శివరామ కదామృతం
— శతావ దాని స్వర్గీయ వేలూరి శివ రామ శాస్త్రి గారు విద్వత్ కవి పండితులు .ఆంద్ర ,గీర్వాణాలను కరతలామలకం చేసుకొన్నవిద్వత్ వరేన్యులు . .పాశ్చాత్య సాహిత్యాన్ని పుష్కలం గా అవలోడనం చేసిన సాహితీ మూర్తి .వేద ,వేదాంతాల లోతులను తరచిన సవ్య సాచి .తత్వ శాస్త్ర మర్మజ్ఞులు .మంత్ర ,తంత్ర శాస్త్రాలను మదించిన ధీ వరేన్యులు .ఆధునిక విజ్ఞాన శాస్త్రపు పారమేరిగిన వారు .ఖగోళ ,జ్యోతిస్ష్యాలలో ఉద్దండులు .మహాకవులై అద్భుత కవితా గానం తో ఆంద్ర దేశాన్ని అలరించిన వారు .తిరుపతి కవుల ఆంతరంగిక శిష్య వరే ణ్యులు .గురు ప్రశంశ ను పొందిన శతావ దాని శివ రామావ దాని ..”శేషం శిష్యేణ పూర ఎత్ ”గా విఖ్యాతు లైన వారు .అవధాన సరస్వతిగా గణన కెక్కిన వారు .”ఇంతటి వాడు మాకు శిష్యుడు గా లభించటం వల్ల మేమిక అవధానాలు చేయ నవసరం లేదు ”అని అని పించుకొన్న విదుషి .వ్యాకరణ శాస్త్ర పారంగతులు .మహా విద్వాంసులు .జ్ఞాన తపస్వి వారికి రాని భాష ,తెలియని విషయం లేదు .పతంజలి యోగ శాస్త్రాన్నిఅధ్యయనం చేసి ”శరీరాన్ని గాలిలో అయిదడుగుల వరకు పైకి లేపే” వారని స్వయం గా చూసిన వారు చెప్పే వారు .ప్రాచీన విజ్ఞానాన్ని ,ఆధునిక పరిభాష లో చెప్పా లన్న తపన వున్న మేధావి .జన్మ సంస్కారం తో కొంత ,సాధన వల్ల అశేష జ్ఞానాన్ని పొందిన సాహితీ కృషీ వలుడు .కృష్ణా జిల్లా లో తేలప్రోలు కు దగ్గర చిరివాడ అగ్రహార నివాసి .అరవింద దర్శనాన్ని వంట బట్టించుకొని వ్యాపింప జేసిన శాస్త్ర పారంగతులు .ఆధినిక విద్యా సాగరులు .ఇదంతా ఒక పార్శ్వం .
శ్రీ శివ రామ శాస్త్రి తెలుగు కధా ప్రపంచం లో దివ్య దీదితులను వెలయించారు .అచ్చ తెనుగు కధ రచయిత లలో వేళ్ళ మీద లెక్కింప దగిన వారే .కధానిక ను ఆయన ”ఉప కధ ”అని పిల్చారు .మొత్తం మీద 45 కధలు మాత్రమే రాసినా ,ఆణి ముత్యాలు అనిపించే కధలే అవి .వాసి ,వన్నె వారి కధ కు ఆభరణాలు .జాతి రత్నాలు .ప్రసిద్ధ కవి పండితుడు ,విమర్శకుడు స్వర్గీయ ఏం.వి.ఎల్.నర సింహారావు ఒక సారెప్పుడో బస్ ప్రయాణం లో కలిసి నప్పుడు ”శ్రీ శాస్త్రి గారి కధలకు ప్రత్యేకత వుంది .ఆయన రాసిన వన్నీ అచ్చు కాలేదు .అవన్నీ వస్తే ప్రపంచ కధా సాహిత్యం లో శాస్త్రి గారి కధానికలు ఉన్నత స్తానం సంపాదిస్తాయి”అన్నారు .అంతటి మహా గొప్ప తెలుగు కధకులు వేలూరి వారు .శ్రీ జంధ్యాల మహతీ శంకర్ ”కధా భారతి ”పేర కొన్ని కధలు
ముద్రించారు .అవి అన్నీ మరీ మరీ చది విన్చేవే .చవులూరించేవే .అంతటి కవి ,పండితుడు ,దార్శనికుడు విమర్శకుడు ,శాస్త్ర వేత్త intellectual giant అయిన శాస్త్రి గారి లో ఇంతటి మహోన్నత కధా రచయిత వున్నాడా ?అని ఆశ్చర్య పోతాం .అందులో మచ్చుకి ఒక కధ ”శకునం ”మీకు అందిస్తున్నాను .అన్నట్లు చెప్పటం మరిచి పోయాను .శాస్త్రి గారు మా రెండో బావ గారు వేలూరి వివేకానంద గారికి స్వయానా పిన తండ్రి .అంటే తండ్రి కృష్ణ మూర్తి గారికి స్వంత తమ్ముడు .చిరివాడ లో నేను మా అక్కయ్య దుర్గ వివాహ సందర్భం లోను ,ఆ తర్వాత చాలా సార్లు దర్శించిన భాగ్యం పొందిన వాడిని నేను .వారి సమీపం లో కూర్చునిసంభాషించిన అరుదైన అదృష్ట వంతుణ్ణి కూడా .దబ్బ పండు మై ఛాయ .విభూతి రేఖలు పంచె కట్టు ,పైన శాలువా తో వాకిట్లో వాలు కుర్చీ లో కని పించే వారు .మంచి నిష్టా గరిస్టులు .పుట్ట పర్తి సాయి బాబా గారి ఆత్మీయతను ,చవి చూసిన మహాను భావులు శ్రీ శాస్త్రి గారు .ఇక అసలు కధ లోకి ప్రవేశిద్దాం . .
బా.బు.అనే ఆయన కు శకునాల పిచ్చి .తుమ్ము విన బడితే ఎక్కడికీ కదలదు .ఒంటి బ్రాహ్మణుడు ,విధవా ఎదురు వస్తే ప్రయాణం మానేస్తాడు తుమ్మిన వాళ్ళకీ ,ఆయన బయల్దేరు తుంటే దాట బడ్డ వారికీ నరకమే .ఆయన పలుకు బడి కల వాడు .”మీరే మాకు అపశకునం ”అని ఎవరూ చెప్పే సాహసం లేదు .ఎంత అర్జంట్ పని అయినా శకునం సరిగ్గా లేక పొతే నెలల తరబడి వాయిదా వేసే వాడు .ఆయన ఇంటికి ఎదురు గా రచ్చ బండ .”దాని కింద చింత చెట్టు ఒకటి చత్రమే .అక్కడ కూర్చున్న వారంతా చత్ర పతులే ”అని చమత్కరిస్తారు శివ రామ శాస్త్రి గారు .
ఒక రోజూ బాబు గారు ప్రయాణం అయారు .రచయిత తుమ్మాడు .ఇంకే ముందీ -ఇంటి లోపలి వెళ్లి పోయాడు .ఇలా చాలా సార్లు జరిగింది ఆ రోజూ .ప్రయాణం దాంతో కాన్సిల్ .పోనీ ఇదేదో హిందువుల పధ్ధతి అనుకుని సరి పుచ్చు కొందామంటే –ఒక క్రిస్టియన్ డాక్టరు గారు కూడా ,వారం ,వర్జం చూసి ప్రయాణం చేస్తున్నట్లు రచయిత తెల్సు కోని మరీ ఆశ్చర్య పోయాడు .ఆ డాక్టర్ గారు ఆ రోజూ అర్జెంట్ గా ఎక్కడికో వేల్ల్లాలి .డ్రైవర్ కారు కూడా తెచ్చి రెడి చేశాడు .వర్జ్యం ఉందంటూ ప్రయాణం మానేశాడు .
ఒక రోజూ మన కధకుడు తన స్నేహితునికి జబ్బు గా వుందని తెలిసి బయల్దేరాడు .కన్య ఎదురైంది .అంతా మంచి శకునమే అన్నారు .ఎన్నో కస్టాలు పడి స్నేహితుడి దగ్గరికి చేరాడు .రోగి ”ఇక బెంగ లేదు ”అన్నాడట .వైద్యుణ్ణి పిల్చు రావ టానికి రచయిత అమలా పురం వెళ్ళాడు .డాక్టర్ ముస్లిం.క్షౌరం చేయించు కొంటున్నాడు .రోగి విషయం చెప్పాడు రచయిత .”ఇది అమంగళ సమయం .నేను రాను ”అన్నాడు .”అదేమిటి ప్రాణం నిలబెట్ట్టటం మంగళ కర మేగా ”అన్నాడు కధకుడు .”అయినా మీరు వచ్చిన పనికి అమంగళం ”అని గట్టి గా చెప్పాడు భిషగ్ వరుడు . .మళ్ళీ సెకండ్ థాట్ వచ్చి ”మీరు చెప్పిన లక్షణాలను బట్టి ,చూస్తె టైఫాయిడ్ లాగా వుంది .ఒక సీసా బ్రాంది తెండి ”అన్నాడు .వెంటనే షాప్ కు వెళ్లి చేత్తో పట్టు కోని తెస్తుంటే సీసా జారి కిందపడి పగిలి బ్రాంది నేల పాలైంది .ఇంకో సీసా తెద్దామంటే సరుకు లేదన్నాడు షాప్ వాడు .తిరిగి వచ్చి డాక్టర్ కు వివ రిచి చెప్పాడు .డాక్టరు ”ఇదంతా అప శకునమే . ”అన్నాడు .కోపం వచ్చిన కధకుడు ”అపశాకునాలను కూడా దాన కోటి లోకి చేర్చటం వైద్యానికి ఆరోగ్యం కాదు .జ్యోతిష్యానికి వెలుగూ కాదు ”అన్నాడు .ముస్లిం డాక్టర్ ”ఏ శాస్త్రానికి ఆ శాస్త్రమే -అయినా సరే పదండి ”అన్నాడు .తీరా రోగి దగ్గరకు చేరే సరికి ”బాల్చీ తన్నేశాడప్పటికే ”.
ఇలా శకునాలు ఒక మతానికి మాత్రమే చెందినవి కావు .అందరు మూర్ఖం గా ఆలో చిన్చేవే .ప్రాణం విలువ కన్న శకునం గొప్ప కాదు అని తేల్చి చెప్పిన కధ .
”మేమింటికి చేరు సరికి రోగి మింటికి చేరెను ‘‘అని ముగించారు శివ రామ శాస్త్రి గారు .
సమాప్తం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -03 –12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com