మరీ రెచ్చి పోయాడు .భార్య వదిలేసింది .ఎక్కడో దిక్కులేని చావు చచ్చాడు .మా కుటుంబాలకు కృష్ణ మూర్తి జీవితం ఒక హెచ్చరిక గామిగిలింది . .సవ్య మార్గాన నడ వ టానికి తోడ్పడింది ..మళ్ళీ పిన్నిని చూసి నట్లు గుర్తు లేదు .రాక పోకలు లేవు .పాపం ఆవిడకు ఉయ్యూరు రావటానికి మనస్సు ఎలా ఒప్పు కొంటుంది ?
              పిన్ని చెప్పిన కధ ఏ గ్రంధం లోదో అప్పుడు నాకు తెలియదు .ఫోర్త్ ఫాం చదువుతుండగా ”సత్య వ్రతము ”అనే పేర పాత్యాంశం గా చదివాం .అనంతా మాత్యుని  భోజ రాజీయం లోని కధ .అందులో తల్లి లేని పిల్లాడు ఎంత చులకనో ఒక పద్యం లో గొప్ప గా చెప్పాడు కవి ”చులకన జలరుహ తంతువు ,చులకన ధూళి కణం ,చులకన గడ్డి పరక చులకన తల్లి లేనిసుతుడు   కుమారా ”అని ఆవు తన లేగా దూడకు హితవు చెబుతుంది .సత్యానికి వున్న గొప్ప తనాన్ని వివరిస్తుంది .అనంతా మాత్యుడు మా ఉయ్యూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో వున్న పెనమ కూరు వాడే అవటం మాకు గర్వ కారణం .పెనమ కూరు లోనే పౌరాణిక నాటకాలలో కృష్ణ పాత్ర వేసే మహానటుడు ,గాయకుడు అబ్బూరి వర ప్రసాద రావు జన్మించాడు .మా చిన్న  తనం లో తోట్ల వల్లూరు లో
శివరాత్రి నాడు శివాలయం లో ఆయన నాటకం చూసే అదృష్టం కల్గింది .ఆయన రాగాలు ఇంకా చెవుల్లో గింగురు మంటున్నాయి .ఫోర్త్ ఫాం లో మాకు ఆ పాఠ్య భాగాన్ని గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారు అనే తెలుగు పండితులు బోధించిన జ్ఞాపకం వుంది .ఆ తర్వాత ద్వా.నా.శాస్త్రి గారితో పరిచయం అయిన తర్వాత మాకు రెండు కిలో మీటర్ల దూరం లో వున్న కనకవల్లి అగ్రహారం లో మారేపల్లి రామచంద్ర శాస్త్రి అనే కవి గారు జన్మించారని ,ఆయనపై తాను పరిశోధన చేశానని ఒక ఉత్తరం లో ఆయన రాశారు .శాస్త్రి గారిని ”కవి గారు ”అనే వారు .వారు విశాఖ పట్నం వెళ్లి తమ కార్య క్రమాలు జోరుగా కొన సాగించారు .గొప్ప సంస్కరణ వాడి .ఆయన గురించి చదివి ఒక పెద్ద కవిత రాసి ఆ తర్వాత ద్వా.నా..గారికి పంపిస్తే చదివి బాగుందని మెచ్చి ఉత్తరం రాశారు .
                  నేను ఉయ్యూరు హై స్కూల్ లో సైన్సు మేస్టార్ గా పని చేసే టప్పుడు స్కూల్ లో 16mm  ప్రొజెక్టర్ తో పిల్లల కోసం విజయ వాడ extention  ofice నుంచి ఉచితం గా రీళ్ళు తెచ్చి వేస్తుందే వాళ్ళం .అందులో పని చేసే ఒక ఆఫీసర్ నాకు బాగా పరిచయం అయారు .ఆయన ఒక సారి నన్ను ”భోజ రాజీయం ”చదివారా ?”అని అడిగారు .చదవ లేదన్నాను .వెంటనే చదవమని  చెప్పారు .కోని చదివాను .ఎంతో నచ్చింది .నన్ను దానిపై వ్యాసాలు రాయ మని కోరారాయన .ఒక సారి ”అనంతామాత్యుడు ”అనే శీర్షికతో వ్యాసం రాశా .అది ”తెలుగు విద్యార్ధి ”లో అచ్చు అయింది .దానికి కొంత రేపైర్ చేసి radio లో
మాట్లాడాను .ఇదంతా మా పాపాయి పిన్ని ఋణం తీర్చుకోవటానికి కొంత ఉపయోగ పడింది .
                   రెండేళ్ళ క్రితం ”సరసభారతి ”ఆధ్వర్యం లో జరిపిన ఒక సభలో నరసరావు పేట నుండి యడ వల్లి మనోరమ అనే తెలుగు లెక్చరర్ ను ఉపన్యాసానికి పిలిచాం .ఆవిడ అది అయింతర్వాత మా ఇంటికి వచ్చింది .మా అమ్మ నాన్న ఫోటోలు చూసింది .ఈ పరిసరాలు తానేప్పుడో చిన్నప్పుడు చూసినట్లు చెప్పింది .వరస పెట్టి తిర గేస్తే ఆవిడ మా పాపాయి పిన్ని మేన కోడలే అని తెలిసింది .ఆ నాటి ఆనందం వర్ణనా తీతం .అప్పటినుంచి తరుచుగా ఫోన్ లో మాట్లాడు కుంటున్నాం .నన్ను నాన్న గారు అనీ ,మా శ్రీమతిని అమ్మ అని పిలవటంమనోరమ  సంస్కారం .ఇలా ఎలా భగ వంతుడు మనుష్య్ల్ని కలుపు తాడో తెలీదు .అంతే కాదు వారం క్రితం మనోరమ ఫోన్ చేసి ”మీ బంధువు మాకాలేజికి ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చారు .”అని చెప్పి ఆయన ఫోన్ నంబెర్ ఇస్తే మాట్లాడాను .ఆయన ఏలూరు లోని మా జ్ఞాతి గబ్బిట దక్షిణా మూర్తి గారి మనవడు ,అని కంచిలో ని వెద పాథ శాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనీ తెలిసింది .మా కుటుంబం అంతా అతనికి బాగా తెలుసునట /నన్ను ”పెద నాన్న గారు ”అని పలకరిస్తే పులకరించి పోయాను ..ఇదీ ఒక బంధం మనోరమ మహాత్య్మం .
 మా పాపాయి పిన్ని ని ఈ విధం గా మీ అందరికి పరిచయం చేసి నేను కొంత వరకు ధన్యుణ్ణి అయాను .
                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -11 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

4 Responses to ఊసుల్లో ఉయ్యూరు –2 పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని

 1. vhhp says:

  ధన్యవాదాలు దుర్గాప్రసాద్ గారు! మంచి తెలుగు చదివి చాల దినాలైంది. మేముండేది కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇక్కడ మాట్లాడే తెలుగు, మీ భాషకు కొద్దిగా మార్పు వుంటుంది. “వరస పెట్టి తిర గేస్తే ” అనే మాట మా ఫ్యామిలీ అంతటికీ చాలా నచ్చింది. వావి వరసలు అనే పదాలు తెలుసు కానీ, ఈ విధంగా వాడవచని నా ౫౫ సంవత్సరాల వయస్సుకు మొదటి సారి మనసుకు హత్తుకొనేలా తెలిసింది.
  మీ పిన్ని గారికి గౌరవపూర్వక నమస్కారాలు.
  వుంటాను.

 2. Suneel says:

  40 సంవత్సరాల క్రితం, మా నాన్న గారు పెనుమకురు లో డాక్టర్ గా పనిచేసే రోజుల్లో, కనకవల్లి లో నాలుగు సంవత్సరాలు ఉన్నాము. మా తమ్ముడు అక్కడే పుట్టాడు. మా పాత రోజులన్నీ గుర్తు వచ్చాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా
  ఉయ్యూరు,కనకవల్లి, పెనమకూరు చూసే భాగ్యం కలగాలని కోరుకుంటూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు కృతఙ్ఞతలు చెప్పుకుంటూ,
  డాక్టర్ సునీల్, యుకె

 3. చాల హృద్యం గా వ్రాశారండి.
  ధన్యవాదాలు.

 4. Sri Sasidhar Gogineni says:

  మాది మొవ్వ మండలం.మీ ఊసుల్లో ఉయ్యూరు చదువుతుంటే మా జిల్లా పరిసరాలు జ్ఞాపకం వస్తున్నాయి.
  చాలా సంతోషంగా ఉంది.

Leave a Reply to Suneel Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.