తెలుగు” జాతి రత్నాలు ”

తెలుగు” జాతి రత్నాలు ”

               యందరో మహాను భావులు .అందరికి వందనాలు .తెలుగు జాతి కీర్తి ని దశ దిశలా వ్యాప్తి చేసి ,వెలిగిన జాతి రత్నాలనుసూక్ష్మం   గా గుర్తుకు తెచ్చు కొనే ప్రయత్నమే ఇది .వారి విపుల చరిత్ర తెలుసు కోవ టానికి దారి చూపే చిన్న దివ్వె ఇది .

 డి.వి .సుబ్బా రావు 

మహానటుడు డి.వి.సుబ్బా రావు కృష్ణా జిల్లా మచిలీ పట్నం వాస్తవ్యులు .తన నాటక నటనా సామర్ధ్యం తో అశేష జన నీరాజనాలు అందుకొన్న వారాయన .ఒక్క నాటక ప్రదర్శనానికి ఆయన కు వెయ్యి రూపాయలు ఇచ్చే వారు .అంత గొప్ప సంపాదన వున్నా కాలమ్ లో కోడా ఆయన వారానికి ఒకే ఒక ప్రదర్శన్ ఇచ్చే వారు .నాటకాల మధ్య కృషి ,ఆలోచనా వుండాలని ఆయన తపన .డబ్బు సంపాదనే కాదు perfection వుండాలని భావించిన నటుడు ఆయన .సాధన తో నే సాధించాలి అన్న నమ్మకం .సాధన ,ప్రతిభ ,ఉపజ్న వున్న కొద్ది మంది లో సుబ్బా రావు గారు ఒకరు .అందుకే ఆయన వేశం ప్రతి సారీ కొత్త గా అని పించేది .ఒక సారి ఎన్నో రిహార్సల్స్ వేసిన నటుడు కూడా రంగ స్థలం పై ఈయన కత్తి పట్టు కోని ”చంపుతాను ”అని ప్రవేశిస్తే ,భయపడి పారి పోయాడట .క్రమ శిక్షణ వున్న మహానటుడు డి .వి .
                                                  ఈమని శంకర శాస్త్రి 
              ఈమని సంగీత వనం లో ఆమని .ఆయన రాగ ప్రస్తారానికి ,స్వర కల్పనా శిల్పానికి ,మూర్చనలకు ఒక ప్రత్యేకత వుందని సంగీతజ్ఞులు కితాబు ఇచ్చారు .వీనే పై వెద మంత్రాలను పలికిస్తే ”ఓంకారమ్”  ఘోష వతి ‘అయి హృదయం లో మోగుతుంది .బాధ ,భక్తి ,ప్రేమలను పలికిస్తే అవి ఉపాస్యాలు అయి ఎదను హత్తు కుంటాయనే వారు .అందుకే కవిపాడుశా జాషువా –
                ”తనువుల్ పుల్కల పూల తోట లయి ,యాత్మల్ స్వార్గికానంద గా –హన ములసలప ,ప్రపంచముంగుదిపి ,యుయ్యాల యూచు ,నీ గాన మో
                 హినికిన్ ,నీకును ,నీ ఫిడేలునకు వేఎండ్లాయురైశ్వార్య ముల్ — తెనుగుం గడ్డ ,యహన్కరించినది ,మేల్ మేల్ గాయకా ”
                           ”చెవులు బట్టి పిండి శిక్షించి ,జడ మైన –కట్టే కెట్లు విద్య గరపి నావో ?
                            అంగుళీ యకంబు లంటి యంటక ముందె –నీ ఫిడేలు మధుర నిధులు గురియు ”
                                                  దాలి పర్తి పిచ్చి హరి 
                   కృష్ణా జిల్లా చల్ల పల్లి దగ్గర లక్హ్మీ పురం లో జన్మించిన దాలి పర్తి పిచ్చి హరి నాద స్వరాన్ని నాద సుధ గా మరల్చిన మహా విద్వాంసుడు ”పూర్వం అల్లంత దూరం కూర్చొని వింటేనే విన గల నాద స్వరాన్ని కచేరీ లో కూర్చొని వినేట్టు చేసిన పండితుడు .పిచ్చి హరి ”అని గాయక సార్వ భౌమ పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులు గారు మెచ్చిన నాదస్వర మేటి .నాద స్వరాన్ని సన్నాయి అనే వారు .అదే సేహనాయి అయింది .పిచ్చి హరిణి ”నాద తనువు”  ”అని బ్రహ్మ రధం పట్టింది సంగీత లోకం అంతా ..దాక్షిణాత్యుల చేత కూడా ”భళీ ”అని పించుకొన్న దిట్ట . ”వీణె కు సంగ మేశ్వ ర శాస్త్రి ,వయోలిన్ కు ద్వారం నాయుడు గారు ,జంత్ర గాత్రాలకు హరి నాగ భూషణం గారు ,హరి కధ కు ఆది భట్ల నారాయణ దాసు గారు మృదంగానికి అశ్వ ధాటి రామ మూర్తి గారు మహా నిదులితే ,నాద స్వరానికి దాలి పర్తి పిచ్చి హరి వారి లో చేరి మహితాత్ముడైనాడు ” అని ప్రశంసలందుకున్నాడు పిచ్చిహరి ..
                 శృతి బాగా తగ్గించి .ఒకటిన్నర లో వేణు గాన సుఖాన్ని కల్గిస్తూ ,సన్నాయి నొక్కులు నొక్కుతూ ,సొక్క జేసి సొగసు గా స్వరం అన గల ప్రజ్ఞా మూర్తి ”.సారమతి ధేనుక ,నీలాంబరి ,షహానా, వంటి తత్వ స్ఫోరక రాగాలు ఆలాపిస్తుంటే భావా వేశ పర వశులమ వుతాం ”అని సాటి సంగీత ప్రజ్ఞా మూర్తులతో కీర్తి కిరీటం పెట్టించుకొన్న నాద సుధానిధి దాలి పర్తి పిచ్చి హరి .నా చిన్నప్పుడు ఉయ్యూరు లో వైఖానస సభలలో విష్ణ్వాలయం లో ,ఆరు బయట ఆయన కచ్చేరి ఏర్పాటు చేస్తే విన్నాను .మా నాన్న ,మామయ్య ,వంగాల శివరామ శర్మ ,గాయత్రి అనంత రామయ్య,చోడవరపు చంద్ర శేఖర రావు ,వారణాసి సదాశివ రావు వంటి ఉద్దండులు విని అద్భుత మని పొగడి  ,అరుదైన సన్మానం చేయటటం నాకు ఇంకాగుర్తు   వుంది
                                                    కాశి కృష్ణా చార్యుల వారు 
               మహా మహోపాధ్యాయ ,అవధాన శిరోమణి ,ఆంద్ర ప్రదేశ్ ఆస్థాన కవీశ్వరులు బ్రహ్మశ్రీ కాశీ కృష్ణా  చార్యుల వారు .ఒక్క ఆశు కంద పద్యం తో శ్రీ కాకుళం జిల్లా అరస వల్లి సభ లో కని ,విని ఎరుగని సన్మానం పొందిన సంస్కృత ఉద్యమ  సారధి
              ”అనిరి పురజనులవనిలో –అని ,రిపు ,రాజనుల నడంప హంసుడ వగుచున్
             ‘ గని వని ”గొల్చెద రర్ధులు –గని వని గొల్చెద రరాతి గములు నృసింహా ”
        ఆచార్యుల వారు ”తర్క విద్వాంసులు .ఉభయ భాషా  కవి మిత్రులు ”జర్మనీ దేశస్తులు వీరిని సగౌర వం గా జర్మనీ కి రమ్మని ఆహ్వానిస్తే ”ఈ వయస్సు లో ఈ కర్మణ్య దేశం వదిలి ఆ శర్మన్య దేశ వాసమా ?”అని తిరస్క రించిన నిత్య కర్మిస్టి .
          వృద్ధాప్యం లో చెట్టంత కొడుకు చని పోయినా ,మనసు చిక్కపట్టు   కోని ఉచితం గ వందలాది విద్యార్ధులకు సంస్కృత విద్యా దానాన్ని చేసిన పుణ్య మూర్తి ,కారుణ్య స్ఫూర్తి .”ఆయన జీవితం గతానికీ ,ఆగతానికీవెలుగు వంతెన ”అని చక్క గా విశ్లేషించారు విశ్లేషకులు .దాదాపు తొంభై ఏళ్ళ వయసు లో కూడా ”పంచ పంచ ఉషఃకాలం లో గజ గజ లాడే చలిలో కృష్ణా స్నానం చేసి ,”వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం -ఇందిరా పతి మాద్యాది ,వర దేశీ వర ప్రదం ”అని మాధవా చార్యుల వారి ద్వాదశ ,రాఘవేంద్ర ,హరి ,వాయు స్తుతులను పథించు కొనే కర్మన్యులు ..సంస్కృత బాల బోధిని విద్యార్ధుల కోసం రాసి ఉచితం గా అందించి న వరేన్యులు ఆచార్యులు .
          1962 -63            లో నేను రాజ మండ్రి ట్రైనింగ్ కాలేజి లో బి;యి.డి.చేస్తున్నాప్పుడు రాజమండ్రికి ఆంద్ర దేశం లోని కవులు ,రచయితలు ఏదో సభలకోసం వచ్చారు .అప్పుడు మాకు shortend  బి.యి.డి  చేస్త్రున్న స్వర్గీయ ఏలూరి పాటి అనంత రామయ్య గారు స్టూడెంట్ సెక్రెటరి .ఆయన ఈ మహా మహులను అందర్నీ మా కాలేజికి ఆహ్వా నించారు .అందరువచ్చారు .  అంత మంది కవులు పండితులు ,రచయితలు ,పత్రికా సంపాదకులను ఒకే వేదిక మీద చూసే అరుదైన అదృష్టం మాకు కలిగింది .ఇంతలో కృష్ణా చార్యుల వారు వస్తున్నారని చెప్పారు .పర వశించి పోయాం .మీటింగ్ పై అంతస్తు లో .వీరు పైకి నడిచి రాలేరు .అప్పుడు లిఫ్ట్ లు లేవు .ఒక వెడల్పు కుర్చీ లో వారిని కూర్చో బెట్టి నలుగురు విద్యార్ధులం జాగ్రత్త గా మోస్తూ వారిని పై మీటింగ్ హాల్ లోకి తీసుకొని వెళ్లాం ..మా జన్మ ధన్య మయిందని బావిన్చాం .అప్పటికే వారి నడుము విల్లు బద్ద లా వంగి పోయింది .సన్న గా తేజో వంతం గా వున్నారు .ఆ మహా మహున్ని అప్పుడు అలా చూసే భాగ్యం ,వారిని ఎత్తు కోని తీసుకొని వెళ్ళే మహద్భాగ్యం నాకు కల్గింది.వారి పాదాలను స్పృశించి నమస్కరించే అరుదైన అదృష్టము కలిగింది . .జీవితం లో ఇంత కంటే అదృష్టం ఏముందని పిస్తుంది అది తలచు కుంటే .
                             వీరంతా తెలుగు ”జాతి రత్నాలు ”.వారికి వందనం చేస్తూ సెలవ్.
                                                              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -12 -11 .
.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.