ఊసుల్లో ఉయ్యూరు —3 పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్

      ఊసుల్లో ఉయ్యూరు —3
                                             పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్
                మా ఉయ్యూరు లో పూర్వంపశువుల  పశ్వుల ఆస్పత్రి మాసువర్చ లాంజనేయ స్వామి   దేవాలయానికి దగ్గర సూరి వారి బజారు లో వేదాంతం రామాచార్ల గారి ఇంటి వద్ద వుడేది .అద్దె కే .ఒక చిన్న పెంకుటిల్లు .అందులో డాక్టర్ గారి ఆఫీసు ,బీరువాలలో మందులు ,కత్తులు కతార్లు మొదలైన శస్త్ర పరికరాలు ఉండేవి .బయట ఒక తాటాకుల పాక .డాక్టర్ గారుపశువుల యజమానుల్ని  ఈ పాక లో వుండి ,ఒక రిజిస్టర్ లో వివ రాలు అడిగి రాసుకొనే వారు .పాపం ఆయనకు ఒక చిన్న కొయ్యకుర్చీ ,చిన్న  , కొయ్య  బల్ల .చేతులు కడుక్కోవటానికి స్టాండ్ బేసిన్ .లైఫ్ buoy సబ్బు ,చిన్న తువాలు .రెడీ గా చేతికి గ్లోవేలు ,కాళ్ళకు పొడవైన మోకాళ్ళ దాకా వచ్చే బూట్లు .ఒక కామ్పౌందర్ సహాయకారి .ఇద్దరు అటెండర్లు  .అక్కడికి వెడితే భలే తమాషా మందుల వాసన వచ్చేది .నా చిన్నప్పటి నుంచి ఆ ఆస్పత్రితో సంబంధం వుండేది .మాకు గేదెలు ,ఆవులు ఉండేవి పాలేరు వుండే వాడు .దాదాపు వూళ్ళో చాలా మందికి ఆనాడు పశువులు ఉండేవి .వ్యవసాయం వున్న వారికి ఎడ్లు ,బండీ పెద్ద పాలేరు వుంటారు … .
                         ఆ కాలమ్ లో పశువులకు జబ్బులు బాగా నే వచ్చేవి .గాళ్ళు అనే వ్యాధి కాళ్ళకు వచ్చేది .దీన్నే గాలి కుంటు వ్యాధి అంటారు .పాపం అవి విపరీతం గా బాధ పడేవి .ఈగలు    ఆ పుళ్ళ మీద ముసి రెవి .ఆజబ్బు సోకితే తిండి తినేవి కావు .వాటి బాధ వర్ణనా తీతం .కొన్ని పశువులు లేవ గలిగే స్థితి లో ఉండేవి కావు .లేస్తే ఆస్పత్రికి పాలేళ్ళు తోలుకు వెళ్లి మందు వేయించే వారు .ఆస్పత్రి లో అన్నిరకాల   పశువులకు వైద్యం వుండేది .గొప్ప తనం ఏమిటీ అంటే  దమ్మిడీ కూడా డాక్టర్లు కాని ,సహాయకులు కాని ఏ జబ్బుకు డబ్బు తీసుకోక పోవటం .అన్ని మందులు ఆస్పత్రి లోనే ఉండేవి .అన్నీ ఉచితమే .అవసరమై ఇంటి దగ్గర వేయాల్సి వస్తే వాళ్ళే ఇచ్చే వాళ్ళు .దానికీ డబ్బు లేదు .
                       పాలేల్లతో పాటు చిన్నప్పుడు ,ఆ తర్వాత ఉద్యోగం చేసే టప్పుడు నేను హాస్పత్రికి వెళ్ళే వాడిని .అక్కడ గొడ్లను నుంచో పెట్టి మందు నోటిలోకి పోయటానికి రెండు అడ్డ కర్రలు భూమిలో సపోర్ట్ తోనూ ,ముందు ఒక బలమైన కొయ్య స్థంభం సుమారు అయిదారు అడుగుల పొడవుతో ఉండేవి .దీనికి పశువును కట్టి మొర పైకెత్తించి నోటిలో పొడవైన వెదురు గొట్టంలో మందు పోసి నాలుక అదిమి పట్టి నోటిలోకి చెయ్యి పెట్టి పోసే వారు .అవి గుట గుట తాగుతుంటే తమాషాగా వుండేది .తాగింతరవాత పొట్ట మీద చరిచే వారు .పూర్తి గా లోపలి చేరా టానికి .
                    ఎద్దులు దున్నలు వస్తే వాటికి మూపురం మీద ,కంఠం కింద ,గంగ డోలు వాచినపుడు వాటిని పట్టుకొని వైద్యం చేయటం కష్టం .అందుకని ఇసక తో పూడ్చిన గొయ్యి లాంటి వెడల్పైన దాంట్లో కాళ్ళకు బందాలు వేసి ఒక్క సారిగా పడి పడుకొనే ట్లు చేయటం భలేగా వుండేది .గంగ డోలు వాస్తే ఒక రకమైన ఆయింట్ మెంట్ రాసే వారు సహాయకులు .అది రాసింతర్వాత పసుపు రంగులో మారేది .వింతవాసన వచ్చేది .ఈ పనులన్నీ  చేయ టానికి నాకు తెలిసిన దగ్గర్నుంచి కోటయ్య,పరసు రాముడు  అనే చాకలి వాళ్ళు ఇద్దరు అటెండర్లు గా వుండే వారు .వాళ్లకు retirement వుండదేమో నని పించేది .ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి చీకటి పడే వరకు ద్యుటి ఏ.విసుగు విరామం లేదు .అందులో పెద్ద అతని పేరు కోటయ్య .నల్లగా ,పెద్దముక్కు తో ,బలం గా ,కొంచెంగండు మొహం తో   వుండే వాడు .కీచు గొంతు ,.తెల్లని పంచె ,తెల్లని చొక్కా ఉండేవి .అవి ఎంత కష్టమైనా పని చేసినా మాయటం నేను చూడ లేదు .మా ఇస్త్రీ చాకలి మాణిక్యం అనే అమ్మాయికి తమ్ముడు కోటయ్య .రెండ వ అతను పరశు రాముడు కాకి నిక్కర్ ,బనీను తో వుండే వాడు .ఇందులో కోటయ్య ఆరితేరిన మనిషి .డాక్టర్లు ఆ కాలమ్ లో తక్కువ ,సరిగా వచ్చే వారు  కాదు .కనుక హాస్పటల్  లో కోటయ్య వుంటే డాక్టర్ వున్నా .లేక పోయిన ఫరవాలేదు .అందరికి అదో ధైర్యం . అతని అనుభావసమే అతను డాక్టర్ కంటే గొప్ప వాడిని చేసింది .అందుకే నాకు అతనే పశువుల పాటి నారాయణుడు అనిపించే వాడు .ఆ ఇద్దరు అశ్వినీ దేవతల్లా అని పించే వారు .వారి సేవలు నిరూప మానం ..మాటలతో వర్నించలేనివి .కనీసం ఈ రూపం గా నైనా వాళ్ళిద్దర్నీ తలిచి ఉయ్యూరు వాసుల ఋణం తీర్చు కోవటమే నేను చేస్తున్న పని .వాళ్లకు ఏమిచ్చి ఋణం తీర్చుకో గలం  ?ఉయ్యూరు చుట్టూ పక్క గ్రామాలకు అప్పుడు ఇదే ఆస్పత్రి .ఆ తర్వాత చుట్టూ వచ్చాయి  గేదెల గేదేలాక్ అరుపులతో ,ఆవుల అమ్బారవాలతో దూడల అరుపులతో ,ఎద్దుల  రంకె లతో భలే సందడి గా వుండేది .కొల్ల కొక్కొరో కోలు,కుక్కలా నాలుకల విసుర్లు భౌ భౌ లు వింత గా ఉండేవి .
                      పశువులకు పారుడు వ్యాధి బాగా వుండేది .అవి పారుకొంటు ఆస్పత్రి అంతా చెడగొట్టేవి   .పాలేళ్ళు జాగ్రత్త గా ,శుభ్ర పరిచే వారు .గోడలకు injection   చెయ్యటం చూడ ముచ్చట గా వండేది .సహాయకులు తాడు వేసి బిగించి పశువును రాటకు కట్టిఅదిలిస్తూనే డాక్టర్   గారు కావలసిన మందును సిరంజి లో ఎక్కించి  తుంటి మీదో ,మెడ మీదో మూపురం మీదో బలం గా సూదిని లాగి పెట్టి పొడి చే వాడు .అది నిలబదిన్తర్వాట ,సిరంజి లోని మందు దానిలోకి ఎక్కించే వాడు .సరదా గా వుండేది చూడ టానికి .అవును బాధ పశువుది ఆనందం ఈ నర పశువుది కదా ..అర్రు మీద పుల్లు ఏర్పడేవి .సరైన సమయం లో మందు వేయక పొతే అది బాగా లోతు గా పెరిగేది .అలాంటి వాటికి రోజూ డ్రెస్సింగ్ చేసే వాళ్ళు కోటయ్య ,పరశు రాముడు .అయోడిన ఆయింట్ మెంట్ రాసే వారు .బొరిక పౌడర్ అద్దె వారు .tncture   లో దూది ,అద్ది పట్టు కార లాంటి సాధనం తో పుండు లోపలి పోనిచ్చి చెడు పదార్ధం అంతా బయటికి తీసేసి గాజు గుడ్డకు మందు రాసి అందులో పెట్టి డ్రెస్సింగ్ చేసే వారు.చేతులు కడుక్కోవతానికీ పుల్లు కడగా టానికీ పోతాస్సియం పెర్మాంగా నెట్ వాడే వారు . .కొన్ని ఆవులు,గేదెలు ఈనిన తర్వాత మాయ వేసేవి కాదు .ఒక రోజూ చూసి వాటిని తీసుకొచ్చే వారు .గ్లోవులు తొడుక్కొని పరసురాముడు ,కోటయ్య దాన్ని బయటికి తీసీ వారు .అప్పుడు డాక్తో చెక్ చేసి మందు రాసే వాడు .మంచి ఆబోతు ,దున్న పోతు కొంత కాలమ్ వున్నట్లు జ్ఞాపకం .ఎద కు వస్తే వాటితో దాటిన్చ్ వారు .ఏదైనా యజమాని ఇస్తే తీసుకొనే వారు .ఆ పనీ కోటయ్య సమర్ధం గా చేసే వాడు .చూడి నిలిచిందో లేదో మూడో నెల నుంచి పరీక్షకు తెచ్చే వారు .దానికీ కోటయ్యే ముందు .’కోడె దూడలకు వృషణాలు కొట్టటం కూడా చేసే వారు .పశువును ఒడుపుగా తాళ్ళు నడుం చుట్టూ వేసి బిగించి ఒక్క ఉదుటున పడుకో బెట్టె నేర్పు . కోటయ్యడే ఎంత లావు పశువైనా అతని లాఘవం ముందు బలాదూరే . .పాలు సరిగ్గా ఇవ్వటం లేదనో దూడ , పాలు తాగటం లేదనో వచ్చే వాళ్ళు .డాక్టర్ వుంటే సరే .ఏక పోతే కోటయ్యే కామ్పౌందర్ తో కేసు రాయించి మందు ఇచ్చి పంపేవాడు .లేగ  దూడలకు మట్టి తింటే పేడలో  పురుగులు పడేవి .చాలా బాధ పడేవి .మెలికలు తిరిగేవి .వాటికీ చక్కని మందు ఇచ్చే వారు .నాకు తెలిసినంత వరకు ఏ పశువు వైద్య లోపం వల్ల అక్కడ చని పోలేదు .ఇది చాలు కోటయ్య సేవకు .
                     డాక్టర్లలో నాకు కొంత వరకు తేతలి సుబ్బా రావు గారు తెలుసు .అ తర్వాత చాలా మంది వచ్చే వారు ,పోయే వారు .ఎవరు వచ్చినా ,పోయినా కోటయ్యే అసలు డాక్టర్ నా దృష్టిలో .వాళ్లకు పెద్ద గా జీతాలున్దేవి కాదను కుంటా .దేవిరింపు లేదు .దసరాకు మాత్రం అన్ని ఇళ్ళకు మామూళ్ళ కు వచ్చే వారిద్దరూ .చాల సంతోషం గా యజమానులు తోచింది ఇచ్చి సంతృప్తి పరిచే వారు .ఆరగా ఆరగా బీడీలు తాగే వారు .రాత్రి పూట పొద్దున్నించీ చేసిన పనికి ఒళ్ళు పులిసి మందు కొట్టే వారు .అయితే ఎప్పుడు వీధిన పడే వారు కాదు .తెల్లార గానే ద్యుటి కి మళ్ళీ హాజరు .ఆ హాంగోవర్ కని పించేది కాదు .పనిలో బద్ధకం ,అశ్రద్ధ లేవు .క్రమం గా ఆస్పత్రి లో డబ్బు ప్రవేశించింది .,వీళ్ళు రిటైర్ అయింతర్వాత .మందులు ఉండేవి కావు .డాక్టర్ రాసిస్తేబయట  కోని తెచ్చుకోవాలి .artficial insemination వచ్చింది .బలమైన ,పాలిచ్చే సంతాతి ,జెర్సీ ఆవులు ,వచ్చాయి .ఒక సారి ఒక కుర్ర డాక్టర్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు .నాగేంద్ర మూర్తి అని పేరు అని అజ్నాపకం .పశువుల పెంపకం లో మంచి సలహాలనిచ్చాడు .పాలిచ్చే వాటినే వుంచి మిగిలినవిఅమ్మేయమని   సలహా ఇచ్చాడు .నేను పాటించాను .సరదాగా నవ్వుతు మాట్లాడే వాడు .అప్పుడువసతులు లేవు .కానిడ్యూటి   మీద శ్రద్ధ బానే వుండేది వున్న దాంట్లోనే చక్కని వైద్య సేవలు అందించే వారు .
                           ఇప్పుడు పశువుల ఆస్పత్రి అమెరికా లో ఉంటున్న ఉయ్యూరు నివాసిఅక్కడ  retired లైబ్రరియన్ అయిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి భారీ విరాళం తో నిర్మింపబడిన ఏ.సి .గ్రంధాలయం ప్రక్కన వుంది .మంచి బిల్డింగ్ ను ,వసతులను ఉయ్యూరు కే.సి .పీ .వారు కలుగ జేశారు .బాగానే నడుస్తోంది సమర్ధులైన స్తాఫ్ఫ్ వున్నట్లు తెలిసింది .కొయ్య చట్రాలు పోయి ఇనుపవి వచ్చాయి .వీటిని ఫోటో లలో చూడ వచ్చు .
             వైద్యో నారాయనో హరిహ్ .అని సామెత .మా పశు వైద్య శాలకు కోటయ్యే మాకువైద్యుడు  ,నారాయణుడు ,హరీ అన బోయే పశువులకు ప్రాణ దాత .అందుకే అతన్ని ,అతని సహచరుడు పర్సు రాముడిని జ్ఞాపకం చేసుకున్నాను
                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -11 -11

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు —3 పశు వైద్యో కోటయ్యో నారాయనో హరిహ్

  1. karlapalem hanumantha rao అంటున్నారు:

    చాలా విలువైన సమాచారం మనసులను తాకే శైలిలో ఓపికగా ఇచ్చారు సార్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.