ముదిమి లోను యవ్వనో త్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5 హయ్యర్ సెకండరి ఉద్యోగం

          ముదిమి లోను యవ్వనో త్చాహి  శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —–5
                                                     హయ్యర్ సెకండరి ఉద్యోగం
                  అది హయ్యర్ సెకండరిఅంటే  యుగం పన్నెండో తరగతిని high స్చూల్స్ లో ప్రవేశ పెట్టారు .దీని బోధనకు పోస్ట్ గ్రాద్యుఎట్లే అర్హులు .రావు గారు ఏం.ఏ.పస అయారు కనుక దానికి అర్హులు .అద్దాడ స్కూల్ కు promotion పై బదిలీ అయారు .మైలవరం రాజా గారి ఆధ్వర్యం లో గొప్ప సన్మాన సభ ఏర్పాటైంది .రావు గారితో అక్కడ ఒక ఇంగ్లీష్ కాన్వెంట్ ను ఏర్పాటు చేయాలనే సూచన వచ్చింది .వదాన్యుల సహకారం తో ఆగస్ట్ పదిహేనున ప్రారంభించారు రావు గారు .అయితె కొద్ది కాలానికే నిర్వహణ లోపం వల్ల మూత పడింది .పశువుల హాస్పిటల్ అందులో వచ్చింది .రావు గారు చాలా బాధ పడ్డారు . .
                  గుంటూరు లో వీరి అన్న గారు ”శాంతి నిలాయం ”బ్రాన్చిని స్థాపించి విద్యాలయం గా తీర్చి దిద్దారు .మధ్య తరగతి వారి విద్యావసరకలను తీర్చింది .ఇక్కడే పూర్వం బాపిరాజు గారి కళా పీఠం వుండేది .1962 లో చిత్రకారుల అభిరుచులకు అనుగుణం గా ”మళ్ళీ ”మాపిరాజు కళా పీఠం ”స్థాపించారు సోదరులు .ఉన్నత స్థాయిలో కార్య క్రమాలు జరిగేవి .న్యాయవాది నడింపల్లి రామయ్య అధ్యక్షులు .గొప్ప చిత్రకారులు పుప్పాల రాజా నరసింహం కార్య దర్శి ,లక్కరాజు సూర్య నారాయణ ప్రధాన కార్య దర్శి ,బిత్రా శ్రీనివాస రావు కళా ఊపనాసకులు .శ్రీ మారేమండ శ్రీని వాస రావు ,పోరాస్మల్ జైన ,వారణాసి రామ మూర్తి (రేణు)ఈ కళా పీఠం లో పరిమళించిన కళా పుష్పాలు .౧౯౬౩ లో చిత్ర కళా ప్రదర్శన నిర్వ హించారు .శ్రీ నడింపల్లి నరసింహారావు ,”చుక్కాని ”సంపాదకులు ,బందరు వాసి కే.ఆర్.కే..మోహన్ .శ్రీ వత్చవ  వంటి పెద్దలు వచ్చి చూసి అభినందించారు .ముదునూరు సోదరులు ”సంస్కృతీ ”అనే ప్రత్యెక సంచిక ను వెలువ రించారు .
                                                    అద్దాడ లో సేవలు
              రావు గారుఅడ్డాడ   లోచేరారు .  .”బాలానందం ”పత్రిక ప్రారంభించారు .దీనిలో సైన్సు విషయాలను శ్రీ వసంత రావు వెంకట రావు ,రాసే వారు .సోమంచి రామం ,కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ,నార్ల చిరంజీవి ,శ్రీ వత్చవ  ,తంగెళ్ల పాండురంగ శర్మ ,శ్రీమతి హేమలతా లవణం,ఆచంట జానకి రాం ,కవిరావు ,మారేమండ ,శంకర రామా రావు వంటి ప్రముఖుల రచనలతో పత్రిక శోభించేది .గీతా సుబ్బారావు సాంబు ,సత్యమూర్తి నిర్వహణ సహకారం అందించారు .ఆర్ధికం గా  ఆదుకున్న దాతలు వున్నారు .పత్రిక పంపితే హాయిగా చదివే వారే కాని చందా పంపే వారు లేరు అది ఏనుగును పోషించే చందంగా తయారయిన్దన్నారు రావు జీ .అందులో ”అన్నయ్య ”శేర్శికను రావు గారు చూసే వారు .అందులో గొప్ప వారి జీవితాలను ఆకర్షణీయం గా రాసే వారు .”కవుల గాధలు ”,బాలల నవల ”,పెజీలున్దేవి .చిన్నారిగూద చారి  కధలు బాగా ఆకర్షించేవి .ఈ రచనలన్నీ కలిపి ”బాల సాహిత్య అకాడెమి ”ప్రచురణ గా తెచ్చారు .”బాల కవిత ”,బాల వేదిక ”,”కార్డు కధలు ”,గేయాలు ,ఆరోగ్య సౌందర్యం ,సామెతలు ,మాటా మంచి ,ఒకటేమిటి ?అల్ ఇన్ వన్ గా వుండేది లెక్కల పజ్ల్స్ తో మేతమే ట్రిక్స్ రాశారు .ముఖ చిత్రం గా ఆనేలలో జన్మించిన మహామహుల చిత్రాలు వేసే వారు .వెనుక పేజి లో ;;వివేక వాణి ”,గాంధీ అమర వాణి ,రాధాకృష్ణ వాణి ,రమణ వాణి ,పరమహంస వాణి ,నెహ్రు వాణి ప్రచురించి స్ఫూర్తి కలిగించే వారు .పిల్లల సర్వతోముఖాభి వృద్ధికి బాలా నందంద్వారా  అద్భుత సేవ చేశారు .బాలా నందం అంటే ”వైజ్ఞానిక మాస పత్రిక ”అనే గుర్తింపు పొందటం విశేషం .ఇదంతా రావు గారి డ్రీం ప్రాజెక్ట్ గా ప్రొజెక్ట్ అయింది .
                      addada అనే పేరులో మూడుడలు వుండటం అక్కడ  దీడిక్కులు ఎక్కువ .పరీక్షల్లో మార్కులకు గిరాకీ వున్న రోజులవి .మార్కుల కోసం tutions  చదివే వారు పిల్లలు తమ దగ్గర చదివే వారికి ఎక్కువ మార్కులు ,మిగిలిన వారికి తక్కువ వేసే వారు .దీనితో ముఠా తగాదాలు .అధికారుల రాక .రిపోర్టులు .భీభాత్చం గా వుండేది వాతా వరణం .క్రమ శిక్షణ లేదు .అప్పుడు రావు గారు స్కూల్ లోనే tution చెప్పే విధానం  అందరిని ఒప్పించి అమలు చేశారు .గొడవలు తగ్గాయి .దీనినే insti tutionalised tution అంటారు .దేన్నీ మిగిలిన పాతశాలలు ఆదర్శం గా తీసుకొని అమలు పరిచాయి .విద్యార్ధులు రెండు సార్లు సమ్మె చేసే ప్రయత్నం చేస్తే నచ్చ చెప్పి నివారించారు .కరెంట్ సౌకర్యం స్కూల్ లో లేకపోతె ,పిల్లల్ని వరి  కోత కు తీసుకొని వెళ్లి ఆ డబ్బుతో కరెంట్ కల్పించారు .జిల్లా విద్యా శాఖాధి కారి గారు మెచ్చి వీరిని ”krishna jillaa secondary schools cultural asociation ”ఏర్పర చటానికి constitution  రాయించారు .ఆయనే ప్రెసిడెంట్ గా జిల్లా పరిషద్ అధ్యక్షులు శ్రీ పిన్నమ నేని కోటేశ్వ ర రావు గౌరవాధ్యక్షులు గా ,రావు గారు convenor గా కమిటీ ఏర్పడింది .ప్రతి సంవత్చరం జరిగే గ్రిగ్గ్ స్పోర్ట్స్ జరిగే పాథ శాలలో మూడు భాషలలోను దేబాటే ,వ్యాస రచన ,చేతి పనులు ,చిత్ర రచన ,ఏక పాత్రాభినయం పోటీలు నిర్వహించే వారు .బహుమతు లిచ్చే వారు .అడ్డాడ పాథ శాల పత్రిక ”తెలుగు బాల ”అచ్చు పత్రికను విద్యార్ధుల ,ఉపాధ్యాయుల రచనలతో తెచ్చారు .
                                                నా స్వంత విషయం
                 నేను అడ్డాడ హై స్కూల్ లో 1991 నుంచి 1998 వరకు ఏడేళ్ళు ప్రదానో పాద్యాయుని గా పనిచేశాను .అక్కడే రిటైర్ అయాను .అప్పటికి రావు గారి గురించి నాకేమీ తెలీదు .వినటమేతప్ప  .ఆయన చేసిన బాలల కార్య క్రమాలను గురించి విన్తుందే వాడిని .అంత కంటే తెలీదు .నేను చేరే టప్పటికి స్కూల్ లో కరెంట్ లేదు .సర్వీసు వైర్ లేక  పోవటం వల్ల .ఎవరు పట్టించుకోలేదు .నేను ఆగస్ట్ 14  న చేరాను . మర్నాడు జండా వందనం చేయాలంటే జండా చిరిగి పోయిందన్నారు .అప్పటికప్పుడు అక్కడ అంజి రెడ్డి అనే నా పూర్వపు మిత్రుడు ,అప్పుడు గుమాస్తా గా వున్న అన్జిరేడ్డికి చెప్పి మర్నాదుకు సిద్ధం చేయించాను .ఆగస్ట్ పదిహేను అయిందని పించాము .కరెంట్ సమష్య యెట్లా తీర్చాలి అనుకొంటుంటే ,బాల కృష్ణ అనే ల్యాబ్ అసిస్టంట్ ముందుకు వచ్చారు .తన స్వంత ఖర్చుతో కరెంట్ వైర్ కోని సర్వీసు వచ్చేట్లు చేశారు ,నాకు అది శుభ సూచకం గా కనిపించింది .స్తాఫ్ఫ్ అసోసియేషన్ ఏర్పాటు చేయించాను .పామర్రు లో నాతొ పని చేసినవీరభద్ర రావు అనే  సెకండరి ఉపాధ్యాయుడిని అందరి అంగీ కారం తో సెక్రటరీ ని చేశాము .ఆయన అప్పటి నుంచి ,నేను రిటైర్ ఆయె దాకా గొప్ప సహకారం అందించారు .అక్కడి నా ప్రతివిజయం లోను ఆయన పాత్ర వుంది .క్రమం గా కార్య క్రమాలను ఒక్కొక్కటే చే బట్టాను .కొత్త ఆలోచనలతో ముందుకు సాగాను .అందరిది .సహకారం బాగా లభించింది .స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ అడుసు మిల్లి రామ బ్రహ్మం గారు తన వంతు సహకారం ఇచ్చారు .అక్కడ విద్యార్ధులంతా బి.సి.ఎస్.సి విద్యార్ధులే .ఉత్తీర్ణతా శాతం తక్కువ .అందుకని స్పెషల్ క్లాసులు తీసుకొనే వాళ్ళం .ఇంటర్వల్ లో నేను ఇంగ్లీష్ గ్రామర్ ,లెక్కలు చెప్పే వాడిని .సాయంత్రం స్కూల్ అయింతర్వాత ఒక గంట చది వించే వాళ్ళం .నెమ్మది గా పిల్లల్లో హుషారు పెరిగి చదవటం ప్రారంభించారు .క్రమంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది .
                    సైన్సు ప్రదర్శన పుస్తక  , ప్రదర్శన ఏర్పాటు చేయించాను .చుట్టు పక్కల స్కూల్ వాళ్ళను కూడా ఆహ్వానించి చూసే ఏర్పాటు చేశాం .అప్పటికి వార్షి కొత్చావాలు అక్కడ లేవు .డబ్బు లేదు .అందరి సహకారం తో వరికోతలు ,మినప తీతలు చేసి డబ్బు సంపాదించివార్షి కొత్చావాన్ని  ప్రతియేడు ఘనం గా జరిపాము .నాటికలు ,పాటలు డాన్సులు అన్ని ఉండేవి .పిల్లలలతో ”భారతావతరణం ”అనే పద్య నాటికను వేయించాను ,నోరు తిరగని విద్యార్ధులతో శ్రమ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వేయించాను .పద్యం చదవటం అందులో రాగ యుక్తం గా పాడటం నేర్పాను.వాళ్ళందరూ బి.సి .,ఎస్,సి విద్యార్ధులే .అవన్నే టేప్ రికార్డర్ లో రికార్డు చేయించాను .ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చిన విషయం ..ఆడ పిల్లలు ఆటలు ఆడే వారు కాదు విద్యార్ధులకు ఆటల్లో చదువుల్లో మంచి బహుమతులు ఇచ్చే వాళ్ళం .వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ల కోసమే ఖర్చు చేసే వాళ్ళం . .జగన్మోహన రావు ,ది.నాగేశ్వర రావు అనే డ్రిల్ మాస్టర్లను ఉత్చాహ పరిచి ఆడ పిల్లల ఆటలు జరిగే చోటికి ఆడ పిల్లలనుఅపంపించి వాళ్లకు ప్రేరణ కలిగించి క్రమంగా ఆటలలో పాల్గోనేట్లు చేశాం .కబాడీ ,త్రో బాల్ అదే టట్లు చేశాం .సబ్ జానే లో వరుస గా ఫస్ట్ వచ్చారు .అలాగే మగ పిల్లలు  వాలి బాల .బాడ్మింటన్ లో ఎప్పుడు ఫస్ట్ .ఉపాధ్యాయ్లం వాలీ బాల్ .బాద్ మింటన రోజూ ఆడే వాళ్ళం .పోటీలలో గెల్పు అడ్డాడ ఉపాధ్యాయులదే అన్నట్లు వుండేది .సెంట్రల్ జోను లోను ఇదా హవా . గుడివాడ యెన్.టి.ఆర్ స్టేడియం లో పోటీలు జరిగేవి .నేను లెఫ్ట్ ఫ్రంట్ ఆడే వాణ్ని .నా సర్వీస్ అంటే కనీసం నాలుగు అయిదు పాయిన్ట్లినా రావాల్సిందే .అలాగే వాలి బాల్ సర్వీసు లో కూడా సర్వీసు కు నాలుగు కంటే ఎక్కువ వచ్చేవి .నేను సర్వీసు చేస్తుంటే జనం విపరీతం గా చప్పట్లు కొట్టే వారు .అంత గొప్ప ప్రోత్చాహం లభించేది ”.ముసిలాడు బాగా అడుతున్నాడ్రా” అని కామెంట్లు .ఇంకా రెచ్చి పోయేవాడిని .ఆట బాగాఆడే  వీరభద్ర రావు ,నాగేశ్వర రావు లను బాగా ప్రోత్చాహించే వాడిని .తప్పు చేస్తే అరిచే వాడిని కూడా .నెక్స్ట్ టైం బెటర్ లాక్ అంటుండే వాడిని .janam నాకు ఇచ్చే ప్రోత్చాహం ఒక సచిన్ కో ,కపిల్దేవ్ కో ఇచ్చినత గొప్ప గా వుండేది .అది మరువ లేని విషయం    .నా జీవితం లో .అద్దాడ టీం వస్తోందంటే హడలు అన్నట్లుండేది .
                      అంగలూరు లో వున్న దయట్ కాలేజీ నుంచి lecturerlnu పిలిపించి ఉపన్యాసాలు ఇప్పించే వాడిని .ఉయ్యూరు వాడు ఫణి రాజా మోహన అనే గణిత ఉపాధ్యాయునితో విద్యార్ధులే ప్రుచ్చకులుగా ”గణిత అష్టావధానం ”చేయించా.అతను నా   శిష్యుడే .దయట్ ప్రిన్సిపాల్ చాగంటి వెంకటేశ్వర రావు గారు వచ్చి మా కార్య క్రమాలకు మురిసి పోయారు .సెప్టెంబర్ అయిదు ఉపాధ్యాయ దినోత్చావం అనే గురు పూజోత్చ వాణ్ని విద్యార్ధులతో ఘనం గా జరిపించే వాడిని విద్యార్ధులు స్వయం గా ముందుకు వచ్చి డబ్బులు వసూలు  చేసుకొని ఉపాధ్యాయులన్దరినీ ఆరోజు సన్మానించే వారు .నేను ప్రతి సంవత్చరం ఆ రోజున ఒక టీచర్ ను ఎన్నిక చేసి స్టాఫ్ తరఫున సన్మానం చేసే వాడిని .అక్కడ పని చేసి  రిటైర్ అయిన టీచర్స్ ను కూడా ఆహ్వానించిసన్మానించే వాళ్ళం . చుట్టూ పక్కల ఏ స్కూల్ లోను ఇలా జరిగేవి కావు .అందుకని గొప్ప ఫీల్ ఆయె వారు .ఇదంతా అందరి సహకారం తో జరిపిన పంలె .విద్యార్ధులను ఆంద్ర బాంక్ కు  ,పోస్ట్ ఆఫీస్ కు పంపి లావా దేవీలు జరిగే తీరు నేర్చుకోనేట్లు చేశాను .ఇది కొత్త ప్రయోగం . .ఇన్స్పెక్టర్లు వచ్చి అద్దాడ ప్రగతిని చూసి మెచ్చే వారు .అద్ద్కాదను చూసి నేర్చుకోండి అని మిగిలిన స్చూల్స్ లో చెప్పే వారట .ఆడ పిల్లలకు సుబ్జోనే ఆతల పోటీలు రెండు రోజులు గ్రామస్తుల ,పరిసర గ్రామస్తుల సహకారం తో అత్యంత వైభవం గా జరిపాము .మంచి భోజనం ,వసతి గొప్ప బహుమతులు .అందరికి ఆశ్చర్యం కలిగింది .అడ్డాడ హై స్కూల్ కు నాకు మంచి పేరు రావటం నా అదృష్టం .టీచర్స్ రిటైర్ అయితే ఘనం గా సన్మానించే వాళ్ళం .ఊళ్ళో వాళ్ళను ప్రోత్చ హించి విద్యార్ధులకు అనేక బహుమతులు ఇచ్చే ఏర్పాటు చేశాను .సైన్సు పరికరాలు ,ఆట వస్తువులు ,క్రాఫ్ట్ కు కావలసిన సామాను కొనే వాడిని .అక్కడి డ్రాయింగ్ మేష్టారు అప్పా రావు మంచి ఆర్టిస్ట్ ,స్కూల్ మగజైన్ ఆయన సహకారంతో వ్రాత ప్రతి గా తెచ్చే వాళ్ళం .దేనికీ డబ్బు లేదు అనే మాట వుండేది కాదు .పిల్లల డబ్బే పిల్లల సౌకర్యాలకు ఉపయోగించాము .మంచి నీరుకు బావి మాత్రమే వుండేది మోటర్ ఎప్పుడో చెడి పోయింది .దాన్ని బాగు చేయించి రక్షిత మంచ్ నీతి సరఫరా ఏర్పాటు చేశాను .స్కూల్ చరిత్ర ను రాయించాను .పని చేసిన ప్రదానో పాద్యాయుల పేర్లున్న బోర్డు రాయించాను .స్కూల్ ఫస్ట్ విద్యార్ధుల పేర్లు రాయిన్చాము .దాతల పేర్లు పర్మనెంటబోర్డు మీద రాయించాను .మొక్కల పెంపకం వుండేది కొబ్బరి చెట్లకు పోషణ బాగాచేయించి ఫలా సాయం తీశాం .పాట పెట్టి ఆ డబ్బు జమ చేసే వాళ్ళం .ఒక రూరల్ స్కూల్ లో ఇదంతా అసాధ్యమే కాని సుసాధ్యమయింది పిల్లల ,పెద్దల ,గ్రామస్తుల ,సిబ్బంది సహాయ సహకారం తో .ఇదో దివ్యానుభూతి నాకు .చాలా సంతృప్తిగా 1998 జూన్ 30 న రిటైర్ అవటం నా అదృష్టం .ఇందుకు నాకు సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు .
                     ఇదంతా ఎందుకు అంటే నా బావ మరిది టి  .వి.ఎస్,.బి.శాస్త్రి నూజివీడు లో వెంకటేశ్వర రావుగారి శిష్యుడు .  తన జీవిత చరిత్రలో ఆయన అడ్డాడ లో పని చేసిన విషయం వుందని చెప్పాడు .అతను ముసునూరు బాంక్ లో పని చేసే వాడు .అప్పుడు నేను మా స్టాఫ్ తో సంప్ర దించి ,16 ఏళ్ళ క్రితం
రావు గారిని ఒక స్వాతంత్ర దినోత్చావం నాడు ఆహ్వానించి ,విద్యార్ధులకు సందేశం ఇప్పించి ,ఘనం గా సన్మానం చేశాము.మా బావ మరిది కూడా వచ్చాడు .అతని paintings ప్రదర్శన ఏర్పాటు చేశాం కూడ .రావు  గారు చాలా సంతోషించారు .ఎప్పుడో పని చేసిన తనను గుర్తుంచుకొని ఆహ్వానించి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .మళ్ళీ ఈ సంవత్చరం సెప్టెంబర్ 28 న ఉయ్యూరు లో” సరస భారతి ”29 వ సమావేశానికి ముఖ్య అతిధి గా ఆహ్వానించి శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్ల దేవాలయం లో ”మహిత మందిరం ”లోఘనం గా  ”బాల సాహిత్య చక్ర వర్తి ”బిరుదాంకితులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిని  సత్కరించాము .ఆ కార్య క్రమానికి అనుకోని అతిధులు గా కృష్ణా జిల్లా రచయితల అధ్యక్షా ,కార్య దర్సులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు గారు ,దా.జి.వి పూర్ణ చంద్ గార్ల సమక్షం లో  లో ఈ సన్మానం జరగటం విశేషం .ఇది నా జీవితం లో మరుపు రాని సంఘటన .రావు గారు చాలా సంతోషం వెలి బుచ్చారు మా బావ మరది శాస్త్రి కూడా వచ్చాడు .రావు గారు రెండు గంటలు పై గా మా ఇంట్లో వుండటం గొప్ప అనుభూతిని మిగిల్చింది .వారు రాసిన వారి పుస్తకాలు నాకు అండ జేశారు .
                                                    మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -11 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.