భారత చరిత్ర భాస్కరులు
ఎవరెవరో అడ్డ దిడ్డంగా రాసిన మన చరిత్రను
మన వెద ,శాస్త్ర జ్యోతిష,పురాణేతి హాసాల నాధారం గా సరి దిద్ది, తిరగ రాసి
”ఇదీ బారత చరిత్ర -ఇదే భారత చరిత్ర ”అని సగర్వంగా
ఎదురొడ్డి నిలిచి ప్రపంచానికి చాటిన పండిత విమర్శకులు
”బ్రహ్మాండ సృష్టి రహశ్య విజ్ఞానాన్ని ”త్రవ్వి తీసిన విజ్ఞాన ఖని
”మానవ సృష్టి విజ్ఞానాన్ని ”ఎరుకకు తెచ్చిన మేధావి ‘
”ఆంధ్రుల సర్వతోముఖ విజ్ఞానాన్ని ”వెలికి తీసిన విజ్ఞాన మూర్తి
”అన్య గ్రహ లోకాదుల్లో స్థూల దేహాలున్నాయని ”గుర్తించిన సూక్ష్మ గ్రాహి
” భూగోళ స్థిత జంబూద్వీపాన్ని-నవ వర్ష విభాగాలుగా
సచిత్రం గా ”ఆవిష్కరించిన” పరిశోధన ఘనా పాథీ
శ్రీ రామ సేతువును ,లంకా స్థల నిర్దేశాన్ని నిరూపించిన నిజ నిర్ధారక వేత్త
” అలేగ్జాందర్ కు సమ కాలికుడు గుప్త చంద్ర గుప్తుడే
”మౌర్య చంద్ర గుప్తుడు కాదని తేల్చి చెప్పిన వివేకి
” శ్రీ శంకర భగవత్పాదుల కాలాన్ని క్రీ.పూ.509 ” అని
సొప పత్తికం గా నిరూపించిన చారిత్రాకాన్వేషి
అందరం నెత్తి కేత్తుకొనే ”మాక్స్ ములర్ పండితుని ”
మూల సిద్ధాంతాన్నే తిప్పి కొట్టిన వెద శాస్త్ర ప్రజ్ఞా మూర్తి
”వేదం అపౌరుషేయం ;;అని మళ్ళీ నిరూపించిన ఆధునిక శాస్త్ర విజ్ఞాని
” చారిత్రిక శకాలను” (era )స శాస్త్రీయం గా
అక్షర బద్ధం చేసిన మహా మహో పాద్యాయుడు
” కలి రాజ వంశాన్ని” కల్మష రహితం గా రాసిన కాల వేది
భారత యుద్ధ కాలాన్ని, కలి ప్రవేశ కాలాన్ని
శాస్తోక్తం గా చెప్పిన చారిత్రకాగ్రేసరుడు
” తిలక్ చెప్పిన ఆర్యుల ధ్రువ ఖండ నివాసాన్ని ”
ఖండన మండనం చేసి ,నిజాన్ని నిర్భయం గా చెప్పిన శేముషీ దురంధరుడు
”ఆంద్ర ,ఆంగ్ల ,గీర్వాణా లలో అద్వితీయ ప్రతిభా సంపన్నులు
తన అభిప్రాయాలను నిర్మోహ మాటం గా ప్రకటించి
ఆ నాటి దేశ ,విదేశీ చరిత్ర కారుల ,పండితుల ,పరిశోద కారుల తో
చర్చించి నిగ్గు తెల్చుకొన్న” అసలు సిసలు చరిత్ర కారులు ”
ఆయనే మన” విజయ వాటికా” పుర వాస్తవ్యులు
”భారత చరిత్ర భాస్కరులు ”-
”-శ్రీ కోట వెంకటాచలం -మాన్యులు ”
” శ్రీ మదభి నవ విరూపాక్ష జగద్గురు పీథాదిపతులు ”
” శ్రీ శ్రీ శ్రీ అద్వయా నంద శంకర భారతీ స్వాములు ”
విజయ వాడ తో సహా ,భారత దేశ జనులు
అందరకు” నిత్య ప్రాతస్మర నీయులు ”
ఆ సార్ధక నామాన్ని” చిరంజీవి” చేయాలి మనం అందరం ‘
గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -11 -11 .
.
44 వ జాతీయ గ్రంధాలయ వారోత్చావాల సందర్భం గా విజయ వాడ చిత్త రంజన్ గ్రంధాలయం లో ”రమ్య భారతి ”ఆధ్వర్యం లో ”మన విజయ వాడ ”అనే అంశం పై జరిగిన కవి సమ్మె లనం లో నేను చదివిన కవిత ఇది .
శ్రీ కోట వెంకటా చలం గారు సుమారు 1925 నుంచి 1995 వరకు విజయ వాడ లో వున్నారు .వారు ఒంటి చేతితో సాగించిన చారిత్రిక పరిశోధన ,ఆంద్ర ఆంగ్ల భాషల్లో వెలువరించిన పుస్త కాలు అమూల్య మైనవి .వారు సార్ధక జీవితాన్ని గడిపి తురీయా ఆశ్రమం లో సన్యశించి శ్రీమదభినవ విరుపాక్ష జగద్గురు పీతాది పతులై ”అద్వాయానంద శంకర భారతీ స్వాములు” గా చరితార్దులై నారు ..వారి కుమారులు ,తండ్రి అంతటి పరిశోధకులు ,ఆయుర్వేద వైద్య శిఖా మణి శ్రీ కోట నిత్యానంద శాస్త్రి గారి తో నాకు మంచి పరిచయం వుంది .నిత్యానంద శాస్త్రి గారిని( 84 ) రెండేళ్ళ క్రితం ”సరసభారతి ”కి ఆహ్వానించి ,వారి తండ్రి గారిని ఆ సభలో సంస్మరించుకొని వారికి ఆత్మీయ సత్కారం చేశాం .ఇప్పటికీవారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నాను .వెంకటా చలం గారిపై భారదేశ చారిత్రిక పరిశోధన శాఖ వారు ఈ సంవత్చరంమే నెలలో హైదరా బాద్ లో ఒక గొప్ప సభ చేసి ,వారిపై ఒక” ప్రత్యెక సంచిక ”ను వెలువరించి ,వారి కుమారులు నిత్యానంద శాస్త్రి గారిని ఘనం గా సన్మానించారు
నేనుపైన రాసిన కవితను నిన్న విజయ వాడ లో చదివితే ఒక్కరికి కూడా వెంకటా చలం గారు తెలియదు అని చెప్పారు .వారిని ,ఆ కార్య క్రమం లో గుర్తు చేసినందుకు నన్ను అందరు అభినందించారు .నాకూ,ఆనందం గా వుంది







గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -11 -11 .
ఇంతటి మహనీయుని గురించి తెలియజేసినందులకు కృతఙ్ఞతలు. వెంకటచలం గారి పుస్తకాలు కొన్ని ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయి. కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ లో శంకర భవత్పాదుల జీవిత కాలాన్ని వీరు నిర్ణయించిన విధంగానే ప్రచురించారు. వీరి పేరును కూడా ప్రస్తావించారు.
కోట వారి పుస్తకాలు కొన్ని జాలంలో ఉన్నాయి. దొరికినవన్నీ నేను చదివాను. ముఖ్యంగా మహాభారతకాలం గురించి వీరు వివరించిన అంతర్గత ఆధారాలు మారుమాటాడనివ్వకుండా ఉన్నాయి. అలాగే పాశ్చాత్యుల కాలగణనలో లోపాలను ఈయన చాలా చక్కగా ఎత్తిచూపారు. మళ్ళీ అవన్నీ తెలుగులో పునర్ముద్రిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
All the works of Sri Kota Venkatachalam should be compiled and be brought for the general public. Though most of them were published, they should be re-published as present time is more responsive. Collection of works can reach the growing number of interested public.