సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం

 సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం 

                   శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి నమస్తే .కులాసా అని తలుస్తాను . .మీరు శ్రీ రామ రాజ్యం చూసి నాకు మీ భావాలు మెయిల్ చేశారు నాలుగు రోజుల క్రితం .నన్ను కూడా చూసి నా అభిప్రాయం రాయమని ,దాని కోసం ఎదురు చుస్తున్టాననీ మీరు రాశారు .ఎందుకో చూడాలి అంటే భయం వేసింది .అందుకనే కొంత ఆలశ్యం చేశాను .వార్తలు చూస్తుంటే రెండో వారం ఉయ్యూరు లో ఆడదేమోనని పించింది .ఇవాళ ఉదయం పద కొండున్నర ఆటకు నేను ,మా శ్రీమతి ,మా కోడలు సాయిమహల్ లో చూశాము .హాల్ కెపాసిటీ సుమారు రెండొందల యాభై వుంటుంది .నేల,బెంచీలలో  కలిపి ఆరుగురు వున్నారు .బాల్కనీ కి వెళ్లాం మేము .అక్కడ కెపాసిటీ సుమారు యాభై వుంటుంది దాదాపు అన్ని సీట్స్ నిండాయి .వీరందరూ పౌరాణికం మీద ప్రేమతో వచ్చి వుంటారు .కొందరు బాపు రమణల మీద నమ్మకం తో వచ్చివుంటారు .ఈ category లో మా ఫామిలీ వుందని మీకు తెలుసు .నాకు మొదటి నుంచి ఆశ లేదు .అయినా దింపుడు కళ్లం ఆశతోనే వెళ్లాం .సుమారు సంవత్సరం క్రితం మీరు బాపు గారు రామరాజ్యం తీస్తున్నట్లు చెప్పారని నాకు రాశారు .అప్పుడే నేను అయ్యో పాపం అని రాసి నట్లు గుర్తు ,ఎందుకో పాపం ఆ జంట చేసినవేవీ up to the mark  గా లేక పోవటం తో నాకు ఈ మధ్య విడుదలైన సినిమాలు ఏవీ చూసే సాహసం చెయ్య లేక పోయాను .ఇది బాపు రమణ ల ఇష్ట దైవం అయిన శ్రీ రాముని సినిమా కదా ఎంతో కొంత సరుకు ఉంటుందని ధైర్యం చేసి వెళ్లాం .

              ఒక్క మాట లో చెప్పా లంటే అది బాపు తీసిన ,రమణ రాసిన సినిమా కాదు ,కాదు ,కాదు .అని అనిపించింది .బాపు అంటే ఎంత వూహ వుంటుంది ,రమణ మాట అంటే ఎంత లోతు భావం వుంటుందీ !ఇవి రెండూ ముందు పూజ్యం .తర్వాతరమణ  మాటల్లో between the lines కు ఎంతో ప్రాముఖ్యం వుంటుంది .బాపు ఒక సీన్ తీస్తే అది అంత అందంగా ఎలా ఉంటుందా అనే ఆశ్చర్యం తో మునిగి పోతాం.ఒడలు మరుస్తాం .ఆ అందానికి దాసోహం అంటాం .dialogue  కంటే భావానికి ప్రాధాన్య మిచ్చే ట్లు నటింప జేసే మహోన్నత దర్శకుడు   బాపు .రమణ మాట రాస్తే అందు లో ఎన్నో అర్ధాలు వెతికి మనసు ఉప్పొంగి పోతుంది .ఇవేవీ మచ్చుకు కూడా కని పించవు .ఇక బాపు సినిమా అంటే అద్భుత మైన చిత్రాల దర్శనం అప్రతిభుల్ని చేస్తుంది .అవి చూస్తే చాలు ఇంకేమీ లేక పోయినా పర్వాలేదని అందరి అభిప్రాయం .ఇదీ పూజ్యమే .ఇక్కడ రెండు మూడు సెట్టింగులు చూడటానికి చాలా gorgeous కని పిస్తాయి .అవి చూస్తే మనం రామ రాజ్యం లో ఉన్నామని అని పించవు -రోమన్ సామ్రాజం  లో వున్నట్లని పిస్తుంది .nativity లో లోపం వుందని పించింది ఇనేత్రానందము పూజ్యం .పోని జగదానందం ఉందా అంటే ,నలుగురు మనుషులు కూడా  కనిపించరు .రామ రాజ్యం లో ప్రజల ఆనంద సామ్రాజ్యం కని పించదు .సాధారణం గా వాచ్యానికంటే భావానికి ప్రాధాన్య మిచ్చి తీసే ఈ జంట ,ఇందులో వాచ్చ్యానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి భావానికి ,మన ఆలోచనకు ,మనకు రాముని మీద ,రామ రాజ్యం మీద ఏర్పడాల్సిన అభిప్రాయానికి అసలు వీలు లేకుండా చేశారు .అందరి పాత్రలకు అతి గా సంభాషణలు వున్నాయి ఇవి రమణ సంభాషణలు కావు  పరుచూరి వారి దీర్ఘ ,అతి దీర్ఘ సంభాషణలు అనిపిస్తాయి .ఇక్కడా మనసుకు హృదయానికి పట్టింది పూజ్యమే .  . సంగీతా విషయానికి వస్తే చెవి తుప్పు వదిలించే మనోహర ,శ్రావ్య సంగీతం అందిస్తారు బాపు .ఎంతో లలితంగా ,ఆర్ద్రం గా ,కన్ను చేమర్చేట్లున్తాయి రాగాలు ,స్వరాలు ,బాణీలు .ఇక్కడ అంతా విరుద్ధం .ఒక్క ”జగదా నంద కారకా ”అన్నది మాత్రమే అదీ ,అంత వరకు మాత్రమే కాస్త మనల్ని హం చేయిస్తుంది .మిగతా పాటల్లో ఒక్కటి కూడా మనల్ని పట్టించు కోదు .ఇది బాపు విధానానికి మరీ విరుద్ధం .పాపం ఇళయ రాజా ఎంత కమ్మని సంగీతం ఇచ్చి మనల్ని మరో లోకం లో విహరింప జేశాడో మనకు తెలుసు .ఇక్కడ మరీ failure .దీనికి కారణం ఏమిటో నాకు అంతు బట్ట లేదు .స్వేచ్చ ఇవ్వ లేదా ?గీతాన్ని సంగీతం ,back గ్రౌండ్ మ్యూజిక్ ముంచేసింది .హాల్లో నుంచి బయటకు వస్తుంటే ఏ ఒక్కపాటా   మన వెంట రాదు అదేం పాపమో శాపమో .ఇదీ బాపు శైలికి బద్ధ విరుద్ధం .అక్కడ వినటానికి చూట్టానికి కాస్త బాగున్నా ,అవి మనల్ని పట్టు కోని వదలక పొతే కదా మళ్ళీ ఏవ రైనా రెండో సారి చూసేది .?కర్ణ భేరి పగిలి పోయే సౌండ్ భయ పెడు తుంది .మానసిక ఆహ్లాదం ఉల్లాసం కలిగించక పోవటం స్వర కర్త లోపమే .ఇదీ బాపు మార్కు కాదు .

               ఫోటోగ్రఫి సంగతి చూద్దాం .అన్ని పాత్రలను భూతద్దం లో చూపించినట్లు కని పించారు .ఎవరు స్వభావ సిద్ధంగా లేరు .ట్రిక్ అసలేమీ లేదని చెప్ప లేను కని లవ కుశులకు మూడు  అస్త్రాలు వాల్మీకి ఇచ్చే సందర్భం లో చాల బాగా వుంది .ఆ ఊహకు బాపును ,తీసిన ఛాయా గ్రాహకుడు గ్రాఫికుడు , అభినందనీయులే .పాపం వాల్మీకి నాగేశ్వ ర రావు కు ఒకటే పంచె ఉత్త రీయం తో లాక్కోచ్చారు   .ఆయన ఆహార్యం గురించి ఎవరు పట్టించుకున్న ట్లు లేదు .
                     ఈ సినిమా లో అన్నీఅతి గా  ఉండటమే పెద్ద దెబ్బ కొట్టింది .పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే లేక పోవటం పెద్దలోపం . .అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత నిచ్చి ,అవసర మైన దాన్ని తగ్గించటం తో ఉత్కంటత లేక పోయింది .బాపు ,విశ్వ నాద్ సినిమా లు అంటే గుండె తడి కన్పిస్తుంది .ఆది పూర్తి గా ఎండి పోయిన్దిక్కడ .సన్ని వేశంచూస్తే  కళ్ళు చెమర్చే ట్లు తీయటం ఇద్దరికీ స్వంత మైన విద్య .అదేమీ వీసం కూడా కని పించలేదు .ఇదంతా కోపం తోనో ,అసూయా తోనో ,అక్కస్సు తోనో ,రాయటం లేదు .బాపు సినిమా కనుక ఇది రాస్తున్నా .ఇంకెవరు తీసినా రాయాల్సిన పని లేదు .బాధ ,సాను భూతి లే నన్ను ఇది రాయించాయి గోపాల కృష్ణ గారు .రెండు నెలల క్రితం మోజు పడి బెజ వాడ లో సి .ది .కోని తెచ్చు కొన్నాను .ఒక సారి వెంటనే పెట్టి విన్నాను .సగం పాటలు కూడా విన లేక పోయాను .మళ్ళీ పెడితే ఒట్టు .ఆ ఉత్సాహం కలి గించక పోవటం అందరి లోపం .పాటలు హృదయానికి పట్ట లేదు .తాత్కాలికం గా అక్కడ వింటే పరవాలేదు అని పించాయి అంతే .అసలే నిర్మాత చాలా డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీశాడని ,నెత్తి మీద జుట్టు కూడా ఊడి పోయి విగ్గు పెట్టు కొన్నాడని ఒక సారి మీరు నాకు మెయిల్ ఇచ్చారు .ఏ సినిమా కు అయినా మాస్స్ ప్రేక్షకులే ప్రాణం .నేను ముందే చెప్పి నట్లు మాస్ లో అయిదారుగురు కంటే లేక పోవటం,అందు లో బాల కృష్ణ వుండికూడా  కొ౦త  నన్ను అమిత ఆశ్చర్యం పాలు చేసింది .నిర్మాత గారికి పాపం ఎంత భారమో .ఎలా తేరు కుంటారో .క్లాస్స్ వారు కొద్ది మంది వున్నా రెండో సారి చూసే ధైర్యం ఎవరికి వుండదు ..అందుకే ఇది బాపు ,రమణ ల సినిమా కాదు .పౌరాణికం వచ్చి చాలా ఏళ్ళు అయిందని సంబర పడి వెళ్ళే వారికి తీవ్ర నిరాశ మిగిల్చింది .అన్న మయ్య ,రామ దాసు పాటల్లో నే జనాన్ని రాబట్టాయి .తర్వాత దర్శ కత్వ ప్రతిభ ,నటీ నటుల నటన .అవి వాటికి ప్లస్ పాయింట్లు .అవన్నీ దీనికి పూర్తి గా మైనస్ పాయింట్లు ఆవ టం బాధ గా వుంది .మళ్ళీ పౌరాణికం తీయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి .
                      నటన లోకి వస్తున్నా .ఎక్కువ మార్కులు కొట్టే సింది నయన తార .ఆమె సీతా మాత గా అని పించక పోయినా ఉన్నంత వరకు న్యాయం చేసింది .ఒక్కో సారి చార్మి లా ,ఇంకోసారి స్మితా పాటిల్ లా అని పించింది .అయితె glomour  ను తగ్గ కుండా చూసు కొంది .బాపు గారి సీతా అని పించలేక పోయింది .అందుకు బాపు కూడా బాద్యుడే .తరువాత మార్కులు ఆమెకు డబ్బింగ్ చెప్పిన సునీత కు దక్కు తాయి .అయితే ఇది వరకే చెప్పి నట్లు సీతా దేవికి సంభాషణల కంటే భావ వ్యక్తీకరణకు ఆవకాశం ఇవ్వక పోవటం వెలితి .అదే ఆనాడు అంజలి దేవికి చాలా ప్లస్ పాయింట్ అయింది .హృదయం విప్పి చెప్పు కొనే స్థితి ,మాటల్లో కాకుండా చూపుల్లో ముఖం లో కల్పించే బాపు చాలా విరుద్ధం గా ఇక్కడ తీయటం నచ్చ లేదు .తారు వాత లవకుశులు .చిన్న గా ,ముచ్చట గా మంచి చతురంగా నటించారు .మరీ చివరి సన్ని వేషాలలో పాటలో .లవ కుశ పాట అంతే గుండెలు కరిగాయి ఆనాడు .ఇప్పుడు గుండెలు చెడి రాయి .అంత విరుద్ధం .ఇక్కడ లోపం ట్యూన్ లదే . వారి పాటలు మనల్ని మళ్ళీ మళ్ళీ వినాలి అని పించక పోవటం ఎవరి తప్పో .
               శ్రీ రాముడు గా బాలయ్య ముసలయ్య లాగా వున్నాడు .ఆయన్ని మరీ భూతద్దం లో చూపించారు .రాముడు కని పించలేదు నాకు పున్దరీకుడే దర్శన మిచ్చాడు .డైలాగులు వల్లించాడు కాని హృదయం లోంచి పలికించ లేక పోయాడు తొందర లో అవి మరీ దోకుడు అయాయి .ఇక్కడా బాపు మార్కు లేదు .రామునితో బాపు తక్కువ చెప్పించి ఎక్కువ మనకు అందించే వాడు .ఇక్కడా విరుద్ధమే .ఆకట్టు కో లేక పోయాడు పాపం .కింద పడి దొర్లటం తో సరి పుచ్చు కున్నాడు .ఆభరణాలు .శాలువా మొదటి నుంచి చివరి దాకా అవే మైంతైన్ చేశారు .మరీ శోకం లో గంభీరత పూర్తి గా లోపించింది .ఆయన ఏడిస్తే మన కళ్ళు చెమ్మ గిలాలి .అలా చేయించలేక పోయాడు .విగ్రహం భారీ గానే వుంది .కాని పాటకు తగిన నటన రాబట్ట లేక పోయారు ..
               వాల్మీకి గా నట సామ్రాట్ ముసలి తనం లోను చక్క గా నటించారు .ఆయన ఆహార్యం పై భాగం పూర్వపు లవ కుశ లోని నాగయ్య గారిని ,కింది భాగం నాగేశ్వ రావు ని చూపించి నట్లుంది .పాపం కళ్ళల్లో కాంతి లోపించింది .ఆ గడ్డం దురద గా ఉందేమో .నాగయ్య గారి సాత్వికత ,గంభీరత ,శాంత చిత్తం కని పించ లేదు .నాగయ్య గార్ని చూస్తేనే కళ్ళు మూత పడి నమస్కరించ బుద్ధి అయేది .అది ఇక్కడ లోపించింది .బానే తంటాలు పడ్డాడు ఆయన .పిట్ట కధలు బానే చెప్పాడు .
                   వశిష్టుడి గా బాలయ్య కూడా పాత్రో చితం గా నటించాడు .కష్ట పడి సంభాషణలు చేఒప్పాడు .జనకునిగా మురళీ మోహన్ చూడ ముచ్చట గా వున్నాడు .రాజర్షి అన్నట్లు గా వున్నాడు .మాటలు బానే పలి కాదు .ఋష్య సృన్గుని గా నరేష్ అనుకుంటా కూడా మట్టం గా వున్నాడు .సంభాషణలు ఎవరితోనే చెప్పించి నట్లు కన పడింది .శాంత గా శివ పార్వతి శాంతం గా చేసింది .కౌసల్య పాత్ర లో కే.ఆర్.విజయ అసలు రాణించలేదు .ఆమె సంభాషణలు అసందర్భం ,అతి దీర్ఘం ,అనవసరం .కన్నాంబ కు సరి లేరెవ్వరు ?సుమిత్ర, కైక లు ఏమి  మాట్లాడారో, ఏం చేశారో మనకు తెలీదు .లాంగ్ షాట్స్ లో వాళ్ళను లాగేశారు .
                 లక్ష్మణుడు గా శ్రీ కాంత్ బాగున్నాడు .పాత్రకు న్యాయం చేశాడు సంభాషణలు బానే చెప్పాడు .సమీర్ భరతుడు ఉన్నాడని పించాడు .రమణ గారు సీతమ్మకు చేదోడు వాదోడు గా ఆన్జనేయున్ని వాల్మీకి ఆశ్రమం లో కి కోయ పిల్లాడు గా చేర్పించారు .ఆ పాత్ర చిన్నపిల్ల లకు నచ్చేదే .ఆంజ నేయుడు మూతి కొంచెం పెద్ద ది గా వుంటే నిండుదనం వచ్చేది అని పించింది .
             బాపు మార్క్ అని పించేవి రెండు మూడు సన్ని వేశాలున్నాయి .అందు లో ఒకటి -రావణుని భార్య మండోదరి రామ దర్శనం కోసం వచ్చి నప్పుడు ఆమె నీడ కూడా తన మీద పడ కుండా రాముడు జాగ్రత్త పడటం ,ఆయన ఏక పత్నీ వ్రతాన్ని ఆమె శ్లాఘించటం ,అయోధ్య వాసులు స్వర్ణ సీతా నిర్మాణానికి తాము సీత పై నీలాప  నిందలు వేసినందుకు నష్టపోయి ,దాన్ని భర్తీ చేసు కోవటానికి తమ దగ్గరున్న బంగారాన్ని అంతనూ రాముడికి సమర్పించటం బాగుంది 
                       సెట్స్ అన్నీ అట్ట ప్లాస్టిక్ తో కని పించాయి .అందులోను భవనాలు dome ఆకారం లో వుంది అవి అయోధ్య లోవి కాకుండా ఇటాలి లోని రొమే శిల్పాయం గా వుంది .పాశ్చాత్య వాసన తో .మిచెల్ ఆన్జేలో నో ,ఎవరో వేసినట్లు కన్పించాయి .వనాలు ,తపోవనలు అంతా ప్లాస్టిక్ మయమే .ఎబ్బెట్టు గా వున్నాయి .అసలు రుషి వాటిక లా అనిపించక పోవటం బాదే . .రాముడే కాదు ,కౌసల్య తల సోఫా కేసి కొట్టు కోవటం వింత .ఆఖరి సీన్ లో రాముడు మళ్ళీ నెల మీద పడి పాకుతాడు సీత కోసం .ఏ సన్ని వేషము హృదయాన్ని కదిల్చ లేక పోవటం పెద్ద లోపం .వాళ్ళు ఏడుస్తున్నా ,మనకేమీ పట్ట నట్లున్డటం ఆశ్చర్యం .involve  అయ్యేట్లు ఉ౦డదు  .కృత్రిమత ఇబ్బంది కల్గిస్తుంది .రాముడి పాలన ప్రజా సేవకే అనే మాట చెప్పించాడు కాని దర్శకుడు ,అలాంటి ఏ ఒక్క సన్ని వేషాన్ని మనసుకు పట్టే ట్టు చూపించ లేక పోవటము .
                    బాపు ,రమణలు ఏ కధ సినిమా  తీసినా రామాయణ భావం under కరెంట్లా వుంటుంది .కాని ఈ సినిమా లో రామాయణమే మాయమైంది .లోకాభి రామాయణం అయింది .వాల్మీకి మహర్షి కుదురు గా అయిదు నిముషాలు ఎక్కడా కూర్చోడు .తపస్సు ,కమండలం ,దండం వుండవు .ముసలాయన కదా బరువవు తాఎమో .వాల్మీకి ఒక సన్యాసి గా వున్నట్లు అని పిస్తాడు .మహర్షి భావన కలగదు .నాగయ్య గార్ని మరవ లేకేమో . . టెక్నికల్ రిచ్ నెస్ వుంది ,గ్రాఫిక్ వుంది కాని  ఫీలింగ్ రాక పోవటమేబాధ .ఝాన్సి ,బ్రహ్మానందం లు కూడా ఎందుకో రాణి౦చ లేక పోయారు .. .. 
                          రమణీయ రసమయ కావ్యం ,దృశ్య కావ్యం అవాల్సిన సినిమా నీరస అదృశ్య మ్ గా మనసుకు ,బుద్ధికి పట్టని ఒక రంగుల సినిమా లా  వుంది .హాల్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఒక్క క్షణం కూడా మళ్ళీ ఆ సినిమా గురించి ఆలో చించే అవకాశం లేకుండా చేసిన ఆ సినిమా మహాత్ములందరూ అభి వంద నీయులే ,అభినంద నీయులే ఆలో చిస్తే మళ్ళీ చూడాలని పిస్తుంది కదా .ఆ బాధ నుంచి తప్పించి నందుకు అందరికి మప్పిదాలు (నమస్కారాలు ).ఎందరో మహాను భావులు అందరు కలిస్తే ఎంత బాగా తీయ లేరో రుజువు చేసింది .శాంతం పాపం .బాపురే  -రమణీయం-శ్రీ రామ రాజ్యం గా ఉంటుందని వెళ్ళిన నాకు అంతా రివర్స్ గా కని పించింది గోపాల కృష్ణ గారూ..మీరుఅన్నట్లు   పద్యాలకు అలవాటైన ఆంద్ర జనం పౌరాణికాలలో అవి లేని వెలితిని భరించ లేరేమో .నిర్మాత గారికి సాను భూతి తెలియ జేస్తున్నాను .ముమ్మాటికీ ఇది బాపు రమణ ల సినిమా అని అనుకో లేక పోతున్నానని మరో మారు తెలియ జేస్తూ ——మీ .దుర్గా ప్రసాద్  –23 -11 -11 .
 

.

 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

16 Responses to సర్వం పూజ్యం శ్రీ రామ రాజ్యం

 1. bollojubaba అంటున్నారు:

  this is too much and purely prejudiced

  (may be to substantiate a previously made comment -సుమారు సంవత్చరం క్రితం మీరు బాపు గారు రామ రాజ్యం తీస్తున్నట్లు చెప్పారని నాకు రాశారు .అప్పుడే నేను అయ్యో పాపం అని రాసి నట్లు గుర్తు – thats all)

  i dont think this movie is such disgusting

  with due apologies to durga prasad gaariki

 2. SrI అంటున్నారు:

  అయ్యా, మీరు సినేమాకు వెళ్ళకుండ ఉంటే బాగుండేదేమో! వయసులో పెద్దవారైనా ఇంకా చార్మి అందాలు మీకు గుర్తుకు వస్తున్నాయంటె సామాన్యులు కారని తెలుస్తోంది. చూడబోతే మీరు సావిత్రి తరం నుంచి సినేమాలు చూసినట్టు ఉన్నరు ప్రతి హీరొయిన్ బాగా గుర్తున్నట్లు ఉన్నారు, కనుకనే మధ్యలో స్మితా పాటిల్ కూడా బాగా గుర్తు పెట్టుకొని కవర్ చేశారు. ఇంత చెత్త రివ్యుని ఎక్కడా చదవలేదు.

  * అయోధ్య లోవి కాకుండా ఇటాలి లోని రొమే శిల్పాయం గా*
  వుంటే వచ్చిన నష్ట్టమేమిటి?మీరు ఆయోధ్యలో రామాయణ కాలం నాటి భవనాలు ఎలా ఉన్నాయో చూసొచ్చారా?

 3. avyaaja అంటున్నారు:

  అయ్యా.. మీ అలోచనావిధానం ప్రస్పుటితంగా ఉంది.. సినిమా ఫై మీ తీరు తెన్నులు సబబుగానే అనిపిస్తున్నాయి..పాటలు విన్నప్పుడే ఇళయరాజా వారి అశ్రద్ధ అణువణువునా తొణికిసలాడింది. సినిమాలో ఎలా ఒదుగుతుందో ఈ సంగీతం అని అ౦దరికి స౦దిగ్ధమె. చాల మంది దగ్గర విన్నాను. కధకి ఇన్ని పూర్వ పరాలు చేర్చినా సామాన్యులని అలరించలేకపోయింది. రామాయణ మూలానికి దూర౦గా కధని తీసుకెళ్ళినా రసవత్తర౦ గా లేదంటే ప్రేక్షకుల ఆలోచనలు సబబుగా లేవా? చెత్త సినిమాలు కూడా అమెరికా లో వారం పదిరోజులు ఆడిస్తున్న వారు, మూడు రోజులకు, మూడు ఆటలకు పరిమితం చేసారు. రామ రామ.. !!!

 4. SrI అంటున్నారు:

  *పాపం ఇళయ రాజా ఎంత కమ్మని సంగీతం ఇచ్చి మనల్ని మరో లోకం లో విహరింప జేశాడో మనకు తెలుసు .ఇక్కడ మరీ failure .దీనికి కారణం ఏమిటో నాకు అంతు బట్ట లేదు.*
  తమరు వయసు పై బడిన వారు, చాంధసులని బాగా తెలుస్తున్నాది. ఇక మీరు ఈ సాహిత్య సేవ నుంచి కూడా ఎంత త్వరగా రిటైర్ ఐతె అంత మంచిది. ఊరకనే బ్లాగులు పెట్టుకొని ఉచితంగా ఎందుకు రాయాలి? Time waste.

 5. Vasan అంటున్నారు:

  లోకో భిన్న రుచి:

  కాకపోతే, ప్రతిదీ బూతద్దంలో నుంచి చూస్తూ ప్రతిదీ విమర్శించటంలోనే మీరు ముందుగానే ఒక ఆలోచనతో వెళ్ళారని తెలుస్తోంది. మీరు ప్రస్తుత కాలమాన పరిస్థితులని కూడా ఆలోచించగలిగుతూ, ఈ రోజుల్లో పౌరాణికాన్ని ఆనాటి లవకుశలా తీయాలా లేదా ఈ నాటి వాస్తవికతకి తగినట్లుగా తీయాలో తెలిసేది.

 6. samitha అంటున్నారు:

  మాస్టారు, మీ లోతట్టు అభిప్రాయలు రామరాజ్యం ఫై చూసాను.. మీ భక్తి భావం బాపు రమణల మీద మరింత శ్రద్ధగా కనిపిస్తోంది..ఆ కాలం లవ కుశ లతో పోల్చకండి. అప్పటి వారు రామాయణ సార౦ బాగా పట్టిన వారు(తీసిన వారు /చూసిన వారు) .. ఇప్పటి వారి ఆలోచనలు వేరు. నచ్చనివి వేలకొద్ది చెప్పారు.. కాని నచ్చినవి అయిదారు పంక్తులలో చెప్పండి.. ప్రజానీకానికి ఊరట కల్గుతుంది.. సినిమా హాలులో జనాలుండక పోవటం పాపం ఆర్ధిక మాంద్యమా? లేక బుద్ధి మాంద్యమా ? సినిమా చూసి మీ వంతు కృషి మీరు, మా వంతు కృషి మేము చేసాము..
  బాపు రమణల ఏ చిత్రం చుసిన సగటు మానవుడి జీవితాన్ని అద్డం పట్టినట్టుగా ఉంటుంది.. బహుశా మనలో సగటు మానవుడు లోపించాడా ? బహుశా పాత్రలతో తుపాకులు, jeans , సింగపూర్ షికార్లు, మరింత hitech గా చేస్తే బాగుండేదేమో..ఏమో త్వరలో అది చూసే అదృష్టం కలుగుతుందేమో !! ఎదురుచుద్దాం !!

 7. రంగరాజు అంటున్నారు:

  అయ్యా దయచేసి ఇకనుంచి మీరు తెలుగుసినిమాలు చూడకండి.మీకు నచ్చిన అన్నమయ్య,శ్రీరామదాసు సినిమాల్లోని బూతు పాటలు,డబుల్ మీనింగ్ డవిలాగులు చూస్తూ ఇలానే సంతోషంగా ఉండండి.ఎవరికీ ఏమీ నష్టం లేదు

 8. RS అంటున్నారు:

  మరీ పిడకలవేట అనుకోకపోతే నావో రెండు మాటలు.
  బ్లాగులు, రివ్యూలు చదివి వెంటనే బయల్దేరిపోయాను కాని.
  నాకయితే బాపు మార్క్ ఎక్కడా కనపడలేదు.

  తెలిసిన కథే కాబట్టీ, ఎవరికీ కథాగమనం మీద ఆసక్తి ఉండదు. వీటిని కవర్ chesenduku ఇటువంటి పరిస్తితులలో, టేకింగ్, సాంకేతిక నైపుణ్యత, నేపధ్య సంగీతం లాంటి వాటి మీదయినా కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

  మరీ నిరాశ పరిచిన అంశం అంటే, సంగీతం…. 😦 ఇళయరాజా గారి నుంచి, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నేను.కొన్ని పాటలు, చంటి సినిమా లోని “అన్నుల మిన్నల అమ్మడికన్నులు.” మరీ మరీ గుర్తుచేసాయి.

  సాధారణంగా బాపు అనగానే కాటుక కళ్ళు, వాలు జడ గుర్తొస్తాయి. నయనతార పేరు లో మాత్రమే .బాపు మార్క్ కళ్ళూ కానే కావు.కాస్త నిరాశ కలిగింది. ఆకర్ణాంత నేత్రుడైన రాముడు అక్కడ కనిపించలేదు. :(.

  ఇక ఏడుపులు పెడబొబ్బలు, టి.వీ సీరియల్స్ ని గుర్తుచేసాయి… శ్రీరాముడంతటి. ధీమంతుడు, స్థితప్రజ్ఞుడు. మాటి మాటి కి నేలమీద పడి దొరలడం పాకుతు ఏడవడం…లాంటివి చూడడం శ్రిరాముడి భక్తులకు కాస్త కష్టమే.

  క్షమించాలి….రాధాగోపాలం లో చాదస్తం మరీ ఎక్కువగా కనిపించి, ఇక చూడ్డం, మానెయ్యలనుకున్నా.
  ఇలా నటులతో ప్రయోగాల కన్నా, బాపు గారి బొమ్మలతో, ఎవరయిన యానిమేషన్ సినిమా తీస్తే చూసితరించాలనే కోరిక మాత్రం గాఢంగా పెరిగి పోతోంది నాకు.
  RS

 9. nagamurali అంటున్నారు:

  మీ రివ్యూ ఇంకా చాలా నయం. ఏవో కొన్ని చిన్న చిన్న విషయాలైనా మీకు నచ్చినట్టున్నాయి. ‘పెళ్ళిపుస్తకం’ సినిమా వచ్చినప్పుడు మాకు తెలిసిన ఒకాయన, (ఆయన జీవితంలో కలర్ సినిమా చూట్టం బహుశా అదే మొదటిసారేమో) అందరూ చాలా బాగుందని చెప్తే వెళ్ళి చూశాడు. చూసొచ్చి మాతో, ‘పచ్చి బూతు సినిమా. బాపూ ఒక పెర్వర్ట్’ అన్నాడు. మేం షాకై నోరెళ్ళబెట్టాం. ఆ సినిమా చూసిన‌ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అక్కడక్కడా మన సమాజంలో కొందరు గ్రహాంతరవాసులు కూడా మనతో పాటూ నివసిస్తూ ఉన్నారని. వాళ్ళు కూడా అప్పుడప్పుడు సినిమాలు చూస్తారని.

 10. nagamurali అంటున్నారు:

  >> శ్రీరాముడంతటి. ధీమంతుడు, స్థితప్రజ్ఞుడు. మాటి మాటి కి నేలమీద పడి దొరలడం పాకుతు ఏడవడం…లాంటివి చూడడం శ్రిరాముడి భక్తులకు కాస్త కష్టమే.

  మీరు రామభక్తులైతే ఒక‌సారి వాల్మీకి రామాయణం కానీ, అది మరీ పెద్దది అనుకుంటే భవభూతి రాసిన ఉత్తర రామచరిత్రమ్ కానీ చదవడం మంచిది. ఉత్తర రామచరిత్రమ్ సంస్కృత నాటకాల్లో అత్యుత్తమమైనదని శ్లాఘించబడింది.

 11. SrI అంటున్నారు:

  ప్రస్తుతం ఉన్న నటినటులతో సినేమా బాపు గారు తీశారు. అందులోను తెలుగు నటినటులే ఎక్కువగా నటించారు. విమర్శించే వారు, ప్రస్తుతం ఉన్న సినేమా నటులలో ఆయా పాత్రలకు అంతకు మించి సరి పోయేవారు ఎవరో చెప్పాలి. మీరంతా ఇలా ఇలా ఓ ఓ అని బాధపడటానికి కారనం సీత చాలా బాగుంది, అంజలీఓ దేవిలాగా మొదటి సిన్ నుంచి దిగులు దిగులుగా గుబులు పడుతు లేదు. ఎమైనా సీత ఏడుపును చూసి జాలి పడి తమ పెద్దమనసు చాటుకొందామని వెల్లిన వారిని ఈ సినేమా ఖచ్చితం గా నిరాశకు గురిచేస్తుంది.

 12. ప్రేక్షకుడు అంటున్నారు:

  నేను కూడా మీతో ఏకీభవిస్తాను . ఈ మధ్య అసలు పౌరాణికాలే రాకపోయేసరికి , పాత తరంతో పోల్చుకుని , అందులో ఏ ఒక్క శాతం తీసినా , ఆహా ఓహో అనే భజంత్రీలు ఎక్కువైపోయారు. అసలు కథ అందరికీ తెలిసినదే ఐనప్పుడు , అది తీసే విధానమే ఎవరికైనా కావలసింది . అక్కడే ఇందరు మహానుభావులూ ఫెయిల్ అయ్యింది. ఏ ఒక్క పాటా ఆకట్టుకోదు . మరీ నాసిరకం సంగీతం. ఉత్త మెలో డ్రామా . వాల్మీకి పాత్ర లో నాగేశ్వర్రావ్ ఐతే మరీ బిగుసుకుపోయి నటించేశాడు . ” ఒకనాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను ” – అని అనీ అనగానే ఎవడున్నాడీ లోకం లో అంటూ పాట మొదలు , అసలంత తొందరతొందరగా మాటలాడడమేమిటి ? కాస్త నిదానించి , సాత్వికంగా మాట్లాడితే ఏం పోయిందట ? ఆ మీసాలేమిటో బొత్తిగా పైకి మెలి తిరిగి , నిమ్మకాయలు నిలిపేట్టు వాల్మికి పాత్రధారికి .
  యథాతథం గా కొన్ని సీన్స్ పాత లవకుశ నుండి దింపేసి మళ్లీ దానితో పోల్చి చూడవద్దంటే ఎలా ? సీత పాత్ర ఆత్మ రూపం లో బంగారు సీతకు చంద్రవంక దిద్దే సన్నివేశం ఒక్కటి చాలు – అసలుకూ నకిలీ కి తేడా తెలీడానికి !
  ఈ మధ్య ఇదొకటి – నచ్చనిది నచ్చలేదని చెబితే , ఓ మీద పడి తిట్టెయ్యడం , నువ్వు తీసి చూపించు అని సవాల్ విసరడం – అయ్యా నచ్చని వాళ్లమైన మేము సినిమా దర్శకులం కాదు , ఎవరి పని వారే చేయాలి , డబ్బు పెట్టి ( పైరసీ కాకుండా ) , థియేటర్ లో కూర్చుని చూసి వచ్చినందుకు ఎక్కడ నచ్చలేదో చెప్పే హక్కు అధికారం మాకున్నాయి అంతే !!!
  హోటెల్ కెళ్లి సాంబార్ నచ్చలేదని మీరంటే వెంటనే మీ పక్కనున్నోడు , ఇంత బాగుంటే నచ్చలేదంటావేం , నీకు చేతనైతే , హోటెల్ కిచెన్ లోకెళ్లి నువ్వు సాంబార్ చేసి చూపెట్టు అని అంటే మీకెంత కోపం వస్తుందో మాకూ అంతే !!!

 13. Vasan అంటున్నారు:

  నాయనా ప్రేక్షకుడు,

  నిదానమూ, సాత్త్వికతా.. ఇంకా మీసాల వంపు…ఆహా ఎంత గొప్ప పాయింట్లు.. తమరి కోసం నిదానం, సాత్త్వికతలు మేళవిస్తే ఇంకో గంట ఎక్కువ అయ్యేది సినిమా. జనాలు అప్పుడు చూస్తారంటారా? మీసాలు కిందకి దించితే సినిమా హిట్టయ్యేదంటారు? మరో పెద్దమనిషి రాముడు పాకటమేంటి అన్నాడు… అసలు రామాయణం చదివారా? బంగారు సీతకు చంద్రవంక దిద్దితే నకిలీ సినిమానా? ఏం? పాత లవకుశలో అలా లేదనా? మరిచిపోయా, డబ్బు పెట్టానన్నారు కదూ, ఆ అహం కనపడుతూనే ఉంది. బహుశా పైరేటెడ్ కాపీ చూస్తే నచ్చేదేమో మీకు.

 14. Sri అంటున్నారు:

  @ప్రేక్షకుడు,
  వాల్మికి కిరాతకుడు/బోయవాడు ఋషి అయినాడు. ఋషీ అయినంత మాత్రాన ఆయన భాష మారిపోతుందా? పాత సినేమాలో చిత్తురు నాగయ్య నిదానంగా మాట్లాడడని వాల్మికి అలాగే మాట్లాడాడని అనుకొంటామ. అసలు ఒకసారి పాత లవకుశ వేసుకొని మీ ఇంట్లొ చిన్న పిల్లలకు చూపించండి అరగంట కూడా చూడru, బెదిరిపోతారు. ఈ కాలం పిల్లలకు పద్యాలు, రాగాలు పాడుతూంటే చీరెత్తుకొస్తుంది. గట్టిగా పట్టుకొని చూపించాలని ప్రయత్నిస్తే మీ చేయికొరకి పారి పోతారు.

 15. gdurgaprasad అంటున్నారు:

  శ్రీ దుర్గాప్రసాద్జీ : మీ జవాబు కు నా కృతఙ్ఞతలు.

  శ్రీ రామరారాజ్యం మీద మీ నిష్పక్షపాత విమర్శ, ఒక surgeon సొంత
  తండ్రిగారిమీద operation చెయ్యవలసినప్పుడు తప్పక చేసినట్లుగా ఫీలయ్యాను.
  అది ఎంతో కష్టమైన పని. కానీ మీరు సూక్ష్మ దృష్టితో చెప్పినవి సత్య దర్శనం
  గా భావించాను. బాపు, రమణుల మీద మీకు అపారమైన ప్రేమ, ఆరాధనా ఉండబట్టే
  మీరు అంతగా మధన పడవలసి వచ్చిందనే భావం స్పురించింది. ఇందులో రెండో
  అర్ధానికి తావు లేదు. ఏమాత్రం సందేహం లేదు.
  మరి ఇవాల్టికి శెలవు సార్.–ఇట్లు, మైగో

 16. కమల్ అంటున్నారు:

  ఇప్పటికే చాలా సమీక్షలు చదివాను బ్లాగుల లోకంలో..ఒక్కొక్కరు.ఒక్కో కోణంలో సినిమాని చూశారన్నది అవగతమవుతున్నది. లవకుశను కాపీ చేశారు కాబట్టి..ప్రతి సన్నివేశం. మాటలు, సంగీతం. నటన మిగతా అన్ని విభాగాలను పోలుస్తూ చూసేవారు..విమర్శించె వారు కొందరైతే. బాపు రమణల మీద ప్రేమతో చూసి..వారి గత సినిమాల మాదిరిలేదనే కోణంలో చూసే కొందరిలో మీలాంటి వారు వున్నారు…! అసలు రాముడనే రాజు కథను ఎవరు ఎన్నిరకాలుగా చెబుతున్నారనే విశాల దృక్పదంతో చూసిన వారు చాలా అరదుగా కనపడుతున్నారు. ప్రతి సన్నివేశాన్ని..ఆయ పాత్రలు ధరించిన దుస్తుల్ని, ముఖానికి వేసిన మేకప్‌నుండి..ఏవి వదలకుండా శల్య పరీక్ష చేస్తూ మీరు బాగానే విమర్శనాసమీక్ష వ్రాశారు.. బాగుంది..! ఒక చిన్న ప్రశ్న మీవంటి పెద్దలకు..ప్రతీది శల్యపరీక్షలా పరిశీలించి వ్రాసిన మీ సమీక్షలో ఎన్ని అక్షర దోషాలున్నాయో చూసుకొన్నారా..? రామరాజ్యం సినిమాలో మీరు ఎత్తిచూపినట్లుగానే నేను మీ వ్యాసంలోనికొన్ని పదాలను చూపిస్తున్నాను చూడండి ఉదాః ” దాని కోసం ఎదురు చుస్తున్టాననీ మీరు రాశారు “, “ఇనేత్రానందము “, ” సాధారణం గా వాచ్యానికంటే భావానికి ప్రాధాన్య మిచ్చి” , “కన్ను చేమర్చేట్లున్తాయి రాగాలు” , ఇలాంటి అక్షర దోషాలు చాలానే వున్నాయి మీ సమీక్షలో..! మరీ మీలా అన్ని పట్టి పట్టి లోపాలను వెతలేక ఇక్కడితో ఆపేశాను.! .మీ వంటి పెద్దలను ఇలాంటి అల్పమైన ప్రశ్నలేయడం మీకు బాద కలిగించవచ్చు..కాని..వాస్తవం అదే కదా..? మీలానే చాలా మంది కొన్ని కొన్ని నిర్ణయాలకు “కట్టుబడి” (ఫిక్స్) సినిమాలను చూస్తున్నారు. అలా చూసే వారికి అన్ని లోపాలే కనపడతాయి..రంధ్రాణ్వేషన ఉన్నప్పుడు మీలాంటి వారికి తప్పవు ఈ తిప్పలు. అలానే ఎంత బాగా తీయాలని ప్రయత్నించినా కొన్ని తమ తమ చేతుల్లో లేని విదంగా లోపాలు జరగడానికి అవకాశమున్నది..అది మానవ సహజం. ఏ దర్శకుడు..లేక ఏ నటుడు చెండాలంగా తీయాలని కానిలేక దరిద్రంగా చేయాలని కాని ప్రయత్నించరు కదా..? తమ చేతనయినంత బాగా చేయాలనే ప్రయత్నిస్తారు..అందునా బాపు రమణాలంటి మహానుభావుల గురించి ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. వారేదో కొత్తగా చేయాలని ప్రయత్నించారు..అంతే..ఆ విదానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.