వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –7
”సప్తమాంకం ”లో వలీఖాన్ ను బుట్టలో పడేస్తూ ,జరుగ బోయేది జ్యోతిష్యం గా చెబుతూ ,ఖాన్ కున్న దురాశ ను రెచ్చ గోతుంటాడు చెకుముకి శాస్త్రి .శాస్త్రి చెప్పి నట్లల్లా చేస్తానంటాడు ఖాన్ .అప్పుడు శాస్త్రి ”నా పొట్ట పెరగావాలా ,నా నోరు తియ్యా కావాలా ,నీవే లడ్డూ నవిలి పెట్టి ,నీవే మింగి పెట్టు ”అన్నట్లుంది నీ మాట అని ఖాన్ తో మేల మాడుతున్నట్లుంది శాస్త్రి మాటల ప్రవాహం .వలీఖాన్ పూర్తి మైకం లో పడి పోయాడు .మతి పోగొట్టు కొన్నాడు .అప్పుడంటాడు ”భాయీ నీకీ చూడ గానే నాకీ ”ఖాసా ”బుద్దే వుండదు .నువ్వు జోశ్యం చెబ్తావో ,ఉపాయం చెబ్తావో నీకీ తెలవదు .నేనూ ”కబోదీ ”వుంటాను .”అంతా నేవే తప్ప ఇతః పరం లేదు అని సరెండర్ అయి పోయాడు ఖాన్ .ఈ నాటకం లో సాఎబుల మాటలన్నీ హాశ్యాన్ని పండించేవే ,పిండిన్చేవే .ప్రతి మాటా ,ఒక నవ్వుల తూటా ,పేలి హాశ్యపు వెలుగు నిచ్చేదే .అవన్నీ రాయాలంటే పుస్తకం అంతా ఉదాహరించాల్సిందే .చదివి ఆనందిన్చాల్సినవే అన్నీ .
వెర్రి వాడి వేశం లో వున్న ”యుగంధర మంత్రి ”ధిల్లీ లో చేసే ప్రతి చేస్తా ,అన్న ప్రతి మాటా నవ్వులను రువ్వేవే .జందెం వీపు గోక్కోవ టానికి పనికి వస్తుందని వెర్రి వాడంటే ,ప్రక్కన వున్న శిష్యుడు ”ఆడ వాళ్లకు దురద లేదా ”?అంటాడు .
వెర్రి వాడు తక్కువ వాడు కాదు కదా ”వాళ్ల కుండేది వాళ్ల కుంది .నీ కుండేది నీకుంది .నాతొ వాదిస్తావూ? నేను ”ఖాజీ ”ని నీవు ”ఫాజీ ”వి అని సందేహ నివృత్తి చేస్తాడు .పిచ్చ కోపం తో శిష్యుల్నిద్దర్నీ బాడి పారేస్తాడు వెర్రి వాడు .అందులో ఒకడు
”కాయ సిద్ధి అయిన యోగీశ్వరుడు రా ,ఈయన దయ చేత మనకున్నూ ,కాయ సిద్ధి కావచ్చు ”అంటాడు .”మనకు సాధ్యా కాయ శిద్ధి అవుతూనే వుంది ”అని తాను తిన్నా దెబ్బలు గుర్తుకు తెచ్చు కొంటాడు ”కాయ సిద్ధి ”అంటే ”దేహ శుద్ధి” అనే భావం తో అద్భుతం గా శ్లేషిస్తారు వేదం వారు .
వేదం వారు మా కవుల ,పండితులు ,విమర్శకులు .ఆ స్తాయి చాలా కొద్ది మందికే వుండేది .అందుకే అల్లా టప్పా కవుల మీద ఆయన విరుచుకు పడ్డారు .తన భావాలను వెర్రి వాడి పాట తో విని పిస్తారు .”మొద్దు ,మొద్దూ కవుల బొద్దూ బుర్రల మీద ,బొద్దూ బుర్రల మీదా గుద్దు నా ముద్దు పాట .జబ్బూ జబ్బూ కవుల ,గబ్బూ పాటల మీద దెబ్బ నా లిబ్బి పాట .పుచ్చు పుచ్చూ కవుల చచ్చు పాటల మీద చిచ్చు ,నా మెచ్చు పాట .కూలీ కూలీ కవుల బోలూ పాటల మీద ,బోలూ మాటల మీద ,డోలూ నా మేటి పాట .మడ్డీ ,మడ్డీ కవుల ,రోడ్డూ మాటల మీద ,సొడ్డు నా లడ్డు పాట ‘అని అలాంటిలాంటి కవులను వాళ్ల పాటల ,,మాటల పేర్పుల్నీ ,వాయించి వదిలారు శాస్త్రి గారు .వెర్రి వాడితో చెప్పించినా గొప్ప వేదాన్తమే చెప్పించారు .అందరూ భుజాలు ఎగరేసు కోవాల్సిన పరిస్తితే. .”యమునా నది ని వల్ల కాటి ”నల్ల సామి చెల్లెలు ” చూచు చుండ ”అంటాడు వెర్రి వాడు .యమునా నదిని వల్ల కాటి నల్ల సామి చెల్లె లనటం చమత్కారం .ఆమె నల్ల దనానికీ ,అద్దం పట్టడం ,జాతి లక్షణం అనీ చెప్పటం కూడా .
”అష్ట మాంకం ”లో వలీఖాన్ దర్బార్ .సుల్తాన్ ,వలీఖాన్ ల సమా వేశం లో ఒకర్నొకరు హత మార్చాలని ప్లాన్ వేస్తారు .వలీ -సుల్తాన్ ను పొగడ్తల అగడ్తల లోకి తోస్తూ ,”బంద గానే ఆలీ రెండో అల్లా ”అని ముఖ స్తుతికి పెద్ద పీట వేస్తాడు .అక్కడే వున్న ఒక వజీరు ,ఖాన్ పన్నాగం తెల్సు కోని ,పొగడ్తలతో తననే మించి పోతున్నాడని భావించి ”నహి ,నహి ,సుల్తాన్ వారూ ,మొదల అల్లా ,అల్లా రెండూ అల్లా ”అంటాడు .ఇంతకు మించిన మునగ చెట్టు లేదన్నట్లు .తాను అన్న దానికి వజీర్ వివరణ కూడా ఇచ్చు కొంటాడు .
”సుల్తాన్ వారూ ,ఇప్దిస్తారూ -హల్లా రేపిస్తాడ్ –సుల్తాన్వారూ ఇప్పుడే కొడ్తార్ –హల్లా రేప్ కొడ్తార్
సుల్తాన్వారూ ,హగ్పద్తార్ ,-హల్లా హగ్పడరు –సుల్తాన్వారూ హింపద్తార్ -హలా ఇన్ పడడూ
సుల్తాన్ వారూ హన్తా నిక్షయ (నిశ్చయం )–హల్లా శందేఘం (సందేహం )
అందుకే సుల్తాన్ వారూ మొదలు అల్లా -హల్లా రెండల్లా ”
అని డప్పు విపరీతం గా వాయిన్చేస్తాడు .ఇంక తననెవరూ మించ లేడని .సందర్భాన్ని హాశ్యపు పంట తో నింపేశారు శాస్త్రి గారు .ఆయన ”హాస్య వేదం ”.అందుకే” హాస్య నివెదనే” అందించారు .ఇంకో సందర్భం లో వెర్రి వాడి బలాన్నీ ,దెబ్బల రుచినీ చూసిన ఒక జవాను సుల్తాను తో ”సర్కార్ !వాడికి సిన్ఘం (సింహం )వుంది ఒంట్లో .వాడూ సైతాన్ ,మన్సీ కాడు ”అని సందర్భోచితం గా చెప్పిస్తారు వంట్లో సింహం వుండటటం గొప్ప మాట .ఇంగ్లీష్ లో There is a very good father in him”
అన్న పలుకుబడి .
సుల్తాన్ తో సహా అందరు ,పడవల్లో చేరి ,వార్త కులు తెచ్చిన వజ్ర ,వైదోర్యాల్ని చూస్తూంటారు .ఒక నర్తకి ఆత్యం చేయ టానికి వస్తుంది .సుల్తాన్ మైకం లో పడి ”ఆ నాచీ వస్తే మేమూ కూడా ఆడుతాం ,లేదూ” మొగతాం ””అంటాడు .మొగతాం అనే మాట శాస్త్రి గారి coinage word .కాదు పుబ్బ నవ్వించే మాట .
”నవమాంకం ”లో యుగంధరుడు -ప్రతాప రుద్ర మహారాజును ,ధిల్లీ సుల్తాన్ ను తీసుకొని వరంగల్లు వస్తాడు .జనం తండోప తండాల్ల వీధుల్లో చేరతారు .అప్పుడొక స్త్రీ మరోకామే తో ”తొరగా రావో ,వోవిడో ,తొర గా రా ,ఇళ్ళకు పోదాం -ఆలస్సం చేస్తే ఈ రోజూ వీధుల్లో ,”నువ్వు గింజ రాలదు ”రాజోస్తాడట ,మన్త్రోస్తాదశ ”అంటుంది .ఇసకేస్తే రాలక పోవటం విన్నాం కాని ఇదో కొత్త ప్రయోగం .ఒక బ్రాహ్మడు భార్య తో ”ఓసీ !నా మూట నీవు మోసికొని పోదువా ,నేను కూడా గడి కోటకు పోయెదను ”అంటే ఆమె ”నావే నేను మోయ లేకున్నాను ,మీవి నేను మోయడ మేక్కడిది ?”అంటుంది .ఈ నాటి సినిమా డైలాగులకేమీ తీసి పోని రెండర్ధాల మార్కు మాటలు ఆనాడే వేదం వారు కుట్టారు .ఆ నాటి బ్యామ్మల వాక్ చాతుర్యాన్ని అద్దం లో చూపారు . మళ్ళీ రాజు గారు సురక్షితం గా చేరారన్న వార్త తో నగరం ఆనందం తో నిండి పోయింది .రాజు గారు అర్దుల కోసం బంగారాన్ని వెద జల్లు తున్నారు .ఆ పస్పు దనం తో ఆ కాశం అంతా నిండి పోయిందట .ఇక్కడ శాస్త్రి గారు రాసిన పద్యం హృద్యం
— ”నెర ఈరెండగా ,సంపెగ ,-విరి జడియన ,సంజె మొగులు విరిగి ,చిద్రుపలై
ధర బడే నానా ,బంగారు మల -కరగి ,కురిసే ననగా ,నింగి కడు బసుపయ్యేన్ ”
సువర్ణ వృష్టి అంత గొప్ప గా వుంది .”రత్న వర్షం -రక్త వర్షం ”లాగా కూడా కని పించిందట .రాజు గారు వూరేగుతుంటే ,ఆడ వారి చూపు లన్నీ ఆయన పైనే నిలిచి ,చూపుల గాలి పటాలు ఆడిస్తున్నారట . .
”ఆలోకము లేద ముడి యిడి –లాలస దారంబు గా ,నిలాపతి మేలన్
గీలించి ,మదను దాదేడు –గాలి పాడగా లైరి పౌర కాంతలు తరుణీ ”
రాజు గారి రెండు కళ్ళ చూపులు ,మనసు ,మూడూ కలిసి దారం గా ముడి వేయ బడి ,కోరిక పొడుగాటి పురి అయిందట .కోరిక తో చూసే ఆ నగర స్త్రీలు -గాలి పడగలే అయారట .మన్మధుడే ఆ గాలి పడగల్ని రాజు శరీరానికి కట్టి ,చిత్రం గా చూస్తున్న క్రీడా సక్తుడు అయినాదట . .అంటే అందరి స్త్రీల దృష్టీ రాజు మీదే వుంది .చాలా చమత్కార మైన వర్ణన .సందర్భోచితం కూడా .మహా మహోపాధ్యాయ బిరుదు సార్ధకం చేసు కొన్నారు వేదం వెంకట రాయ శాస్త్రి గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -12 -11 .