వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –4 నాటక నిర్వహణ విధానం

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –4

                                           నాటక నిర్వహణ విధానం
తెలుగు నాటకాలలో పాత్రోచితమైన ,వాడుక భాషను ,శిస్త వ్యావహారికాన్ని ప్రవేశ పెట్టి ,”కన్యా శుల్కం ”నాట కంతో గురజాడ అడుగు జాడ వేశాడు .వ్యావహారికాన్ని బాగా ఎద్దేవా చేసినా ,చివరికి శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారుగురజాడ జాడ లోనే అడుగు వేశారు .ప్రతాప రుద్రీయ నాటకం వ్రాసి ,తానూ,సహజం గా పాత్రల చేత ,వాటి సహజ సిద్ధ మైన ”నేటివ్ లాంగ్వేజ్ ని అద్భుతం గా చెప్పించారు .పెద్ద నాటకమే అయినా ,చదవటం మొదలు పెడితే ,ఆ మాటల ప్రవాహం లో కొట్టుకు పోతాం .మంచి డ్రామా కూడా వుంది .రంగస్థలం పై ప్రదర్శించటం తక్కు వె అయినా ,పాథక హృదయాలపై చెరగని ముద్ర వేసి ,వేదం వారు వేదాన్నే కాదు నాటక వేదాన్ని ,జన సామాన్యానికి అందు బాటు లో తెచ్చారు .అప్పా రావు గారి కన్యా శుల్కం లో సామాజిక స్పృహ వుంటే వేదం వారి ప్రతాప రుద్రీయం లో రాజకీయమూ వుందీ ,ప్రభుభక్తీ వుంది ,దేశభక్తి నిండి వుంది .దేశం కోసం త్యాగం చేయటమే కాదు ,తమ సర్వస్వం అర్పించ టానికి ఇందులో పాత్రలన్నీ తమ వంతు కర్తవ్యాన్ని గొప్ప గా నిర్వ హిస్తాయి .ఈ తరహా నాట కాలకు ,వరవడి ని సృష్టించిన నాటకమిది .అన్ని పాత్రలనుశిల్పి  గా సృష్టించారు .ఇంత పెద్ద నాటకం లోను QUOTABLE QUOTES చాలా ఉండ టం విశేషం .అవి ఆ నాటి నుంచి జనం నోళ్ళ లో నానుతూనే వున్నాయి .ఆ పలుకు బడులు ,హాశ్యపు తేనే చినుకులు అందరికి  అందించటమే నా ధ్యేయం
చాక్ల తో జనార్దన మంత్రి ”నూరు తరాలుగా మీరు ఎవరి అన్నం తింటూ బతుకు తున్నారో తెలుసా “‘అని ప్రశ్నిస్తే ఓ వెర్రి మడులు ”మీ అన్నమే ”అంటే ,మరొకడు ”ఒక అన్న మేటి బాబూ ,మాయన్నీ మీయే -మా పానాలు మీ పానాలే ,మా కొంపలు మీ కొమ్పలె ,మా గుడ్డలు మీ గుడ్డలే ,మా ఒళ్ళు మీ వొల్లె,మా బిడ్డలు మీ బిడ్డలే ”అని చివరికి ”మా పెళ్ళాలు మీ పెల్లాలే ,మాననీ మీయే;;అంటాడు అమాయకం గా .ఇందులో విశ్వాసం వుంది ,అమాయకత్వమూ వుంది .అందు లోంచి వచ్చిన హాశ్యపు జల్లు ఇది .వీళ్ళను తురకలకు పని మనుషులు గా బెతా యిస్తాడుమంత్రి .అసలు వీళ్ళ కు హిందూ స్థానీ భాష వచ్చో ,లేదో నని అనుమాన పడితే ,వాళ్ళ మాటల మూటలు చూడండి .”నానీ తురకొల్ల నందర్నీ ,డెక్కెస్తా  ,నానీ బుర్రలు రస గుండ్లు లాగా తలత్తల మెరిసే లా డోకే స్తా ”అని ప్రగల్భాలు పలుకుతూ,ప్రతీ హారులకే గుర్తు పట్టలేనంత గా గొప్ప నాటకం ఆడేస్తారు . .
ద్వితీయాంకం లో చెకుముకి శాస్త్రి వలీఖాన్ కు ఖుశ్రు కు వాళ్ళ కోరిక పై  జోశ్యం చెప్పాలని ప్రయత్నిస్తాడు .వలీ అంటాడు ”సాస్తుర్లూ !మీరు మాతో భాయీ ,భాయీ ఉండ వాళ .మీరు అడ్గిన దంతా ,మేమ్చేస్తాం .మీరు షరీ జోశ్యం చెప్తే మీకీ బంగారం లో పాతేయిస్తా ఝూటా జోశ్యం చెప్తే మట్టి లో పాతి యేస్తాం ”అంటాడు తెలుగు తురకలా .వెంటనే చెకు ముకి ”నిప్పులో అనుడు .మట్టి లో పాతుట తురకలనే ”అని అంత్య సంస్కారాన్ని సంస్కరిస్తాడు .
”ప్రతాప రుద్రీయ యశో భూషణం ”వ్రాసిన విద్యా నాద కవి శేఖరులు రాజును పడవ లో తురకలు బంధించి ఉండ గా చూస్తాడు .తానూ రాసిన కవితను ఆయనకు విని పిస్తాడు .తురక భటులకు మస్కా కొట్టి ,పడవ లోపలి చేరి చీకట్లో ,అందులో ప్రతాప రుద్రుని దాన మహిమను తెలియ జేసే శ్లోకం చదువు తాడు .
”కతి పయ DIVASHAIH క్షయం ప్రియా యాత్ –కనకగిఱీః   కృత వాసరావ సానః
ఇతి ముదముపయాతి ,చక్ర వాకీ –వితరణ శాలినీ ,వీర భద్ర దేవే ”
అంటే ప్రతాప రుద్రా రాజు దాన విషయం విని ,చూసి ,చక్ర వాకి తనకు పగటి పూట ప్రియుని తో యెడ బాటు కల్గించే బంగారు కొండ (మేరు పర్వతం )త్వర లోనే దానం వల్ల కరిగి పోతోందని సంతోషిస్తోందట .దీని వల్ల రాజు దాతృత్వ గరిస్తత ,కవి కవితా విసిస్తత తెలుస్తాయి .ఈ శ్లోకాన్ని ఉదాహరించి విద్యా నాద కవి మహత్తు మనకు అందించారు శాస్త్రి గారు .”అంతటను వానినే  తగుల వేసితిని ”అని చమత్క రిస్తాడు కూడా .అంటే అంతంత బంగారాన్ని అర్ధులకు రాజు నిత్యం దానం చేస్తున్నాడని భావం .రాజు విని ,ఆనందించి ”సమ్మాన మేమైనా జరిగినదా !”అని ప్రశ్నిస్తే కవి రాజు ”సమ్మానమే !దర్శనమే పూర్నాను స్వారం”అని చమత్క రిస్తాడు .ఎన్నో అబద్ధాలు ఆడి ,తురకలకు టోపీ వేసి ,రాజును బందీ గాచూశాడు   కవి .తను పలికిన ”బొంకులు ”ఎలా ఫలించాయో నని ఆశ్చర్య పడుతూ ,చక్కని జాతీయం ప్రయోగిస్తాడు ”దాలి త్రవ్వ గా గనియు ,పుట్టయు నైనవి -చీకటి పడితే గడియ దూరమే ఆమడ అవుతుంది ”అంటాడు .రాజు మెచ్చి రాజ ముద్రిక ను ఇస్తాడు కానుక గా .అది చూసి అతన్ని ప్రతాప రుద్రుని గా గుర్తిస్తాడు .జరిగింది అర్ధం చేసు కొంటాడు .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -12 -1

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.