ఊసుల్లో ఉయ్యూరు –6 కోదండ రామయ్య గారి ”నో వేకన్సి-సారి”

  ఊసుల్లో ఉయ్యూరు –6

                                                  కోదండ రామయ్య గారి ”నో వేకన్సి-సారి”

—                       మా చిన్న తనం లో అని రాస్తున్నాను అంటే సుమారుగా నాకు పది హీను ఏళ్ళ వయసు లోపు అని నా భావం అంటే ఇంకా హై స్కూల్ చదువు దాటని నేపధ్యం అని .అప్పుడు ఉయ్యూరు లో పెళ్లి ,పేరంటాలు చాలా సరదాగా ఉండేవి .ముఖ్యం గా బ్రాహ్మణుల ఇళ్ళల్లో .అప్పటికి ఇంకా ఇతరుల ఇలకు భోజనాలకు వెళ్ళటం లేదు .మేము వెల్ల లేదు .వాళ్ళు వచ్చే వారు కాదు .తిఫిన్లకు ఆఇబ్బంది లేదు . .వేసవి కాలం క్లాస్ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతా అంటే పరీక్షా ఫలితాలు బోర్డు మీద పెట్టిన తర్వాతా కుర్రాళ్ళం ఇంటి దగ్గర టీ పార్టి ఏర్పాటు చేసు కొనే వాళ్ళం .స్నేహితులందర్నీ పిలిచే వారం .అందరు వచ్చే వారు ఇంట్లోనే స్వీటు హాట్ పండు టీ అందరికి ఇచ్చే వాళ్ళం .వాళ్ళ ఇళ్ళ కు మేము వెళ్ళే వాళ్ళం .మా పెద్ద లెవరు దీనికి అడ్డు చెప్పా లేదు .అప్పటికే హోటళ్లు బానే వచ్చాయి . . 
                 ఆ నాటి భోజనాలు మా ఇళ్ళ లో సరదా గా జరిగేవి .ఎవరింటి లో కార్యం అయినా అందరు సహకరించు కొనే వారు .ముఖ్యం గా ఆడ వాళ్ళు ,వంట వచ్చిన అమ్మ లక్కలు పిలిచినా వారింటికి మది కట్టు కొని వెళ్లి వంటలో సాయం చేసే వారు .కూరలు తరగటం ,పప్పు రుబ్బతం ,పచ్చళ్ళు చేయటం ,పిండివంటలు చేయటం కలిసే చేసే వారు .కొద్ది మంది వంట బ్రాహ్మ లను పెట్టు కొనే వారు .వారితో వంట చేయించే వారు .మగ వాళ్ళు చాతనయినా వారంతా బాదం ఆకు విస్తళ్ళు కుట్టే వార్రు .లేక పొతే తామ రాకు లు వాడే వారు .లేక పొతే మోడు గాకు విస్తరి కట్టలు కొని వాడే వారు .అడ్డాకు విస్తర్లు కూడా వాడటం వుంది .ఆ నాటి స్వీట్ అంటే ఎక్కువ గా లడ్డు .పరవాన్నం పూర్ణం బూరె బొబ్బట్టు ,అరిశే ,సగ్గు బియ్యం పరవాన్నం ,చక్కర పొంగలి .సేమ్యా మడికి వాడే వారు కాదు .హాట్ అంటే పులిహోర ,గారే ఆవడ ,బజ్జీ ,వండే వారు .  
            ఆ నాటి భోజనం పిలుపులు చాలా మర్యాద గా ఉండేవి .యజ మాని, భార్య ఇద్దరు కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఆప్యాయం గా   బొట్టు పెట్టి పిలి చే వారు .ఆడ వారి చేతిలో కుంకుమ భరిణె వుండేది .”మీరు మీ కుటుంబం ,మీ ఇంటికి వచ్చిన బంధువులు మా ఇంటికి భోజనానికి రావాలని కోరుతున్నాం ”అని పిల్చే వారు శుభ లేఖ వుంటే పేరు రాసి మర్యాద గా పిలి చే వారు .”’మీరు అందరు వచ్చి ఆశీర్వ దించి ,అక్షింతలు వెయ వలసినది గా కోరుతున్నామం ”అని ఆహ్వానించే వారు .అసలు కార్య క్రమం రోజున ఇంకో గంటకు విస్తళ్ళు వేసి వడ్డిస్తారు అనగా కుర్రాళ్ళను,పిలిచినా ప్రతి ఇంటికి పంపి ”ఆలశ్యం లేదు .విస్తళ్ళు వేస్తున్నారు .త్వరగా రండి ”అని చెప్పి వచ్చే వారు .నేను ,మా తమ్ముడు ,మా మామయ్య గారి అబ్బాయి ఇలా మా ఇళ్ళలో జరిగే కార్య క్రమాలకు వెళ్లి పిలిచి వచ్చే వాళ్ళం .అలాగే మిగతా వాళ్ళు చేసే వారు .ఇదో గౌరవ మైన పిలుపు .
                   ఆ నాడు ఇళ్ళల్లో అందరికి సరి పడ గ్లాసులు ఉండేవి కావు .అందుకని భోజనానికి వెళ్ళే వారు ఎవరి గ్లాసు ,చెంబు నీళ్ళ తో తీసుకొని వెళ్ళే వారు .సాధారణం గా పెద్దలందరూ పంచె కట్టు కొని ,చొక్కా లేకుండా తువ్వాల పైన వేసు కొని,మడి తో  వెళ్ళే వారు .చిన్న పిల్లల మైనా మేము కూడా అంతే .మట్ట లాగు ,పైన తుండు ,చేతి లో గ్లాసు ,చెంబు లతో ప్రత్యక్షం .పెద్దలకు వేరుగా ,చిన్న లకు వేరుగా వడ్డన వుండేది .మడి వాళ్ళ ను ముట్టు కో కూడదు .అదో నియమం .చాలా ఆప్యాయం గా కొసరి కొసరి వడ్డిచే వారు .తింటే కాని వదిలే వారు కాదు .నెయ్యి కి ఝారీ ఉండేవి .దానితో చేయి నిండా నెయ్యి వడ్డించే వారు .పెరుగు వుండటం తక్కువే .మజ్జిగ ఎక్కువ గా పోసే వారు తృప్తి గా  తింటేనే యజమానికి ఆనందం ఒక వేల ఏ కుటుంబం లో నైనా రాక పొతే మళ్ళీ కబురు చేసే వారు .పంక్తి భోజనాలు మహా మజా గా ఉండేవి .చేతులు కడుక్కో వటానికి దొడ్లోనో ,వాకిట్లోనో గంగాలాలతో నీళ్ళు ,చెంబు పెట్టె వారు .వాటిని వాడు కోవాలి .చేతులతో పాటు ,కాళ్ళు కూడా పొడి లేకుండా కడుక్కో వాలి ..పొడి వుంటే శని అందు లోంచి ప్రవేశిస్తాడని భయం .అందుకని అంత జాగ్రత్త .తారు వాత తువ్వాలతో కాళ్ళు తుడు చు కో వాలి .ఒక పళ్ళం లో లేత తమల పాకులు ,ఫై.ఎస్ .ఆర్ .వాక్క పొడి ,ముద్దా సున్నం ఉండేవి .వాటిని కావలసిన వాళ్ళు హాయిగా కావలసినన్ని వేసు కొని నమిలే వారు .నోరు బాగా పండితే మహదానందం .యజ మానికి చెప్పి ఇంటికి బయల్దేరటం అలవాటు .అదీ ఆ నాటి భోజన పధ్ధతి .ఇంట్లోని ఆడ వాళ్ళే ఎంగిలి విస్తళ్ళు ఎత్తి పారేసే వారు .ధన వంతులు డబ్బిచ్చి ఎవరి తోనైనా తీయించే వారు .ఆనాడు అందరికి సరి పడ పీత లు ఉండేవి కావు .చాపల మీద కూర్చొని తినటం నిషిద్ధం .వుంటే నెల బల్ల లు ,లేక పొతే కింద కూర్చొనే తినే వారు .వూళ్ళో వారు అందరు వచ్చి భోజనాలు చేసిన తర్వాత ఇంటి యజమానులు భోజనం చేసే వారు .రాని వారి కోసం రెండు మూడు సార్లు కబురు పంపటం రివాజు .
                   ఇలా దాదాపు ప్రతి గృహస్తు మర్యాద గా ఆహ్వానించి గౌరవించటం వుండేది .ఖాళీ లేదని ఎవరికీ చెప్పే వారు కాదు .పంక్తి నిండి పొతే విడిగా వారు కాసేపు కూర్చోవ టానికి ఏర్పాటు చేసే వారు .అలా చేయ వలసి వచ్చి నందుకు బాధ పడే వారు .అందరు రావాలనే కోరికే వుండేది .రాక పొతే పోయార్లె అని వుండేది కాదు .కోదండ రామయ్య గారి మాట వదిలి భోజనాలలో మునిగి పోయాం .ఇప్పుడు ఆ విషయం లోకే వస్తున్నాను .ఈ సంఘటన నేను చూసింది కాదు .మా మామయ్య ,నాన్న ,వెంకట్రామయ్య గ్సారు చెపితే విన్నది .అంటే నాకు ఇంకా గ్రాహకం రాక ముందు జరిగిందన్న మాట 
                       మా ఉయ్యూరు లో ఊర వారి బజారు చివర అంటే ఉత్త రాన రాయ ప్రోలు కోదండ రామయ్య గారి ఇల్లు వుండేది .బాగా ఎత్తరుగుల ఇల్లు .బాగా స్థితి మంతుడు ఆయన .పచ్చ గా ,దబ్బ పండు రంగులో చాలా అందం గా .లేత తమల పాకు ల వుండే వారు .ఒడ్డు ,పొడుగు భారీ మనిషి గ్లాస్కో పంచె ,లాల్చి తో చాలా అందం గా వుండే వారు .ఆయన కొడుకు సాంబమూర్తి .వాళ్ళ అమ్మాయి ఒకావిడ మా రెండో అక్కయ్య క్లాసు మాటే .రెండో అమ్మాయి సౌదామిని నాకు క్లాస్ మాటే .వాలందఱు అందం గా నే వుండే వారు .పొలం ,పుత్రా నాగా నటరా బాగా ఉన్న వారు .అయితే ఆయన ఎవరితోనూ కలిసే వాడు కాదు .ఆయన మా నాన్న గారికి స్నేహితుడు .మా మేన మామ గుండు గంగయ్య గారికి సహాధ్యాయి .వీళ్ళిద్దరూ ”ఏరా అంటే ఎరా ”అను కొనే వాళ్ళు .ఆయన చెల్లెలే దస్తావేజులు రాసే కొలచల వెంకట రామయ్య గారి భార్య ..అయితే వారిద్దరి కుటుంబాలకు నాకు తెలిసి నంత వరకు రాక పోకలు లేవు .వెంకట్రామయ్య గారు మా నాన్న స్నేహితుడు ఒరే అను కొనే వారు .మాకుటుమ్బానికి చాలా  సన్నిహితులు .అంటే కాదు కోదండ రామయ్య గారి భార్య తమ్ముడు మా అన్నయ్య గారి అమ్మాయి భర్త అంటే వేలూరి రామ కృష్ణ (చిరి వాడ )కు మేన మామ .అంటే వాళ్ళమ తమ్ముడు .వీళ్ళ పెళ్లి అయింతర్వాత ఆ బంధుత్వం తెలిసింది .
                   ఒక సారి కోదండ రామయ్య గారింట్లో ఏదో షుహ కార్యం జరిగిందట .వూరి లోని బ్రాహ్మణ్యాన్ని అందర్నీ భోజ నాలకు పిలి చారట .ఆయన తీరు అందరికి తెలిసిందే .ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు ఆ పక్కనే వుండే వాడు .ఆయన తోనే మాటలు ఉండేవి కాదని చెప్పు కొనే వారు . మా నాన్న ,మా మామయ్య ఇంకా కొందరు కోదండ రామయ్య గారింటికి భోజ నాలకు వెళ్ళారు .అప్పటికే జనం బాగా వచ్చారట ..వాలది డాబా ఇల్లు .అన్ని వస్తూ లతో ,తూగు తుయ్యాల తో ,వాలు కుర్చ్క్=హీతో మహా NEAT గా వుండేది .సరే వీళ్ళు అక్కడికి వెల్ల గానే తలుపులు వేసి వున్నాయట .తలపులు వేయటం అప్పుడు అల వాటే కారణం భోజ నాలు చేస్తుంటే ఎవ్వరు చూడ రాదనే ఒక అభిప్రాయం .తలుపు తట్టారట .కోదండ రామయ్య గారు తలుపు తీసి ”నో వేకన్సి-సారి ”  అని తలుపు మూసే”NO VACANCY ” బోర్డు చూపించాడట . .వీళ్ళకు కోపం వచ్చింది .మొహం మీదే తలుపు వేయటం అవమానం అని పించిందట .అంటే తిరుగు టపా లో తిరిగి ఇంటికి వచ్చారట .వంట చేయించుకొని అప్పుడు భోజనం చేశారట ..విషయం తెలుసు కొన్న కోదండ రామయ్య గారు తర్వాత ఎవరినో పంపించారట భోజ నాలకురమ్మని  .వీళ్ళు మళ్ళీ వాళ్ళింటి గడప అప్పటి నుంచి తొక్క లేదట .ఎప్పుడు మా ఇంట్లోను ,మామయ్య గారింట్లోను భోజ నాలు సందర్భం లో ఈ సంఘటన గుర్తు చేసు కొని పడీ పడీ నవ్వు కొనే వారు ”ఎరా మీ ఇంట్లో కూడా నో వేకన్సి బోర్డు పెట్టావా ”అని నవ్వు కొనే వారు .ఇదీ నో వేకన్సి కదా .ఇప్పటికి నా పేజికి కూడా ”నో వేకన్సి– .సారి ”.
                                              మీ దుర్గా ప్రసాద్ –24 -11 -11 .

ఊసుల్లో ఉయ్యూరు –5 పాపం- వెంపటి శర్మ గారి శ్రమకు ఏం మిగిలింది ?-
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.