ఊసుల్లో ఉయ్యూరు –5 పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-

ఊసుల్లో ఉయ్యూరు –5

                                                       పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-

—                     ఒక్కొక్క ఇంటికి ఒక భోగం వుంటుంది .ఒక్కో సారి ఇళ్ళను దురదృష్టం వెన్నంటి వుంటుంది .ఆ ఇంటి లోని వారిని పాపం ఆ భగ వంతుడు కూడా కాపాడ లేడేమో నని పిస్తుంది .యెంత సుఖం ,భోగం ఆ ఇంట్లో చేరి నప్పుడు వారు అనుభ విన్చారో ,చివరికి అంతటి దీన ,హీన స్థితి పొంది అందు లోంచి నిష్క్ర మించాల్సి వస్తుంది .అది వాస్తు దోషమో ,వారి జాతక ఫలమో ,చేతులారా చేసు కోవటమో తేల్చి చెప్ప లెం.అలాంటి ఒక కుటుంబీకుడు స్వర్గీయ వెంపటి శివ రామ కృష్ణ శర్మ గారు .ఎలెమెంటరీ  స్కూల్ ఉపాధ్యాయుడు ..చాలా వైభోగం గా ఆ ఇంటిలో చేరారు .చాలా మార్పులు చేశారు .చివరికి అన్నీ అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్ళారు .ఆ ఇల్లే వెంపటి వారిల్లు .అంతకు ముందు అంటే మా చిన్నతనం లో రాయప్రోలు వారిల్లు .రాయప్రోలు సీతమ్మ ,కావమ్మ అనే అక్క చెల్లెళ్ళ ఇల్లు గా నాకు గుర్తు .వాళ్ళు చిరి వాడ ఆగ్రహారానికి చెందిన వారు .ఇది తండ్రి ఆస్తి అను కుంటాను .మేము చూసి నప్పటినుంచీ అంటే 1945  నుంచి వారిని వైధవ్యం లోనే చూశాం .పిల్లా ,జెల్లా వున్నట్లు జ్ఞాపకం లేదు .ఒకావిడ ఎర్రగా పిల్లి కళ్ళ తో వుండేది .ఇంకో ఆవిడ చామన ఛాయా గా వుండేది .ఇద్దరు కవలలా అన్నట్లుండే వారు . .మా అమ్మ వాళ్ళను సీతక్కాయ్ ,కాక్కాయ్ అని పిలి చేది .మా ఇంట్లో అందరం ఆ పేరు తోనే పిలిచే వాళ్ళం .గల గలా మాట్లాడే వారు .ఎప్పుడు ఇక్కడ వుండే వాళ్ళు కాదేమో అద్దెకు ఇచ్చే వారు .ఆ ఇల్లు మా ఇంటికి దక్షిణాన మూడో ఇల్లు .అక్కడే మాకు చిన్న తనం లో చదువు చెప్పిన గురువు గారు కోట సూర్య నారాయణ గారు అద్దె కుండే వారు .ఆ తర్వాత యనమండ్ర కుటుంబయ్య గారి కుటుంబం ,రుక్మిణమ్మ వాళ్ల కుటుంబం అంటే గోసుకొండ శాస్త్రి గారి కుటుంబం వుండేది .ఆ తర్వాత ఆ యిల్లును అమ్మేస్తే చివుకుల వెంకట రమణ సిద్ధాంతి గారు కొన్నారని జ్ఞాపకం .వీరు గుంటూరు జిల్లా వేమూరు వాస్తవ్యులు .మా నాన్న గారు మా మేన మామ ,వార నాసి సదా శివ రావు గారు ,చోడ వరపు చంద్ర శేఖర రావు గారు ,వేదార్ధం నేర్చుకోవటానికి వారిని ఉయ్యూరు తీసుకొని వచ్చారు .మొదట మా ప్రక్క ఇల్లు బ్రహ్మాజోష్యుల వారింట్లో అద్దె కు ఉంచారు .తరువాత సిద్ధాంతి గారు రాయ ప్రోలు సీతక్కాయ్ ,కాక్కాయ్ ఇల్లు కొనుక్కొన్నారు .ఆయనా అందులో లాభ పడిందేమి లేదు .ఆర్ధిక బాధలు ,కుటుంబ బాధలతో అల్లుడు వెంపటి శర్మ గారికి అమ్మారు .శర్మ గారు కూడా దాన్ని నిలబెట్టు కో లేక పోయారు .ఆయనా అమ్మేశారు ప్రసాద రావు గారు అనే retired బాంక్ ఉద్యోగి కొన్నారు .ఆయన తాకట్టు వ్యాపారం చేసి నష్ట పోయి ఆ ఇంటిని అమ్మేసుకున్నారు .ఉయ్యూరు హై స్కూల్ లో లెక్కల మాస్టారు గా పని చేసిన వల్లూరు పాలెం వాస్తవుడు చిగురు పాటి ఉమా మహేశ్వర రావు కొన్నాడు .కొంత కాలానికి ఆయన ఏ.జి.కే.నగర్ లో ఇల్లు కట్టుకొని ఆరేళ్ళ క్రితం అకస్మాత్తు గా మరణించారు .ఇల్లు ఇంకా వారి అబ్బాయి ప్రసాద్ స్వాధీనం లో నే వుంది కాని శిధిలా వస్త లో వుంది .ఇదీ వెంపటి శర్మ గారి ఇంటికి నేపధ్యం నడిచిన , చరిత్ర .శర్మ గారితో మొదలు పెట్టి చాలా దూరం వచ్చేశాం .మరి ఇవి జ్ఞాపకాల దొంతరలు కదా .అలా దొర్లు కొస్తాయి .

                          శర్మ గారు పొడవుగా వుండే వారు పంచె ,చొక్కా వేసే వారు .కీచు గొంతు .స్కూల్ కు వెళ్ళే టప్పుడే పంచ .మిగతా కాలమ్ అంతా లున్గీయే .చొక్కా సాధారణం గా వుండేది కాదు ఆయనకు ఒక సైకిల్ వుండేది .ఉయ్యూరు ,చుట్టూ పక్కల elementari స్చూల్స్ లోపని చేశారు .ఎప్పుడు బిజీ ఏ..అప్పుడు బ్లాక్ డెవలప్ మెంట్ వారి అధీనం లోస్చూల్స్   ఉండేవి .ఉద్యోగం నుంచి వచ్చిన క్షణం లో భోజనం చేసి బ్లాక్ ఆఫీసు కు వెళ్ళే వారు .ఆయనకు ఆఫీసు పని బాగా వచ్చు .అందరి పని ఒక్కడే చేసే వారు .అక్కడ ఆఫీసులో గుమాస్తాల చాకిరి ఈయన తో నే చేయించే వారు .ఇంక్రి మెంట్ల saanction ,శలవుల మంజూరు ,నెల నెల అన్ని స్చూల్ల్ల జీతాల బిల్లులు ఒకటేమిటి సమస్తం ఆయనే చేసే వారు .ఆయనకు అంత సరదా .అక్కడ అందరికి కాఫీలు ,టిఫిన్లు ,సిగరెట్లు ఖార్చులన్నీ శర్మ గారివే .ఆఫీసు వాళ్ళు పైసా కూడా చెపే వారు కాదు .ఇవి ఎప్పుడు ఆయన చెప్పుకొనే వారు కాదు .మిగిలిన మేస్టార్లు ఆయన మీద సానుభూతి తో మా కు చెప్పే ఆరు .అసలు అప్పుడు జీతాలెంత ?చాలా తక్కువ .అందులో elementari వారికి మరీ తక్కువా.కుటుంబమా పెద్దది ముగ్గురు మగ పిల్లలు ఇద్దరాడ పిల్లలు .భార్య కు అనా రోగ్యం .ఇవన్నీ ఆయన జీతం లోనే గడ వాలి .సాధ్యమయ్యే పనా ?కాదు .కాని ఆ బ్రాహ్మడు అభిమానం కల వాడు .ఇవన్నీ తట్టు కోటానికి అప్పు లు చెయ్యాల్సివచ్చేది   .అవి క్రమంగా పెరిగి చుట్టేశాయి .ఆ ఊబి లోంచి బయట పడటం కష్ట మైంది .ఆయన్ను చూసి నవ్విన వాళ్ళే కాని సహాయం చేసిన వారు లేరు .అయినా ఆ యన అడవా చాకిరి మాన లేదు .అ ఖర్చు మాన లేదు .ఆఫీసు ఆయనతో చాకిరీ చేయిన్చుకోనేదే కాని ,ఆయనకు సరైన గౌరవం కూడా ఇచ్చి న దాఖలా లేదు .నేను అప్పుడప్పుడు అంటుండే వాణ్ని ”శర్మ గారు !ఎందుకొచ్చిన ఈ కంచి గరుడ సేవ ?మీకు వాళ్ళిచ్చే విలువ లఏమీ లేదు .మీ శరమంతా సాటి వారి కోసంధార పోస్తున్నారు  .దానికి తగిన గుర్తింపు లేదు .మీకు కావలసిన చోట పోస్టింగ్ ఇవ్వరు .మిమ్మల్ని పీల్చి పిప్పి చెయ్యటమే కాని వారి వల్ల మీకు ఒరిగేది ఏదీ లేదు /.దానితో పాటు చేతి చమురు బాగా వాది లించుకున్తున్నారు ”అనే వాణ్ని .నవ్వే వారే కాని సమాధానం చెప్పే వారు కాదు .పని అనేది ఆయనకు పాపం ఒక వ్యసన మై పోయింది .అందులోంచి బయట పడ లేక పోయారు .ఆరోగ్యం క్షీణించింది .మందులు వాడుకోవ టానికి కూడా ఇబ్బంది పడే వారు ,
                   మా నాన్న గారంటే చాలా గౌరవం .తరచూ మా ఇంటికి వచ్చి మాట్లాడుతుందే వారు .కాఫీ బాగా తాగే వారు .ఆయన మామ గారు నిత్యాగ్ని హోత్రులు ,త్రికాల సంధ్యా వందనం చేసే వారు .విభూతి పెట్టినప్పుడు చూస్తే పరమ శివుడి లాగా వుండే వారు దబ్బ పండు ఛాయా .కుది మట్టం గా ఒడ్డు ,పొడుగు గా వున్దేవారాయన ”.వేదార్ధ ప్రవీణ ”అని వారికి బిరుదు .భగవద్గీత ,మీద ఉపనిషత్ ల మీద పుస్తకాలు రాశారు .వారు ఇక్కడి నుంచి మళ్ళీ వేమూరు వెళ్ళిన తర్వాత అన్ని విధాలా వారికి కలిసి వచ్చింది .పేరు ప్రఖ్యాతులు ,గౌరవాలు ,సన్మానాలు బాగా లభించాయి .ఆ తర్వాత ఎప్పుడో వారి అబ్బాయి కలిశాడు .వారి కుటుంబ విషయాలన్నీ చెప్పాడు .అప్పటికే సిద్ధాంతి గారు పరమ పాడించారు .ఆయన పంచాంగ గణనము చేసే వారు ..ఇక శర్మ గారికి అవేమీ అలవడ లేదు .ఆయన అల్లుడు ఈయన అని చెప్పటం వింత గా వుండేది .శర్మ గారిపెద్దబ్బాయి భాస్కర సోమయాజులు ,రెండో ఆతను రాదా కృష్ణ మూడో అతను మోహన్ అని జ్ఞాపకం .అమ్మాయి సన్న గా అందంగా వుండేది .పెద్దబ్బాయి ధనుర్మాసం లో వాళ్ల ఇంట్లోనే కాక మా ఇంట్లో,ప్రక్క బెల్ల కొండ వారి వాకిళ్ళలో ముగ్గులు వేసే వాడు .ఆడ వాళ్ల కంటే బాగా వేసే వాడు అని చెప్పుకొనే వాళ్ళం .అతను అప్పుడు కొంచెం ఆడంగి లేకి గా అనిపించే వాడు కులుకుతూ నడ వాటం  ,మాట్లాడటం వల్ల నేమో ..తరువాత మిలిటరీ లో చేరి మంచి ఉద్యోగం చేశాడు .రెండో అతను బాంక్ ఉద్యోగి మూడు కూడా ఉద్యోగే ..ఎప్పుడైనా హైదరా బాద్ లో పెళ్ళిళ్ళలో కలుస్తారు. శర్మ గారు ఆడ పిల్లల పెళ్లి చేశారు .
                    కాలమ్ చాలా మార్పు తెచ్చింది .శర్మ గారి బిజీ జీవితం కుటుంబానికి ఇబ్బంది కరం అయింది .భార్య అనారోగ్యం వల్ల ఆర్ధికం గా చితికి పోయారు .అప్పులేక్కువయ్యాయి .ఎంతో ఆనందం గా ఆ యింట్లో ప్రవేశించిన శర్మ గారు ,అప్పుల బాధ నున్చీ తప్పించు కోవ టానికి ఇల్లు అమ్మ క తప్పలేదు .రిటైర్ అయారు కూడా .అప్పుడు పెన్షన్ కూడా నామ మాత్రమే .అదేమీ చాల్ల్తుంది అంతటి సంసారానికి? .గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇల్లు అమ్మేశారు .అప్పు లన్నీ అణ పైసలతో బాకీ దారులకు తీర్చేసి చేతులు దులుపు కున్నారు .ఇక్కడి నుంచి కుటుంబాన్ని మచిలీ పట్నానికి తరలించారు .అక్కడికి చేరిన కొన్నేళ్ల కే భార్య మరణించారు .అ తర్వాత కుటుంబం హైదరా బాద్ చేరింది .పిల్లలు చదువుకొని మన్చీ అభి వృద్ధి లోకి వచ్చారు .గౌరవ ప్రద మైన జీవితాలు గడుపు తున్నారు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసు కొన్నారు .నా స్నేహితుడు స్వర్గీయ పెద్ది భొట్ల ఆది నారాయణ కుమార్తె వివాహం లో ,కొడుకు వివాహం లో స్వర్గీయ వెంపటి శర్మ గారి పిల్లలు దాదాపు పదేళ్ళ క్రితం కలిశారు .మళ్ళీ పాత రోజులన్నీ గుర్తుకు చేసు కున్నాం .వాళ్ళందరికీ మేమంటే మంచి అభిమానం ,గౌరవం .చాలా ఆప్యాయం గా పలకరిస్తారు .ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇటు వైపు వస్తే వీలు చేసుకొని తప్పకుండా మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళే సంస్కారం వాళ్ళది .”ఊసుల్లో ఉయ్యూరు ”ఎవరి ద్వారానో విని చదివి నిన్నా మొన్న వాళ్ళు ఉయ్యూరు కు ఫోన్ చేసి అన్నీ జ్ఞాపకం చేసు కొన్నారు .అందుకే వారి నాన్న గారు వెంపటి శర్మ గారి పై రాయాలని పించి రాశాను .వాళ్లకు ఆనందం .నాకు కూడా ఒక సేవాపరాయనున్ని ,నిస్వార్ధ పరుణ్ణి గురించి రాసే అవకాశం కల్గిందని సంతోషం .
                     ఇప్పుడు ఉపాధ్యాయుల సేవ అని చెప్పి చేసే వారు వున్నారు .వాళ్ళు అంతా రేట్ల ప్రకారం డబ్బు వసూలు చేస్తారు .ఇంక్రిమెంట్ కు ఇంత ,ఫిక్సేషన్ కు ఇంత ,పెన్షన్ పేపర్లు పూర్తి చేస్తే ఇంత ,వాటిని saanction చేయించు కొస్తే ఇంత అని వేలకు  వేలు సంపాదించే వార్ని మా కళ్ళతో చూస్తున్నాం ,.వీటిని కాదని తన కు చేత నయినంత సహాయం చేస్తూ ,ప్రతిఫలా పేక్ష లేకుండా ఉపాధ్యాయ  లోకానికితనువు మనసు ధనము తో  సేవ చేశారు వెంపటి శర్మ గారు .అందుకీ ,ఆయన అనుభ వించ లేక పోయినా ,వారి సేవా ఫలితంగా  పిల్లలు అభి వృద్ధి చెంది సుఖం గా వున్నారు .ఇది మాత్రమే వారి ఆత్మకు శాంతి నిచ్చేది .అదే ఆ కుటుంబానికి శ్రీ రామ రక్ష అయింది .శర్మ గారి శ్రమ ఆయనకుజీవిత కాలమ్ లో ఉపయోగించ కున్నా ,గుర్తింపు రాకున్నా   ఆ తర్వాత పిల్లల శ్రేయస్సుకు ఆశీస్సు గా   ఉపయోగ పడింది .
 
 
 
 
 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.