వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–6 నాటక నిర్వహణా చాతుర్యం

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం–6

                                                  నాటక నిర్వహణా చాతుర్యం
ఆరవ అంకం లో హాశ్యాన్ని అంతా ఒలక బోసి జుర్రు కొమన్నారు వేదం వారు .ప్రతి లైన్ లోను లైఫ్ వుంది ,హాశ్యపు రిలీఫ్ వుంది .కాళి దాసు గారి అభిజ్ఞాన శాకుంతల నాటకం లో ”చతుర్ధాంకా నికి ”ఉత్క్రుస్తత ఉన్నట్లే ,ఇక్కడ ”షష్ట మామ్కానికి ” శ్రేష్టత ఉంది .అంతటి వెర్రి కూడా వుంది .”సారా సేమ్బు ”అదే స్వారశ్యం వుంది .పెరి గాడి రాజ దర్బార్ లో ”హాశ్యం రాజ్యం ”చేశింది .పసందైన విందు చేసింది .అది మృష్టాన్న భోజనమే .కడు పుబ్బా తిని అనుభ విన్చాల్సిందే .నవ్వ లేక పొట్టలు పట్టు కోని ఊగి పోవాల్సిందే .ఆ వైభవం ఏమిటో చూద్దాం . .
రాజ దర్బార్ లో పెరి గాడికి ”రాజు ”వేశం వేశారు .మంత్రులంతా ,కొలువై వున్నారు .ఆట ,పాట .పద్యం ,గాణా ,బజానా జోరుగా సాగుతున్నాయి .రాజు వేషధారి వీటన్నిటినీ మెచ్చు కోవాలి .వాడిని మంత్రులంతా కావలసినంత గా ”తోమారు ”అప్పటికే .అంటే తర్ఫీదు ఇచ్చారన్న మాట .అయినా వాడు ఎలా ప్రవర్తిస్తాడో ననే భయం లోపల పీడిస్తూనే వుంది .అందుకే జుట్టు కు ఒక తాడు కట్టారు .సన్ని వేశం బాగుందంటే ,జుట్టు తాడు లాగు తారు .వెంటనే వాడు ”స్వారశ్యం ,స్వారశ్యం ”అని మెచ్చు కోవాలి .ఇంకో తాడు ”పంకా ”లాగే తాడు కూడా వుంది .ఈ రెంటినీ ఒకడే ,సందర్భాను సారం గా లాగాలి .అదీ ఏర్పాటు .సభ మొదలవంగానే పంకా తాడు లాగ బోయి ”స్వారశ్యపు తాడు ”లాగుతాడు పొరపాటున .వెంటనే పెరి గాడు ”ఏమి సారా సేమ్బు ,ఏమి సారా సేమ్బు ”అని ,ఇచ్చిన తర్ఫీదు ప్రకారం ,అక్కడేమీ జరక్క పోయినా అనేస్తాడు .అందరు పగలబడి నవ్వారు .మనమూ అంటే గా .అలా రాసా భాస తోనే కొలువు ప్రారంభం అవుతుంది .చెప్పిన దంతా ఎక్కడికి పోయిందో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టు కొంటు మంత్రులు ”నీకు చెప్పిన దల్లా బూడిద లో హోమము రా ”అంటారు .ఇదీ కొత్త ప్రయోగమే .
వీణా వాయించే  వాడు ”చంద్ర కళా ధర సాంబ సదా శివ ”అని పల్లవి పాడి వాయిస్తాడు ‘.”వవ్వా ,వవ్వా ”అని మెచ్చుకొని ”ఒక పాళీ నానొక బేసి ని పెంచినా ,అది కార్తి లో ఆడ బేసిని సూస్తే ఇంత కంటా ,ఎయ్యింతలు కుంయి ,కుంయి అనేది .దాని కంటా దీని ఇసేసం ఏంటీ అంటా ?”అంటాడు పేరి గాడు .దానికి విద్యా నాధుడు ”చాలా చమత్కారం గా సెల విచ్చారు ఏలిన వారు .దీనికి ఆడ బేసి అక్కర్లేదు .అది లేకుండా నే ఇది కుంయి ,కుంయి అంటుంది -దీనికి గంజి కూడా అక్కర్లేదు .”అని సరదా గా సమా దానం చెబుతాడు .ఈ మాట పేరి గాడు నమ్మ లేదు ”గంజి తాక్కుంటే ,అంత కడుపేలా గోస్టది ?అని సందేహం వెలి బుచ్చు తాడు  వీణ కున్న పై బుర్ర ,కింది బుర్ర లను చూపించి .మన బుర్రలు తిరిగి పోతాయి .మంత్రి మళ్ళీ ”దానికి గంజి తాగ కుండానే కడుపోచ్చింది .”అంటాడు .”నేను నమ్మను .యెంత” మావస” మైనా ,తినేస్తాది ,మూకుళ్ళు ,మూకుల్లెమాయం చేస్తది .””అని మళ్ళీ అడుగు తాడు . మంత్రి ఖంగు తింటాడు .వాడెం మాట్లాడుతున్నాడో వాదికేమైనా తెలుసో లేదో నని అనుమానం వచ్చి ”మాంసం తింటుందని మీ కేలా తెల్సు “”అని ప్రశ్నిస్తాడు .వాడు ”మావాసం తిన కుంటే ఆ కోర లెందుకు ?ఆ పళ్ళు ఎందుకు  నోటి నిండా”అంటాడు .ఇప్పుడు మనం పళ్ళు ఇకిలించాల్సి వస్తుంది .మళ్ళీ వీణ మీటు తాడు వైణికుడు ”అచ్చర నచ్చ ఇనాం ,అదే సారా సేమ్బు !అద్గదీ సారా సేమ్బు ”అని చెంబుల కొద్దీ హాశ్యం ఒలక బోస్తాడు పేర్రాజు. దీన్ని సర్ది చెప్ప టానికి మంత్రులు తంటాలు పడుతూ ,వాడు చెప్పిన ప్రతి దానికీ తగిన వివరణలిస్తూ గుట్టు రట్టు కాకుండా కాపాడే సేరికి వాళ్ల తల ప్రాణం తోకకు వస్తుంది .
తర్వాత కార్య క్రమం గాత్ర కచేరి .కర్పూర శలాక తెచ్చి అక్కడ పెడతాడు .ఆనంద బాష్పాలు రాలటానికి కర్పూర శలాక కళ్ళకు అంటించు కొంటాడు  పేరి గాడు .ఆ తర్వాతే పాడ మంటాడు .వీడి చర్యకు ఆశ్చర్య పోతాడు గాయకుడు .పాట పాడతాడు .ఇక ఆ గాత్రాన్ని మెచ్చు కోవటం మొదలెడతాడు రజక రసిక శిఖామణి .”అబ్బా !నా కళ్ళంతా పోతున్నాయయ్యా ,ఈ ఆనంద బాస్పాల సేత .మరి ,ఈన నెత్తి మీద రోవ్వొంత కొప్పు ,మెళ్ళో ఒకటే అదేంటో ,తాటి పింజంత గింజ .ఇయ్యి మొయ్య లేక ఈన బుర్ర ఇసిరి ,ఇసిరి మెడతిప్పి   ,తిప్పి కళ్ళు మూత పడి ,నాలి కెల్ల బెట్టి ,తణుకు లాడుతా వున్నాడు గందా ,నా గాడిదే నదురు ,బెదురూ లేకుండా ఎన్ని మూటలు మోసేదిరా ,నా రంగా ,దాని ముంగట ,ఈనేందుకు పనికోస్తాడూ అంటా ?”అదీ వాడి మార్కు స్వారశ్యం .మళ్ళీ గాయక సార్వ భౌముడు పాట అందు కొంటాడు .మన ”మడేలు” సార్వ భౌముడు ”పాటలో మాత్రం ఈన ఎచ్చేన్టంతా ?నా గాడిద ఓండ్ర పెడితే రేవు .రేవంతా ”రోంయి ,రోంయి ”అంటూ మోగి పొయ్యేదే .ఈన పాడితే ,ఏదీ మోగ మను ?ఇక్కడికే ఇన పట్టం లేదే “”?అని తీర్పు చెప్పాడు పేరి రస రాజు .మధ్యమం లో పాడుతాడు ఆయన మళ్ళీ .”అద్గదీ ఇప్పుడు కొంచెం వొండ్రానికి సేరు పోతా వుంది పాట .మా గాడిది కి సేరు పౌతా వున్నాడీయన ”అని తన విశ్వాస జంతువు కు సామ్యం చెబుతాడు .అంటే  స్వజాతి గౌరవం ఎక్కువ మడే లు  మా రారాజుకు .         తర్వాత ఒక ఆట కత్తె వచ్చింది ఆడ టానికి .”ఆట కట్టేంటి ?కట్టి ఆడుడ్డా ?”అని ప్రశ్నస్తాడు పేరి సార్వ భౌముడు .”కట్టి కాదు ”అంటాడు విద్యా నాధుడు .”కట్టేట్టు కోని మనిషి ఆడుద్దా ఏంటీ ”అని మళ్ళీ సందేహం .ఇంక వినడ బట్ట లేక పేరి గాడి చెవి లో చేవిపెట్టి ”ఛీ ఊర కుండు ”అని మంద లిస్తాడు  విద్యా నాధుడు,అవిద్యా నాధుణ్ణి .మొర్సింగు వాయించే వాణ్ని చూసి ”ఆ అయ్యా వారు పాడ తా వుంటే ,ఆ కుర్రోడు ,ఆడబ్బ సచ్చి నట్లు ”లబ ,లబ ,లబ ,లబ ”నోట కొట్టు కునదే అదెందుకు “??అని అడుగు తాడు .”మొర్సింగ్ ”అంటాడు కవి .”ఆ తెలిసింది .చింగ్ ,చింగ్ ,చింగ్ మని మొర కేసి కొట్టు కోటమా ?ఆయన ఈనే పీకతమీంటి ?ఈయన నోటనే అరవతమేంటి ?ఆ ఈనే సగ మోడు ,సగమోడు పంచుకొని ఇద్దరూ వోయిస్తా ఆడ రాదా “”?అని తీర్పు చెప్పాడు .ఆ నోటి లబ లబ లేన్డుకని ?”అంటే కాదు ఇంకో సూక్ష్మం తెలియ జేస్తాడు .”ఈళ్ళని భూవి లో పాతేస్తే ,సెట్లు మోలిసి ,ఈనోయిన్చోల్లు ,నోటి పాడే వొళ్ళు ,కడుపు మీద బాడుకొనే వొళ్ళు ,లబ,లబ కొట్టు కొనే వొళ్ళు ,వొండలు వొండలు కాయలు కాయవా సేప్పండీ “‘అని నిల దీస్తాడు .గాయక శిఖా మనులంతా ,భయ పడి పారి పో జూస్తారు .మనిషిని పాతెస్ట్ మనిషి ఎందుకు పుట్టాడో పేరి గాడికి అర్ధం కాదు .పాతేస్తే మనిషి చని పోతాడు కనుక ,మనిషి పుట్టదు అని తెలుపు తాడు చచ్చిన గింజ మొలవదు అనే సత్యం తెలియ జేస్తాడు .అర్ధమై నట్లుంది రాజు వేష గానికి .మెచ్చు కొంటు ””అద్గదీ !బా గా సెప్పి ఆ వయ్యా ఏమడిగినా సేప్తావండీ నువ్వేకడి మంత్రి వో గాని !మరింక నత్తకం కానీండి .తడున్న్నీంది కానీ ,బాస్పాలు నా వొల్ల కాదు ”అని ఇంకా ఏడవ లేననీ ,ఆనంద భాష్పాలు రాల్చ లేననీ ఇదై పోయాడు నిజాయితీ గా .   . .
ఒక నటి పాడుతూ నటిస్తోంది .మద్దెల వాడు అనుగుణం గా వాయిస్తున్నాడు .మహారాజు గారి మహా రసికత కట్టలు తెన్చుకొంతోంది   .ఆగ లేక ‘ఆలె !ఆడు ఆది కడుపు మీద్దాన్ని కొట్టు కుంటుంటే ,నువ్వెందుకే ఏడవటం , యగారటం ,దుమకటం ,సేతు లిసురు కొట్టం ?నా కాన్నా ,నీ టెక్కులు నీకే మన్నా తగిలిందా ?పోనీ నీకేం వాయువా ?వోతలేయిస్తా .ఏడవకు .ఆడి  కాడ ఉండొద్దు .ఈ మూలనుండు . .కాకిని కొడితే , గద్ద సచ్చిందట .ఓరి ఎంకటయ్యా  ,కడుపు లాగా ,అదొక్కటి ముందేసు కొని ,ఆడ పిల్లను ,దాన్ని ఎందుకు జడి పిస్తావు ?ఒకరి మొగం ఒకరు సూడ కండి ”అని ఆజ్ఞా పిస్తాడు .
ఇంతలో సారా సెంబు తాడు తెగింది .ఎలా మెచ్చు కోవాలో తెలియ లేదు వాడికి ”నా సారా సెంబు తాడు తెగి పోయింది .నిలు ,నిలు ”అని గోల చేస్తాడు .అంతా నవ్వులతో తల కిందు లౌతారు .పాట రాసిన మహా కవి ఎవరు ?”మంచి తేనెకు” చెంచేతను” పొగడుదురు కాని తేటిని దలపరు ”అంటాడు సరైన స జాతీయత తో విద్యానాధుడు   .కవి గారు కవిత్వం చదువు తారు .వీడికి    అర్ధం కాదు .”దీనికి నాను సోయం పాక మైనా ఈను .ఇదేమి  కయిత్తం ?సీధ్ ”అంటాడు పేరి గాడు .మంత్రు లంతా కవి గారి ని పొగడ్తల తో ముంచేస్తారు .వీడు వెర్రి మొగమేస్తాడు . .
” కయిత్త  మంటే,పెతి మనిషికీ తేలియాల .సాకలోడికీ ,మంగ లోడికీ కూడా తేలియాల ”అని జనతా జనార్దనుడు మెచ్చేదే కవిత్వం అని చెప్పాడు .ఇది అందరికీ ఆదర్శ మేగా .రాజ హృదయం అర్ధం చేసు కొన్న కవి
”సలవ మడ తలకి మలేనే –ఎలి బూడిద  ,సౌడు సున్న  ,మెల్లల మలేనే –కలు నీల మలె ,మడేలా –ఎలిగీ నీ యశము నేల కెలి కొకవురా ”అని చాకలి భాష లో కపిత్తం చెబుతాడు .”బలే ,బలే బాపనయ్యా !వవ్వా ,వవ్వా !అచ్చర నచ్చలు -కయీస్సరుడా ,ఇలాంటి కయిత్తం ,ఇంకెవరైనా సెప్ప గత్త రా ?”‘అనిప్రశ్నిస్తాడు మెచ్చు కొంటునే .”ఇంత వరకు లేదు .నేనే మొదటి కవిని ”అంటాడు కవి రాజు .”నువ్వెలా పుట్టావ్”అని రాజు ప్రశ్న .వీన్ని ఉడికించ టానికి ”శ్రీ రాముల వారికి వాల్మీకి మహా ముని ,ధర్మ రాజుల వారికి వ్యాసులు ,”రేవేలిన ”వారికి నేను, అవతార మెత్తి నాము ”అంటాడు కవి .’నువ్వెవరి అవుతారంబ్యామ్మడా “‘అని మళ్ళీ ప్రశ్న .దానికి ”కాళీ వాహును ఆవ తారం ‘అంటాడు ,గాడిద స్వారి చేసే వాడికి దున్న  పోతు భాష లో .”మరి నేనో ”?అంటే ,కవి ”విష్ణు మూర్తి అవతారం ”అంటాడు .”ఐతే ఇష్ను మూర్తి కి ”గూని ”వుంటదా ”?. వీడికి సందేహం .తన గూనిని విష్ణుమూర్ తగిలించే ఉపాయం .కవి చమత్కారం గా ”విష్ణు మూర్తి మందర పర్వతం మోసి మోసి ,వీపును వంచి, వంచి, కూర్మం అయినపుడు గూను వచ్చినది .అదే -”రేవేలిన మారాజు అవతారం లో మూటలు ,మోచి ,మోచి వచ్చినది రెండునూ నీళ్ళ తో సంబంధ మున్న అవతారములే కదా ”?అంటాడు కవి సమయ స్ఫూర్తితో ఈ చాకలి పృధ్వీ పతిని ,ఆ విశ్వ పతి తో పోలుస్తూ .”కవి గారూ !ఏలిన వారేమి మూటలు మోచి నారు “”అడి గాడు వాడు . .”భూదేవి ముఖ్యాలన్కారముల మూటలు ”అని కవి సమాధానం .ఇందులో శ్లేష వుంది .”వూరి వాళ్ళ బట్టలు ”అనే అర్ధం వుంది (వస్త్ర ముఖ్యస్త్వలన్కారః )అని శాస్త్రం .”రేవేలిన వారేమి “”?అని జనార్దన మంత్రి ప్రశ్న .”ఏలిన వారి రాష్ట్రం గోదావరీ ,సాగర పరి వృతం కదా .కావున ఎటు చూసినాను రేవే ””అంటాడు కవి .ఈ సంభాషణ అంతా పేరి గాడిని మహాదానందం  లో  ముంచేసింది .పట్ట పగ్గాలు లేక పోయాయి .”నా కిట్టాంటి కవులే గావాల .ఇంక మీద ఇట్టాంటి కవులు పుడతారా “? సందేహం .కవి చమత్కారం గా ”ఇంకా ఆరు నూరెండ్లకు వేరు దొర తనములో కొన్ని తావుల మీ లాంటి రసజ్నులే బహుళ మగు దురు .వారికి మీ బోటి రసికులే కవనములు సేయుదురు .మీ వలెనె వారుభయులు చదువు కొన్న వారి కంటే తామే మేలని తలచు వారే ”అని నేడున్న స్తితిని ఆ నాడే అంచనా వేసి చెప్పారు వేదం వారు . .”కయిత్తం నీరసం గా వుంటే బాగుంటుందా ?”రాజు కు అనుమానం .”నీరస మనగా నేమి-నీవు ఆనందించు రసం నీరసము ”అని కవి గారు అనుమానం తీరుస్తాడు .ఆనంద సాగరం లో మునిగి పోయాడు ”రేవేలే రాజు ”.”నీ నోట వొచ్చే దంతా  కయిత్త మేనయ్యా ”!దేర్ది ‘(ద్వ్యర్ధి ) చేసి నావు నీ కయిత్తానికీ ,నీ పెగ్గేకీ అచ్చర కొట్లిచ్చాను .తీస్కెళ్ళు ”అని ఆజ్న జారీ చేశాడు నకిలీ ప్రతాప రుద్ర  మహా రాజు . కవి ఆనందించి కాళిదాస మహా కవి పూర్వం చెప్పిన సంస్కృత శ్లోకానికి  కవి చక్కని  తెలుగు పద్యం చెబ్తాడు .
”ఇతర పాప ఫలము లిచ్చ వచ్చిన యట్లు – వ్రాయ వయ్య మిత్ర వనజ భవుడ –అరసికాళి మ్రోల సరస కావ్యము సెప్ప –దలను వ్రాయ వలదు ,వలదు ,వలదు ” అని నెత్తీ ,నోరు బాదు కొంటాడు విద్వత్ కవి విద్యా నాధుడు .సభ అయి పోయింది .ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ,రాసా భాస చేసినందుకు జనార్దన మంత్రి కి కోపం వచ్చి పేరి గాడ్ని చెడా మడా తిడతాడు .”సామీ !మీకు దండ మేడతా .నా కిదంతా తెల్దు .బాబూనాకు  సదువోద్దు ,సదువు కొన్నాళ్ళ కంటే నా నెచ్చే  గందా ,నన్నెందుకు మా రాజా !సదువ్వు సెప్పి కులం సేరు పు తారు ?”అని సామెత ను సార్ధకం చేస్తూ మాట్లాడు తాడు .ఇందు లో వాడి అమాయకత్వమే కాదు -గడుసు దనమూ  వుంది . .వాణ్ని ఫూల్ చేద్దా మను కొంటె వాడే అందర్నీఇడియట్ లను   చేసి పారేశాడు ,గడుగ్గాయి అనిపించు కొన్నాడు   .ఈ సన్ని వేశం లో అందరి కడుపులు ”వీరణ మైనాయి ”అంటూ  ,జాగ్రత్త గా నవ్వా లని విద్యా నాద కవి సందేశామూ ఇస్తాడు .ఇదీ ఈ ”షష్ట అంకం .ఇది సర్వ శ్రేష్ట అంకం  .
స శేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.