రెండు చారిత్రిక మహా నగ రాలు –1

రెండు  చారిత్రిక  మహా నగ రాలు –1

                                                        పాటలీ పుత్రం

భారత దేశం లోని నగరాలన్నిటికి తల మానికంగా , వుండి ,భారతీయ కళా సౌందర్యానికి నిలయం గా వున్న ,ఆనాటి పాటలీ పుత్రం   నేడు -చరిత్ర గర్భం లో కలిసి పోయిన పురాతన పట్టణం .ఆర్య చాణక్యునికీ ,ఆర్య భట్టు వంటి ఖగోళ శాస్త్రజ్ఞులకు జన్మ నిచ్చిన పుణ్య భూమి .మౌర్య సామ్రాజ్యానికి ఆయువు పట్టు .బౌద్ధ ధర్మం శత పత్రం గా వికశించిన దివ్య ధాత్రి .తధాగతుని చరణ స్పర్శ తో ,పులకించిన మహా నగరం .నాగరకత కు పట్టు గొమ్మ .హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రికులకు ఆశ్చర్యం కల్గించిన చారిత్రిక పట్టణం .కుసుమ పురం అనే పేరు తో విరాజిల్లిన కమనీయ నగరం .పాటలీ పుష్పాలు ఒక రక మైన ఎరుపు రంగుతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి .అవి ఇక్కడ విశేషం గా కన్నుల పండుగ చేస్తాయి కనుక పాటలీ పుత్రం అనే పేరు సార్ధక మైంది .పురాణ ప్రసిద్ధ మైన గాది రాజు కుమార్తె ” పాటలి”  అని ,ఆమె కోరిక పై ,కౌండిన్యుడు ,మాయా జాలం తో ,దీన్ని నిర్మించాడని ,ఆమె పేరు తోనే ”పాటలీ పుత్రం ”అయిందని కధనం .దాని వైభవం కూడా మాయా జాలం గానే మాయ మై పోయిందేమో నని పిస్తుంది .

                                                    మౌర్య వంశ పాలన 
                 క్రీ.పూ.519 -491 లో బింబిసారుడు గిరి వ్రజం (రాజా గృహ )రాజా దాని గా ,మగధ దేశాన్ని పరి పాలించాడు .ఉదయాశ్వుడు రాజధాని ని పాటలీ పుత్రానికి మార్చాడు .నంద వంశ రాజుల దుస్త పరి పాలన నుంచి విముక్తి చేసి ,చంద్ర గుప్త మౌర్యున్ని పట్టాభి షిక్తున్ని  చేశాడు ఆచార్య చాణక్యుడు .మెగస్తనీసు అనే యాత్రికుడు రాసిన ”ఇండికా ”గ్రంధం లో పాటలీ పుత్రం అతి సుందర నగరం అనీ ,శత్రు దుర్భేద్య మైన కోతలు వున్నాయని ,చుట్టూ ఎత్తైన ప్రాకారాలు ,నగరం మధ్యన రాజా ప్రాసాదం ఉండేదని వర్ణించాడు .తిరుగుతూ పైకి నీరు చిమ్మే ఫౌంటైన్లు వుండే వట .’స్తంభాలకు బంగారు పూత వుండేది .మణులు పొదిగిన ఆసనాలు ,మంచాలు వైభవో పేతం గా ఉండేవి .అనేక దేవాలయాలకు నిలయం ఆ నగరం .బ్రాహ్మణులకు ,లోహ కారులకు వేర్వేరు వీధులు ఉండేవి .తూర్పున క్షత్రియులు ,శిల్పులు ,వర్తకులు వుండే వారు .పడమటి భాగం లో సాలీలు ,చర్మ కారులు వుండే వారు .ప్రజలకు ఆర్ధిక సహకారం అందించే పరపతి సంఘాలున్దేవి .శ్రమ జీవుల సంక్షేమమ్ చూసే శ్రామిక సంగ్ఘాలున్దేవి .సస్కల వసతులతో బాట సారులకు విశ్రాంతి గృహాలు ,ఉండేవి .మనసు దోచే ఉద్యాన వనాలున్దేవి .తీర్చి దిద్దిన బాటలు ,పరిశుద్ధ జలాలు ,మంచి పారి శుద్ధ్యం తో సౌఖ్యం గా ప్రజలు ఆనందంగా వుండే వారు .మహాకవి కాళిదాసు ,దండి తమ కావ్యాలలో పాటలీ పుత్ర వర్ణన చేశారు .క్రీ’పూ’272 లో  అశోక చక్ర వర్తి ఇక్కడే పట్టాభి షిక్తుడు అయాడు ..
                                                           స్వర్ణ యుగం 
            గుప్త సామ్రాజ్యానికి కూడా పాటలీ పుత్రమే రాజా దాని .సముద్ర గుప్తుడు దిగ్విజయ యాత్రలతో సామ్రాజ్యాన్ని విస్తరించి ,స్వర్ణ యుగానికి కారకు డైనాడు .రెండవ చంద్ర గుప్తుడు సాహస విక్ర మార్కు డైనాడు .చైనా యాత్రికుడు ” పాహియాన్ ”ఈ పట్ట నాన్ని సందర్శించి పులకించి పోయాడు .మూడు సంవత్చ రాలు ఇక్కడే నివ సహించి ,సంస్కృతాన్ని అధ్యయనం చేశాడు .చంద్ర గుప్త విక్రమాదిత్యుని పాలనకు ,పద్ధతులకు ఆశ్చర్య పోయాడు .అంతటి ”ధర్మ పాలన ”తాను ఇంకెక్కడా చూడ లేదు అని రాశాడు .విని కూడా వుండలేదన్నాడు .నగర సౌందర్యానికి ముగ్ధుడయాడు .”అసలిది మనుష్యులు నిర్మించిన పట్టణ మేనా “”?అని సంభ్రమం తో పాటు ,సంబరము పడ్డాడు .పాటలీ పుత్ర విద్యాలయం లో వేలాది విద్యార్ధులు విద్య నభ్య సించె వారట .పాటలీ పుత్ర పౌరుల ఉదార ధన సాయం తో అద్భుత మైన ”వైద్య శాల”నిర్మించి ,నిర్వహించే వారట .రోగులకు అన్నీ ఉచితం గానే లభించే వట .అన్న సత్రాలు ,ధర్మ శాలల నిర్వహణ అత్యంత శ్రద్ధా శక్తులతో ధార్మిక భావన తో నిర్వ హించే వారట .సుంకాలు ,నిర్బంధాలు లేవట .లంచ గొండి తనం లేనే లేదట .పంట లో ఆరవ వంతు రాజు తీసు కొనే వాడట .క్రూర దండనలు లేనే లేవు .రాజా ద్రోహం చేస్తే కుడి చెయ్యి తీసే వారట .
                                                   పాడు పడ్డ” పాట్నా” 
               తర్వాత వచ్చిన హుయాన్ సాంగ్ నాటికి పాటలీ పుత్రం ”శిధిల నగరం ”ప్రసిద్ధ కట్టడాలన్నీ ,గంగా ,శోణ నదుల్లో మునిగి పోయాయి .ఆ శిధిలాలను చూసి కన్నీరు మున్నీరు అయాడట ఆ మహా యాత్రికుడు .అశోకుని కాలమ్ లో మూడవ బౌద్ధ పరిషత్తు జరిగింది .బౌద్ధ ధర్మాన్ని కాపాడ టానికి అన్ని ఆగ్రట్టలు తీసు కొన్నాడు .గౌతమ బుద్ధుడు రాజా గృహాన్ని తరచు సందర్శించే వాడు .జైన మత స్థాపకుడు ,వర్ధమాన మహా వీరుడు కూడా పాటలీ పుత్రం లో ధర్మ బోధ చేశాడు .పాటలీ పుత్రమే నేటి ”పాట్నా”-బీహారు రాష్ట్రం లో వుంది .ఇక్కడ ”బారా పతన దేవి ”ఆలయం వుంది .అలాగే ”చోటా పతన దేవి ”ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది .శివుడు సతీ దేవి మృత దేహాన్ని మోసుకు పోతుంటే ,ఆమె వస్త్రం ఈ ప్రదేశం లో పడిందని ,అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు .శిక్కుల మత గురువు ”గురు గోవింద సింహుడు ”జన్మించిన పట్నం ఇదే .బాల్యం లో ఆయన ఉపయోగించిన ఉయ్యాల ,చెప్పులు ,గ్రంధ సాహెబ్ ,లు  .మహా రాజా రంజిత్ సింగ్ కట్టించిన దేవాలయం లో దర్శన మిస్తాయి .
                    దక్షిణాత్య రాజులు కూడా  పాట్నా ను పాలించారు .బౌద్ధ ధర్మ ప్రచారమూ చేశారు .తర్వాత మహమ్మదీయుల కాలమ్ లో అంతా సర్వ నాశనం అయింది .ఈ విధం గా హిందూ ధర్మానికీ ,బౌద్ధ ధర్మానికీ ,జ్సైన ధర్మానికీ నిలయమై ,రెండు మహా సామ్రాజ్యాలకు ఆలవాలమై ,కళా సంస్కృతి రంగాలకు నిలయమై అహింసకు ఆలంబనమై న పాటలీ పుత్ర మహా నగర వైభవం జ్ఞాపకం వస్తే ,కళ్ళల్లో నీరు ఒలుకుతుంది .
                                ఈ సారి ”కన్యా కుబ్జ నగర ”విశేషాలు తెలియ జేస్తాను .
                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to రెండు చారిత్రిక మహా నగ రాలు –1

  1. vasanth kumar అంటున్నారు:

    HUYAN SANG AND PAHIYAN GURINCHI CONFUSING GA RASARU……………NAKU ARTHAN KALEDU……..FIRST PERA GRAPH LO HUYAN SANG NAGARANNI CHUSADU ANI RASARU…………
    CHIVARI PERA LO NASANAMAYINA NAGARANNI CHUSI EDCHADU ANI RASARU………………..
    ASALU E YATRIKUDU MUNDU HUAYAN SANG A LEKA PAYIYAN A……?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.