ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4

       ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —4
                                                  సాంఘిక సాహిత్య సంక్షేమ కార్య పరం పర
                   1953 లో గోదావరి నదికి వరదలు వచ్చాయి .పిల్లలను ,పెద్దలను ,యువకులను చేర దీసి వరద సహాయ నిధి కోసం గ్రామాలన్నీ తిరిగి బుర్రకధలు చెప్పించారు .నాటికలు వేయించారు ,పంచ వర్ష . ప్రణాళికలు ,గ్రామ స్వరాజ్యం ,మహిళాభ్యుదయం పై ఉపన్యాసాలను తయారు చేసి ,విద్యార్ధులతో మాట్లాడించే వారు .శాంతి నిలయం సేవా సంఘం ద్వారా ,ముదునూరు లో రోడ్లను అభివృద్ధి చేశారు .”ఉచిత హిందీ శిక్షణా సౌకర్యం ”ను పువ్వుల రామ మోహన రావు వంటి హిందీ ప్రేమికుల ద్వారా కల్పించారు .రైతు బిడ్డలను విహార ,విజ్ఞాన యాత్రలకు తీసుకొని వారి జ్ఞానాభి వృద్ధికి దోహదం చేశారు .కుల మతాలకు అతీతం గా పని చేశారు .అందుకే అది ”సోషియోఎడ్యుకేషనల్ కల్త్యరల్  సెంటర్ ”గా గుర్తింపు పొందింది .ఆ కాలమ్ లో ఎన్నో సాహిత్య ,కళా సంస్థలు పుబ్బలో పుట్టి మఖ లో మాడి పోయాయి .దానికి కారణం సంకుచితత్వం,ఈర్ష్యాద్వేషాలు అని బాధ పడుతారు రావు గారు .అందుకే వాటికి అతీతసం గా ,ముదునూరు సంఘం సేవలందించింది .బాధ్యతలు అందరికి ,సామర్ధ్యాన్ని బట్టి అప్పగించే వారు .మంచి పర్య వేక్షణ వుండేది .వీటికి మించి సేవా దృక్పధం వుంది .”రాము -రాజా ”అనే ఇద్దరబ్బాయిలు పిల్లల కార్యక్రమ రూప కల్పనలో నిర్వహణ లో బాగా తోడ్పడ్డారు .
                     radio అన్నయ్య శ్రీ ఏడిద కామేశ్వర రావు ముదునూరు వచ్చి కార్యక్రమాలను పరిశీలించారు . radio వారే వచ్చి పిల్లల కార్యక్రమాలు రికార్డు చేసి ప్రసారం చేశే వారు .ఉయ్యూరు మొదలైన గ్రామాలలో ”బాల రాజ్యం ”బ్రాంచీలు ఏర్పాటి చేశారు .మేము అందరం అందు లో పాల్గొనే వాళ్ళం .అప్పుడు ఆయన్ను చూసిన గుర్తు నాకు లేదు .ముదునూరు నుంచి సుమారు 100 ”బాల రాజ్యం ”కార్యక్రమాలు నిర్వహించిన ఘనా పాటి రావు గారు . ఆరుగొలను నుంచి నండూరి సుబ్బారావు అనే హాష్య నటులు ,ముదునూరు నుంచి ఈ సోదరులు పిల్లలను radio కార్య క్రమాలకు విజయవాడ  తీసుకొని వెళ్ళే వారు .రావు గారిని ”radio కార్యక్రమ సభ్యుని ”గా చేశారు వీరు ప్రదర్శించిన ”ఉగాది అల్లుడు ”నాటిక బాగా క్లిక్ అయింది .గంగిరెద్దు ,హరిదాసు ,గొబ్బిపాట ,లతో సంక్రాంతి శోభను రేడియోలో కల్పించారు .పిల్లలు లంబాడి డాన్స్ చేసి అచ్చంగా లంబాడీలే క్యని పించే వారు .రావు గారి శిక్షణ అంత నిర్దుష్టం గా వుండేది .వీరు రచించి ప్రదర్శించిన గంట నాటిక ”కనువిప్పు ”పోటీలలో బహుమతి సాధించింది .ఉమ్మడి డబ్బు సమాజానికి ఎలా ఉపయోగించాలో తెలియ జేసే కధ ఇది .  .
                  1955 లో భూదానోద్యమ నాయకులు వినోబా భావే విజయ వాడ వచ్చార్రు .వారి సమక్షం లోవారి జీవిత కధ ను   బుర్రకధ గా మలిచి రాము బృందం తో ప్రదర్శించి భావే మెప్పు పొందారు .దాన్ని ఆయనకే అంకితమిచ్చారు .రచనకు క్రియాశీల ప్రయోజాం వుండాలని ,ఉన్నత భావావిశాకరణ జర గాలాని రావు గారి అభిప్రాయం .కరుణశ్రీ ,ఉత్పల ,ముదిగొండ ,వంటి కవులు ,ముదునూరు వచ్చి శాంతినిలయం కార్యక్రమాలు చూసి ముచ్చట పడ్డారు .;”భారత సేవా సమాజ్ ”ఇచ్చిన ఆర్ధిక సాయం తో ముదునూరు లో డొంక రోడ్డు నిర్మించారు .వీరి రేడియో కార్యక్రమాలు విని ఆనాటి బందరు పార్లమెంట్ సభ్యులు మండలి వెంకట కృష్ణా రావు అభినందన లేఖ రాశారు .గ్రామ మహిళా సంఘం ఏర్పరచి ,”మరుగుదొడ్డి ”అవసరాన్ని వివరించి అమలు పరిచారు .40 మంది మహిళల తో ”అంబర్ చరఖా కేంద్రం ”ఏర్పాటు చేసి ,బ్లాక్ డెవలప్మెంట్ వారి ఆర్ధిక సాయం తో ,శిక్షణ నిప్పించారు .దీనితో పేద కుటుంబాలకు జీవనో పాది లభించింది .కుట్టు పనులు నేర్పించారు గృహా లంకరణ .నేర్పించారు . .తాటాకు చాపలు ,ఈతాకు చాపలు విసన కర్రలు తుంగ చాపలు జేబు రుమాళ్ళు తయారు చేయించే వారు .కవర్ల తయారు చేయటం లో శిక్షణ నిప్పించారు .ఇవన్నీ మంచి ఉపాధి కల్పించాయి ..ఇవన్నీ రావు గారిమెదడు   లోని ఆలోచనలు .అవి సమర్దవంతం గా అమలయాయి .స్వంత కాళ్ళపై నిలబడే గొప్ప  అవకాశం కల్పించారు రావు గారు .ముదునూరు గ్రామ జీవనం లో ఈ కేంద్రం మైలు రాయి గా నిలిచి ,ఆడర్శవంతమైంది  ‘చేతి పనుల ప్రదర్శన ఏర్పాటుచేసి అందరి ప్రశంసలు పొందారు .
                     ఏడు ఏళ్ళు ముదునూరు లో గ్రామ ప్రజల చైతన్య కార్య క్రమం నిర్విఘ్నం గా జరిపిన ఘనత వెంకటేశ్వరావు సోదరులాడే .ఆ సమయం లోనే మద్రాస్ ,హైదరాబాద్ ,ధిల్లీ లకు విజ్ఞాన యాత్రలు నిర్వహించారు ధిల్లీ లో భారత ప్రధాని నెహ్రూను దర్శించి మాట్లాడి ,ఆ జ్ఞాపకాలను ”పండితజీ తో పది నిమిషాలు ”వ్యాసం లో నిక్షిప్తం చేశారు .ఋసీ కేష్ లో స్వామి శివానంద ను సందర్శించి ,ఆధ్యాత్మిక అనుభూతి పొందారు .ఇంత తీరిక లేని కార్య క్రమాలు నిర్వ హిస్తూనే 1961 లో బనారస్ విశ్వ విద్యాలయం నుంచి ప్రైవేటు గా చదివి ఏం .ఏ.సాధించారు .ఇదీ సార్ధక జీవితం అంటే -తాను తరిస్తూ ,ఇతరులను తరింపజేయటమే .
              1961 లో ముదునూరు లో జిల్లా స్థాయి నాటిక ,ఏక పాత్రాభినయం పోటీలను శాంతి నిలయం లో మూడు రాత్రులు ఘనంగా నిర్వహించారు .కవి కాటూరి తో ప్రారంభం చేయించారు .బాలకవి బి.వి.నరసింహారావు .పైడి పాటి వంటి కవులు ,రచయితలు పాల్గొన్నారు .న్యాయ నిర్ణేతలుగా ,ఎర్రోజు మాధవా చార్యులు ,రామచంద్ర కాశ్యప్ ,విన్న కోట రామన్న పంతులు వ్యవహరించారు .అత్యంత భారీగా ,సమర్దవంతం గా నిర్వహించటం చెప్పుకోదగిన విషయమే .పాల్గొన్న సమాజాల వారికి ,నటీ నటులకు సహాయకులకు ఉచిత వసతి ,భోజన సౌకర్యం కల్పించారు .
                1962 లో మైలవరం హై స్కూల్ కు బదిలీ అయారు .అక్కడా ఇదే విధానం అవలంబించి అందరి అభిమానం పొందారు .మైలవరం రాజా నరసింహారావు గారు మంచి ప్రోత్చాహం అందించారు .యు.యెన్.వో .పరీక్షలకు శిక్షణ ఇచ్చారు .”గోడ పత్రిక ”నిర్వహించారు .విద్యార్ధులతో పదిహేను రోజులకో సారి వార్తా సమీక్ష చేయించే  వారు .దీనితో జెనెరల్ నాలెడ్జి బాగా పెరిగేది .రేడియో పాఠాలను రికార్డు చేసి ఖాళీ పిరియడ్లలో వినిపించే వారు .”బాల భారతి ”అనే వార్షిక పత్రిక నడిపారు .విద్యార్ధులను ప్రోత్చాహించి కవితలు కధలు వ్యాసాలు రాయించారు .పాఠాశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను” సినిమా ”తీయించి వార్శికోత్చావం రోజున అందరికి ప్రదర్శించి చూపే వారు .ఆనాడు ఇది చాలా సాహసో పేత మైన చర్య.ఎక్కడా ,ఎవరు చేసిన దాఖలాలు లేవు .
కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం మైలవరం ”బాల రాజ్యం ”పనులను పరిశీలించారు .ఆ సందర్భం గా హస్త కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు .మూడు రోజులు నాటికలు ప్రదర్శించారు .మైలవరం మొదటి నుంచి నాటక రంగానికి గొప్ప కేంద్రం .ఆ రాజు లందరూ బాగా ప్రోత్చాహించారు .నాటకం మొదట పాడే ”పరా బ్రహ్మ పరమేశ్వర ”అనే ప్రార్ధనా గీతం అక్కడే రూపు దిద్దుకుంది .ఆ ఆస్థాన కవి దాన్ని రాశారు ..ఆ తర్వాత అన్ని సమాజాలు దాన్ని అనుసరించాయి .రేడియో గాయకురాలు వింజమూరి లక్ష్మి ,రేడియో అన్నయ్య ,నటుడు కందుకూరు రామ భద్ర రావు గార్లకు ఆ వేదికపై ఘన సన్మానం చేశారు .ప్రజా సహకారం తో ”బాల రాజ్యం ”అనే ప్రత్యెక సంచికను వెలువరించి ,అందులో మైలవరం నాటకరంగ సేవ పై ప్రత్యెక వ్యాసాలు రాయిస్తూ ,పిల్లల .పెద్దల .ఉపాధ్యాయుల రచనలతో దాన్ని అతి సుందరం గా ముద్రించి రికార్డు నెలకోల్పారు రావు గారు .వూరు ఏదైనా ,వారి తీరు అదే .
                                             సశేషం
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -11 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.