వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –3

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –3

                                              నాటక కధ –అంకాల వారీగా

 మొదటి రంగం –ఓరుగల్లు రాజధాని గా కాకతి ప్రతాప రుద్రుడు త్రిలింగ దేశాన్ని పాలిస్తున్నాడు .మంత్రి యుగంధరుడు రామేశ్వర యాత్ర లో వున్నాడు .అతని తమ్ముడు జనార్దన మంత్రి రాజ్య వ్యవ హారాలు చూస్తున్నాడు .రాజు వేటకు వెళ్ళాడు .ధిల్లీ సుల్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ”వలీఖాన్ ”ఒక లక్ష సైన్యం తో ఓరుగల్లు పై దాడికి వచ్చి ,నగరం బయట విడిది చేసి ,జనార్దన మంత్రి తో స్నేహం చేస్తున్న వాడిలా నటించాడు .తాను సుల్తాన్ రాయ బారిగా వచ్చాననీ ,ధిల్లీ పై ఆఫ్ఘనిస్తాన్ రాజు దాడికి వస్తున్నాడాని ,ప్రతాప రుద్రుని సాయం కోసం వచ్చానని కబుర్లు చెప్పాడు .ఖాన్ ఆంతర్యం గ్రహించి ,మంత్రి తెలివిగా రాజు ,నగరం లో లేడని ,రాగానే దర్శనం చేయిస్తానని అంటాడు .నౌఖర్లను ఏర్పాటు చేయ మని కోరితే ,వేగుల వాళ్ళ నే నౌకర్లు గా నియమిస్తాడు .అన్న యుగంధరుల వారి కోసం కబురు కూడా పంపిస్తాడు ముందు జాగ్రత్త గా .అపాయం గ్రహించి రాజు గారిని వెంటనే నగరానికి రావలసిందనీ కబురు పంపాడు .తురకలు పారి పోకుండా గోదావరి నది  దాటే పడవ లన్నిటినీ పగల కొట్టిస్తాడు మంత్రి జనార్దనుడు .రాజు పోలిక లున్న చాకలి పేరి గాడిని తన ఇంటికి పిలి పించుకొని ,అవసరాన్ని బట్టి వాడిని వాడుకోవ టానికి సిద్ధ పడతాడు మంత్రి .అన్నకు తగ్గ తమ్ముడు అనిపించాడు .
రెండవ అంకం –వలీఖాన్ మంత్రా లోచన చేస్తూంటాడు .చెకుముకి శాస్త్రి అనే జనార్దన మంత్రి స్నేహితుడు జోశ్యం చెప్పే మిష తో ,తాను రాజ ద్వేషినని ,ధిల్లీ సుల్తాన్ దర్శనం చేయిస్తే ,ఆయన సాయం తో ,ప్రతాప రుద్రుని మట్టి కరిపిస్తానని ,నమ్మకం గా చెప్పి స్నేహం నటిస్తాడు . వారి నుంచి తురక దుస్తులు బహు మతి గా పొంది ,వెళ్లి పోతాడు .రాజునుబంధించటం  చాలా కష్టం గా అని పిస్తుంది వలీ  ఖాన్ కు .
 మూడవ అంకం –    రాజు వేట అలసట లో గోదావరి నది ఒడ్డున చెట్టు కింద నిద్రించాడు .వలీ ఖాన్ సైనికులు అతన్ని గుర్తించి బందీని చేసి పడవలో తీసుకొని వెళ్తారు .ఈ పడవ వాళ్లకు మంత్రి ఇచ్చిన ఆజ్ఞా అందాక పోవటమే కారణం .విశ్వ నాద కవి ఇదంతా చూసి ,మోసం జరిఇగిందని తెలుసు కోని ,తన్ను మొసలి తరుము తోందని గోదావరి లో దిగి అరుస్తుంటే రాజు గారి పడవ లోకి చేరతాడు .చీకటి లో రాజును గుర్తించి ,ఆయన పై శ్లోకాలు చెప్పి ,రాజు గారి ఉంగరం సంపాదిస్తాడు .అది గారి ఉంగరాన్ని గుర్తించి ”నెల రోజుల్లో రాజును ఓరుగల్లు సింహాసనం పై ఉంచుతాను ”అని ప్రతిజ్న చేస్తాడు .
 నాల్గవ అంకం   యుగంధరుడు రాజధాని చేరాడు .కవి వచ్చి జరిగిన దాన్ని తెలియ జేసి ,ముద్రికను అంద జేస్తాడు .యుగంధరుడు కవి ని ”జోష్యునిగా ”అందరికీ పరిచ్చయం చేసి ,జాత కాలు చెప్పిస్తాడు .రాజు వేట లో గాయ పది ,బెడద పూడి లో రామావదానుల ఇంట వున్నట్లు ,జోశ్యం చెప్పిస్తాడు కవితో .రాజు నుంచి ,లేఖ వచ్చి నట్లు అందర్నీ నమ్మిస్తాడు .పేరి గాన్ని రాజు  ను చేసి ,కోటకు ,తెమ్మని ,ఆజ్ఞా పిస్తాడు .లేక పొతే ,రాజ్యం అల్ల కల్లోలం ,అవుతుందని  భావిస్తాడు .విద్యా నాధుడు ,పేరి గారి చెయ్యి చూసి ,”రాజు అయ్యే యోగ్యత వుంది ”అంటాడు .
 అయిదవ అంకం   జనార్దన ,విశ్వ నాధులు పేరి గాడిని రోగిష్టి రాజు గా ,వేశం వేయించి ,వేరొక మహల్లో ఉంచుతారు .సర్దార్ ఖుశ్రు ఖాన్ -రాజు గారు నగరానికి వచ్చారని తెలిసి బాధ పడతాడు .ఇంత లో ఒక సైనికుడు వచ్చి వలీఖాన్ రాజును బందీ చేసి ,ధిల్లీ తీసుకొని పోయాడని తెలిపాడు .ఖుశ్రు కు అనుమానం వచ్చి ,చెకు ముకిశాస్త్రి ని జోశ్యం అడుగు తాడు .అతడు రాజు అనుకోని చాకలి పేరి గాడిని ఖాన్ తీసుకొని పోయాడని ,నమ్మకం గా చెప్తాడు .ఇంతలో యుగంధరుని నుంచి ,ఖుశ్రు కు యుద్ధానికి సిద్ధం గా ఉండ మని కబురు వస్తుంది .ఖుశ్రు కు నతా గందర గోళం గా వుంది .తన కింది సర్దార్లు ,తన్ను మోసం చేస్తున్నారని ,భావిస్తాడు .ఇంతలో సైన్యాధ్యక్షులు భేతాళ రాజు రెండు వైపులా నుంచి ,తురక సైన్యం మీద దండెత్తి నాశనం చేశాడు .వూరిలో అందరు ,పెరిగాడిని ధిల్లీ పట్టుకు పోయారని ,వదంతి వ్యాప్తి చేయిస్తాడు మంత్రి .రాని ,తల్లి రాజును చూడాలని వస్తే ,కుదరని ,మంత్రులు పంపించేస్తారు .యుగంధరుడు ముమ్ము డమ్మ  తో జరిగిన దంతా చెప్పి -నెల రోజుల్లో రాజును తెచ్చి అప్ప గిస్తానని ప్రతిజ్న చేస్తాడు .అదే ”ప్రతిజ్ఞా యౌగంద రాయణం ”రాజ్యాన్ని విద్యా నాద ,జనార్దనులకు అప్ప గించి యుగంధరుడు ధిల్లీ చేరతాడు .
ఆరవ అంకం ––పేరి గాడి రాజ సభ.వింతలు ,వినోదాలతో షష్ట అంకం  కడుపుబ్బ నవ్విస్తుంది
 ఏడవ అంకం –-ధిల్లీ లో చెకుముకి ,వలీఖాన్ తో ఒక కుట్ర చేయిస్తాడు .ధిల్లీ సుల్తాను వజీర్లు అంతా ,-యమునా నది లో కి వచ్చే ఒక వర్తకుని ,ఓడ లోకి చేర్చి ,అందర్నీ చంపటం -వలీ సుల్తాన అవటం –ఇదీ యుగంధరుని మంత్రాలోచనే .చెకు ముకి ఓరుగంటి పాదుషా అవటం ,.అప్పటికి  మూడు నెలల నుంచి యుగంధరుడు ధిల్లీ నగర వీదుల్లోపిచ్చి వాడిగా తిరుగుతూ ”ధిల్లీ సుల్తాన్ -పట్టుక పోతాన్ -మూడే నాళ్ళకు పట్టుక పోతాన్ ”అని అరుస్తుంటాడు .సుల్తాన్ చారులను నియమించి ,ఆరా తీస్తాడు .వారంతా అతడు పిచ్చి వాడే నని నమ్మిస్తాడు .ఖుశ్రు ఓరుగల్లు నుంచి ,పారి పోయి ధిల్లీ వచ్చి ,పిచ్చి వాణ్ని గమనించి ,అనుమానిస్తాడు .వెర్రి వాడు తన శిష్యుణ్ణి ,ఖుశ్రు వెంట చారునిగా పంపిస్తాడు .ఖుశ్రు వలీతో ”చాకలిని బందీ గా తెచ్చావు ”అంటాడు .ఖాన్ భయ పది ,ఖుసృను యమునా దగ్గరకు తీసుకొని వెళ్లి ,తల పగల కొట్టి ,చంపి యమునా లో తోసేస్తాడు .శిష్యుడు ఇదంతా పాట గా పాడి ,గురువుకు కధంతా తెలియ జేస్తాడు .
 ఎనిమిదవ అంకం ధిల్లీ సుల్తాన్ ను వర్తకులు దర్శించి ,ఓడ లో అపారంగా మణులు ,వజ్రాలు పరిశోధించాలని కోరుతారు .వాటి నాణ్యం పరిశీలించా టానికి ,వెల నిర్ణ యించ టానికి ప్రతాప రుద్రుని ఖైదు విడి పించి ,సుల్తాన్ తో సహా అందరు వొడ లోకి చేరు తారు . .వెర్రి వాడు అరుస్తూ వస్తే ,వినోదం కోసం ,వాడినీ వొడ ఎక్కిస్తారు .గానా ,బజానా బాగా జరిగింది .రాత్రి ”త్రిలింగ విజయం ”నాటకం ఆడతారు ఓడ లో .అందులో వలీఖాన్ చేయ బోయే కుట్రను బయట పెడతారు .నిజం తెల్సుకొన్న సుల్తాన్ ,వలీ ఖాన్ ను అతని ,మంత్రుల్నీ చంపి ,యమునా లో పడేస్తాడు .వలీ ఖాన్ తలను వర్తకులు దాచేస్తారు .మిగిలిన వారంతా ,వొళ్ళు మరిచి నిద్ర పోయారు .అందర్నీ యుగంధరుడు ఖైదు చేయించి ,ఓరుగల్లు చేర్పించాడు .,
తొమ్మిదో అంకం రాజు ఓరుగల్లు నగర ప్రవేశం చేశాడు .ప్రతాప రుద్రున్ని తల్లి ముమ్ము డమ్మ కు అప్ప్క గిస్తాడు మంత్రి యుగంధరుడు .కృతజ్ఞత తో ఆమె పులకిస్తుంది .
పదవ అంకం రాజ సభ -అన్నమ రాజు అనే సేనాని ”కటకం ”పాలించే ”బల్లహుని  ”చంపి ,,అపార ధన రాసులు తెచ్చి రాజు ప్రతాప రుద్రునికి సమర్పించాడు .ముమ్ము డమ్మ ”వీర బిరుదాంకిత మైనహారాన్ని  a యుగంధరునికి పంపుతుంది .రాజు ఆ హారాన్ని మంత్రి యుగంధరుని మెడ లో గౌరవం గా అలంకరిస్తాడు .ఎల్లికి ,పేరి గాడికి రాజు మంచి ఉద్యోగాలు ఇచ్చి గౌర విస్తాడు .విద్యా నాదున్ని సత్కరించి ,అతని కృతి ;;ప్రతాప రుద్ర యశో భూషణం ”ను అంకితం పొందు తాడు .”అంతటా -వానినే తగుల వేసితిని ”అన్నారు కదా అంటాడు రాజు కవి తో ”-.అవును -మీ పేరు ప్రతి శ్లోకం లో తగిలి వుందో లేదో చూడండి ”అని కవి రాజు చమత్క రిస్తాడు .అతని సమయ స్పూర్తి కి తగిన పారి తోషికం ఇచ్చి మెచ్చాడు రుద్ర భూపతి .తన చెర విముక్తికి సాయ పడినవారందర్నీ   తగిన రీతిగా మహా రాజు సన్మానిస్తాడు .దీనితో నాటకం పరి సమాప్తం అవుతుంది .
సశేషం                      నాటక విశేషాలను రేపటి నుంచీ తెలుసు కొందాం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -12 -11 .

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.