వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –1

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –1

            వేదం వెంకట రాయ శాస్త్రి గారు ”ప్రతాప రుద్రీయం ”అనే నాటకాన్ని రాశారు .దాదాపు గురజాడ అప్పారావు గారి ”కన్యా శుల్క నాటకానికి” సమ కాలీన నాటకమే ఇది .ఇద్దరూ ఇద్ద రే ఉద్దండులు .దేని ప్రతిభ దానిదే .ఈ వ్యాస పరంపర లో వేదం వారి జీవిత విశేషాలను ,ప్రతాప రుద్ర మహారాజు చరిత్రను ,నాటకం లో ప్రతి అంకం లోని కధా విశేషాన్ని ,ఆ తరువాత శాస్త్రి గారు నాటకాన్ని తీర్చి దిద్దిన వైనాన్ని తెలుసు కొందాము .
  వేదం వారి జీవిత విశేషాలు 

వేదం వెంకట రాయ శాస్త్రి గారు 1853  డిసెంబెర్  21 న చెన్న పట్నం లో జన్మించారు .వీరిది నెల్లూరు జిల్లా ,కావాలి తాలూకా ,”మల్లయ పాలెం ”స్వగ్రామం .వీరు పూదూర్ ద్రావిడ బ్రాహ్మణులు .తండ్రి ,తాతలు యజ్ఞాలు చేసి ,సోమయాజులు అయ్యారు .తండ్రి వెంకట రమణ శాస్త్రి వ్యాకరణం లో ఉద్దండ పండితులై ”వైయాకరణ పతంజలి ”అనే బిరుదు పొందారు .తండ్రి గారు తెలుగు లో ”బాల వ్యాకరం ”వ్రాసిన పర వస్తు చిన్నయ సూరి గారికి స్నేహితులు .ఒక సోదరుడు వెంకటా చలం గారు చిలక మర్తి లక్ష్మీ నర సింహం గారికీ ,మరో సోదరుడుసూర్య   నారాయణ శాస్త్రి గారు ఆంద్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ,ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి రాజ మండ్రి లో గురువు గారు .శాస్త్రి గారు 1869 లో మెట్రిక్ పాస్ అయారు .వీరి గురువు తెలుగు నిఘంటువు ను రచించిన బహుజన పల్లి సీతా రామ శాస్త్రి గారు .వేదం వారు శ్రీకాకుళం ,విశాఖ పట్నం ,రాజ మండ్రి లలో హైస్కూళ్ళ లో ప్రదానో పాద్యాయులు గా పని చేశారు .1875 నుంచి 1886 వ్క్యరకు మద్రాస్ Anglo vernacular middle school లో హెడ్ మాస్టర్ గా చేశారు .
కందుకూరి వీరేశ లింగం గారి స్త్రీ పునర్వివాహాన్ని ,గిడుగు వారి వ్యావహారిక భాషా వాదాన్ని వేదం వారు పూర్తిగా వ్యతి రేకించారు .”జన వినోదిని ”అనే పత్రిక నడిపారు .”కధా సరిత్చాగరాన్ని” తెలుగు లోకి అనువ దించారు .జ్యోతిష్మతీ ప్రెస్ పెట్టి అమూల్య గ్రంధాలను వెలుగు లోకి తెచ్చారు .” జక్కన రాసిన ”విక్రమార్క చరిత్ర ”,”ఆంద్ర ప్రసన్న రాఘవ నాటకం ”లకు మంచి విమర్శనం చేశారు .మనుచరిత్ర ,ఆముక్త మాల్యద లకు విపుల మైన అర్ధ తాత్పర్యాలతో ,విశేషాలతో వ్యాఖ్యానం రాశారు .కాళి దాసు కావ్యాలకు తెలుగు వ్యాఖ్యానం చేశారు .1922 లో మద్రాస్ ఏ.సి .కాలేజీ లో సంస్కృత పండితులైనారు .తెలుగు లో ”ఛందసశాస్త్రాన్ని ,భోజ విక్ర మారక చరిత్రను టీకా తాత్పర్యాలతో వెలువ రించారు .శ్రీ హర్షుని ”నాగా నందం ”నాటకాన్ని ఆంధ్రీ క రించారు .కాళిదాసు ”శాకుతల ”నాటకాన్ని  అనువదించి వ్యాఖ్యానించారు .ఆముక్త మాల్యద కు ”సంజీవిని   వ్యాఖ్య ”రాశారు .శ్రీ హర్షుని ”శృంగార నైషధం కు విస్తృత వ్యాఖ్య రాశారు .కాళిదాసు నాటకాలను  చక్కని అర్ధ తాత్పర్యాలతో ,తెలుగు వారికి అందించారు .తెలుగు ప్రబంధ సాహిత్యాన్ని అందరికి అందు బాటు లోకి తెచ్చిన ఘనత వేదం వారిదే .”శారదా కాంచిక ”అనే పేరు తో కావ్య విమర్శలు చేశారు .
ఎన్నో గ్రంధాలను పరిశీలించి ,శుద్ధ ప్రతులు తయారు చేసి వెలువరించిన ఘనత శాస్త్రి గారిది .దీనికి ఎంతో శ్రమించారు .భిన్న దేశాల ప్రతుంనీ తెప్పించి   కూలంకషంగా  ,  పరిశీలించి ,పాథ నిర్ణయం చేసే వారు .తెలుగు నాట కాన్ని ప్రదర్శన యోగ్యం గా మార్చాలనే గొప్ప తపన వారికి వుండేది .”విద్వద్మనో రంజని ”,”సుగుణ విలాస సభ ”సంస్థలను ఏర్పరచి మంచి నాట కాలను ప్రదర్శించే వారు .వేదం వెంకట రాయ శాస్త్రి గారు 1929 లో జూన్ 18 న 76 వ ఏట పరమ పదించారు .ఆంద్ర దేశం గర్వించ దగిన మాహా విద్వాంసులు శాస్త్రి గారు .
1912 లో కాని భాసుడు రాసిన ”ప్రతిజ్ఞా యౌగంద రాయణం ”నాటకం వెలుగు చూడ లేదు .వీరి ”ప్రతా రుద్ర నాట కానికీ దానికీ ఒక్క మంత్రి పిచ్చి తనం తప్ప ఇంక ఏ పోలికా లేదు .చిన్న తనం లో శాస్త్రి గారు గోదావరి లో తమ్ముడి తో కలిసి ఈత కొడుతూ ,మునిగి పోయే స్థితి వచ్చింది .ఆ సీన్ ను విద్యా నాదునికి తన నాటకం లో అంట కట్టారు -మరి వేదం వారు నిజం గా విద్యా నాదులే కదా .అలాగే ఇందు లోని పేరి గాడు పాత్ర ఆయనకు పరిచయం బాగా వున్న చాకలే నట .ఆయనే చెప్పారు.”ఉష”,”బొబ్బిలి యుద్ధం ”నాటకాలు కూడా వేదం వారు రాశారు .ప్రతాప రుద్రీయం లో ప్రతాప రుద్రుడు ,ముమ్ముడ మ్మ  ,విద్యా నాధుడు ,మహమ్మద్ బీన్ తుఘ్లక్ (శూజుద్దీన్ తుఘ్లక్ )మాత్రమే చారిత్రిక పాత్రలు .మిగిలిన పాత్ర లన్నీ శాస్త్రి గారి కల్పనలే .
కన్యా శుల్కం –ప్రతాప రుద్రీయం
గురజాడ వారి కన్యా శుల్క నాటకం 1892 లో మొదటి సారిగా ప్రదర్శింప బడింది .పుస్తకం గా 1897 లోమాత్రమే ముద్రణ పొందింది .వేదం వారి ప్రతాప రుద్రీయం కూడా 1897 లో అచ్చు అయింది .కన్యాశుల్కం సాంఘిక నాటకం .క్లాసిక్ నాటకం గా మంచి పేరు పొందింది .గురజాడ వారే ప్రతాప రుద్రీయాన్ని ”మన దేశ చరిత్రలో గుండెలు కదిలించే వృత్తాంతం ”అని మెచ్చు కొన్నారు . ”Maturity of mind ,maturity of manners ,maturity of language and perfection of the common style ”అనేవి క్లాసిక్  లక్షణాలు అంటారు విమర్శకులు .కన్యా శుల్కం క్లాసిక్ మాత్రమే కాదు ”ఎపిక్ ”అంటే ”కావ్యేతి హాసం ”అని కూడా అని పించు కొంది .వేదం వారి నాటకం ”సంప్రదాయ నాటక ప్రక్రియకు సంబంధించిన అపూర్వ మిశ్రమ ప్రయోగం -చారిత్రక వీర గాదా మిశ్రమం .అయితే భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతాప రుద్రీయం దోహదం చేసింది ”అని ప్రఖ్యాత విమర్శకులు ఆచార్య జి వి .సుబ్రహ్మణ్యం గారు తేల్చి చెప్పారు .”ధిల్లీ సుల్తాన్-పట్టుక పోతాన్ ”అని, నాటకం లో యుగంధరుడు గర్జిస్తే ”పరపాలకులకు ,జాతి స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించి ,దాశ్య శృంఖలాలను జాతికి తగిలించిననయ వంచకులకు త్వర లోనే తగిన శాస్తి చేస్తాం ”అనే ప్రేరణ తెలుగు వారి లో కల్గించి  ,జాతిని ఈ నాటకం ఉత్తేజ పరిచింది ”అంటారు బుద్ధి జీవి జి.వి .రక్త పాతం లేని విజయాన్ని నీతి తో ,బుద్ధి బలం తో ,సాధించిన యుగంధర పాత్ర చాకచక్యం  ,జాతి కోరుకొనే శాంతి విజయానికి ప్రతీక ”అని చాలా విశ్లేశాత్మక ప్రశంస ను ఇచ్చారు ఆచార్యుల వారు .
కన్యా శుల్కం లో ఎలా పాత్రలు మానవ జీవితానికి అతి సమీపం లో వున్నాయో ,రుద్రీయం లోని యుగంధరుడు ,పెరి గాడు ,ఎల్లి అలాగే ఈ సమాజం లోంచి వచ్చిన సజీవ పాత్రలే .సామాన్యులకు ప్రతి నిధులే .గురజాడ ,శాస్త్రి గారు ఇద్దరూ మహా శిల్పులే .రెండూ రెండే గొప్ప నాటలు .తెలుగు వారు గర్వించ దగినవే .వారి జీవితాలకు సంబంధించినవే .ఉదాతమైనవే ,ఉత్తేజం కలిగించేవే .ప్రయోగ ఫలితాలే .సత్ఫలితాన్ని ఇచ్చినవే .రెండూ ఒకే సమయం లో వెలువడిన ఉత్కృష్ట  నాట కాలే సందేహం లేదు .అయితే కన్యాశుల్క నాటకం వేలాది ప్రదర్శనలకు నోచుకొంటే ప్రతాప రుద్రీయానికి అంతటి అదృష్టం మాత్రం పట్ట లేదు .
1962 -63 లో నేను రాజ మండ్రి ప్రభుత్వ ట్రైనింగ్ కాలేజి లో బి.యి.డి  చేస్తున్నప్పుడు గుంటూరు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ ,మహా విద్వాంసుడు ,నాకు  సహాధ్యాయి shortend B.ed చేస్తున్నస్వర్గీయ ఏలూరి పాటి అనంత రామయ్య గారు యుగంధరుడి గా నేను ఆయన శిష్యుని గా ,కాలేజి వార్షి కొత్చవం లో” ప్రతాప రుద్రీయం నాటకం” లో కొన్ని సీన్లు నటించాం . అది మరుపు రాని మధురాను భూతి గా మిగిలింది .
అతి మూర్ఖం గా గ్రాంధిక భాషే వాడాలి అన్న వేదం వారిలో శ్రీ గిడుగు రామ ఊర్తి గారి విమర్శనా పరంపర ల వల్ల చాలా మార్పు వచ్చింది .వేదం వారిని విమర్శించినంత గా గిడుగు వారు వేరెవరినీ విమర్శించ లేదు .చివరికి మారిన మనిషి గా తానె పాత్రోచిత భాషను రాశారు వేదం వారు .అదీ గిడుగు వారి ప్రభావం .1928 లోనూజి వీడు లో జరిగిన ”సాహిత్య పరిషత్ ”ఉత్చ వాలలో వేదం వారు పాల్గొని అధ్యక్షత వహించి ”,నండూరి వారి ఎంకి” పాటల్ని బ్రహ్మాండం గా ప్రశంశించారంటే వారిలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది .కన్యా శుల్కం ,ప్రతాప రుద్రీయాలను ప్రచురించి ఇప్పటికి    113  ఏళ్ళు   ఈ శుభ సమయం లో ప్రతాప రుద్రీయం గురించి వివరించే అరుదైన ఆవ కాశం తీసు కోని ఆ వివ రాలు ధారా వాహిం గా మీ ముందు ఉంచు తున్నాను .ఇదంతా రాసి ఇప్పటికి పద మూడేళ్ళు అయింది .  దీని తర్వాత ”ప్రతాప రుద్రుని” గురించి  తెలియ జేస్తాను
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -05 -12 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.