ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

ఊసుల్లో ఉయ్యూరు –9

                               ఆ ఇద్దరు -ఈ నలుగురు

—              ఉయ్యూరు శివాలయానికి రోజూ రాత్రి ఎనిమిది గంటలకు ఖచ్చితం గా  ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వామి దర్శనం చేసు కొనే వారు .ఆరు నూరైనా ,నూరు ఆరైనా  ,అదే సమయం పాటించే వారు .వారిద్దరూ వచ్చి దర్శనం చేసు కొన్న తర్వాతనే పూజారి గారు ఆలయం తలుపులు మూసేవారు .తుఫాను వచ్చినా ,వర్షం ధారా పాతం గా పడు తున్నా పిడుగులు పడ్డా ఉరుములు సాగినా ,వారి ఆ దిన చర్య లో మార్పు వుండేది కాదు .జెర్మనీ లో”ఇమాన్యు యల్    కాంట్” గారు ఎలా  ఖచ్చితం గా టైం షెడ్యూల్ పాటించే వారో వీరిద్దరూ అంతే .కలిసే వచ్చే వారు ,కలిసే వెళ్ళే వారు .ఆ ఇద్దరూ ఒకరు ఆది రాజు సర్వేశ్వర రావు గారు ,రెండవ వారు పువ్వాడ చంద్రయ్య గారు .మొదటి వారు బ్రాహ్మలు .రెండవ వారు కోమట్లు .ఆ స్నేహం ఎలా ప్రారంభ మైనదో మాకు తెలీదు కాని ఆ జంట స్నేహానికి ముచ్చట పడే వాళ్ళం .
ఇద్దరు చక్కగా స్నానం చేసి విభూతి రేఖలు నుదుటి మీద తీరు గా ధరించి గుడికి వెళ్ళే వారు .చేతిలో లాంతరు వుండేది .అది వాళ్ల identiti .సర్వేశ్వర రావు విష్ణ్వాలయం అవతలి వైపు మెట్లకు ఆనుకొన్న స్వంత ఇంటిలో వుండే వారు .ఆయన దస్తావేజు రచయిత .వారి అబ్బాయి రామ చంద్ర మూర్తి ,ఆ వారసత్వం కొన సాగించారు .చంద్రయ్య గారిని షరాబు చంద్రయ్య గారు అనే వాళ్ళు .ఉయ్యూరు లో ప్రభుత్వ ఠానా వుండేది .అందు లో ఆయానా ఉద్యోగి .ఠానా లో కంచు ఘంట వుండేది .ప్రతి ఘంటకు ఘంట కొట్టే  వారు .అదే సమయాన్ని తెలుసు కోవ టానికి ఉపయోగ పడేది .ఎన్ని ఘంట లైతే అన్ని దెబ్బలు కొట్టే వారు .కర్ర సుత్తి తో కొట్టే వారు .ఘంట శబ్దం ఊరంతా విన పడేది .అప్పుడు జనాభా ,ఇళ్ళు తక్కువ .తర్వాత ఠానా  ఎత్తేశారు.ఠానా మా బజార్లోనే ఇప్పుడు ఊర సుబ్బా రావు గారింట్లో వుండేది .అది పోయింతర్వాత సుబ్బా రావు కొన్నాడు .ఇప్పుడు వాళ్ల అబ్బాయి మోహన రావు అధీనం లో ఆ స్థలం వుంది .తర్వాత ఉయ్యూరు పాలి టెక్నిక్ లో ఘంటలు  కొట్టే వారు .తే;ల్ల వార్లూ కొట్టే వారు .అదీ బానే విని పించేది .ఇదీ ఆ నాటి కాల గమనం తెలియ జేసే విధానం .చంద్రయ్య గారు రావి చెట్టు బజారు లో దానికి దగ్గర స్వంత ఇంట్లో వుండే వారు .చంద్రయ్యది గండు మొగం .కోపం గా కని పించే వాడు .మాట్లాడటం చాలా తక్కువ .డ్యూటీ minded గా వుండే వారు .సర్వేశ్వర రావు గారు పల్చగా యెర్ర గా వుండే వారు .ఈ యన దావాళీ కట్టు కోని గుడికి వచ్చే వారని జ్ఞాపకం .చంద్రయ్య గారు లుంగీతో వెళ్ళే వారు ఈయన బుజాన తుండు గుడ్డా వుండేది .సర్వేశ్వర రావు గారికి పైనఆచ్చాదన  వుండేది కాదు .వీరిద్దరి స్నేహం గురించి ఊరంతా ముచ్చట గా చెప్పు కొనే వారు .దైవ దర్శనానికి అంత గొప్ప గా సమయ పాలనను పాటించిన ఆ మహా ను భావులిద్దరు ధన్య జీవులే .అప్పటికే వారిద్దరికీ అరవై ఏళ్ళు పై బడే ఉండేవని గుర్తు
ఈ నలుగురు
ఉయ్యూరు లో ఏ భారీ కార్య క్రమం జర గాలన్నా ,మా చిన్నప్పుడు నలుగురు వ్యక్తులు ముందుండి వారి చేతుల మీదు గా జరపటం నాకు బాగా గుర్తు .వేసవి లో సహస్ర ఘటాభిషేకం ,శివాలయం లో చేయటం ,పురాణ ప్రవచనాలు కంచి ,శృంగేరి పీఠాది పతులను ఆహ్వానించటం ,recreation క్లబ్ ,విష్ణ్వాలయం లో వైశాఖ మాసం లో స్వామి వార్ల కల్యాణం ,అక్కడే జరిగే భాగవత సప్తాహాలు ,వేద విద్వాంసులను సన్మానించటం మొదలైన సామాజిక కార్య క్రమాలన్నీ  ఈ నలుగురే దగ్గరుండి చాలా చక్క గా నిర్వహించే వారు .వారే మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు ,మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి అనే గంగయ్య గారు ,స్థితి పరులు చోడ వరపు చంద్ర శేఖర రావు గారు ,జిల్లా జడ్జి వారణాసి సదా శివ రావు గార్లు .వీరికి సహాయ కారులుగా  ,ఆది రాజు నరసింహా రావు గారు అంటే చంద్ర శేఖర రావు గారి బావ మరిది ,మరియు హెడ్ కర్ణం ,డాక్టర్ మామిడి పల్లి నర సింహ మూర్తి గారు ,ఆదిరాజు చంద్ర మౌలీశ్వరరావు గారు .వీరికి ఉమా ప్రెస్ అనే ప్రెస్ వుండేది .చాలా పుస్తకాలు అచ్చు వేశారు .వడ్ల మర ను నిర్వహించారు  .ఆలోచన అంతా ఈ నలుగురిదే .ఆచరనంతా     మిగతా వారి సహ కారం తోనే .అంత కలిసి కట్టుగా ఆనాటి బ్రాహ్మణ్యం వుండేది ..ఏది చేసినా వూరి సౌభాగ్యం కోసమే .
మా నాన్న గారు వెద వేదాంగాలు క్షుణ్ణం గా చదువు కొన్న వారు .అధ్యన ,అధ్యాపనాలు చేసిన వారు .తెలుగు విద్వాన్పాస్  అయిన వారు .మచి గొప్ప తెలుగు పండితులు గా జిల్లా లో గుర్తింపు పొందిన వారు .శాస్త్రం లో ఏదైనా సందేహం వస్తే నాన్న గారి వద్దే తీర్చు కొనే వారు .కావ్యాలన్నీ అవలోడనం చేశారు .సంస్కృత కావ్యాల్ని ఆ పోసన పట్టిన వారు .శంకరా ద్వైతాన్నిక్షుణ్ణం   గా బోధించ గల వారు .పచ్చగా కుది మట్టం గా వెలుగు రేఖల్లా వీభూతి రేఖలతో నుదుట వెలిగే వారు .పంచె ఖద్దరు లాల్చి .పైన ఖండువా .త్రికాల సంధ్యా వందనం ,శ్రీ రామ కోటి నిత్యం రాయటం భగవద్గీతా పథనం వారి దిన చర్య .
మా మేన మామ ను గం .గం .శాస్త్రి అనే వారు .లేక గుండు గంగయ్య గారు అనే వారు .మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్ళు .మా అమ్మకు స్వంత తమ్ముడు .చిట్టి గూడూరు సంస్కృత పాథ శాల లో చదివాడు .వరదా చార్యుల గారి శిష్యుడు .జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి కి సహాధ్యాయి మంచి మిత్రుడు కూడా .రామాయణ భాగవత భారతాలను సులభం గా పురాణం గా చెప్పే వాడు సంస్కృత మూలం తోనే .తేలుగు పండిట్ గా కొంత కాలమ్ బోర్డు హై స్కూల్ లో పని చేశాడు .మంచి ఆస్తి పరులు .దానం ధర్మం చేసే వాడు .జ్యోతిష్యం బాగా నేర్చాడు జాతకాలు వేయటం చెప్పటం ముహూర్తాలు పెట్టటం చేసే వాడు .కోట శ్రీ రామ మూర్తి గారు ,మామయ్యకు జ్యోతిష్యం లో గురువు .సరదా గా మాట్లాడే వాడు .మంచి చనువు వున్న వాడు .యిట్టె అందరితో పరిచయాలు పెట్టు కొనే వాడు .మాట కారి గొప్ప సహాయ కారీ .
నల్ల గా వుండే వాడు త్రికాల సంధ్య వార్చే వాడు .వెద పథనం నిరంత రామ్ గా సాగించే వాడు .అలా చేస్తూ జంధ్యాలు ఒడికే వాడు .చాలా సున్నితమైన జంధ్యాలు తయారు చేసే వాడు .గోచీ పోసి పన్చ్వ కట్టు ,బైటికి వెళ్తేనే చొక్కా .లేక పొతే ఉత్తరీయమే .మంచి బలిస్టుడు .పాలేళ్ళతో పాటు కట్టెలు కొట్టే వాడు .అరక దున్నే వాడు .బండి తోలే వాడు మంచి వ్యవ సాయం  చేయించే వాడు గొడ్డు గోదా పాడి పంటా తో ఇళ్ళు కళ కళ లాడుతూ వుండేది .అందరికి అందు బాటు లో వుండే వ్యక్తీ బ్రహ్మ ల ఇళ్ళల్లో పెళ్లి మొదలైన శుభ కార్యాలన్నీ మామయ్య వుంటే సులభం గా జరిగి పోయేవి .చక్కని సలహాలను ఇచ్చే వాడు .
మూడవ వారు చోడవరపు చంద్ర శేఖర రావు గారు .మంచి స్థితి పరులు .నియోగులు .యెర్ర గా ,పొట్టి గా వుండే వారు .ముఖం ఎప్పుడు కంద గడ్డ లాగా వుండేది .ఆయన ఎదుట పడాలంటే అందరికి భయం .వేదం అభ్యసించాడు .శాశ్ర్త్రాలు నేర్చాడు .ఆతిధ్యం ఇచ్చే వాడు .అర్ధులకు కొంగు బంగారమే .అప్పటికే వూరిలో ఆయన కు ఒక్కడికే డాబా ఇళ్ళు వుండేది. పై అంతస్తు కూడా వుండటం విశేషం .ఇంట్లో పింగ్ పాంగ్ ఆడే బల్ల  వుండేది .సోషల్ క్లబ్ లో పదవినీ నిర్వ హించారు .ఏ కార్య క్రమానికైనా ముందుండే వారు .అయితే కోపం వస్తే పిచ్చ బూతులు తిట్టే వాడు అందుకని ఆయన్ను ”రావణాసురుడు ”అని పిల్చే వారు .ఆయన భార్య అమ్మన్న   ,మా అమ్మ భావానమ్మ గారికి స్నేహితు రాలు .ఆయన ,నాన్న కు క్లాస్ mate .”ఏరా అంటే ఏరా ;; అనుకొనే వారు .వారబ్బాయిలు మేము మళ్ళీ స్నేహితులం ,ఆయన మన వళ్ళు నా శిష్యులు కూడా ,పాలేళ్ళు వ్యవసాయం పాడి పంటా నిఖా మాన్లు వున్న పెద్ద వ్యవ సాయం వారిది .ఊళ్లోకి యాయ వారం బ్రాహ్మలు వస్తే స్సత్కరించి పంపే వారు .వెద పండితులను ,కూచి పూడి వారినీ అలానే గౌర వించే వారు .నీర్కావి గ్లాస్కో పంచె చొక్కా ఆయన వేశం
నాలుగవ వారు వార నాసి  సదా శివ రావు గారు .బందరు జిల్లా కోర్ట్ జడ్జీ గా పని చేశారు కొబ్బరి తోట లో యిల్లు .భార్య అన్న పూర్ణమ్మ గారు మా అమ్మకు మంచి దోస్తీ.ఇద్దరు కలిసి చాలా యాత్రలు చేశారు .మంచికి ముందుండే వారు ..సదాశివ రావు గారు కూడా వేదం చదివారు .శాస్త్రాలు నేర్చారు .ఈ నలుగురు వేదార్ధం చదవ టానికి సిద్ధమై గుంటూరు జిల్లా వేమూరు నుంచి వేదార్ధ ప్రవీణ,చివుకుల  వెంకట రమణ సిద్ధాంతి  గారిని ఆహ్వానించి ఇళ్ళు వసతి సౌకర్యం కలిపించి వేదార్ధం నేర్చు కొన్నారు .దాదాపు నాలు గేళ్ళు    నేర్చుకొన్నట్లు గుర్తు .ఆ తర్వాత ఆదరం తగ్గి ఆయన మళ్ళీ స్వంత వూరు వెళ్లి పోయారు .వేదార్ధ ప్రకాశిక]గీతాసారం   అనే పుస్తకాలు రాశారాయన .యెర్ర గా వుండే వారుగొప్పగా ఏ విషయాన్నైనా విడ మర్చి చెప్పే నేర్పు వారిది మాకేమీ అర్ధం కాక పోయినా నోరు తెరిచి వినే వాళ్ళం .
ఇదంతా చూసి శైవులు   కూడా వారి గురువు గారిని ఆహ్వానించి ఆయన దగ్గర శైవ శాస్త్రాధ్యయనం చ్జేశారు దీనికిపూనుకొన్న వారు మామిళ్ళ పల్లి నాగేశ్వ రావు గారు  తాతయ్య గారు పురుషోత్తమం గారు. వీరంతా శివాలయ అర్చకులు.
మొదట చెప్పిన ఈ నలుగురు -శివాలయం లో సహస్ర ఘటాభి షేకం చేయించే వారు సకాల వర్షాల కోసం .చాలా నిష్ట గా జరిఫ్\గేది పుల్లేరు కాలువ లో చెలమ తీసి నీరు తెచ్చే వాళ్ళం .మేము పిల్లాలమైన బిందెలతో అక్కడి నుంచి నీళ్ళు తెచ్చి అంచెలంచెలుగా అంద జేసే వాళ్ళం .వంగల సుబ్బావధాని గారు వగైరా పురోహితులు ఆ లయం లో పల వుండి అభి షేక కార్య క్రమం నిర్వ హించే వారు .ఈ నలుగుర ,మిగతా వారి తో కలిసి గర్భాలయం లో శివ లింగానికి అభి షేకం చేసే వారు స్వ హస్తాలతో. చూడ ముచ్చట గా వుండేది .అది అయిన తర్వాత బిల్వార్చన .భోజనాలు అక్కడ ఉండేవి కావు ,అంతా మడి తోనే జరిగేది ఆడ వారు కూడా ఉత్సాహం గా పాల్గొనే వారు .అర్చకుల సహకారం బాగా వుండేది .అంతా అయింతర్వాత ఎవరిళ్లలో వారు భోజనం చేసే వారు .
నవ రాత్రుల లో రోజూ సాయంత్రం అమ్మ వారికి లలితా సహస్ర నామ లతో పూజ ఆ తర్వాత మంత్రపుష్పం   .దీనికి ఆ నలుగురు మిగిలిన పెద్దలు మేము కూడా హాజరయ్ వాళ్ళం .వ్విన టానికి ఎంతో హాయిగా వుండేది .మాకు మంత్ర పుష్పం నోటికి రావటానికి అదే ఆధారం ,కార్తీక మాసం లో ఈ నలుగురు ఆలయం లో అభిషేకం చేసు కొనే వారు
విష్ణాలయం లో ఆది రాజు చంద్ర మౌలీశ్వర రావు గారి ఒదిన గారి ఆధ్వర్యం లో ఎన్నో సార్లి భాగవత ,రామాయణ సప్తాహాలు జరిగాయి చివరి రోజూ న నందరికీ భోజనాలు .దీని పర్య వేక్షనా వీరిదే .వైశాఖ మాసం లో  కల్యాణం వైభవం గా జరిగేది ఆది రాజు నరసింహా రావు గారి ధర్మ కర్త ఆయన ఆధ్వర్యం లో కల్యాణం జరిగేది బంగిన పల్లి మామిడి పళ్ళు పంచి  పెట్టె వారు నరసింహా రావు గారు .వేదాంతం రామ చంద్రా చార్యులు ,రామా చార్యులు మొదలైన అర్చకులు బాగా చదువు కొన్న వారు చక్క గా కార్య క్రమాలు నిర్వ హించే వారు .కార్య క్రమం అయి పోయే దాకా ఈ నలుగుర వుండే వారు .వారు వుంటే దిగ్వి \జయమే ..అలాగే ధనుర్మాస కార్య క్రమాల్ని హించే వారు .ఈ ఆలయం అర్చకులు ”హయగ్రీవ జయంతి ”నిర్వ హించే వారు .పెద్దలన్దరితో పాటు ఈ నలుగురు వచ్చి నిర్వహణ లో తోడుండే వారు .
ఊళ్ళోకి వేద పండుతులు వస్తే సభ జరిపించి సత్కరించి గౌరవం గా పంపే వారు .
పాలిటెక్నిక్ లో నాన్న గారిని పిలిపించి వ్యాస రచన ,డిబేటింగ్ లకు జడ్జి గా నియమించే వారు .
ఈ విధం గా ఆ ఇద్దరు సమయ పాలనకు  ఉదాహరణ గా నిలిస్తే ,ఈ నలుగురు సేవా తత్పరతకు ,వూరి హితం కోసం పాటు పడే వారుగా గుర్తింప బడ్డారు

                     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -12 -11 –క్యాంపు హైదరాబాద్ .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.