దివ్య ధామ సందర్శనం –2

దివ్య ధామ సందర్శనం –2

          1-5-98–నిన్న ఉదయం 07 -30 గం.లకు బయల్దేరిన ఆంద్ర ప్రదేశ్ ఎక్ష్ప్రెస్స్ ఈ రోజూ ఉదయం తొమ్మిది గంటలకు న్యూ ధిల్లీ స్టేషన్ చేరింది .అవిశ్రాంతం గా పరుగు పెట్టి ,గంటకు 60 కిలో  మీటర్ల వేగం తో ప్రయాణించి ,గమ్యానికి  చేరి సేద తీర్చుకొంది .సామాను అంతా దింపి ఎనిమిదవ నంబర్ ప్లాట్ ఫాం మీద రావు ట్రావెల్స్ వారి మనిషి కోసం ఎదురు చూస్తున్నాం .పది గంటల వరకు చూసి restles గా ఫీల్ అవుతూ ,వాళ్ళను తిట్టు కొన్నాం .బావ ఫోన్ చేశాడు .అప్పటికి సెల్ ఫోన్లు ఇంకా అందు బాటు లో లేవు .వాళ్ళు సారీ చెప్పి ,తాము పంపిన మనిషి మమ్మల్ని గుర్తించ లేక  తిరిగి వచ్చాడనీ ,చెప్పాడు .బావకు పిచ్చ కోపం వచ్చి చెడా మడా వాయిన్చేశాడు .అసలు యజమాని రావు గారే ఫోన్ తీసుకొని మాట్లాడారు .వెంటనే శ్రీనివాస్ అనే అతన్ని కారు ఇచ్చి పంపుతున్నట్లు చెప్పారు .ముద్దు ముద్దు గా పదకొండు గంటలకు ఏ.సి.కార్ లో శ్రీనివాస్ వచ్చాడు .అతను రావు ట్రావెల్స్ వారి guide .అతను ,మేము సామానంతా మారుతి లో సర్దాం .అందులో jeans పాంట్ కుర్రాడు బాగా సాయం చేశాడు .ప్లాట్ ఫాం బతుకు గంటకు పైగా గడిపాం .స్టేషన్ లో ఎక్కడ చూసినా మురికి కంపు .ఇదేం ధిల్లీ రా బాబూ అబ్ని పించింది .దీన్ని చూట్టానికా అంత దూరం నుంచి ఎగేసు కుంటు వచ్చాం అక్ను కొన్నాం .కడుపంతా దేవేసింది .భరించలేని వాసన .ఆ కంపు ఎలా భరిస్తున్నారో అక్కడి జనం ?తన కంపు తన కింపు ,పరుల కంపు ఏవ గింపు కదా .దేశ రాజా దాని స్టేషన్ ను అంత నిర్లక్షం గా వదిలేయటం బాధ అని పించింది. మెట్రో లోనే ఇలా వుంటే మిగతా సామాన్య స్టేషన్ ల పరిస్థితి ఏమిటి ?
కారు తలుపు లన్నీ మూసే శాడు .ఏ.సి .ఆన్ చేశాడు శీను .అది వ్యాపించే లోగా చెమట తో తడిసి ముద్డ అయ్యాముఅందరం .కడుపు లో ఆకలి దంచు తోంది .పన్నెండు గంటలకు ట్రావెల్స్ వారి ఆఫీస్ కు చేరాం .అక్కడ రావు గారు వున్నారు .మాకు వెస్ట్ బెంగాల్ వారి ”మాత్రు మందిరం ”అనే daarmitari ఏర్పాటు చేసి నట్లు చెప్పారు .అది నంబర్ టెన్ సఫ్దర్ jangh రోడ్ లో వుంది .అక్కడికి చేర్చారు మమ్మల్ని .రూం లేదు .ఒక గది లో పది నులక మంచాలు ,వాటిపై పరుపులు ,దుప్పట్లు .ఒక్కొక్కరికి రోజుకు ముప్ఫై అయిదు   రూపాయలు చార్జి .రాత్రికి ప్రయాణ మేగా  .సర్డుకున్దామని సరే నన్నాం .
సామాను దార్మిటరి లో సర్దేసి .స్నానాలు చేశాం .చల్లని నీళ్ళు .హాయిగా ప్రాణం లేచి వచ్చి నట్లుంది .ఒదినా మరదళ్ళు బట్టలుఉతుక్కున్నారు .  .వాళ్ల దగ్గరే వున్న కాంటీన్ లో భోజనం .పది హీను రూపాయలు మనిషికి .ఇంత పప్పునీళ్ళు   ,కూర పేరు తో ఏదో చెత్త ,ఉప్పుడు బియ్యం తో అన్నం .మెతుకు లోపలి పోలేదు .మేము తెచ్చిన తొక్కుడు పచ్చడి ,నెయ్యి ,పెరుగులతో ఏదో కొంత కతికాం .ఇంక అక్కడ తిన కూడదని అనుకొన్నాం .బట్ట లన్నీ ,దగ్గరలో వున్న”చేమ్బిస్త్రీ”   వాడి తో చేయించాం .శాల్తీకి రూపాయే .అదే ఉయ్యూరు లో రూపాయి పావలా .మూడు గంటల వరకు మంచాల మీద దొర్లాం .దగ్గరలోనే మార్కెట్ వుంది డజను పద్దెనిమిది రూపాయల చొప్పునపచ్చ   అరటి పళ్ళు కొన్నాం ..
హైదరాబాద్ లో శర్మ కు  చిలుకూరికీ ఉత్తరాలు రాసి పోస్ట్ చేశాను .చిలుకూరిని 13 న గ్వాలియర్ లో కలువమని రాశాను .అతని వూరు పేరు ధోల్పూర్ అని జ్ఞాపకం రాక జేస్సూర్ అని రాసి పడేశా .అదేమీ అందదని తర్వాత అర్ధ మైంది .
సాయంత్రసం మళ్ళీ స్నానాలు చేసి ,రెండో అంతస్తు లో వున్న ”దుర్గా దేవి ”ఆలయం లో అమ్మ వారిని దర్శించం .చాలా బాగా వుంది .మాతో పాటు బస చేసిన వారి లో ఇద్దరు ఆడ వాళ్ళు ,అచ్చం శ్రీ కృష్ణ ,బల రాములు లాగా వున్నారు .ఆశ్చర్య మేసింది .ఆ రంగు ,అందం ,ఠీవి ,దర్జా ,కట్టు ,బొట్టు కు ముచ్చటేసింది .బెంగాలీ పంచె కట్టు లాల్చీ లతో శోభాయ మానం గా వున్నారిద్దరూ .ఈ daarmitari ని ఒకాయన తన తల్లి పేర ”మాత్రు మందిర్ ”గా నిర్మించి ,సేవ చేస్తున్నాడు .చాలా విశాలమైంది .వాళ్ళే maintain చేస్తున్నారని తెలిసింది .మాంసా హారం బాగా వండి వడ్డిస్తారిక్కడ .ఆ వాసన భరించలేం .”జల పుష్పాలు ”మామూలే .ఏడున్నర కల్లా ,వెంట తెచ్చుకొన్న పూరీలు తిని మజ్జిగ తాగి ,పళ్ళు తిని ఆకలి తీర్చుకోన్నాం .రావు ట్రావెల్స్ వారితో ఎప్పటి కప్పుడు మాట్లాడు తూనే వున్నాం .అంతా తెలుగు లోనే సంభాషణ .రాత్రి నఎనిమిది గంటలకు కార్ వస్తుందని అన్నారు .తొమ్మిదింటికి సుమో వచ్చింది .సామానంతా ఎక్కించాం .తొమ్మిదిన్నరకు రావు ట్రావెల్స్ వారి ఆఫీస్ కు చేరాం .
అక్కడ రావు గారున్నారు .ఆయన Ex air force officer -retire అయి ఈ ట్రావెల్స్ నడుపు తున్నారు .దేశమంతా వాళ్ల బ్రాంచెస్ వున్నాయి .చాలా బాగా receive చేసు కొన్నారు మమ్మల్ని .రాత్రి పది గంటలకు ప్రయాణం అని చెప్పారు .ఒక మినీ వాన్ వచ్చింది .28 సీటర్ ది .మే ఫస్ట్ నే అంటే మాతోనే మొదటి ట్రిప్ అని చెప్పారు రావు జీ .బదరి ,కేదార్ యాత్ర లకు అదే ప్రారంభ ట్రిప్ .ఆ రోజునే ఆ ఆలయాల తలుపులు తీస్తారుఅక్టోబర తర్వాత …రావు ట్రావెల్స్ వారు ప్రతి శుక్ర వారం మాత్రమే బస్ నడు పు తారు .సదరన్ ట్రావెల్స్ వాళ్ళు సోమ వారం ,శుక్ర వారం నడుపు తారు .ధిల్లీ నుంచి కేదార్ ,బద్రీ యాత్రలకు మనిషికి 2500 రూపాయలు భోజనం తో సహా .daarmitari వాళ్ళే ఏర్పాటు చేస్తారు .అక్కడ పరుపు దుప్పట్లకు మనం డబ్బు కట్టాలి .
అయితే ఈ బస్ కు 13 టికెట్స్ మాత్రమే బుక్ అయాయి .అయినా మొదటి ట్రిప్ కనుక పంపుతున్నారు .దగ్గరలోని శ్రీ హనుమంతుని గుడికి మమ్మల్ని తీసుకు వెళ్ళారు .మామ్మల్ని బస్ లోనే ఉండ మన్నారు .ఒక తమిళ పూజారితో ” ,భుశం-భుశం  ”అని ఏదో పూజ అయిందని పించారు .టైర్ల కింద నిమ్మ కాయలు పెట్టి తొక్కించారు .రావు గారు లోపలి వచ్చి అందరికీ నమస్కారం చేశారు .”బస్ నిండక పోయినా మీరంతా బాగా ఎంజాయ్ చేయాలని ఫస్ట్ ట్రిప్ అనే ఉద్దేశం తో మిమ్మల్ని పంపిస్తున్నాం .డబ్బు కంటే మాకు మీ satisfaction చాలా ముఖ్యం .మీ తరఫున ,మా తర ఫున కేదార్ ,బద్రీ స్వాములని అర్చించండి .మా guide ,డ్రైవర్ వగైరా స్టాఫ్ తో సహకరించండి .జై బద్రీ -విశాల్ కీ జై ”అని చక్కని తెలుగు లో మాట్లాడారు .మా అందరికి ప్రసాదం గా స్వీట్స్ పంచి పెట్టారు .జయ ,జయ ధ్వానాలతో మా మినీ బస్ ,maaxee టూర్ కు శుభారంభం చేసింది .పుష్ బ్యాక్ సీట్స్ .ఇకటి రెండు సీట్స్ అక్కయ్యకు బావకు ,మూడు నాలుగు మా ఇద్దరికీ .బస్ క్లాస్ గా neat గా వుంది .మజేస్తిక్ గా వుంది .రాత్రి పదిన్నరకు బస్ బయలు దేరింది .మంచి వేగం గా బస్ ప్రయాణం సాగించింది .నిద్రా మెలకువ ల మధ్య దాదాపు ఆరు గంటలు ప్రయాణించి ఉదయం నాల్గున్నరకు రుషీ కేష్ చేరాం .
2-5-98-శని వారం  —అప్పుడే ప్రయాణం లో రెండో రోజూ .ఉదయం నాల్గున్నరకు హృషీ కేష్ లో దిగాం .గాలి విపరీతం గక వుంది .ఇసుక లేచి పడుతోంది .పక్కనే భాగీరధి అనే గంగా నది .విపరీత మైన వరవడి .ఇక్కడ ఇంకా గంగా మాత పర్వతాలపైనే ప్రవహిస్తోంది .న్యూ ధిల్లీ నుంచి గంగ ఒడ్డునే ప్రయాణం .మీరట్ ,ముజాఫర్నగర్ ,రూర్కీ ,హరిద్వార్ లను దాటి రుషీ కేష్ చేరామన్న మాట .అంటే ధిల్లీ నుంచి 223 కిలో మీటర్ల దూరం లో రుషీ కేష్ వుంది .200 కిమీ.లలో హరిద్వార్ వుంది .రాత్రి ప్రయాణం సుఖం గా జరిగింది .అయిదు గంటల వరకు బస్ లోనే విశ్రాంతి .తీసుకొన్నాం .పళ్ళు తోముకోన్నాం .సులభ కామ్ప్లెక్ష్ లో ఒకటి ,రెండు తీర్చుకోన్నాం .ఇంకా తెల్లార టానికి సమయం చాలా వుంది .బస్ లోంచి వంట వాళ్ళు వంట సామాను దించి ,అక్కడే వున్న ఒక హోటల్ పక్కన ఖాళీ లో ,టిఫిన్ కాఫీ తయారు చేయటం ప్రారంభించారు .05 -15 కల్లా కాఫీలు తాగాం .కాఫీ చాలా బాగా వుంది .మిల్క్ పౌడర్ కాఫీయే .గంగ ఒడ్డునే బస్ ఆపారు .పక్కన నిర్మల గంగా ఝారి .ఎదురుగా ”ఘద్వాల్ హిమ నాగాలు ”ఎంతో ఎత్తు గా ,మానవుని అల్పత్వాన్ని ఎత్తి చూపుతున్నట్లున్నాయి .తమ మహిమాన్వితాన్ని చాటు తున్నాయి .హుందాగా ,సర్వ దేవతా నిలయం గా భాసించాయి హిమాలయాలు .ఇప్పటి దాకా వినటమే కాని మొదటి సారి గా చూసింది ఇప్పుడే .పరవశత్వం కలిగింది .తెల్ల వారు తున్న కొద్దీ ,తెల్లని ఇసుక కను విందు చేస్తోంది .అంత తెల్లని ఇసుకను కూడా చూడటం అదే మొదలు .రివ్వున వీచే గాలీ ,గంగా ప్రవాహం తో ఇసుక ,అక్షంతలు లాగా మీద పాడు తోంది .ఆహ్వానం పలుకు తున్నట్లుంది .బస్ ఇక్కడ పన్నెండు గంటల వరకు ఉంటుందని ,ఈ లపల చూడ వలసినాక్ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు నని గైడ్ శ్రీని వాస్ చెప్పాడు
ఉదయం ఆరు గంటలకు గంగా స్నానానికి బయల్దేరాం .బావా నేను పంచెలు కట్టాం .అక్క ,ప్రభ ,చీరా జాకేట్లతో గంగకు అవతలి ఒద్దు కు చేరాం ..ఎందుకో అక్కడ అంత బాగా లేదని పించింది .ఈ మధ్యనే పుష్కరాలు పూర్తి అవటం తో ,,ఆ ఏర్పాట్లన్నీ అలాగే వున్నాయి .ఖాళీ ఇనప డ్రమ్ముల -vacum cylinders గంగ ఆపై వరుసగా పేర్చి ,ఇనుప గొలుసు లతో ఈ ఒద్దు నుంచి ఆ వొడ్డుకు తాత్కాలిక ”ఝాలా ”ఏర్పాటు చేశారు .దానిపై నడిచి ఆవలి వడ్డుకు చేరాం .ఇలాంటిదే ప్రక్కన ఇంకో అప్ప్రోఅచ్ వంతెన కట్ట గా ,అది అంతా దాదాపు కొట్టుకు పోయి కొంత అవశేషం గా వేలాడు తోంది .అంటే ప్రవాహ ఉద్ధృతి అంత ఎక్కువన్న మాట .పొడి బట్టలు పక్కన పెట్టి ,స్నానానికి ఉపక్రమించాం .”గంగా స్నాన విధి ”అంతా ఇంటి దగ్గరే రాసు కోని తెచ్చాను .గంగా స్తవం చేసి ,మానస గంగా స్తోత్రాలు చెప్పి ,అందరం కలిసి స్నానం చేశాం .పురోహితునిలా నా ధర్మం నెర వేర్చాను .గంగ అతి వేగం గా పారి పోతోంది .అడుగున ఇసుక జారి పోతోంది .అనంతమైన స్వచ్చ గంగా జలం .పరమ పవిత్ర నదీ మా తల్లి .పరవశం తో మునిగి తేరు కొన్నాం .ఒళ్లంతా పరమ పవిత్ర భావం ఆవేశించింది .ఆ వేగానికి భయం వేసినా ,ఆనందం గా   స్నానం అరగంటకు పైగా చేశాం .భక్తీ భావ పులకాన్కితాలతో నిండి పోయాం .ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కిందన్న అభిప్రాయం .పవిత్ర భాగీరధీ స్నానం తో అలసట తీరింది .కొత్త శక్తి లోపలి ప్రవేశించింది .కడుపు నిండా అమృత గంగ ను తాగాం .ఆ ఆనందం వర్ణనా తీతం .మహర్షులు ,మహాను బావులు నడయాడిన పరమ పవిత్ర ప్రదేశం లో కాలు పెట్టాం అనే సంతృప్తి మనసు నిండా వుంది .వారంతా పావనం చేశారు తమ పవిత్ర పాద ధూళి తో .తపస్సుకు ,యోగ సాధనకు అతి అనువైన ప్రదేశం హృషీ కేష్ .గొప్ప తీర్ధం .జన్మ తరించింది అని పించింది .ఎన్నో ఏళ్ళ కల నిజమైంది .జన్మ చరితార్ధ మైంది .నోట మాట రాలేదు ఆ ఆనంద పార వశ్యం లో .నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాఠం గా కారి పోతున్నాయి .ఏదో  దివ్య లోకం లో ఉన్నాము అన్న భావం నర నరాన వ్యాపించి వుంది .స్నానం ,సంధ్యా వందనం ,అర్ఘ్య ప్రదానం పూర్తి చేసు కొన్నాం .ఏడు గంటలకు వంతెన దాటి మళ్ళీ బస్ దగ్గరకు చేరాం .గంగా జలం అతి చల్లగా వుంది ,శరీరానికీ ,మనసుకూ,కొత్త శక్తి ని ఇచ్చి నట్లని పించింది .energiged బాడీ గా శరీరం మారింది .ఆ నీటి లో ,ఆ గాలిలో ఆ ప్రదేశం లో వున్న మహిమ అది .ఆ ప్రదేశం లో వున్న ఆధ్యాత్మిక భావ సంపన్నత తర తరాలుగా అవిచ్చిన్నం గా ప్ర వహిస్తోంది .ఉత్సాహం ,భక్తీ కృతజ్ఞత లతో ఉక్కిరి బిక్కిరి అయి పోయాం నలుగురమూ .
బట్టలుఆరేసు  కొనే సరికి టిఫిన్ ,కాఫీ రెడీ ..ఉప్మా చాలా బాగా వుంది .కావలసి నంత పెట్టారు .కడుపు నిండా తిన్నాం .మళ్ళీ కాఫీ తాగాం .strong కాఫీ బాగా వుంది .బడలిక తీరింది .తర్వాత ఒక గైడ్ ను మాతో పంపించాడు శ్రీని వాస్ .బస్ లో వాళ్ళందరం కలిసి మళ్ళీ వంతెన దాటి ,అవతలి ఒడ్డు చేరి ,అక్కడి ప్రదేశాలు చూడ టానికి బయల్దేరాం .గంగా ప్రవాహానికి రాళ్ళు అన్నీ అరిగి ,గుండ్రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కని పించాయి .అవి ఎన్నో రంగుల్లో వున్నాయి .కావలసిన వాళ్ళు యేరు కోని దాచుకొన్నారు .అదే ఇక్కడి ప్రత్యేకతల్లో ఒకటి .ఆ ప్రకృతి అందానికి పులకాన్కితులం అయ్యాము .
మిగిలిన రుషీ కేష్ విశేషాలు తర్వాత రాస్తాను
దివ్య ధామ సందర్శనం –1
సశేషం –
మీ –గబ్బిట ,దుర్గా ప్రసాద్ -16 -12 -11 –క్యాంపు –హైదరాబాద్  .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

2 Responses to దివ్య ధామ సందర్శనం –2

 1. మీ blog నచ్చింది సర్, ఒక ౩ or 4 నెలల క్రితం మేము చాలామంది సభులము కలసి, చార్ ధాం లో కేదార్ నాథ్ బదిరి నాథ్ దర్శించి వచ్చాము (ఆ భగవత్ కృపతో )
  ఈ blogs లోకి నేను ఈ మధ్యనే వచ్చాను రాగనే అనుకున్న నా యాత్రా విశేషాలు ఇక్కడ పొండుపరుద్దామని కాని మనసు మాట వినలేదు, అటు ఇటు తిప్పుతున్నది
  సరే అలసి సోలసాక అదే మన దారి కి వస్తుందిలే అని దాని మానాన దానిని వదిలేసాను, ఆమధ్య కార్తిక మాసం లో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి నప్పుడల్లా ఆ స్పర్శ కలిగేది
  కాని గుడి నుంచి బయటకు రాగానే మనసు మారి పోయేది
  ఏంటో నేను కుడా రావణుడి లా మంచి పనులన్నీ వాయదా వేస్తున్నాను
  మొత్తానికి మీ యాత్రా సంగతులు చుశాకైనా నాకు ప్రేరణ కలగాలని ఆశిస్తున్నాను
  నిన్నటి post లో photos బాగున్నవి మీ వ్యాఖ్యానం గురించి మరొక మారు మాట్లాడు తాను అంతా పూర్తి అయ్యాక !
  కాని “జీవితం లో ఒక్కసారైనా కడతెరేలోపు” చూడదగిన చూడ వలసిన ధామాలే అవి.
  మీరూ భాగ్యశాలులు ! మీరు దర్శించటమే కాక పలువురికి మీ అనుభవాలు పంచుతున్నారు !!
  ఇప్పుడు ఏదో చికాకు పుణ్యమా అని మనసు తాత్కాలిక వైరాగ్యం పొందినట్లుంది అందుకే
  ఆ వైరాగ్య మాత అనుగ్రహమే ఇలా అక్షర రూపం దాల్చి reply గా వస్తున్నది.
  మీ కృషి కి అభినందనలు
  భం భం భోలా
  కేదార్ బాబా
  jai బదరి నాథ

 2. K.RAMAKRISHNA RAO says:

  మీ బ్ల్లాగ్ చాలా బాగున్ది. చార్ ధామ్ యాత్ర మిగిలిన విసేశాల కొరకు ఎదురు చూస్తున్నాము.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.