పాహియాన్ సఫల యాత్ర –4 బుద్ధుని స్వర్గా రోహాణం

పాహియాన్ సఫల యాత్ర –4

                                        బుద్ధుని స్వర్గా రోహాణం

మధుర నుంచి పాహియాన్ బృందం ”సంకాస్య ”రాజ్యం చేరారు .ఇది కనోజ్ కు వాయువ్యం గా వుంది .దీన్నే ”సమకాశ ”అనీ అంటారు .బుద్ధుడు స్వర్గం లో తల్లి మాయా దేవి కి బౌద్ధ ధర్మం బోధించి ,మళ్ళీ వచ్చిన ప్రదేశ మిది .ఇక్కడ సుమారు 1000  మంది సన్యాసులున్నారు .మహా యాన ,హీన యానాలు రెండు ఇక్కడ వున్నాయి .ఇక్కడే ”శ్వేత కర్ణి ”అనే భూత సర్పం వుంది .ఇది హాని చేయదు .సకాలం లో వర్షాలు కురిపిస్తుందని నమ్మే వారు .శుభ దాయిని గాభావించే వారు.దీనికి ఒక విహారం కట్టించి ,పడుకోవటానికి రత్న కంబలం ఏర్పాటు చేశారు . మంత్ర పూత మైన ఆహారం అందించే వారు .దానితో కలిసి భోజనం చేసే వారు .వర్షా కాలమ్ తర్వాత అది తన శరీరాన్ని కుదింప జేసు కోని శూక్ష్మ రూపం పొందేది .అప్పుడు” మీగడ తో నింపిన రాగి కలశం ” లో ఉంచే వారు .ఆ కలశాన్ని ,ప్రతి భిక్షువు వద్దకు తీసు కోని వెళ్లి చూపించే వారు .ఆసనం దగ్గరకు రాగానే తన శిరస్సు ఎత్తి ,ఆశీర్వ దించేది .మళ్ళీ ముడుచు కోని పోయేది .ఈ విధం గా ప్రతి సంవత్చరం ,ఈ భూత సర్పా కారాన్ని పొంది ,దర్శించి ,తరించి ,పోతూ వుండేది .
ఈ రాజ్యం లో పంటలు బాగా పండేవి .జనం సుఖం గా జీవించే వారు .అతిధి సేవ బాగా చేసే వారు .దీని దగ్గర లో ”నిదాన బుద్ధుడు ”మరణించిన చోటు వుంది .ఇక్కడే అగ్ని సంస్కారం చేశారు .అది బండి చక్రం అంతపరిమాణం   లో వుంది .ఆ భాగం లో వర్షా కాలమ్ లో గడ్డి కూడా మొలవదు .ఆయన కాషాయ బట్టలు ఆర వేసుకున్న చోటు లో కూడా పచ్చ గడ్డి మొలవదు ..

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.


కన్యా కుబ్జం
వర్షా కాలమ్ తర్వాత ,ఆగ్నేయం గా బయల్దేరి ,”కన్యా కుబ్జం ”చేరారు .దీన్నే కుబ్జ కన్యల నగరం అని కూడా అంటారు .బ్రహ్మ దత్తుని వంద మంది పుత్రికలు ,”మహా వ్రుక్షుడు ”అనే తాపసి ని వివాహం చేసు కో కుండా తిరస్కరించటం చేత ,ఆయన కోపించి కుబ్జలు గా మారమని వారిని శపించాడట .అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు .ఇక్కడ బుద్ధుడు శిష్యులకు బౌద్ధ ధర్మాలు బోధించాడు .


అక్కడ నుంచి ,”విశాఖ ”చేరారు .దీన్నే అయోధ్య అని కూడా అంటారు .”సాకేతు ” దీని రాజ దాని .దీనికి దగ్గర లో బుద్ధుడు ”దంత ధావనం (పండ్లు తోముకోవటం )చేసిన చోటు వుంది .ఆ పుల్లను నేలలో గుచ్చితే ,చిగిర్చి చెట్టు అయింది .ఎన్ని సార్లు నరికినా ,పెకలించినా చావ లేదు .ఇక్కడే ;”బుద్ధ చతుష్టయం ”సంభాషించిన ప్రదేశం వుంది .విహారమూ వుంది .అక్కడి నుంచి ఎనిమిది యోజనాల దూరం లో వున్న ”శ్రావస్తి ”చేరారు .ఇదే కోసల దేశ రాజ దాని .అతి ప్రాచీన నగరం .ప్రసేన జిత్ పాలించిన రాజ్యం .జనం లేక శూన్యం గా వుంది .200 కుటుంబాలు మాత్రమే వున్నాయి .మహా ప్రజా పతి చేత నిర్మించ బడిన స్తూపం వుంది .’అంగుళి మాల్యుడు ”  ”అర్హతు డైన చోటు కూడా ఇక్కడే వుంది .అయితే పాడు బడ్డ నూతులు తప్ప అప్పుడు వాళ్లకు అక్కడేమీ కంపించ లేదు .పూర్వం ఇక్కడ స్తూపాలు చాలా ఉండేవట .బ్రాహ్మణులు వీటిని అన్నిటిని పడ కొట్టారు అని పాహియాన్ తెలియ జేశాడు .
గౌతమ బుద్ధుని కన్ను లారా చూసే భాగ్యం కలగ లేదని పాహియాన్ బృందం అనేక సార్లు బాధ పడింది .బౌద్ధ భిక్షువులు వీరిని సమీ పించి ,వచ్చిన విషయం ఏమిటో అడిగి ,తెలుసు కోని ,చైనా నుంచి వచ్చారని విని మురిసి పోయారట .బుద్ధుడు ఇతర మత పెద్ద లతో వాదించి గెలిచిన చోట 60 అడుగుల ఎత్తైన  విహారం వుంది .అక్కడ కూర్చున్న భంగిమ లో బుద్ధుని విగ్రహం ముచ్చట గా ఉంది .
దీనికి ఎదురు గా ,బ్రాహ్మణ మతస్తులు కట్టిన ఒక దేవాలయం వుంది .60 అడుగుల ఎత్తు పోటా పోటీ గా కట్టా రన్న మాట .దీన్ని ”చాయాచ్చాదిత దేవాలయం ”అంటారు .సూర్యుడు పశ్చి మాన వుంటే బుద్ధ జాతక విహార చాయ దీనిపై బడి కప్పి వేస్తుంది .తూర్పున సూర్యుడున్నప్పుడు ,ఈ దేవాలయం నీడ బుద్ధ విహారం పై పడదు .బ్రాహ్మణ దేవాలయం లో వెలిగిన ధూప దీపాలు (రాత్రి పూట )తెల్ల వారే సరికి విహారం లో కన్పించేవి .ఇది బౌద్ధ భిక్షువులు చేసిన పని అనుకొనే వారు .కాపలాలు కాశారు ,పరీక్షలు చేశారు .దేవతలే దిగి వచ్చి ,విహారానికి ప్రదక్షిణ చేసి ,ఆ దీపాల తో బుద్ధుని సేవించి ,హారతులిచ్చి ,అదృశ్యమాయే వారు ..బ్రాహ్మణులు దీన్ని కళ్ళా రా చూసి ఆశ్చర్య పోయారని పాహియాన్ లిఖించాడు .వారంతా బౌద్ధ భిక్షువులు అయారు .98 మఠాలు ఉండేవి .ఇప్పుడు ఒక్కటి కూడా లేదు ..


కపిల వస్తు
శ్రావస్తి నుంచి” వారణాసి   చేరారు .కాశ్యప బుద్ధుడు తండ్రి శుద్దోదన మహా రాజు ను కలిసిన చోటు ఇదే .శరీరం విడిచిన చోటు ,క్రమ చండ బుద్ధుడు జన్మిచిన చోట్లు చూశారు .వాటిపైస్తూపాలు  నిర్మించి వున్నాయి .అక్కడి నుంచి ”కపిల వస్తు   నగరం” ‘చేరారు .ఇది బుద్ధుని నగరం ,.పాడు పడి శిధిలమై పోయి వుంది .నిర్మానుష్య మైన ఎడారి అని పించింది వారికి .మన సు లో తీవ్ర బాధ పడ్డారు .అంతటి మహా నగరం  చివరికి ఈ దీన స్తితి లో వుండటం వారిని కలచి వేసింది .కొద్ది మంది భిక్షువులు ,12 నిరు పేద కుటుంబాల మధ్య వున్నారు .మనుష్య సంచారం చాలా తక్కువ .శుద్దోదన మహారాజు రాజ ప్రాసాదం శిధిలమై చరిత్ర సాక్షం గా మాత్రం ఉంది .కొన్ని విగ్రహాలు మాత్రం కన్పించాయి .బుద్ధుడు తిరిగిన ప్రతి చోటా స్తూపం వుంది .మాయా దేవి కల గన్న   చోటు ,బుద్ధుడు రోగ పీడితుడైన చోటు ,అశ్వాన్ని వెనక్కి పంపిన చోటు ,జ్ఞానోదయ పొందిన చోటు అన్నీ తిరిగి చూశారు .భక్తీ శ్రద్ధ లతో పులకించి పోయారు జన్మ . చరితార్ధ మైనదని భావించారు .మనసు లో విచారం నిండా వుంది .అక్కడి నుంచి ”లుంబిని వనం ”వెళ్లి చూశారు .అంతా నిర్మానుష్యం వాళ్ళను బాధించింది జన శూన్యం ,నిర్జరా రణ్యం .సింహ ,శార్దూలాలతో నిండి వుంది వనం .ప్రయాణం చేయటం కష్టమని పించింది .
అక్కడి నుంచి తూర్పుకు వెళ్ళారు .రధ సారధి” చెన్నుని ”,బుద్ధుడు ఇంటికి తిరిగి పంపిన ప్రదేశం వుంది దానిపై స్తూపం కట్ట బడి వుంది .హిరణ్య వతీ తీరం లో బుద్ధుడు ఉత్తర శిరస్సు గా నిర్యాణం చెందిన చోటు దర్శించారు .బుద్ధుని అస్తికలు ఎనిమిది భాగాలు గా తీసుకొన్న ప్రదేశం చూశారు .అక్కడా స్తూపాలు నిర్మించారు .సన్యాసికుటుంబాలు   మాత్రమే వున్నాయి .నర సంచారం లేదు .అక్కడి నుంచి ”లిచ్చవి ”చేరారు .అక్కడే బుద్ధుని తో పాటు నిర్వాణం చెండా టానికి ఆ పుర ప్రజలు వచ్చారు .వారిని వారించాడు కరుణా మయుడైన గౌతమ బుద్ధుడు .వారు ఆయన మాట విన లేదు .వాళ్ల అనురాగానికి ,భక్తికీ మెచ్చుకొని వారికి ”కక్ష పాల”ను ఇచ్చి పంపించే శాడు .అక్కడ శిలా స్తంభం వుంది .

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.


సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -12 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.