పాహియాన్ సఫల యాత్ర –5

పాహియాన్ సఫల యాత్ర –5

                                             వైశాలి

—        పాహియాన్ బృందం ”వైశాలీ ”నగరం చేరారు .ఉత్త రాణ వన వాటిక వుంది .బుద్ధుడున్న చోట రెండవ స్తూల విహారం వుంది .ఆనందుని అర్ధ శరీరం పై ఉన్నత  స్తూపం కట్టారు .బౌద్ధ భిక్షుకి ”ఆమ్ర పాలి ”కి గౌరవం గా కట్టిన స్తూపం చూశారు .ఆమె బుద్ధునికి దానం గా ఇచ్చిన మామిడి తోట ఇక్కడే వుంది .బుద్ధుడు వైశాలీ నగరాన్ని విడిచి వెళ్ళే టప్పుడు ,”నేను ఈ లోకం లో చివరి సారిగా చేయ వలసిన పని ఇక్కడే చేశాను ”అన్నాడు .అక్కడ ఒక స్తూపం కట్టారు .దీనికి పశ్చిమం లో ”శస్త్ర పరి వర్జిత స్తూపం” వుంది .ఇక్కడే బుద్ధుడు ఆనండునితో ,”నేను మూడు నెలల్లో ఈ శరీరాన్ని విడిచి పెడతాను ”అని చెపాడు .ఇక్క్కడా ఆ గుర్తుగా స్తూపం వుంది .దీనికి దగ్గర లో ”ద్వితీయ బౌద్ధ మహా సభ ”జరిగిన ప్రదేశం వుంది


”పంచ వేణీ ”సంగమ తీర్ధం లో స్నానం చేసారు .ఆనందుడు ఇక్కడే ”అగ్ని సమాధి ”అయాడు .తన దేహాన్ని రెండు ఖండాలు చేసుకొన్నాడు .ఈ రెంటిపైనా స్తూపాలు నిర్మించిభక్తీ ని   చాటుకొన్నారు బౌద్ధావ లంబులు .


పాటలీ పుత్రం
వైశాలి కి దక్షిణం లో వున్న ”పాటలీ పుత్రం ”చేరారు .ఇదే ఆశోక చక్ర వర్తి పరి పాలించిన నగరం .అశోకుడు ,పిశాచాలను ఆహ్వా నించి ,దివ్య సౌధం కట్టాడు .మానవులకు అలవి కాని శిల్ప కళా వైభవం ఇక్కడ వుంది పాహియాన్ కాలానికీ ,ఆశిల్ప వైభవం చెక్కు చెదర లేదు .అశోకుని సోదరుడు అర్హత్వం పొందిన చోటు దీనికి దగ్గరలో  వుంది  .పూర్వం ”రాదా స్వామి ”అనే బ్రాహ్మణుడు  మహా యాన ,బౌద్ధ మతం తీసు కొన్నాడు .ఆయన మహా విజ్ఞాని .సుగుణ సంపన్నుడు .దీర్ఘ దర్శి .ఆయన ప్రేరణ తో చాలా మంది బౌద్ధ భిక్షువులు అయారు .రాజు ఆయన్ను చాలా గౌర వంగా చూసే వాడు .రాజు అమిత  వత్చల్యం తో   ,ఆయన చేతిని  తాక గానే ,ఈ బ్రాహ్మణుడు చెయ్యి కడుక్కొనే వాడు .అందరికి ఆయనంటే అమిత గౌరవం .మతాంతర బౌద్ధులు ,ఈయన్ని చూసి బౌద్దుల్ని పీడించే వారు కాదు .


అశోకుడు ఇక్కడే విశాల మైన ,రమణీయ మైన సంఘారామం కట్టించాడు .మాహాయానులు ఇందులో వుండే వారు .దీని కి దగ్గరే హీన యాన మతం కూడా వుండేది .ఇందులో 700 మంది వుండే వారు .అందరు ,వినయం విద్య ,గాంభీర్యం గల వారే .మంచి శిక్షణ వుండేది .పాథ శాలలు బాగా నిర్వ హించే వారు .వేదాంత రహశ్యాలు తెలుసు కోవ టానికి చాలా ప్రాంతాల నుండి విద్యార్ధులు వచ్చే వారు .”మంజు శ్రీ ”అనే ఆయన్ను అందరు గౌరవించే వారు .


మధ్య భారతం లో ని రాజ్యాలలో ఇది చాలా విశాల మైంది .ప్రజలు బాగా ధన వంతులు .కారుణ్య హృదయులు .దానం ,ధర్మం ఎక్కువ గా చేసే వారు .ప్రతి వైశాఖ అష్టమి రోజూ ”విగ్రహ మహోత్చావం ”జరిపే  వారు .చాలా కోలాహలం గా జరిపే  వారు . రధాల తో   బుద్ధుని ఊరేగించే వారు .అనేక ఆకారాల్లో ,అందమైన ,అలంకరణ ల తో రధాలు ముచ్చ ట గా ఉండేవి .విపరీతం గా జనం రదోత్చ వానికి హాజరు ఆయె వారు . .పుష్పాలంకరణ బాగా చేసే వారు .జనం తొక్కి స లాట ఎక్కువే . గానమూ ,వాద్య విశేషాలు ఉండేవి .అలాంటి రదోత్చ వాలను ఆ నాడు దేశ మంతా నిర్వ హించే వారు ..


ప్రతి పట్టణం లోను  ప్రముఖులు ,దాతలు ,విద్యాలయాలను కట్టించే  వారు .ఉచితం గా వైద్య సేవ చేసే వారు .నిరుపేదల ,దీనుల పాలిటి కల్ప తరువు లు గా ఉండేవి .అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే వారు .అన్న ,పానీయాలు ఉచితమే .ఇక్కడ ఒక స్తూపం వుంది ‘.దాని పై ”అశోక చక్ర వర్తి జంబూ ద్వీపాన్ని అంతా ,బౌద్ధ భిక్షువులకు ధార పోసి అనేక ధన రాశులను ఇచ్చి ,మరల వాటిని ప్రతి గ్రహించాడు   ”అని రాసి వుంది .దీనికి దగ్గరలో అశోకుడు ,నిర్మించిన ”నీలి ”నగరం వుంది .ఇక్కడొక 30 అడుగుల శిలా స్తంభం వుంది .దాని పై భాగాన సింహ విగ్రహం వుంది .
రాజా గృహం 


పాటలీ పుత్రానికి ఆగ్నేయం గా ”ఇంద్ర శీల గృహ ”చేరారు మన యాత్రిక బృందం వారు .ఇంద్ర లోకం నుంచి వచ్చిన  ‘ పంచ ముఖుడు ”వీణా పై అద్భుత గానం చేయ గా ,బుద్ధుడు అమితానందాన్ని పొందాడు .దీనికి యోజన దూరం లో ”నలంద ”పట్టణం వుంది .దీనికి దగ్గరే మగధ రాజుల రాజ  దాని ”రాజా గృహం ”వుంది .దీన్ని అజాత శత్రువు నిర్మించాడు .ఇదే బింబిసారుని రాజధాని కూడా .దీని చుట్టూ పర్వ తాలున్నాయి .దీనికే ”రాజ ఘర్ ”అని పేరు ఆ శిధిలాలు ఈ నాటికీ కన్పిస్తాయి .బుద్ధునికి హాని కల్గించాలని ,అజాత శత్రువు గుర్రానికి ” కల్లు”  పోయించి ,పంపిన ప్రదేశం కూడా ఇక్కడే వుంది .సుందర విహారం కట్టారు .ఇక్కడి నుంచి ,”గృధ్ర కూట   శైలం ”చేరారు .ఇక్కడే బుద్ధుడు తపస్సు చేశాడు .ఆనందుడు తపస్సు చేస్తుంటే ,ఇంద్రుడు గృద్ర (గద్ద )’రూపం లో చెడ గొట్ట టానికి వచ్చిన ప్రదేశం .బుద్ధుని దయ వల్ల ఆనందుని తపస్సుకు అంత రాయం కలగ   లేదు .బుద్ధుని పై దేవ దత్తుడు ,రాయి విసరిన ప్రదేశం ఇక్కడే  వుంది .అది ఆయన పాదం మీద పడింది .16 అడుగుల ఎత్తు 34   అడుగుల కైవారం వున్న రాయిని దేవ దత్తుడు విసిరాడు .పాహియాన్ ఈ ప్రదేశాలన్నీ భక్తీ శ్రద్ధాల తో   దర్శించి పరవశించాడు .విచారం తో ”బుద్ధుడు సురాన్గమ సూత్రాలను ఇక్కడే బోధించాడు ”.ఆ కాలమ్ లో జన్మించ   లేక పోయాను కదా !ఆయన నడ యాడిన పవిత్ర ప్రదేశాలను  మాత్రమే చూచే అదృష్టమే మిగిలింది ఇదే ఏ జీవితానికి మహా నందం ” అను కొన్నాడు .  .కన్నీరు ధారాపాతం   గా  కార్చాడు .ఆ శిలా గహ్వర ప్రాంతం లో కూచుని ”సురాన్గమ సూత్రాల” ను భక్తీ తో పఠించి ,మనశ్శాంతి పొందాడు .ఆ రాత్రి అక్కడే గడి పాడు .
గయ
పశ్చిమంగా ప్రయాణం చేసి ,”గయా ”క్షేత్రాన్ని చేరాడు .అప్పటికే శిధిల మై పోయింది ఆ నగరం .దీనికి దగ్గరలో ,బుద్ధుడు ,ఆరు సంవత్చ రాలు కఠోర తపస్సు చేసిన పవిత్ర వాటిక వుంది.దీనికి దగ్గరలో ,ఒక తటాకం  వుంది .ఒక సారి దానిలో మునిగి పో బోయాడు బుద్ధుడు .ఒక దేవత ప్రత్యక్ష మై ,ఒడ్డున గల చెట్టు కొమ్మను ,వంచగా ,దాన్ని ,పట్టు కోని ఒడ్డుకు చేరాడు .దీనికి దగ్గరలోనే ,పల్లె బాలికలు ,ఆయనకు పరవాన్నం పెట్టిన ప్రదేశం వుంది .దీనికి సమీపాన ,పర్వత బిలం వుంది .ఇక్కడ పశ్చిమ అభి ముఖం గా    ,కూర్చొని ,”నాకు బుద్ధత్వం వస్తే ,-ఆ అద్భుత సంభవం ఇక్కడే రుజువు కావాలి .”అను కున్నాడు బుద్ధ దేవుడు .


ఆ గుహ గోడల పై మూడు అడుగుల పరిమాణం లో కాంతి పుంజాలను వెద జల్లే ,ఆయన శరీర ఛాయ కన్పించింది .ఈ నాటికీ ,అది తేజో వంతం గా ,అక్కడ దర్శన మిస్తుంది .ఆ సమయం లో ఒక అశరీర వాణి విన్పించింది ”.బుద్ధత్వం పొందే చోటు ఇది కాదు .నైరుతి దిశ గా ,అర యోజనం వెళ్ళు .అక్కడ ఖర్జూర వృక్షం వద్ద సిద్ధి లభిస్తుంది ”’దేవతలు ఆయన చేతిలో ”పిడికెడు దర్భలు ”వుంచి ,అదృశ్య మైనారు ..ఈ ప్రదేశా లలో అద్భుత స్తూపాలు నిర్మించారు .జ్ఞాన పరి పూర్ణుడు అయిన తర్వాత ,”విముక్తి ”పొందిన చోటు ,ఖర్జూర చెట్టు కింద ,ఏడు రోజులు పచార్లు చేసిన చోట దేవతలు ,సుందర మందిరంకట్టి ,ఏడు రోజులు పూజ చేసిన చోటు ,”మహా మచి లిండడు ”అనే పాము ,బుద్ధుని పై ,సూర్య కిరణాలు పడ కుండా ,తన శరీ రాన్ని ఆయన చుట్టూ ,చట్టి ”,పడగ నీడ ”పట్టిన ప్రదేశం ,బ్రహ్మ దేవునికి ,బౌద్ధ సారం తెల్పిన చోటు ,దేవతలు ”కక్ష పాల ”ఇచ్చిన చోటు ,అన్నీ చూసి ఆనంద పరవశం చెందారు .ఈ అన్ని చోట్ల స్తూపాలు ఘనం గా కట్టారు .చూసి తరించారు పాహియాను ,ఆతని అనుచరులు .జ్ఞానోదయం అయిన చోట మూడు బౌద్ధ మతాలు వున్నాయి .భిక్షువులు వున్నారు .ప్రజలూ ఎక్కువ గా కన్పించారు .కావలసిన సహాయ ,సహ కారాలు అంద జేస్తుండె వారు .బుద్ధుని కాలమ్ లో నియమాలు ఎలా పాటించే వారో ,పాహియాన్ సందర్శించి కాలమ్ లో అలాగే పాటించారు .అప్పుడే కాదు ఇవాల్టికీ అల్లానే పాటిస్తూన్డటం  మరీ విశేషం .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -01 -12 -11 .

మరి కొన్ని క్రింద

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

1 Response to పాహియాన్ సఫల యాత్ర –5

  1. M.V.Ramanarao అంటున్నారు:

    గుప్తులకాలంలో ఫాహియాన్ వచ్చాడు.అప్పటికే బౌద్ధ మతం క్షీణించ నారంభించింది.వైదిక మతం వి జృంభించుతున్నది.(4,5,శతాబ్దులు )హుయెన్సాంగ్ హర్షుడి కాలంలో వచ్చాడు.అప్పటికి బౌద్ధం ఇంకా క్షీణించింది.ఈ విషయాలు వాళ్ళ రచనల ద్వారా తెలుస్తున్నవి.మీ ఫొటోలు బాగున్నవి.informativeగా వున్నవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.