వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –8

వేదం వారి ప్రతాప రుద్రీయ నాటకం –8

                                               నాటక నిర్వహణ వైనం

—           తొమ్మిదో అంకం లోనే రాజును తెచ్చి ,యుగంధరుడు రాజ మాత ముమ్ము డమ్మ  కు అప్ప గిస్తాడు .తాను అన్న మాట నిల బెట్టు కొన్నాడు మంత్రి. రాజ మాత ఆనందం  వర్ణనా తీతం .కృతజ్ఞత తో ఆమె మనసు నిండి పోయింది .
”నాడు మహేష్వా రుండు కరుణా పరతన్ ,వరమీయ బ్రాతియై
పొడిగ ,నాదు గర్భమున ,బుట్టితి వంటిది ,బొంకు సుమ్మికన్
నేడు యుగంధర ప్రభు డనిద్ర కృపన్ ,వరమీయ ,బ్రాతియై
పొడిగ నాదు గర్భమున బుట్టితి వంట నిజంబు పుత్రకా ”
అంటుంది .తన కుమారుని పునర్జన్మ కు ”యుగంధర దేవుడే ”కారకుడన్న మాట .ఆమె హృదయం లోతుల్లోంచి వచ్చిన మాటలివి .క్రుతజ్ఞాతకు పరా కాస్త .ఇంతకు మించిన వాడు రాజ కుమారుడు .చిన్న వాడైనా ”మనం తాత గార్ని ఇలా వేల్పుగా కొలువ వలసినది కదా “అంటాడు .రాజు రక్త మహిమ .ఇదో మహా వాక్యమే .తగిన వారసుడని పించుకొన్నాడు .
వారం రోజులు విముక్తి ఉత్స వాలు జరుప వలసిందిగా ఆదేశిస్తూ ,,ఆ జామా ఖర్చులను రాజ సభ లో చదువ వలసిందిగా యుగంధర మంత్రి విశ్వాస రావు ను ఆజ్ఞా పిస్తాడు .పబ్లిక్ ఫండ్ ను ఎలా ఖర్చు చేసి జవాబు దారీ గా ఉండాలో తెలిపే రాజ నీతిజ్నత .
పెరి గాడు ,ఎల్లి కలుస్తారు .ఒక పరిజనుడు -ఎల్లి పేరి కోసం ఎలా తపించిందో చెప్తూ ”అది నీకోసం పడ్డా పాట్లు కతలు ,రామాండాలు ,పురాండాలు ”అంటాడు .రామాయణం ,పురాణం అంత వుంది అని వాడి భావం .అంతగా ఎదురు చూసిందని అర్ధం .”దూడ పేడ ,బర్రి పేడ (దూద్ పెడ్ ,బర్ఫీ )లెండి ముద్ద తిన నంటాడు పేరి గాడు అనుభవించిన రాజ భోగం గుర్తు చేసు కొంటు .తక్రు వాత తన అనుభవాలు ఏకరువు పేడ తాడు ”నాకు జందెం ఎసి నారు .ఈపంతా గుల గూలె .అది బాప నోళ్ళు యేసు కొనే జందెం .అదేస్కొంటే చచ్చి పోమా ?సాకలోల్లమే చీత్ ”అంటాడు .లెంపలేసు కొంటాడు ప్రాయశ్చిత్తం గా .తాను రాజ పరివారాన్ని ఎలా ఏది పించాడో చెబుతూ ”సరదంగాల (చదరంగం )కాదా ,కాయి ముందరికి తొయ్య మంటే ,ఎనక్కి తోయఎతం ,బాగా ఏది పించాన్రా ”అని తన్ను వాల్లెడి పిస్తే ,తానూ” టిట్ ఫర్ టాట్ ”చేసి నట్లు  చెప్పాడు .వాడెం తక్కువ వాడు కాదు .మొండి ముండా వాడు .తాను ఎక్కడికెళ్ళినా పల్లకీ మోత .దాన్నే వాడి మాటల్లో ”నాను ఎక్కడ్కేల్లినా ,వొం భోయ్ ,వొం భోయ్ ,వోమ్భోయ్ ”అంటాడు .ఏ గుడికెల్లినా ”చట కోపాలే” (షడ గోపురం ) ఇంతలో ఒకడు” కోపం” అనుకోని
”నాక్కోపమొస్తే చట కోపం కాదు -చట ,చట ,చట ,కోపం ”అంటాడు వాడి మాటకు అర్ధం తెలీకుండానే .వీళ్ళకు  అర్ధం కాలేదని పేరి గాడు గ్రహిస్తాడు .”చతగోపం నమ్బాసార్లు ,ఆయ వొర్ల వోరు ,పూజారయ్య వోరు మారాజుల బుర్ర మీదేట్టేది .నా బుర్ర మీదేట్టి తే నాను తియ్యోద్దని జగడ మాడె వాన్ని ”అని చెబుతూ ,వాళ్ల అమాయ కత్వాన్ని కాష్ చేసుకోవాలను కోని ”ఈళ్ళతో ఏమి సెప్పినా ,నమ్ముతారు నాయాళ్ళు ”అని కోసేస్తాడు .బుద్ధి రావా టానికి తన తల మీద షత కోపం ఉంచారని దబాయించి  చెప్పాడు .
ఒక రోజూ బాపన మారాజులు తనను ”పెరిగా ,పెరిగా ,దూడ   పేడ తింటావా ”అని అది గారనీ ,”అత్తిని పిట్టారా ,మారాజా ,నా శాత ”అని తాను ఏడ్చాడట .”ఆల్లు ఎవోరి కడుపు లాలలు పిసుక్కొంటూ నవ్వారట ”మన్ర్త్రు లంతా .అదీ వాడి నిర్వాకం .ఇంతలో ఒకడికి అనుమానం వచ్చింది .వీడు బ్యామ్మలు అంతా డేమిటి అని .వూర్లో సంగతి ప్రకారం తురకలు రాజుగా భావించి తీసుకెళ్ళారు కదా .అందుకే ”ఒకరి కడుపు ఒకరు పిసికితే గదంత్రా నొప్పి తీస్తది -మళ్ళీ బ్యామ్మల్లంటావు ,తుర కోళ్ళు రా ,ఆళ్ళతెలియన్తే   ”అని తురకలు తెలివి లేని మూర్ఖులని ,ఈ మూర్ఖ శిఖామణి తీర్పు .ఇలా ప్రతి సందర్భం లోను చెణుకులు ,చెకు ముకులు ,రాల్తూనే వుంటాయి .దూడ పేడ (దూద్పేడ్ )ఎలా వుందంటే ”దూడ పేడ ఇరవ   కుండా కాలిస్తే ,ఆ ఎలి బూదిడున్తడే అలా వుంది .పచ్చిది కాదు గదా అను కోన్నా .ఎలి బూడిదే తినలేను మా రాజా అని ఏదిశినా ”అంటాడు పేడా పీడనం తో .అది తిన గానే ”నోరంతా మదనం ,పల్లంతా మదనం ,కళ్ళు ,సెవులు ,ముక్కంతా ,మదనమే ”అని వర్ణిస్తాడు .మధురానికి వచ్చిన తిప్పలే ఇవి .మనకి నవ్వూ ,వాడికి దానిపై లవ్వూ .రుచి మరిగి ”నాకు పేడే ఎట్టండి -కూడు వొద్దు  ”అనే వాడట .”ఆరు సాకలోడికి ఇయ్యన్నీ యెడ తామా ,అని బర్రి పేడ మాత్రం ”ఎట్టే వారట .
”తాను పెత్తాత  దురద మారాజు” (ప్రతాప రుద్ర మహా రాజు)నంటాడు .నవ్వు దురద మనకు అంటిస్తాడు .ఒక మడే లు   తాను ఉతుకు వీరుడు గా ఎంత గొప్ప వాడో చెబుతూ ”నాక్కోపమొట్టే ఉదాకటం క్షణం ,గుడ్డంతా ,నూలంతా పీసులై యెగిరి పోవడమే .మురికంతా నా శాత నిలవటమే ?”అని ప్రగల్భాలు ,బీరాలు పలుకు తాడు .పేరి గాడు తన కధ చెబుతూ ”ఓబ్యామ్మడు ”సలవ మడతల కయిత్తం ‘సేసి నాడు ”అంటాడు .వీడి పైత్యం ముదిరి ”మురికి గుడ్డా లుతికే కంపెల్లివి ,ఇంక నువ్వు నాకు పనికి రావు -పెత్తాత దురద మా రాజు కేంటి ,కంపెల్లి పెల్లామేంటి “”అని పెళ్ళాం ఎల్లి కి నీల్లోదిలేస్తానంటాడు ,ఆ గెటప్ ,ఆ టచ్ లో .
ఇక దశామాంకం లోకి ప్రవేశిద్దాం .ఓరుగల్లు ప్రతాప రుద్ర మహా రాజు గారి మహా సభ.రాజు ,మంత్రులు ,ధిల్లీ సుల్తాన్ అంతా సుఖాసీనులై నారు .రాజ కుమారుడిని చూసి సుల్తాన్ ”తుపాకీ కడుపునా ఫిరంగి ”అని పొగుడు తాడు .సహజమైన మాట .ఫోర్సు ఫుల్ గా వచ్చిన మాటే .పేరి గాదని చూసి సుల్తాన్ ”మళ్ళీ వీడ్కి చూడడం హన్మానం ఎలాగా తింటాం “”అను కొంటాడు .పేరి గాడికి గూని వుంది .తాను ధిల్లీ లో చూసిన రాజుకు గూని లేదు .అనుమానం వచ్చింది ”ఇపడు వీపు కోతివంగ్తాద్ -హల్లా హల్లా ,”అని కుయ్యోయ్ ,మోయ్యోయ్ అవుతాడు .యుగంధర మంత్రి ప్రవేశించ గానే ”సలాం! జగద్గాభారా మంత్రీ యుగంధర్దేవ్ మహా రాజ్ ”అంటాడు సుల్తాన్ .నిజం గానే అంత గాభరా చేశాడు కదా మంత్రి పుంగవుడు .తగ్గట్టే అన్నాడు ,సాయిబైనా చాల సరిగ్గానే .పేరి గాడి ,ఎల్లి కేసు పరిష్కారానికి వాదోప వాదాలు జరుగు తాయి .చెకు ముకి శాస్త్రి ”చదువు కున్నా గూని పోలేదు .కనుక వీడు ,చాకలోల్లలో చెడ లేదు .కావున ఎల్లికి పనికి రాడు అనటం తప్పూ ”అని చెప్ప గానే పేరి గాడ్ని ఎల్లిని ఏలుకోమని తీర్పు ఇస్తాడు మహా రాజు .
ఈ విధం గా”ప్రతాప రుద్రీయ నాటకం ”లో ప్రతి అంగుళం లోను ,హాశ్యపు రాజనాలు పండించి ,హృద్యం గా ఆంద్ర సరస్వతి కి నీరాజనాలు అందించారు పుంభావ సరస్వతూ లైన బ్రహ్మశ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారు .యుగంధరుని చాక చక్యం లో హాశ్యం,అంతస్సూత్రం గా ఆసాంతం ప్రవహించి,నాటకానికి తుష్టిని ,పుష్టిని సంతుస్టిని అందిస్తుంది .వేదం వారి ,లోకజ్నత కు అద్దం పట్టే నాటకమిది .అదొక మాటల  ఝారి .ప్రతి చిన్న సంఘటన లోను అతి జాగ్ర్తత్త వహించి ,పాత్రలను తీర్చి దిద్దారు .ప్రతి పాత్ర తాను అనుకొన్నది సాధించేట్లు ,శాస్త్రి గారు పరకాయ ప్రవేశం చేసి ,పాత్ర స్వరూపాలను మలిచారు .ఊహలకు చక్కని పద చిత్రాలు కట్టారు .కమ్మని ,జన సామాన్య మైన పలుకుబడులు ప్రయోగించారు .జాతీయాలను పొది గారు .కొత్త మాటలను కూర్చి word finder  అయారు .తురక భాషను చాలా చక్కగా ,ప్రయోగించారు .ఎంతో పరిశీలనా ,అనుశీలనా ఉంటేనే కాని పట్టు బడని భాష ను అతి సునాయాసం గా రాసి ఆశ్చర్య  పరచారు శాస్త్రి గారు .దానికి వన్నె ,వాసి కల్గించారు .విలువనూ చేకూర్చారు .ప్రభు భక్తీ పరాయనత్వానికి ,దేశ స్వాతంత్ర్య రక్షణకు నడుం కట్టిన యుగంధరాదుల సేవకు ,చిరస్మర నీయ మైన స్మృతి చిహ్నమే ఈ నాటకం .చదివిన కొద్దీ చవులూరిస్తుంది .నవ్వి ,నవ్వి కవ్వించే నాటకం .ఆ మహా రచయిత కు ఆంద్ర దేశం ఎంతో రుణ పడి వుంది .ఎన్నో కావ్యాలకు అర్ధ తాత్పర్యాలు రాసి ప్రచురించిన పరిష్కర్త ,పరిశీలకులు వేదం వారు .ఆయన మేధో జనిత మైన ,స్వయం కృషి తో కూడిన ఫలమే ”ప్రతాప రుద్రీయం ”
చారిత్రాత్మక మైన కధకు ,చరితార్ధమైన రచనతో ప్రాణ ప్రతిష్ట చేశారు వేదం వారు .రాజు గారి వ్యక్తిత్వం under current  గా వున్నా ,మంత్రి గారి మహత్వం డామినేట్ చేసి రక్తి కట్టించిన నాటకం ఇది .ప్రతాప రుద్రీయం ను మొదటి స్వతంత్ర నాటకం గాపరిగనిస్తారు . .ఆంద్ర జాతీయ నాటకం కూడా  ఇదే .కధకు ఆధారం ఏమీ లేదు .ఆయన ఎనిమిదవ ఏట ,వారి నాయన గారు ”ధిల్లీ సుల్తాన్ ,ప్రతాప రుద్రుని ఖైదు చేసి తీసుకొని వెళ్ళాడు ”అని చెప్ప గా విన్న మాటే ఈ నాటకానికి ప్రేరణ .అదే కధకు మూలమైన బీజం .మిగతా దంతా శాస్త్రి గారి స్వకపోల కల్పితమే  .విద్యానాధుడు ,ప్రతాప రుద్రుని సమకాలీనుడవటం మాత్రం చారిత్రిక సత్యం .
లోక స్వభావం ,లోక వృత్తాల అనుకరణ ,తో వ్రాసిన తొలి నాటకం ఇది .పాత్ర లందరి చేత ,పాత్రోచిత భాష ను ప్రవేశ పెట్టటం వన్నె తెచ్చింది .చిన్నప్పటి నుంచీ ,మనుష్యుల తీరు ,వేషభాషలు పరిశీలించే నేర్పు వుండటం వల్ల నే ఇంత గొప్ప రచన చేయ గలిగారు .1897 లో ప్రచురణ పొందిన నాటకం .నాటకం లోని పద్యాలు వేదం వారి కవితా శక్తికి మచ్చు తునకలు .వేదం వారు భాషా ప్రపంచం లో ,సర్వ స్వతంత్ర స్వతంత్రులు .సర్వాది కారి కూడా .పరమ ప్రామాణికులు .పరి పూర్ణత ,సమయ స్ఫూర్తి ,సందర్భ శుద్ధి ,మేధా శక్తి ,ప్రతిభ ,ప్రజ్న ,ప్రయోగ కౌశల్యం ,హాస్య విలాసం ,ఛలోక్తి ,మూర్తీభవించిన వారు వేదం వారు .వీరి రచనలు పైకి కఠినం గా వున్నా ,చొరబడి చదివితే ద్రాక్షా,కదళీ పాకాలు కన్పిస్తాయి .కవిత్వం లో బింకం ,శబ్ద ప్రయోజనం ,అపు రూపం .నిజం గా రస ద్రష్ట ,శబ్ద స్రష్ట శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారు చిరస్మర నీయులు .,వారి నాటకం చిరస్మరణీయం .వారి పద్యం తోనే శుభా శంస  తెలియ జేస్తున్నాను .
”అంకెకు దార్చే నే ,రసికు నంగల భారతి ప్రౌఢ నీతి ,నా
కింకిరి ,నాన్ధ్రి  ద్రావిడియు ,గేరుచు ,దైవియు ,గూడి రెవ్వరున్   ,
జంకు ,కలంకు లేని ,కవి చంద్రుడు ,తోషిత కోవిదేన్ద్రుడా
వేంకట రాయ శాస్రి కృతి ,వెంగలి మూక లెరుమ్గా  శక్యమే ”
సమాప్తం —-         మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.