దివ్య ధామ సందర్శనం –1
1998 లో మేము కేదార్ నాద్ ,బద్రీ నాద్ మొదలైన దివ్య ప్రదేశాల సందర్శనం చేశాం .వాటి విశేషాలను వ్రాసి ఉంచాను అప్పుడే .వాటిని ఇప్పుడు మీకు ”దివ్య ధామ సందర్శనం ”పేరు తో మీ ముందుంచుతున్నాను .మాతో పాటు మీరు కూడా యాత్ర్రాను భూతి పొందుతారనే భావమే ,నన్నీ పనికి ప్రేరేపించింది .దీని నేపధ్యం 1998 అని గమనించ గలరు

;”గత మూడు సంవత్సరాలు గా ,కేదార్ నాద్ ,బద్రీ నాద్ క్షేత్ర సందర్శనం చేయాలని చిన్నక్కయ్య దుర్గా ,బావ వివేకానంద్ గార్లు ,మమ్మల్ని ఒత్తిడి చేస్తూనే వున్నారు ,.ఎందుకో సాహసం చేయ లేక పోయాం.96 లో వాళ్ళుఅమెరికా మూడో సారో నాల్గో సారో వెళ్లి ఏప్రిల్ లో వచ్చింతర్వాత ,మళ్ళీ ఆలోచన వచ్చింది .98 లో వాళ్ళు ఉయ్యూరు వచ్చి వెళ్ళిన తర్వాత , ఈ సారైనా తప్పక వెళ్లి తీరాలని పట్టు బట్టారు .ఒకరికొకరం తోడుంటాం ఇబ్బంది వుండదు అన్నారు .శ్రీ మతి ప్రభావతీ సరే నంది .హోం డిపార్ట్మెంట్ నుంచి clearance వచ్చేసింది కనుక ,బావ ను prograamme chalk out చేయమని చెప్పేశాను .ఇంక ఆయన రెట్టించిన ఉత్సాహం తో రంగం లో కి దిగారు .ధిల్లీ నుంచి రావు ట్రావెల్స్ వారి బస్ లో వెళ్లాలని నిర్ణయించు కొన్నాం .ఇంకేముంది ,మార్చ్ చివర్లోనే హైదరాబాద్ నుంచి ధిల్లీ కి ఏ.పీ.ఎక్ష్ప్రెస్స్ లో బయల్దేరా టానికి ,ఏప్రిల్ ౩౦ న ప్రయాణం సాగించ టానికీ ,టికెట్స్ రిజర్వు చేయించాడు మా బావ వివేకానందం గారు .రిటర్న్ టికెట్స్ దక్షిణ ఎక్ష్ప్రెస్స్ లో ఫస్ట్ క్లాస్స్ లో మే 13 న బయల్దేరి 15 కు హైదరా బాద్ చేరేట్లు రిజర్వు చేయించాడు .ఆయనే ఎప్పటికప్పుడు ఫోన్ లో వివ రాలు తెలియ జేస్తున్డటం మేము వో.కే.చేబుతూన్డటం జరిగింది .ఆయనే డబ్బు ముందు పెట్టుబడి పెట్టి ,కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు బావ .మాకేమో అంతా ,అయోమయం గా ,వింతగా ,కొత్త గా వుంది .ఏం సర్డుకోవాలో ,ఎలా ,ఏర్పాటు చేసుకోవాలో నని కంగారు .

1998 ఏప్రిల్ 23 న స్కూల్ స్ కు లాస్ట్ వర్కింగ్ డే .అప్పటికి నేను అడ్డాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాను .జూన్ నెలాఖరుకు నా పదవీ విరమణ కూడా .సాధారణం గా జీతాలు చివరి వర్కింగ్ రోజునే ఇస్తారు .ఈసారి ఇవ్వలేదు .మర్నాడు ఇచ్చారు .24 న చెక్ మార్చి జీతాలు బట్వాడా చేసి ఆ రోజూ రాత్రికే హైదరాబాద్ బయల్దేరాం .25 ఉదయం మా రెండో అబ్బాయి శర్మ వాళ్ల ఇంటికి చేరాం .అక్కడే మా పెద్దబ్బాయి శాస్త్రి కుటుంబం కూడా వచ్చి వుంది మా కోసం .మనవడు సంకల్ప తో కాల క్షేపం .శర్మస్నేహితుడు ,నా శిష్యుడు చంద్ర శేఖర్ కూడా అక్కడ కలిశాడు .మా దగ్గర సర్దు కోవాటానికి మంచి పెద్ద బాగ్ కూడా లేదు .శర్మ బాగ్ తీసుకొన్నాం .26 ,27 వర్షం పడింది .28 న నేను సామానుతో మా మేనల్లుడుఅశోక్ ఏర్పాటు చేసిన స్టేట్ బాంక్ వాళ్ల కార్ లో ఓల్డ్ బోయినపల్లి లో వున్న మా అక్కయ్య వాళ్ల ఇంటికి చేరాను .మర్నాడు ఉదయం శర్మ ప్రభావతిని స్కూటర్ పై తీసుకొని వచ్చి దింపి వెళ్ళాడు .ప్రయాణానికి కావలసిన వన్నీ అక్కయ్య ,ప్రభావతి అశోక్ భార్య సంధ్య తయారు చేశారు .అన్నీ చక్కగా వేటి కవి సర్దారు .అమెరికా లో ఉంటున్న మా రెండో మేనల్లుడు శాస్త్రి రోజూ ఫోన్ చేసి వివరాలు తెలుసు కొంటూనే వున్నాడు ..మా కంటే వాడికే ఎక్కువ ఉత్సాహం .౨౮ సాయంత్రం నేను బావా ,నారాయణ గుడా లోని రావు ట్రావెల్స్ వారి ఆఫీసుకు వెళ్లి అన్నీ వివరం గా తెల్సుకొని కన్ఫర్మ్ చేసుకోన్నాం .బజార్లో రసం మామిడి పళ్ళు కొన్నాం .అవసరమైన నిమ్మకాయలు కొన్నాం .వాటి తో మర్నాడు కాన్ centrated జూస్ చేసి సీసాలో నిలవ చేశారు దారిలో ఆరగా ఆరగా తాగ టానికి .
.మామిడి కాయల తో ఆవ కాయ వేశారు .తొక్కుడు పచ్చడి పెట్టారు

ఏప్రిల్ 30 న గురువారం తెల్ల వారు ఝామున అక్కయ్య ,ప్రభావతి ,నిద్ర లేచిస్నానాలు పూర్తి చేసి ,ట్రైన్ లో భోజనానికి సరి పడ వంట -పూరీ ,మామిడి కాయ పప్పు ,వంకాయ కూర ,పులిహోర చేసి ఆరు గంటలకల్లా రెడీ చేశారు .అశోక్ స్టే బాంక్ వాళ్ల చిన్న కారు ఏర్పాటు చేశాడు .మా చివరి అబ్బాయి రమణ కూడా కిందటి రోజూ రాత్రే ఇక్కడికి వచ్చాడు .అందరం ఆరున్ననర గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరాం .సామానంతా మేమే ప్లాట్ ఫాం మీదకు మోశాం ..మొత్తం 15 శాల్తీలు .ఉదయం 07 -30 లకు ఏ.పీ.express ఠీవిగా ప్లాట్ ఫాం మీదకు వచ్చింది .ఎస్ 2 కంపార్ట్మెంట్ లో మా సీట్స్ లో క్పూర్చున్నాం .అశోక్ ,రమణ టాటా చెప్పి వెళ్లి పోయారు .”రచన ”మాస పత్రిక కోని ఇచ్చి వెళ్ళాడు మేనల్లుడు అశోక్ .దానితో కొంత కాల క్షేపం .secundera bad నుంచి సుమారు అయిదు గంటల ప్రయాణం ఆంద్ర ప్రాంతం లోనే .ఇంత దూరం ఆంద్ర దేశం వ్యాపించి వుందని మహదానందం పడ్డాం .బెల్లం పల్లి ,సిర్పూర్ కాగజ్ నగర్ దాటింతర్వాత మెల్లగా భోజనం ప్రారంభించాము .ఇంటి నుంచి తెచ్చుకొన్న కమ్మని పదార్ధాలతో కడుపు నిండా భోజనం చేశాం .బెల్లం పల్లి లో చౌకగా అరటి పళ్ళు కొన్నాం .ఆరగా ఆరగా వాటిని లాగిస్తూ నీళ్ళు తాగుతూ ప్రకృతి ని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించాం .సికంద్రా బాద్ నుంచి ధిల్లీ 1600 కిలోమీటర్లు . మధ్యాహ్నం రెండు గంటలకు బెర్త్ ల పై చేరాం .నాలుగు గంటలకు నాగ పూర్ వచ్చింది .ట్రైన్ చాలా స్పీడ్ గా దాదాపు nonstop గా ప్రయాణం చేసి నట్లుంది .నాగ పూర్ స్టేషన్ లో ఒక రూపాయికి ఒక సీసా చల్లని నీటిని ఒక దాత ఎవరో అంద జేస్తున్నారు .మా దగ్గర వున్న మిల్టన్ నిండా అయిదు రూపాయలు ఇచ్చి నీళ్ళు పోయించు కొన్నాం .ఐసు కోని నీళ్ళ లో కలిపాం . మధ్య మధ్య లో రసనా ,నిమ్మ రసం ,తాగుతూనే వున్నాం .వేసవి వచ్చేసింది కదా .తాపం బాగా వుంది .ఒక సీసా తో తెచ్చుకొన్న మజ్జిగ కూడ అడపా దడపా లాగిస్తున్నాం .నాగాప్పోర్ కు అటు ఇటు అన్నీ కమలా తోటలే .కనుల పండువు గా వున్నాయి .ఇంకా కాపుకు రాలేదు
.ఎక్కడికక్కడ బోర్ లు వేసి నీరు అందిస్తున్నారు తోటలకు .పచ్చటి పొలాలు కంటికి కని పించనే లేదు .రైలు మార్గం వంకర టింకర గా వుంది .ఎత్తుకు ఎక్కి నట్లు అని పిస్తోంది .రాత్రి ఏడు గంటలకు స్నానాలు ప్రారంభించి ఎనిమిదింటికి అందరం పూర్తి చేశాం .వెంట తెచ్చు కొన్న చపాతి ,కూరా ,సుబ్భారం గా లాగించాం .కడ్డుపు నిండా మజ్జిగ తాగాం .ఎన్నో ఏళ్ళు గా కళలు కన్న ది తీరు తోందని ఆనందం తో బెర్త్ మీదకు చేరి హాయిగా పడుకోన్నాం .రచన పుస్తకం దాదాపు చదివేశాను .మధ్యలో ఏయే stationlu వచ్చాయో తెలీదు .తెల్ల వారు ఝామున మెలకువ వచ్చే సరికి ధిల్లీ కి దగ్గర లో వున్నాం అని పించింది .దంత దావనాదులు పూర్తి చేసి రైల్వే కాఫీ తాగాం .ట్రైన్ లో pantri కార్ వున్నా రూపాయి పెట్టి ఇంత వరకు ఏదీ కొన లేదు .