పాహియాన్ సఫల యాత్ర -2 ప్రయాణ సంరంభం

పాహియాన్ సఫల యాత్ర -2

                                                                  ప్రయాణ సంరంభం

—                   క్రీ.శ.399 లోతన మిత్రులు ”హ్యూయంగ్ ”హ్యోకింగ్ ,తోచింగ్  లతో కలిసి ,పాహియాన్ చైనా లోని శాంగాన్ నగరం నుంచి బయల్దేరాడు .బౌద్ధ నియమాను సారం వర్షా కాలమ్ లో ప్రయాణం చేయరు .”లాంగు ‘రాజ్యం దాటి ,;;యాంగ్ ”పర్వతాలు దాటి ,;;చాంగ్ యే ”రాష్ట్రం చేరారు .ఆ ప్రాంతం అంతా అరాచకం గా వుంది .బాటసారులకు ప్రయాణం కష్టమైంది .దొంగలు ,దురాచారులతో ప్రాణ భీతి వుండేది .రక్షణ లేదు .రాజు మాత్రం దయా హృదయుడు .ఈ యాత్రికులను ఆదరించి ,ఆశ్రయం కల్పించాడు .సౌకర్యాలుకల్పించాడు . .అక్కడి నుంచి చైనా పశ్చిమ సరిహద్దు లోని ”తన్వాంగు ”పట్టణం చేరి ఒక నెల వున్నారు .రెండు జట్లు గా విడిపోయి ,ప్రయాణం సాగించారు .పాహియాన్ మరి నల్గురు కలిసి ఒక జట్టు గా వున్నారు .కొంత దూరం చేరే సరికి భయంకర మైన ”గోబీ ఎడారి ”కన్పించింది .

                                                 గోబీ ఎడారి
         గోబీ అంటే ఇసుక  సముద్రమే .మార్గం వుండదు .పిశాచాలకు ఆయువు పట్టు గా భయ పడుతారు .భయంకరమైన వేడి గాల్పులు వీస్తాయి .దీని బారిన పడితే బతికి బట్ట కట్టటం అసంభవమే .ప్రాణి కోటి ఎక్కడా కన్పించదు .పక్షులు ,జంతువులూ కూడా వుండవు .క్రిమి కీట కాలు లేవు .నిర్మానుష్యం .మంగోలియా రాజ్యం నుంచి టర్కీ వరకు 200 మైళ్ళ పొడవున వ్యాపించిన ఎడారి ఇది .ఒక సారి ఇసుక తుఫాను వచ్చి ,ఒక రోజూ లోనే 120  మహా నగ రాలు ఇసుకలో పూడ్చి పెట్టుకు పోయాయి .ఎక్కడ చూసినాఆస్తి  పంజరాలే కన్పిస్తాయి .”లేహో ”రాజు ఈ ఎడారి దాట టానికి తగిన ప్రయాణ సాధనాలను సమ కూర్చి పెట్టాడు .
                 అక్కడి నుంచి ”,పెన్షన్ ”రాష్ట్రం చేరారు .అదంతా కటిక రాయి మయం .నిస్సార మైన నేల .జనం అంతా మోటు బట్టలు కట్టే వారు .కొందరు సన్నని రోమ వస్త్రాలు ధరించే వారు .ఇక్కడ 4000 మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారట .వీరంతా ”హీన యాన ”మతస్తులు .మళ్ళీ ప్రయాణం సాగించి ,అనేక ప్రదేశాలు దాటుకొంటూ ,వెళ్ళారు .కర్ణ కఠోర మైన అడవి భాష మాట్లాడే వారు కన్పించారు .సంసారాలను వదిలిన సన్యాసులు మాత్రం” హైందవ ” గ్రంధాలను  చదువుతూ ,హిందూ భాషను మాట్లాడే వారు కన్పించారు .తర్వాత ”వూయి ”రాజ్యం చేరారు .అది బౌద్ధ రాజ్యం .హీన యాన బౌద్ధం ఇక్కడ వుంది .వీరంతా గ్రంధాలలో చెప్పి నట్లు జీవితాన్ని గడుపు తూ వుండే వారు .నియమ ,నిష్టలు ఎక్కువ .వీరి నియమ నిష్టలతో తాము సరి తూగ లేము అని పాహియాన్ అనుకొన్నాడు .రెండు నెలలు ఇక్కడే మకాం.
               వూయి ప్రజలు చాలా క్రూరులు .అతిధి మర్యాద అసలు తెలియని వాళ్ళు .ఆశాభంగం చెందారు మన యాత్రికులు .విసుగు చెందిన పాహియాన్ అనుచరులు చేయన్ ,యూకిన్ ,హ్యూవై వెనక్కి తిరిగి వెళ్లి పోయారు .మిగిలిన వారితో ,రాజు గారి దయతో ముందుకు సాగాడు .జన శూన్య ప్రాంతం .కొండ వాగులు .దాటటం చాలా కష్టం .ముప్ఫై రోజులు అలాగే ప్రయాణించి ”ఖోటం ‘రాజ్యం చేరారు .దీన్నే ”కుస్తాన్ ”అంటారు .ఇది గోబీ ఎడారికి నైరుతి భాగం లో వుంది .
                                                         కుస్తాన్ 
                    ఈ రాజ్యం సౌఖ్య ప్రదం గా వుంది .జనం బాగా వున్నారు .సౌభాగ్యం తో విలసిల్లు తోంది .ఇష్వర్యం తో ప్రజలు ఆనందం గా వున్నారు .మహాయాన బౌద్ధం అనుసరిస్తున్నారు ”.భజనలు” చేసే వారట ప్రజలు .నృత్య ,గానాలతో వినోదించే వారు .చాలా మంది భిక్షువులున్నా రిక్కడ .సన్యాసులకు భోజనాలు పెట్టె ధర్మ సత్రాలున్నాయి .ఇళ్లు దూర దూరంగా  వున్నాయి ..ప్రతి ఇంటి ముందు చిన్న బౌద్ధ స్తూపాలున్నాయి .కనిష్ట ఎత్తు ఇరవై అడుగులు .మఠం లో విశ్రాంతి గదులున్నాయి .అతిధి పూజ బాగా చేసే వారు .ఇక్కడి ”గోమతి ”అనే సంఘారామం కు మంచి పేరు వుంది .3000 మంది  శ్రమణ కులు  వుండే వారు .వీరంతా నేటి హాస్టలు విద్యార్ధులు ఎలా నియమాలు పాటిస్తారో అలా పాటించే వారు .ఘంట కొత్త గానే భోజనాకు వెళ్తారు .నిశ్శబ్దాన్ని పాటిస్తారు .భోజనం చేసే టప్పుడు మాట్లాడారు .గంభీరత ,ప్రశాంతత ఉండేవి .కమండలం .తావళం శబ్దం కూడా విని పించేది కాదట .చేత్తో సంజ్ఞలు చేసు కోవటమే .
 అక్కడి నుండి”యూనీ రాజ్యం చేరారు .వర్ష రుతువు  ను అక్కడే గడిపారు .తర్వాత ”కీచా”రాజ్యం చేరారు .దీన్నే ”కుర్గాన్ ” అంటారు .
                                                       కీచా రాజ్యం 
               కీచా రాజ్యపు రాజు ”పంచమ పరిషన్మహా సభ ”జరుపుతున్నాడు .బౌద్ధ భిక్షువులంతా చేరారు .జెండాలు ,రంగు వస్త్రాలతో వీధులన్నీ అలంకరించారు .చాపల మీద సభా సదులు కూర్చొన్నారు .రాజు ,పరివారం బుద్ధ భగ వానుని పూజించారు .ప్రతి చైత్ర ,వైశాఖాల్లో ప్రారంభమై ,మూడు నెలలు ఈ వుత్చవాలు జరుగు తాయి .సభ అయి పోగానే భిక్షువులకు పారితోషికాలు ఇచ్చి సత్కరిస్తారు .ఇక్కడ గోదుమలె పంట .కొండల రాజ్యం .సంవత్చ ఆనికి సరిపడా భిక్షను ,భిక్షులు తీసుకొని వెడతారు .వెంటనే మంచు కురుస్తుంది  అందుకని . తమ వార్శికాలను తీసుకొనే ముందే పంటలు బాగా పండాలని,ఆశీర్వ డించ వలసినది గా రాజు శ్రమనకుల్ని వేడు కొంటాడు .ఇక్కడే బుద్ధుని ”నిస్టీవన పాత్ర (ఉమ్మి వేసుకొనే పాత్ర )వుంది .బుద్ధుని ”దంతం ”(పన్ను )కూడా ఇక్కడ వుంది .దీనిపై స్తూపం నిర్మించారు ”.హీన యాన మతం” ఆచరణ లో వుంది .అనేక ఆచారాలు జనం పాటిస్తారు .ఏటా పండిన పంటలో కొంత భాగం భిక్షువులకు కేటా ఇస్తారు .
             ఆనియన్ పర్వతాలలో వున్న ఈ రాజ్యాన్ని దాటి ముప్ఫై రోజులు ప్రయాణించి ,మన ఉత్తర భారతం చేరారు పాహియాన్ బృందం ఇక్కడ విష సర్పాలు విపరీతం .వీటిని రేపితే విష వాయువులను కక్కు తాయి .మంచు తుఫానులు సృస్టిస్తాయి .వీటి బారిన పడితే ప్రాణం తో బయట పడటం కష్టమే .దీన్ని ”మంచుకొండ ”అంటారు .అకడి నుంచి ,”తొలి”రాజ్యం చేరారు ఇది ఉత్తర భరత సరిహద్దు లోని రాజ్యం ‘దీనికి ”దారద  ”రాజ్యం అని పేరు ..
                 15 రోజుల ప్రయాణం తర్వాత నురగలు కక్కే ప్రవాహం ,నిలువైన పర్వతాలు గల ”సింధు;;నది చేరారు .అక్కడి నుంచి అడుగు ముందుకు వేయటం అతి కష్టం .ఈ పర్వ తాల నుంచి కిందికి దిగి ,నదిని చేరా టానికి ”గండ శిలలను ”మలిచి ,పొడవైన నిచ్చెన లాంటి మార్గం ఏర్పాటు చేయ బడి వుండేది .అలాంటి నిచ్చెనలు 700 పైగా ఉండేవి నిచ్చెన అడుగు భాగం నుంచి అవతలి ఒడ్డుకు చేరా టానికి మోకుల (తాళ్ళ ) వంతెన వుండేది .అక్కడ సింధు నది 80 బార్ల వెడల్పు చాలా కష్ట పది సింధు నది దాటారు .”వూశాంగ్” ”అనే ఉత్తర భారత దేశ రాజ్యం చేరారు .దీన్నే  ప్రస్తుతం ‘swatt ”అంటారు .అనేక ఉద్యాన వనాలున్నాయి అందుకే ఉద్యాన నగరం ”వూశాంగ్ ”అని పిలిచే వారు .మధ్య భారత భాషను ఇక్కడి ప్రజలు మాట్లాడే వారు .ఆహారం వేషదారనా అదే.బౌద్ధ సన్యాసులుందే ప్రాంతాన్ని ”సంఘా రామాలు ”అంటారు .ఇక్కడ అవి 500 పైగా వున్నాయి .”హీన యాన ”మతావ లంబులే వీరంతా.ఈ రాజ్యం లోనే బుద్ధుడు తన ”పాద ముద్ర ”ను వదిలాడు .ఇప్పటికీ అవి కన్పిస్తాయి .ఆయన కాషాయ వస్త్రాలు ఆర వేసుకొన్న చోటు ఇక్కడే ఉంది .ఇక్కడే ఒక పాముకు దివ్య రూపం ఇచ్చాడని జాతక కధ .అక్కడి నుంచి ”నాగర ”రాజ్యం చేరారు .దీన్నే ”నాగ విహార ”అంటారు .కాబూల్ నదికి దక్షిణ ఒడ్డున గల రాజ్యం .నేటి జలాలాబాద్ కు దగ్గర లో వుంటుంది .ఇక్కడే బుద్ధుని ”దేహచ్చాయ ”వుంది .అక్కడి నుంచి మన యాత్రికులు ”సుహోటో ”చేరారు./
                                     సశేషం
                                             మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అనువాదాలు, రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.