పాహియాన్ సఫల యాత్ర –1

పాహియాన్ సఫల యాత్ర –1

                   ఎక్కడో చైనా  లో జన్మించి ,బౌద్ధ మతాన్ని అవలంబిస్తూ ,మనసు సంతృప్తి పొందక ,బౌద్ధ మత గ్రంధాలు  ”వినయ సూత్ర గ్రంధాలను ”

— స్వయం గా చూసి ,అందు లోని విశేషాలను తెలుసు కోని ,తన దేశస్తులకు ఆ గ్ర్కన్ధాలను తన భాష లో పరిచయం చేయాలని తలచాడు చైనా యాత్రికుడు పాహియాన్ .అంతే కాక ,అహింసా మూర్తి ,శాక్య సింహుడు జన్మించిన పుణ్య భూమి ని దర్శించాలనీ ,ఆయన తిరుగాడిన ,ప్రదేశాలను ,చూసి ధన్యత చెందాలని ఆరాట పడ్డాడు .ఆ ఊహల తోనే ,క్రీ .శ.399 లో చైనా నుండి బయల్దేరి ,ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ,ఆరు సంవత్చ రాలు అలుపు లేకుండా ,ప్రయాణం చేశాడు .భారత దేశం చేరు కొన్నాడు .మరో ఆరేళ్ళు ఇక్కడే గడిపి వివ రాలు సేకరించాడు .ప్రసిద్ధ క్షేత్రాలన్నీ దర్శించాడు .ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయాడు .మరో మూడేళ్ళు ప్రయాణం చేసి స్వదేశం చేరాడు .మొదటి విదేశీ యాత్రికుడు గా చరిత్ర లో నిలిచి పోయాడు .తాను చూసిన విశేషాలన్నీ ,వెదురు పలకల పైన చీనా మ్బరాల పైనా  వ్రాసి నిక్షిప్తం చేశాడు .నిజం గా ,సాహస యాత్రీకుడు .నాల్గవ శతాబ్దం లోని భారత దేశ పరిస్తితులు ,,బౌద్ధ విశేషాలు ,జీవన సరళి ,తెలుసు కోవ టానికి ఆ మహా యాత్రికుడు వ్రాసిన చారిత్రిక విషయాలు ఎంత గానో తోడ్పడుతాయి .ఒక అమూల్య గ్రంధమే ఆయన రచన . .భారత దేశం ఆయనకు ఎంతో రుణ పడి వుంది .

                                                జీవిత యాత్ర 
               చైనా దేశం లోని ”శాంగన్ ”నగ రానికి చెందిన వాడు పాహియాన్ .బౌద్ధ సన్యాసి .క్రీ;శ.370 ప్రాంతం లో జన్మించి నట్లు తెలుస్తోంది .ఆ కాలమ్ లో చైనా ను ”సిన్ను ”వంశ రాజులు పాలిస్తున్నారు .చిన్న తనం లోనే వైరాగ్యం పొంది ,సన్యాసియై ,బౌద్ధ మత ఉద్దహరణకు జీవి తాన్ని ధార పోశాడు ఈయనిది ”కంగు ”వంశం .చైనా లోని ”పియాంగ్ ”దగ్గర వున్న ”ఉయాంగ్ ”లో జన్మిచాడు .నివాసం మాత్రం శాంగన్   నగరమే .తల్లికి నాల్గవ సంతానం .చిన్నప్పుడే ముగ్గురు సోదరుల్ని పోగొట్టు కొన్నాడు .తండ్రికి విరక్తి కలిగి పాహియాన్ ను బౌద్ధ మతం లో విడిచి పెట్టాడు .కాని కొన్ని రోజుల తర్వాత మనసు మార్చుకొని ఇంటికి తీసుకొని పోయాడు .రోజూ వ్యాధి తో బాధ పడే పాహియాన్ ను చూడ లేక మళ్ళీ మఠం లో విడిచి పెట్టి వచ్చాడు-కొడుకు బతుకు తాడనే ఆశ తో .వెంటనే పాహియాన్ ఆరోగ్య వంతు డయాడు .పదవ ఏట తండ్రిని పోగొట్టు కొన్న దురదృష్ట వంతుడు .తల్లిని ఒదార్చమని చెప్పారు .”నన్ను సంసార బంధం లో పడెయ్య వద్దు ”అని మొత్తు కొన్నాడు .ఆయన నిశ్చలత్వానికి అందరు ఆశ్చర్య పోయారు తల్లి కూడా చని పోయింది .పాహియాన్ వెళ్లి సంస్కారాలు చేసి తన బాధ్యత తీర్చుకొన్నాడు . ..
                 చిన్నప్పటి నుంచి పాహియాన్ కు ధైర్య సాహసాలు ఎక్కువే .ఒక సారి తన తోటి సన్యాసులతో కలిసి వరి పొలం కోస్తున్నాడు .దొంగల గుంపు వచ్చి పడింది .అందరు పారి పోయారు పాహియాన్ మాత్రం నిల్చి పోయాడు .దొంగలకు హితోప దేశం చేశాడు ”పూర్వం చేసిన పాపాల వల్ల ఇలా దరిద్రం లో దొంగ లైనారు .ఇప్పుడూ ,అలానే చేస్తే మీకు విముక్తి లేదు ”అని ఏడుస్తూ ”మీకు ఇష్టం వచ్చినంత దోచుకొని వెళ్లి పొండి ”.అని చెప్పి వెళ్లి పోయాడు .వాళ్ళల్లో పరివర్తన వచ్చింది .ఒక్క గింజ కూడా తీసుకొని పోకుండా వెళ్లి పోయారు .దీనితో అతని కీర్తి చైనా అంతా వ్యాపించింది .బౌద్ధ మత శిక్షణ పూర్తి చేసుకొన్నాడు .బౌద్ధ మత గ్రంధ రాజం అయిన ”వినయ పీఠిక ”సంపాదించాలనే కోరిక కల్గింది .మత గ్రందాల కోసం దీర్ఘ యాత్ర చేసిన వాళ్ళు ప్రపంచ చరిత్ర లో ఎవరు లేరు .అందుకనే క్రీ.శ.399 లో శాంగన్ నగరం నుంచి ”పాదచారి ”గా ,యాత్ర ప్రారంభించాడు .భారత దేశం అంతా తిరిగాడు .ఇతిహాస ప్రసిద్దాలైన పుణ్య తీర్ధాలన్నీ తిరిగాడు .వైద్య శాస్త్రానికి ,శాస్త్ర  చికిత్చ కు పేరు గాంచిన ,సకల శాస్త్ర పండితులకు నిలయమైన ”తక్షశిల ”చేరాడు .yenno కస్టాలు అనుభవించాడు .అమూల్య మైన గ్రంధాలను తన వెంట తీసుకొని వెళ్లి ,వాటిని మాత్రు భాష లోకి అనువదించాడు .భారత దేశం ,సింహళం ,ల లోని సాంఘిక ,రాజ్యాంగ ,పారిశ్రామిక వ్యవస్థలను సమగ్రం గా వర్ణించాడు .తమ చరిత్రను తాము రాసు కో లేక పోయిన భార తీయులకు ఆయన రాసినదే చారిత్రిక ఆధారం .అ గ్రంధం పూర్తి కాకుండానే 82 ఏళ్ళ వయసు లో ”సిన్ను ”అనే బౌద్ధారామంలో మరణించాడు .ప్రాచీన నాగరకతా వైభవాన్ని వేనోళ్ళ ప్రస్తుతించిన మహాను భావుడు .ఇతర దేశాల్లో భారత దేశానికి వున్న అగ్ర స్థానం ఎలాంటిదో తెలియ జెప్పాడు .ప్రాచీన భారత సభ్యతను కాలంలో పడి మగ్గి పోకుండా నిక్షిప్తం చేసిన ధన్య జీవి పాహియాన్ .ఆ చారిత్రక వివ రాలను సర్వనాగరక   ప్రపంచానికి చాటి చెప్పిన సాహస యాత్రికుడు పాహియాన్ .ఆయన యాత్ర నిజం గానే ”సఫల యాత్ర ”. .
                        సశేషం
                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -11 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

5 Responses to పాహియాన్ సఫల యాత్ర –1

 1. పూర్ణప్రజ్ఞాభారతి అంటున్నారు:

  చాలా బాగుంది. నేను సి-యు-కీ, ఫో-క్యూ-కీ (ఫాహియాన్, హ్యుయాన్త్సాంగ్ రచనలను అనువదిస్తున్నాను. పూర్తికాగానే మీకు కాపీ పంపుతాను.

  పూర్ణప్రజ్ఞాభారతి

 2. కమల్ అంటున్నారు:

  ఈ పాపియాన్ నవలను ఇప్పటికే డా॥ యం.వి. రమణారెడ్డి అనే అతను ” రెక్కలు చాచిన పంజరం ” పేరుతో రెండు భాగాలుగా తెలుగులో అనవదించారు కదా..? మీరు చెబుతున్న పాపియాన్..తెలుగులోకి అనువదించిన పాపియాన్ రెండు వేరు వేరు నవలలా..? కాస్త తెలియజేయగలరు..?

 3. pedaprolu vijayasaradhi,gandigunta,krishna dt. అంటున్నారు:

  very glad to learn some thing about the GREATTRAVELLER who introduced the philosophical values that cherished in INDIA in olden days. HIS writings helped helped Indians to learn about our past glory. THANK YOU Durgaprasadji-saradhi

 4. Pogari sundarraj అంటున్నారు:

  చాలా బాగా నచ్చింది మీ యొక్క వివరణ

Pogari sundarrajకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.