ఊసుల్లో ఉయ్యూరు –7 శ్రీ గురుభ్యోం నమః

ఊసుల్లో ఉయ్యూరు –7

                                   శ్రీ గురుభ్యోం నమః
ఇవాళ నేను మీ ముందుకొచ్చి నాలుగు మాటలు రాసే అవకాశం కలగ టానికి కారణం నాకు సెకండరి స్థాయి వరకు విద్య నేర్పిన గురు వరేన్యులే నని నా పూర్తి విశ్వాసం .వారందర్నీ ఒక్క సారి గుర్తు చేసుకొని గురు ఋణం తీర్చుకోవాలని చేస్తున్న ప్రయత్నమిది .
నాకు ఓన మాలు నేర్పిన గురువు గారు శ్రీ కోట సూర్య నారాయణ గురు వరేన్యులు .వారు నల్లగా లావుగా వుండే వారు .గంభీర మైన ముఖం .చూడ గానే భయం కలుగుతుంది .కాని చదువు చెప్పేటప్పుడు ఆత్మీయత ను అంతా ఒలక బోసి చెప్పే వారు .ప్రత్యెక శ్రద్ధ చూపే వారు .దాదాపు అర ఎకరం అంత విశాలం గా వుండేది వారి వీపు .బెత్తం చేతి లో ఎప్పుడూ వుండేది .అన్ని సబ్జెక్టులు ఆయనే బోధించే వారు .మూడో క్లాస్ వరకు వారి దగ్గరే చదివాననాను కొంటా .వారిల్లు మా ఇంటికి దగ్గరే దేవుల పల్లి సీతక్కాయ్ ,కామక్కాయ్ గారింట్లో అద్దెకుండే వారు .ఆయన జ్యోతిష శాస్త్ర వేత్త కోట శ్రీ రామ మూర్తి గారికి తమ్ముడు .మా ఇంటిదగ్గర చింత చెట్టు బజారుకు అంటే సందు చివరవుండేది .దాని బెత్తాలు ,వేప బెత్తాలు ,ఈత బెత్తాలు ఆనాడు వీపు మీద మోగించే వారు .దెబ్బకు దయ్యం ఝడ వాల్సిందే.భయం ,భక్తీ ఉండేవి మాకు .నాకు అప్పుడప్పుడు కోపం వక్చ్చి ఆయన దగ్గరకు వెళ్ళే వాణ్ని కాదు .కానీ ఆయనే మా ఇంటికి వచ్చి ,భోషాణం మీద అలిగి పడుకొన్న నన్ను బుజ్జ గించి తీసుకొని వెళ్ళే వారు .లేక పొతే పిల్లల్ని పంపే వారు .వెళ్ళే వాడిని .తెల్లని పంచ ,చొక్కా తో వుండే వారు .గంభీర మైన వాక్కు .ఎంత దూర మైనా విని పించేది .ఎక్కాలు ,అక్షరాలూ సామూహికం గా చెప్పించే వారు అప్ప గించు కోవటం వుండేది .పద్యాలు అందరితో అని పించే వారు .నోటిలెక్కలు   చెప్పించే వారు .అన్ని క్లాసుల వారు వుండే వారు . కోపం వస్తే వీపు విమానం మోతే .గురు పత్ని కూడ చాలా మంచి వారు .మా కుటుంబానికీ .మేస్టారి కుటుంబానికి మంచి దోస్తీ వుండేది .నాన్న  గారికి మేస్తారంటే శిష్య వాత్చల్యం .ఆయనకు నాన్న అంటే గురు భక్తీ .ఆ తరు వాత నేను నాల్గవ తరగతి ఐదో తరగతి హిందూ పూర్ లో చదివాను .కనుక తర్వాత  మేస్టారి సంగతి మాకు తెలీడు . .1950 లో  మేము ఉయ్యూరు వచ్చేసరికి ఆయన గుడివాడ దగ్గర బేత వోలులో   ఉంటున్నట్లు తెలిసింది .నాకు వారే తొలి గురువు గా జ్ఞాపకం .వారిని నేనెప్పుడు మరిచి పోలేను .ఆ ప్రభావం అలాంటిది .1974  లో మా అన్న గారి కుమార్తె వేద వల్లి ని వేలూరి రామ కృష్ణ కు ఇచ్చి  వివాహం చేసినప్పుడు,గుడివాడ దగ్గరబేత వోలు లో  వాళ్ళు మేస్టారి ఇంటికి దగ్గరలో వున్నట్లు తెలిసి మేస్తారింటికి వెళ్లాం  .అప్పటికే ఆయన కాలమ్ చేసి నట్లు తెలిసి విచారించాం .గురు పత్ని ని దర్శించాం .వాళ్ల పిల్లలు రామ క్రిష్న కు క్లాస్ మెట్లు అదీ కోట సూర్య నారాయణ మేష్టారు గారి విషయం .నాకు నాలుగు ముక్కలు నేర్పిన మేస్టారికి చాలా రుణ పడి వున్నాను ..
ఆ తర్వాత నాకు ఇంగ్లీష్ నేర్పిన గురువు గారు ఆది రాజు శ్రీ రాములు గారు .చొక్కా వుండేది కాదు పంచె ,తువ్వాలు తో వచ్చే వారు ,మా ఇంటి దగ్గరకే వచ్చి tution చెప్పేవారు .”ఇంగ్లిష్ అక్షర మాల ”అని వట్టి వట్టి పలికే వారు అక్ష రాలు . రాయించటం ,దిద్దించటం చేసే వారు .రాయల్ ఇంగ్లీష్ వాచకం నేర్పించారు .కాస్తో కూస్తోఇంగ్లీష్   అక్షరాలూ మాటలు శ్రీ  రాములు మేస్టారి వల్లనే అబ్బాయి .కొంచెం ముక్కు తో మాట్లాడే వారు .నిర్దుష్టమైన బోధన వారిది .మరపు రాని గురువు వారు ,వారి అక్క సీతమ్మ గారు మా ఇంటికి తరచు వచ్చే వారు .అమ్మ తో మంచి దోస్తీ .ఆవిడ ఎప్పుడు వ్రతాలు ,భజనలు ,పూజలు తో మంచి కాల క్షేపం చేసేది . .
నా చదువు అనంత పురం జిల్లా హిందూ పుర లో కొంత జరిగింది .నాలుగైదు క్లాసులు అక్కడ చదివాను .నాన్న గారు అక్కడి యి.సి.ఏం.హై స్స్చూల్ లో సేనిర్ తెలుగు పండిట్ .ఇరవై రెండేళ్ళు అక్కడే పని చేసి ,ఆ సర్వీసు తో కృష్ణా జిల్లాకు 1952   లో బదిలీ అయారు .నేను గడ్డమీద ఎలిమెంటరీ లో చదివాను ఆస్సీర్వాదం గారు నాకు నాల్గవ తరగతి క్లాస్ టీచర్ .నల్లగా స్పోటకం మచ్చలతో .మెడలో ఊలు మఫ్లర్ తో వచ్చే వారు పంచె కట్టే వారు కోటు వేసే వారు .ఇంగ్లీష్ బాగా చెప్పే వారు .ఇరావతమ్మ అనే ఒక టీచర్ గారు సైన్సు చెప్పే వారు .ఆవిడ ముఖం అంతా కాళి వికృతం గా వుండేది .తెల్లని చీర తో వచ్చే వారు .మంచి బోధకులావిడ .తెలుగుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చే వారు .పంచ ,చొక్కా ,కోటు ,వీభూతి రేఖలు ,పిలక తో వుండే వారు .బాగా చెప్పే వారు .ఆయన కన్నడిగులని జ్ఞాపకం .”కలకలం” అంటే గద్దలము అని వారు చెప్పిన అర్ధం ఇప్పటికీ జ్ఞాపకం వుంది .పద్యాలు బట్టీ పట్టించి అప్ప గించు కొనే వారు .ఆయనంటే భయం గా వుండేది .నాన్న కు ఆయనంటే చాలా ఇష్టం .అయిదవ తరగతి క్లాస్ టీచర్ ఇరావతమ్మ గారే .ఆశీర్వాదం మేష్టారు లెక్కలు చెప్పే వారు .మిగిలిన మేస్టార్లు గుర్తు లేరు .రాయప్ప మేష్టారు డ్రాయింగ్ ,సంగీతం చెప్పే వారు .పంచె కట్టు కోని చొక్కా మీద కోటు వేసుకొని సన్నగా వుండే వారు .ఫ్లూట్ బాగా వాయించే వారు .ఆయన్న అంటే అందరికి విపరీత మైన గౌరవం వుండేది .అంతా మంచి ఉపాధ్యాయులే .ఒక సారి నేను స్కూల్ కు ముందే వెళ్లాను .gate తీసి లేదు .చువ్వల gate అది కొచెం ఖాళీ లుండేవి .అందరు రెండు చువ్వల మధ్య ఖాళీ లోంచి తల దూర్చి లోపలి వెళ్ళే వారు .నేనూ అలాగే దూరు దామని ప్రయత్నించాను ,నా తల అందు లో ఇరుక్కు పోయింది .బయటికి రాలేదు .ఇంతలిఆ రాయప్ప మేష్టారు వచ్చారు .నా పరిస్తితి గమనించి ,చాలా ఉపాయం గా నా తలను తప్పించి బయటికి తీశారు . ఒక రకం గా రాయప్ప మేష్టారు నా ప్రాణ రక్షకులు .పునర్జన్మ నిచ్చారు .మళ్ళీ ఇలాంటి పనులు చేయ వద్దని హితవు చెప్పారు .కోప పడ లేదు .కొట్ట లేదు .తిట్ట లేదు .చాలా మంచిగా చూశారు .ఆయన రోజూ మా ఇంటి ముందు నుంచే వెళ్ళే వారు స్కూల్ కు .
అంతటి సహృదయులు అరుదు .వారికి ఏమిచ్చి ఋణం తీర్చు కో గలను ?ఒక నమస్కారం హృదయం తో పెట్టటం తప్పా.ఇలా జ్ఞాపకం చేసుకోవటం తప్ప ?ఆ స్కూల్ లో నా సహాధ్యాయులు అబ్బాయి ,చలపతి రావు ,సోమ సుందరం ,దక్షిణా మూర్తి .నాగ రత్నమ్మ ,సునంద ,మొదలైన వారు .
ఉయ్యూరు లో మళ్ళీ చదువు ప్రారంభించాం .ఇక్కడ ఎనిమిదవ తరగతికి ఎంట్రన్సు పరీక్ష రాసి హై స్కూల్ లో చేర్చాలని మా వాళ్ల సంకల్పం .ప్రైవేటు గా చదివి పరీక్ష రాయాలి .దానికి అప్పుడు కొబ్బరి తోట లో ఉంటున్న శ్రీ వేమూరి శివ రామ క్రిశయ్య గారు సమర్ధులు అని మామయ్య గంగయ్య గారు వారి దగ్గర చేర్పించాడు ఆయన పంచ కట్టి ఉత్తరీయం వేసి విభూతి పెడితే అపర సదా శివుడు గా వుండే వారు .మంచి వర్చస్సు వారి ముఖం లో కన్పించేది    .కళ్ళు కాంతి వంతం . ఒకటో తరగతి నుంచి అక్కడ అందరు చది వే వారు .మేము ఎనిమిదికి తయారవుతున్నాం .మాస్టారు అన్ని సబ్జెక్టులు బోధించే వారు .అందరి విషయం పట్టించు కొనే వారు .ఎక్కాలు చెప్పించే వారు .ఇంగ్లీష్ చాలా గొప్ప గా బోధించే వారు .లెక్కలు చాలా బాగా అర్ధం యెట్లు చెప్పే వారు .రోజూ ఉదయం తోమ్మిదిన్ననర్కు ప్జాతీయ పతాకా విష్కరణ ,వందే మాతరం ఉండేవి .అంతా లైన్ లో నిలబడాల్సిందే .చాలా క్రమశిక్షణ   తో విద్య నేర్పారు .
ఆయన వడం కూడా బాగా చదువు కొన్నారు .ఆ బడి ఒక ఆశ్రమ పాథ శాల గా వుండేది .కొబ్బరి ,అరటి చెట్లు ,రెండు పాకలు .మాస్టారి కాపురం ఒక పాక లో .ఆయనకు నుదుటి మీద పెద్ద కాయ వుండేది .జంధ్యాలు వడుకుతూ చదువు చెప్పే వారు .చాలా సన్నని దారం తీసే వారు జంధ్యాలు తయారు చేసే వారు .వారి దగ్గర కృష్ణ భగ వానలు ఇంకో ఆయన కావ్యాలు చది వే వారు .వారికీ అంత శ్రద్ధ గా బోధించే వారు మాస్టారు మాస్టారు గారి అబ్బాయి వేమూరి దుర్గా ప్రసాద్ నాకు క్లాస్ mate దుర్గయ్య అనే వాళ్ళం .వాళ్ళన్నయ్య కామేశ్వర శర్మ మాకు సీనియర్ .పెద్దన్నయ్య కాశీ లో ఏం.ఏ.చది వే వారు .మేస్టారి భార్య గారు చామన ఛాయా గా .పొడుగ్గా వుండే వారు .వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు గా కన్పించే వారు మాకు .వాళ్ల  అమ్మాయి ఒకామె మా సహాధ్యాయి .నోటి లెక్కలు బాగా చెప్పించే వారు .దస్తూరి విషయం లో   రాజీ లేదు .మేస్టారికి నేను అంటే ప్రాణం .మా తమ్ముడుమోహన్  మా మేన  మామ గారి కుమారుడు పద్మ నాభం ,సూరి శ్రీ రామ మూర్తి ,సూరి భాస్కరం మొదలైన వాళ్ళు ఏడవ తరగతికి ఎంట్రన్సు కు అక్కడే చదివారు .నా క్లాస్ మేట్స్ సూరి నర సింహం ,పెద్ది భొట్ల ఆది నారాయణ ,మామిల్ల పల్లి సత్య నారాయణ,చిట్టూరు పూర్ణ చంద్ర రావు వెంట్రాప్రగడ మళ్లి కార్జున రావు ,అతని బావ మరిది అర్జున రావు మోఫ్దలైన వాళ్ళు .ఈ మొత్తం గ్రూప కు నేనే నాయ కుణ్ణి .అందరు నా మాట శిరోధార్యం గా పాటించే వారు .స్కూల్ తర్వాత ఆటలు ఆడే వాళ్ళం .dibetulu నిర్వ హించే వాళ్ళం.గోలీలు బెచ్చాలాట పుల్లాట ఖో ఖో ,యెగిరి దుమకటం .ఒంగో బెట్టి దుమకటం వంటివి ఆడు కొనే వాళ్ళం రాత్రి పూట అందరు మా ఇంటికి వచ్చి చదువు కొనే వారు .అప్పుడు ఇంకా కరెంటు లేదు .కిర్సనాయలు దీపాలే చదువుకు .వీధి దీపాలు అవే . పుల్లేరు కాలువ లో స్నానం .అవే నీళ్ళు చిల్ల గింజ కలిపి తేరిన తర్వాత తాగే వాళ్ళం .అస్పృశ్యత అప్పటికి ఇంకా పాటించే వారు .బ్రాహ్మల పెద్దలు బజార్లో కనిపిస్తే చెప్పులు చేతుల్లో పట్టు కోని పక్కకు తొలగే వారు మిగిలిన కులస్తులు .స్కూల్ నుంచి ఇంటికి రాగానే బట్టలు విప్పేసి వేరే బట్టలు కట్టు కొనే వాళ్ళం .రోజూ రాత్రి పూట శివాలయానికి వెళ్ళే వాళ్ళం .ఇవన్నీ మాకు మా శివ రామ క్రిష్నయ్య మాస్టారు నేర్పిన విధి విధానాలే .వారిది అసలు పెడ ముత్తేవి అక్కడ ఇప్పటికీ వారికి ఇల్లు వుంది .ఇక్కడి నుంచి కాపురం అక్కడికే వెళ్ళారు .ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి కని పిచి వెళ్ళే వారు ,.మేము భక్తీ శ్రద్ధలతో వారికి నమస్కరించే వాలం .మాకు ప్రాపంచిక జ్ఞానం కలిగించిన సద్గురువులు శివ రామ క్రిష్నయ్య మేసారే .వారికి శత సహస్ర వందనాలు ..హిందీ కూడా బాగా చెప్పే వారు .నాకు హిందీ వచ్చేది కాదు .రెండు నెలలైనా అక్షరాలూ రాయతసం రాలేదు .ఒక రోజూ ఆయన విపరీత మైన కోపం తో ”ఈ రోజూ సాయంత్రం లోపు అక్షరాలూ రాక పోతే ఇంక ఇక్కడ చాడ వక్కర్లేదు వెళ్లి పోవాల్సిందే ”అని తిట్టారు .అంతే ఆ భయం పనిచేసిందో ,నా బుద్దే మారిందో ,ఆయన్కాలానికి అన్ని హిందీ అక్షరాలూ రాసి చూపించి సుభాష్ అని పించుకోన్నాను .పాపం ఆది నారాయణ కు మాత్రం రాలేదు /ఇంగ్లీష్ స్పెల్లింగ్ టెస్ట్పపెట్టె వారు  మాస్టారు .అన్నిటి నేనే ఫస్ట్ గా వుండే వాడిని .అందుకే నేనంటే మాస్టారికి అభిమానం . కాపి చూచి రాతలు రాయించే వారు .అంతా నిర్దుష్ట విధానం .నాకు పరమ గురువులు వారు ..
1953 జూన్ లో జరిగిన ఎనిమిదవ తరగతి ఎంట్రన్సు పరీక్ష లో మేమందరం ,అలాగే ఏడవ తరగతి పరీక్షలకు మోహన్ ముఠా అందరం పాస్ అయి మేము ఎనిమిది లో వాళ్ళు ఏడు లో చేరాం .
 ఒక విషయం మర్చి పోయాను .నేను ఉయ్యూరు ఎలెమెంటరీ స్కూల్ లో ఐదో తరగతి చదివాను .హిందూ పుర నుంచి మధ్యలో వచ్చి చెరకనెమొ జ్ఞాపకం లేదు .ఆ స్కూల్ మా ఇంటి దగ్గరే ,మాకు ,మా మామయ్య గారి కి వున్న జాయింట్  సందు కు ఆనుకొని వెంట్రాప్రగడ వెంకటరత్నం ,సాబయ్య గారి రెండు పెంకు టిల్లు  వుండేది .ముందు ఇల్లుచాలా పెద్దది వెనుకాడి చిన్నది .అన్ని క్లాసులు అక్కడే .మధ్యలో తడికలు ఉండేవేమో ?ఇళ్ళకు ముందు అర్ధ గజం ఎత్తున పొడుగ్గా అరుగులు గజం వెడల్పు లో ఉండేవి .అక్కడ అందరు కూర్చునే వారు .ఆ స్కూల్ హెడ్ మాస్టర్ బిట్రగుంట సాంబశివ రావు గారు .గరుగు మీద వుండే వారు .పొలము ,ఇల్లు అక్కడే ఉండేవి .కొచెం సన్నగా ముతక నేత పంచ ,ముతక నేత చొక్కా ఇస్త్రీ లేకుండా వేసుకొనే వారు .ఆయన ప్రత్యెక లక్షణం నల్ల గుడ్డా వున్న గొడుకు తెల్ల గుడ్డా పైన వుండేది .గొడుగు లెండి అడుగు వేసే వారు కాదు .పల్చని తెల్ల జుట్టు ,తెల్ల మీసం .చాలా కోపం గా వుండే వారు .పిచ్చ కొట్టుడు కొట్టే వారు .పిల్లలకు ఆయనంటే హడల్ మాకు ఇంగ్లీష్ ,లెక్కలు బోధించే వారాయన .
ఆ తర్వాతి విషయాలు మరో సారి మనవి చేస్తాను .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -12 -11 .
ఇవి కూడా చదవండి


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.