ఊసుల్లో ఉయ్యూరు –4
కనుమరుగైన వ్రుత్తి కళలు
— ఉయ్యూరు లో చేనేత ,కంచడం ,కమ్మరం ,చెప్పులు కుట్టటం ,కుమ్మరం ,వెదురు ,బుట్టలల్లటం ,ఈతాకు చాపలు ,ఈత బుట్టలు అల్లటం తేనే తీగలను పెంచటం ,పశువాలను పెంచటం ,కోళ్ళను ,మేకల ను ,గొర్రె లను పెంచటం ,పందుల పెంపకం మొదలైన వృత్తులు ఉండేవి .నాన్యం గా చేసినవన్నీ కలలే .అట్లాగే చేపలు పట్టటం బాగా ఉండేవి


ఇవాళ దాదాపు అవన్నీ మా కళ్ళ ముందే కను మరుగై పోయాయి .ముఖ్యం గా ఇత్తడి బిందెలు ,రాగి బిందెలు ,కంచు సామాన్లు చేయటం మహా జోరుగా జరిగేవి ..నాలుగైదు కుటుంబాలు వాటి పై ఆధార పడి ఉండేవి .ఇవి ఉయ్యూరు సెంటర్ దాటి ఎకామ్బరేస్వర టాకీస్ వైపు వెళుతుంటే రోడ్డుకు ఇరు వైపులాఉండేవి .కుటుంబ పని గా కొన సాఎవి .కుటుంబం లోని వారంతా స హక రిస్తుండే వారు .టింగ్ టింగ్ మని ఆ పాత్రలు తయారు చేస్తుంటే తమాషా గా శబ్దం వచ్చేది ఆ శబ్దం చాలా విన ముచ్చటగా వుండేది .పెద్ద పెద్ద బిందెలు తయారు చేయటానికి రేకులు తయారు చేసిగుంటలు పడేట్లు సాగ కొట్టుతూ వాటింతో షాపులు తయారు చేసే వారు .భలే సరదా గా ఉండేవి .ఇత్తడి బకెట్లు ,ఇత్తడి కాగులు ఇత్తడి గ్లాసులు ,రాగి చెంబులు ,పల్లాలు బాయిలర్లు వ్హాలా నాన్యం గా చేసే వారు .వీత్కి అతుకు లూడినా ,కారుతున్నా తీసుకొని వెళ్లి బాగు చేయించే వాళ్ళం .చాలా బాగా రేపైర్ చేసే వారు ,.అట్లాగే సత్తు వస్తువులు చేసే వారు .పాల గిన్నెలు ,మజ్జిగ తప్పాలాలు గరిటెలు తయారు చేసే వారు ఇత్తడి కుందులు బాగుండేవి .కంచు తో కుందులు ,మర చెంబులు ,పూజా పాత్రలు ,విగ్ర హారాలు కూడా చేసే వారు .
మేము ఎనిమిదో క్లాస్ చదివే టప్పుడు మాకు సోషల్ మేష్టారు స్వర్గీయ లంకా బసవా చారి గారు .విద్యార్దులన్దర్నీ అక్కడికి తీసు కోని వెళ్లి ఆ పని చేయటం ప్రత్యక్షం గా చూపించారు .నాకు ఇప్పటికీ గుర్తు .ప్రతివాళ్ల జేబులో ఒక నోట్ బుక్ ఉండాల్సిందే .దానిలో చూసిన ,విన్న ,చాదివినా విశేషాలు రాయటం ఆయనే మాకు నేర్పారు .అప్పటి నుంచి నేను దానిని అనుసరిస్తూనే వున్నాను .ఈ పనిని ”కంచరం ”పని అనే వారు .ఆ ఫీల్డ్ ట్రిప్ అయింతర్వాత స్కూల్ కు వచ్చిన తరువాత మేము చూసిన విషయాలనుమాతో చెప్పించే వారు బసవా చారి మేష్టారు .స్టాంప్ collection హాబీ నేర్పారు . నిన్న పొద్దున్న ఈ పని చేసే వారేవరున్నారో అని వెళ్లి చూస్తే ఒకే ఒక కుటుంబం మాత్రమే కని పించింది .వాళ్ళు కూడాతాము వస్తువులం చేయటం లేదని ,సామాన్లు కోని తెచ్చి అమ్ముతున్నామని చెప్పారు .అంతే ఏమి గిడు తుంది ?అన్నీ యాంత్రికం అయిన రోజుల్లో .సరే నని బాధ పడి ఆ సామాన్లును షాప్ ను ఫోటో తీశాను .ఇది కధ కంచికి చేరిన కంచరం కధ . ,

రెండోది చేనేత వ్రుత్తి .ఎక్కడ పడితే అక్కడ నేత మగ్గాలు ఉయ్యూరు లోను ,చుట్టూ పక్కల గ్రామాల్లో ను విపరీతం గా వుండే వారు .రోడ్లమీద ఆ దారాలను పొడుగ్గా వుండే టట్లు తాడుకు బిగించిన చట్రం లో నేస్తు కనిపించే వారు ఆ పడుగు ,పేక నేత చూడ టానికి సరదా గా వుండేది ఇంటి లోపల మగ్గాలున్దేవి .ఇదీ కుటుంబం అందరు కలిసి చేసే వారు .మంచి నేత చీరలు ,పంచలు ,లుంగీలు ,తువ్వాళ్ళు జేబు రుమాళ్ళు నేసె వారు .మార్కండేయ వస్త్రాలయం అనే చేనేత షాప్ వుండేది సెంటర్ లో వారి కింద చాలా కుటుంబాలు బట్టలు నేసి అందించే వారు .వారు స్వయం గా సాలీలే అవటం తో మంచి అజ మాయిషీ వుండేది . నాణ్య మైన వస్రాలు అక్కడే లభించేవి .ఉయ్యూరు కాలేజి దగ్గర అప్పుడు అంతా ఖాళీ ప్రదేశమే .ఆ చుట్టూ చాలా కుటుంబాలు నేత వ్రుత్తి లో వుండే వారు .నందం వారు ,కొడాలి వారు ఈ వ్రుత్తి లో నేర్పరులు .నందం వారి అబ్బాయినాకు క్లాస్ మేట్ .అట్లాగే కరణం గారి బజారు ,హై స్కూల్ దగ్గర నేత గాళ్ళు అద్భుతంగా నేత నేసె వారు .చిన్నపిల్లలకు అది బాగా వారసత్వం గా వచ్చేది .గండిగుంట ,ఆకునూరు మొదలైన ఊళ్ళల్లో ను మంచి నేత నేసె వారుండే వారు ఇవాళఉయ్యూరు తో సహా ఈ గ్రామాలలో ఒక్కటంటే ఒకటికూడా నేత కుటుంబం లేదు .ప్రభ్త్వం ఉదాసీనత ,నేసిన బట్టకు డబ్బు తగినంత రాక పోవత్సం ,ప్రభుత్వ సబ్సిడీ తగ్గటం ,మర మగ్గాలు అన్నీ వారి పాలిటి శాపాలయాయి .నేత బతుకులు బుగ్గి అయాయి .ఎందరో నేత కార్మికులు అప్పుల బాధ భరించ లేక ఆత్మ హత్యలు చేసు కొన్నారు .చేసు కొంటునే వున్నారు .నేత కార్మిక జీవిత వ్యధలపై కవులు మంచి కవితలు రాస్తూనే వున్నారు .కన్నీళ్ళతో వారి జీవితాలను పరిచయం చేస్తూ ,వారి కద గండ్లను వెలుగు లోకి తెస్తూనే వున్నారు
అనంత పురం లో తెలుగు అధ్యాపకులు శ్రీ ”రాధేయ ”గొప్ప కవి .చేనేత వ్రుత్తి పని వారల దయామయ గాధను ఒక కవితా సంకలనం గా తెచ్చారు .చాల స్పందన కల్గించే కవితలు అందు లో ఆయన రాశారు .ఆయన ”ఉమ్మడి శెట్టి అవార్డ్ ”అని ఒక అవార్డ్ ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్చరం ఉత్తమ కవితా సంకల నానికి అయిదు వేల రూపాయల నగదు బహుమతి నిస్తున్నారు .ఈ అవార్డ్కు చాలా నిర్దుష్టం గా ఎంపిక చేస్తారు .అందుకని అది చాలా విశిష్ట మైన బహుమతి గా భావిస్తుంది సాహితీ లోకం ..దాదాపు ఈ వ్రుత్తి కల కూడా అంతరించటం శోచనీయమే .కాల మహిమ .

ఉయ్యూరు లో కమ్మరి పని వాళ్ళు బాగానే వుండే వారు .పలుగు ,పార,కత్తులు కొడవళ్ళు , ,గొడ్డళ్ళు చేసే వారు కక్కులు పెట్టటం ,పిడులు వేయటం వుండేది పెద్ద చక్రం తిప్పుతూ మంట కొలిమి వెలిగించి ఇనుమును కాల్చి దాగలి మీద కాలిన వస్తువునుంచి ,సుత్తి తో బలం గా కొడుతూ సాగ దీసి కావలసిన ఆకారం తెచ్చే వారు .ఇది నాకు చాలా కష్టమైన పని గా కన్పించేది .రెక్కలు ముక్క లవాల్సిందే .బ్రహ్మం అనే ఆయన పని బాగా చేసే వాడు .వెంకటేశ్వర టాకీస్ దగ్గర ,రోడ్డు మీద కాటూరు రోడ్ లో ఈ వ్రుత్తి ఆపని బాగా చేసే వారు .కొడవల్లకు ,చెరుకు కత్తులకు కాటూరు బాగా ప్రసిద్ధి ,ఆరు నెలలకు ముందే ఆర్డర్ ఇస్తేనే అక్కడ వస్తువులు దొరికేవి .నాణ్యానికి ,మన్నికకు వాటికి పేరు .ఆకునూరు లో కూడా చేసినవి బాగుంటాయి . ఒగిరాలలో కూడా చేసే వారు .ఇప్పుడ ఈ వృత్తీ బాగా తగ్గి పోయింది వూరికి ఒకరున్నారేమో నని పిస్తుంది .పాపం వారి శ్రమకు తగిన ప్రతి ఫలం రాదు .ఆడ వాళ్ళు కూడా ఇందులో చాలా శ్రమ చేయాలి .ఊక ,బొగ్గులు ప్రియం అవటం కూడా వారికి ఇబ్బందే పారలకు కర్రలు, పలుగు ను సాగ దీసి పదును తేవటం చాలా కష్టం తో నేర్పుతో చేయాలి .అల్లాగే గోద్దల్లకు పదును ,కర్ర తొడగటం చూస్తుంటే భలే గా వుంటుంది .ఇవాళ ఉయ్యూరు మొత్తం మీద హై స్కూల్ దగ్గర ఒకే ఒక కుటుంబం వుంది .అతని పేరు అబ్రహాం పూర్వపు పేరు రాదా కృష్ణ .

నాణ్యమైన ఎడ్ల బండ్లు తయారు చేయటానికి ఉయ్యూరు ప్రసిద్ధి .సాయిబులు బాగా చేస్తారు .ఇప్పుడున్న కాకాని పార్క్ దగర పూర్వం బండ్లు తయారు చేసే వారు .అవి చేసే విధానం చూడాల్సిందే .బండి చక్రాలు తయారు చేయటం ,వాటికి చుట్టూ కర్ర లమర్చటం(ఆకులు) ,ఆ shape తీసుకు రావటం కాడి తయారు చట్రం చేయటం నగిషీ చెక్కటం గొప్ప పని కళకు స్థానం .ఇదంతా ముస్లిములిద్దరు సిబ్బందిని పెట్టు కోని చేసే వారు .అందులో సత్తార్ సాహెబ్ గారు చాలకాలం ఆ పని చేసి తరువాత వడ్రంగం లోకి దిగారు .మా ఇంట్లో మంచాలు మడత మంచాలు చేశారు .పందిరి పట్టు మంచాలు మడత మంచాలు చేసే వడ్రంగులు బానే వుండే వారు వారిని ”బ్రహ్మం గారు ”అని పిలిచే వాళ్ళం .కుర్చీలు ,బల్లలు ఉయ్యాలలు , బాగా చేసే వారు” హాఫ్ సుందరయ్య” గా(half sundarayya ) పిలువబడే నరసింహారావు అనే కమ్యునిస్ట్ నాయకుడి కొడుకు నా దగ్గర tution చదివి జీతం బదులు కుర్చీ ,టేబులు ,నవారు మంచం చేసి ఇచ్చాడు . నలభై ఏళ్ళు దాటినా ఇంకా బాగున్నాయి .కోటేశ్వరమ్మ బ్రహ్మం ,ఆయన కొడుకు కోటేశ్వర రావు ఆనాటి నుంచీఈ పనిలో బాగానే రాణించారు .ఇప్పుడు వెంకటేశ్వర రావు ,షఫీ ,సత్య నారాయణ మొదలైన వాళ్ళు బిజీ పని వారు .వడ్రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లు తోంది .తలుపుల మీద పని కూడా వుండేది .పెంకు టిల్లు నిర్మించటం ఆ నాడు వీళ్ళ పనే .ఇప్పుడవి కనుమరుగు .దీనితో పాటు పెంకు నేయటం ఒక వ్రుత్తి గా వుండేది .భిక్షాలు ,సూర్య నారాయణ్ ,ఒకరిద్దరు సాహేబులు మంచి పెంకు నేత నేసె వారు .అందులో భిక్షాలు బ్రాహ్మణ ,కోమట్ల ఇళ్ళలో ఎక్కువ పని చేసే వాడు .తాపీ పనీ అతనికి వచ్చు .సీతారామయ్య ఆనాటి తాపీ మేస్త్రి .సాహేబులు మంచి తాపీ పని వారు.పెంకు నేత పని దాదాపు లేనట్లే .చాల కొద్ది మంది అంటే ఒకరిద్దరే వున్నారు .పెంకునేత చాలా నైపుణ్యం తో కూడిన పని .

కిర్రు చెప్పులకు ఉయ్యూరు ప్రసిద్ధి .ఆ రోజుల్లో అందరు అవే వాడే వారు .వాటి ఆకారం భలే గా వుండేది .ముందుకు తోసుకోచ్చే ఆకారం .నల్లగా నిగ నిగ లాడుతూ ఉండేవి .నడుస్తుంటే ”కిర్రు కిర్రు ”శబ్దం వచ్చేవి అందుకని ఆ పేరు .ఇప్పుడు శబ్దం లేని చెప్పులే .చెప్పులు కుట్టే వారుమాదిగా వారు బాగా కుట్టే వారు .ప్రస్తుతం చెప్పులు కుట్టీ వారు లేరు ఒక్క అతను సాముఎలు మాత్రమే వున్నాడు .అతను సినిమా స్టార్లకు మాత్రమే కిర్రు చెప్పులుఇరవై ఏళ్ళు కుట్టాడు . .నాలుగేళ్ల క్రితం అతన్ని గురించి ఆంద్ర జ్యోతి ఆది వారం అనుబంధం లో స్పెషల్ గా రాశారు .
ఇదివరకు చాలా ఇళ్ళల్లో తేనే పరిశ్రమ వృత్తిగా హాబీగా వుండేది .చుట్టూ ప్రక్కల గ్రామాల్లో కూడా ఇప్పుడు బాగా తగ్గి పోయింది , మా డ్రాయింగ్ మేష్టారు తాడినాడ శేష గిరి రావు గారు తేనె టీగలును పెంచి నాణ్య మైన తేనే తీసే వారు .ఆయన మంచి హోమియో వైద్యులు కూడా సబ్సిడీ కి తేనే పెట్టెలు ఇచ్చే వారు .పెంపకం దార్ల సంహ్ఘాలున్దేవి .మంచి పరిశ్రమ గా వర్ధిల్లింది ఒకప్పుడు .బంగారం పని బాగా చేసే కుటుంబాలు చాలా ఉండేవి .ఒక బజారు బజారు వాళ్ళదే ;కంసాలి బజార్”అంటారు .చేవురి వారు మంచి పని వారు సుదర్శనమనే నా క్లాస్ మేట్ కూడా బాగా చేసే వాడు ,ఇంకో సుదర్శనం హరికధాదాసు గారు చేవురి కనక రత్నం గారు బంగారం పని చేసే వారు .మాచిన్న తనం లో సుబ్రహ్మణ్యం గారు అనే ఆయనవృద్దు మాకు బంగారు వస్తువులు చేసే వారు .తూకం ,పని అంతా చాలా నమ్మకం .గురివింద గింజలతోత్రాసుతో తూస్తుంటే భలేగా వుండేది .అన్న సమయానికి చేసి ఇచ్చే వారు .అంత నమ్మకస్తులు మళ్ళీ మాకు కని పించలేదు .కళ్ళ జోడు లోపలి నుంచి కిందకుచూసే వారు .ఇప్పటికీ గుర్తు .వెండి పని కూడా వాళ్ళు చేసే వారు .ఇప్పుడంతా బెజవాడ లో చేయించ టమే . అందరు .చేయించి తెచ్చి ఇవ్వటమే .

పాడి పశువుల పెంపకం భారం అయింది ద్సాన్నీ వదిలేశారు .మేకలు ల;గొర్రెలు బాతులు ,కోళ్ళు పెంచటం లేదు .కోళ్ళ పరిశ్రమ ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మృగ్యం అయాయి .ఏనాది వాళ్ళు ఈతాకు చాపలు ఈత బుట్టలు అల్లే వారు .మా ఆంజ నేయ స్వామి దేవాలయం చుట్టూ వాళ్ల గుడిసేలే ఉండేవి .అదీ లేదు .వాళ్ళే పందుల్ని పెంచే వారు .పందులు ఉయ్యూరు ”చామల ”లో తెగ ఉండేవి .బురద లో పొర్లుతూఎప్పుడు మొరుగుతూ ఉండేవి .ఒక పెద్ద కర్ర ,తాడుతో పందుల్ని పట్టు కొనే వారు .అవి దొరికితే విపరీతం గా మొరిగేవి భీభాత్చం ఆ దృశ్యం .
అడితీ ల దగ్గర ,ఏకాంబరేశ్వర టాకీస్ ,శివాలయం ఎదురు గా మేదర వాళ్ళు వున్నారు .బుట్టలు ,విసన కర్రలు ,గంపలు ,తట్టలు తడికెలు బాగా అల్లే వారు ఇప్పుడు తడికెల వాడకమే లేదు .ఎక్కడైనా పల్లె టూల్లల్లో వున్నాయేమో .అయినా వారి వ్రుత్తి మాత్రం క్షేమంగా నీవుంది .అ కుటుంబాలన్నీ వున్నాయి .వారికి గిరాకీ కూడా బాగానే వుంది

కుమ్మరి పని శివాలయం ఎదురు గాను ,కాపుల వీధి లోను కుమ్మరి కుటుంబాలు వున్నాయి . .కుండలు ,మూకుళ్ళు ప్రమిదేలు విగ్రహాలు మంచినీళ్ళబానలు చట్టలు ,డబ్బుదాచే కిడ్డీ బాంక్ లు బాగా చేస్తారు చేసే వారు .సంక్రాంతి బొమ్మల కొలువు కు వారి బొమ్మలే కొనే వారు .వినాయక చవితికి ఆ కుటుంబాలే మట్టి వినాయకులను తాయారు చేస్తారు .రంగువి కూడా సరసమైన ధరలకే అమ్ముతారు .అ’వీరమ్మ తల్లి తిరినాలకు గండ దీపాలు పట్టుకొని అందరు వెంట వెళ్తారు .వీరందరి చేతుల్లో ప్రమిదా దీపం వుండటం ప్రత్యేకత .బాతుల పెంపకం ఇది వరకుండేది .ఇప్పుడు చెరువులే లేవు కనుక అదీ అదృశ్యం .ఈ విధం గా ఉయ్యూరు లో వ్రుత్తి కళలు మంచిఉత్చ స్థితి లో లో వుంది నేడు కనుమరుగై పోయే స్థితి లో వున్నాయి
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -11 -11 .
This slideshow requires JavaScript.
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
అన్నివూళ్లూ అలాగే వున్నయి ఇప్పుడు!
సింపుల్గా, “మీ కృషి శ్లాఘనీయం”!
(ఓ సారి సాయిబ్బులు అనీ, మరోసారి ముస్లిం అని వ్రాయడానికి వేరే కారణాలు వున్నాయా?)
Muslim(English) Saibulu(telugu) padalu emo..!! Turakalu ani kuda vaaduka !!
na peru aditya pusala, madi karimnagar distric(AP) nenu kanchari kutumbaniki chendina vadine, me sekarinchina nagaram ekkada adi
Excellent article.
In micro detailed description.
I salute Shri Gabbita Durga Prasad Garu.
My master. 1969-74 ZPHS vuyyuru