దివ్య ధామ సందర్శనం –5

దివ్య ధామ సందర్శనం –5

                                      కేదార్ నాద దర్శనం
మూడో రోజూ ప్రయాణం లో ఆది వారం మే మూడవ తేది న గౌరీ కుండ్దగ్గర   ఆగాం .అక్కడే పోనీలన్నీ ఆగివుంటాయి .అటు ,ఇటు మహోన్నత హిమాలయాలు ,మంచు కరిగి ప్రవహించే సెలయేళ్ళు ,ఎంతో ఎత్తు నుంచి కిందికి దూకే హిమ నదీ నదాలు .పచ్చ బట్ట కట్టు కొన్న పర్వ తాలు ,ఆకు పచ్చ దనం తో నయన మనోహర మైన సుందర దృశ్యం .ప్రకృతి ని చూసి పులకించి పోయాం .తనివి తీరా చూసి పదిలం గా హృదయం లో దాచు కొన్నాం .గల గల మంటూ దూకే ”మందాకినీ నది ”.ఎక్కడో శ్రీ కృష్ణ దేవ రాయల ఆస్థానం లో భువన విజయం లో కూర్చుని పెద్దనార్య మహా కవి ఈ హిమ గిరి సౌందర్యాన్ని మను చరిత్ర ప్రబంధం లో అద్భుతం గా వర్ణించాడు .అదంతా ,అక్షర సత్యం గా కని పిస్తుంది .అయితే ,ఆ ఏనుగులు మాత్రం లేవు .”ఆ నది చేసే మృదంగ ధ్వని ”వింటాం .ఆ అందాన్ని కను లారా కంటాం .ఆ పద్యమూ సొగసు ,ఆ దృశ్యమూ సొగసు .ప్రవ రాఖ్యుడు సందర్శించిన హిమ నగ సౌందర్యాన్ని పెద్దన పద్యం లో
”అట జని కాంచె భూమి సురు డంబర చుంబి శిరస్సర జ్జ్హరీ
పటల ,ముహుర్ముహుర్లుతదభంగా ,తరంగ మృదంగ ,నిస్వన
స్ఫుట ,నటనాను కూల ,పరి ఫుల్ల ,కలాప కలాపి జాలమున్
కటక చరత్కరేను కర కంపిత సాలము శీత శైలమున్ ”
ఆ పద్యం స్ఫురణకు రాగానే శరీరం పులకించింది .మనసు ఆనంద డోలిక లూగింది .  .పెద్దన వర్ణించిన మనోజ్న దృశ్యం కళ్ళ  ముందు ప్రత్యక్షం గా చూశాము .ఈ హిమా లయాలు మన నాగర కత కు ప్రతిరూపాలు .  .సంస్కృతీ విలసనానికి ఆధారాలు .సాక్షాలు ఆధ్యాత్మిక భావ దీప్తి కి ఉద్దీప నాలు .మహర్షుల తపో దీక్ష కు సహజ సుందర వన సీమలు .పరాత్పరుని ప్రత్యక్షం చేయించి ,భక్తుల ,జ్ఞానుల ,ముక్తులకు ఆల వాలాలు .సాక్షాత్తు పరమ శివుని కి ఆవాస భూములు .భారత దేశానికి పెట్టని ఉత్తర పు కోట గోడలు .శత్రు దుర్భేద్యాలు .ప్రకృతి సమ తుల్యానికి ఆధారాలు .వేసవి లోనూ ,మంచు కరిగి ,జీవ జలాన్నందించే జీవ నదుల కు ఆట పట్టులు .వృక్ష జాలాన్ని సుగంధ ద్రవ్యాలను ,మూలికా సంతతుల్ని కలిగిన సంజీవులు .వన జంతువులకు అభయా రన్యాలు .ఉత్త రాన్నుంచి వచ్చే చలి గాలుల్నుంచి భారత దేశాన్ని కాపాడే” రాళ్ళ స్వెట్టర్లు ,”.టోపీలు, శాలు వాలు ,…మేఘాలను ఆపి వర్షం ప్రదానం చేసే ఉపకారులు ఈ హిమాలయాలు .దేవతలకు ఆవాస భ్హూములు .అందుకే హిమాలయాల లోని పుణ్య క్షేత్ర సందర్శన యాత్ర ను ”దేవ లోక యాత్ర ”అనీ ”స్వర్గ లోకయాత్ర  ”అనీ అంటారు సాభి ప్రాయం గా .ఇది ముమ్మాటికీ నిజం ,నిజం ,నిజం .ఈ సొగసులన్నిటినీ పెద్దన తన మనో నేత్రం తో దర్శించి పద్య బద్ధం చేశి మనకు అందించాడు .జోహార్ పెద్దనా మాత్యా జోహార్ .
గౌరీ కుండ్ లో నే పార్వ తీ దేవి ఋతు స్నానం చేసి మందాకినీ నది లో కార్తి కేయునికి జన్మ నిచ్చింది ఇక్కడి   నీరు చాలా తీక్షనం గా వేడిగా  వుంటుంది .గౌరీ కుండ్ కు దగ్గరలో ”వినాయక ”క్షేత్రంవుంది . .ఇక్కడే పార్వతీ దేవి భర్త శివుని రాక కోసం ఎదురు చూస్తూ ,తలంటి స్నానం చేయ బోతూ ,”పిండి వినాయకుని ”చేసి కాపలా గా ఉంచింది గౌరీ దేవి .గోరీ తీర్దానికి పైన ”భైరవాలయం ”వుంది .భైరవ ,చేరా వాసులు కేదార క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారని ఇతిహ్యం .అందుకే ఇక్కడ యాత్రికులు వారికి అన్న ,వస్త్రాలు అంద జేస్తారు .ఇక్కడ ”భీముని రాయి ”వుంది .దీన్ని ఈశ్వరుని ”మంచం ”గా భావిస్తారు .పర్వతం పైన ”కాళీ మాత ”సర్వ కామనలను తీరుస్తుందని ప్రజల నమ్మకం .
మొత్తం మీద పన్నెండున్నర గంటలకు ”పోనీ లు ”ఎక్కాం .ఒక్కో పోనీ మీద ఒక్కరు మాత్రమేకూచో   వాలి .నడిపే వాడు తాడు పట్టుకొని నడి పిస్తాడు .కొన్ని వందల పోనీలు వుంటాయి వచ్చేవి ,పోయేవి .వీటికి తోడూ డోలీలు .ఇందులో మనుష్యుల్ని కూచో పెట్టు కోని మోసుకు వెళతారు .వీపుపై పేము బుట్టల్లో కూడా జనాన్ని కూర్చో పెట్టు కోని తీసుకు పోతారు .దారి అంతా ఒకే రకం గా వుండదు .మెట్లు ,దిగుడు మెట్లు ,మామూలు నేల .మంచునేల ,నీటి ప్రవాహాలు గుహల వంటివి కూడా దారిలో వుంటాయి .ఎవరి దారి వారిదే .దిగే దాకా ఒకరితో ఒకరికి సంబంధం వుండదు .
ఈ పోనీ వాళ్ళు చాలా మర్యాదస్తులు .ఆడ వాళ్ళను ”మా ”అనీ మగ వారిని ”సార్ ”అనీ మర్యాదగా పిలుస్తారు .వంగ వలసిన సందర్భం వస్తే ”వాన్గో -వాన్గో ”అని హెచ్చరించి మనల్ని వంగే టట్లు చేస్తారు .పోనీల మీద  జీనులపై మెత్తటి బట్టలు వుండవు .ముడ్డి మండు తుంది కాసేపు ప్రయాణం చేయ గానే .పుళ్ళు పడ్డా ఆశ్చర్యం లేదు .పోనీ కున్న రికాబు లలో కాళ్ళు పెట్టించి ,పట్టు కోని జాగ్రత్త గా పోనీ పైకి మనల్ని ఎక్కిస్తారు .ఆడ ,మగా ఎవరి కైనా ఇది తప్పదు .హాండ్ బాగ్ వుంటే గుర్రానికి వెనక వైపు జీను కు కడ తారు .ఆ ఆడ గుర్రాలకు వాటి యజ మాని మాట వేదమే .చెప్పినట్లు వింటాయి .ఎక్కడ ఉచ్చ పోయాలో ,ఎక్కడ పేడ వేయాలో అక్కడే వేస్తాయి .అంత  గొప్ప   ట్రైనింగ్ నిస్తారు .వాతావరణం  ఎండ గానూ వుంది ,మబ్బు గానూ వుంది .చాలా ఎత్తైన ప్రదేశమూ,పర్వతాగ్ర భాగమూ కనుక క్లైమేట్ క్షణ క్షణం మారుతూ వుంటుంది .దీనికి తోడూ మాన్సూన్   ప్రభావమూ ఎక్కువే .ఎప్పుడు వర్షం పడుతుందో ,ఎప్పుడు వడ గళ్ళు పడతాయో తెలీని వింత పరిస్థితి .టక టక చప్పుడు చేసు కొంటు పోనీలు అప్రతి హతం గా ముందుకు సాగి పోతున్నాయి .వాటికి శూక్ష్మ గ్రాహకత్వం బాగా వుంది .దారి చాలా ఇరుకు .అంచుల మీద నుంచి కూడా నడవాలవి .మెట్లు ఎక్కాలి .మంచులో నడ వాలి .నీటి ప్రవాహం లోను నడ వాలి .ఇవన్నీ వాటికి కొట్టిన పిండే .చాలా జాగ్రత్త గా నడిచి వెళ్తున్నాయి .అంచ దాటితే అగాధ మైన లోయ .పడితే అడ్డ్రెస్ దొరకడు .చలి ,మంచు రక్షణకు వచ్చే వారుండరు .భగవంతుని దయ వల్ల సవ్యం గా జరిగితే సరే ,లేక పొతే అంతే గతి .పోనీలను హుషారు చేస్తూ ,వాటి యజ మానులు వాటి వేగం తో నడుస్తున్నారు .మధ్య మధ్య లో నీరు తాగిస్తున్నారు .అవి రామ బాణం లాగా దూసుకు పోతూనే వున్నాయి .ఎదురు వచ్చే వారి నందర్నీ జాగ్రత్త గా తప్పించు కోని తమ దారి తాము నడుస్తున్నాయి .గంటన్నర ప్రయాణం తర్వాత ,ఏడు కిలో మీటర్ల దూరం లో ”రాం బారా ”కు చేరాం .అంటే సగం దూరం ప్రయాణం అయిందన్న మాట
ఇక్కడ గుర్రాలకు ”బెల్లము ,పిండి ”కలిపినా ఉండలు పెడతారు బలం కోసం .వాళ్ళు టీ తాగుతారు .మనం కూడా తాగచ్చు .తాగ బుద్ధి కాక తాగ లేదు .కాళ్ళు బిగ పట్టు కోని కూర్చుని వుండటం వల్ల విపరీతం గా నెప్పి .ఒక ఇరవై నిమిషాల విరామం తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించాం .ఇంకో రెండు గంటలకు అంటే సాయంత్రం నాలుగున్నరకు కేదార్ నాద్ చేరాం .దారిలో ‘ముత్యాలంత ”వడ గళ్ళ తో చిన్న వర్షం కురిసింది .ఆగ కుండా అలానే ప్రయాణం కొన సాగించాం .అందుకే ముందుగా ప్లాస్టి రైన్ కోట్లు ముందే కొన్నాం కనుక వేసు కొన్నాం .తలకూ రక్షణ వుంది .జీవిత మనోరధం నెర వేరిందని ఉప్పొంగి పోయాం .ఈ పోనీ లపై కూర్చోవ టానికిచాలా ఓపిక కావాలి .నిబ్బరం గా వుండాలి .లేక పొతే కష్టం .
పోనీలపై కూర్చునే టప్పుడు ,రెండు అర చేతులతో ,జీనుకింద   వున్న కొక్కెం లాంటిది పట్టు కోవాలి .ఏ మాత్రం అజాగ్రత్త గా వున్నా ,కింద పడే ప్రమాదం వుంది .ఎత్తు నుంచి ,కిందకు దిగేటప్పుడు వెనక వైపు పట్టు కోవాలి .టక ,టకా అని
అవి పరుగు లాంటి నడక నడుస్తుంటే ,అను క్షం జాగ్రత్త అవసరం .దారిలో మంచును చేదించి దారులు కొత్త గా ఏర్పాటు చేశారు .అటు ఇటు పర్వతాలపై మంచు కుప్పలు .కరిగిన మంచు ప్రవాహాలు .ఎక్కడ చూసినా మంచు ,నీరు ,గాలి .ఈ గాలికీ ,ఈ వాతా వర నానికీ ఆకలి ,దప్పిక వుండవు .అందుకనే ఇక్కడ యోగులు తపస్సు చేసు కోవ టానికి అనువైన ప్రదేశం .ఆకలి ,దాహం లేక పొతే మనం కూడా దేవతలమే అవుతాం .అందుకే దేవ లోకం అనే పేరు దీనికి సార్ధకం అయింది .
అయితే ,ఈ పచ్చ దానాన్నీ ,ఘద్వాల్ వృక్ష సంపదను ,కాంట్రాక్టర్లు విపరీతంగా ,అడవులను నరికి వాతా వరణ సమ తుల్యానికి చేటు తెస్తున్నారు .మరీ పోరో ఘద్వాల్ హిమా లయాల్లో అడవుల నరికి వేత బాగా ఎక్కువ .పర్యావరణాన్ని రక్షించక పొతే ,చెట్లు లేక పొతే ఇండియా అంతా ఎడారి గా మారి పోతుంది .అందుకనే ప్రముఖ పర్యావరణ రక్షకుడు శ్రీ సుందర్ లాల్ బహుగుణ ”చిప్కో ”ఉద్యమాన్ని చేబట్టారు .హిమాలయ అరణ్యాలను కాపాడుతున్నారు .  .చిప్కో అంటే ”to  hug or embrace ”అని అర్ధం gharvaaleee భాష లో .ఎవరైనా చెట్టును నరుకు తుంటే ,దాని చుట్టూ చేతులతో కమ్మేసి,కావలించు కోని చెట్లను కాపాడే విధాన మే చిప్కో  ఆ ఉద్యమానికి జనం అండ గా నిలిచి అరణ్యాలను కాపాడు కొన్నారు .కొత్త చెట్లు నాటటం ,వున్న వాటిని పరి రక్షించటం జరుగు తోంది .;;శ్రీ ధూం సింగ్ నేగి ”అనే ఉపాధ్యాయుడు ,అతనితో పాటు చాలా మంది స్త్రీలు బహు గుణ కు బాసట గా నిలిచి హిమాలయారన్యాలను సంరక్షించు కొంటున్నారు . vu .
ముందుగా ప్రభావతి పోనీ చేరింది .తర్వాత నాదీ .ఆ తర్వాత మలయాళం  వారివీ .అటు ఇటు హిమం తో కప్పేసిన పర్వతాలు .దారి అంతా మంచు మయం .పోనీల స్టాండ్ దగ్గర దిగాం .కాళ్ళు స్వాధీనం లో లేవు .అక్కడికి అర కిలో మేటర్ నడిచి ”మహా రాష్ట్ర భవన్ ”చేరాం .అక్కడ ఒక రూం లో మూడు మంచాలు ఇచ్చారు .అయిదుగురం అందులో సర్దు కోవాలి .అందులో ఒక హిందీ ఆవిడకూడా  వుంది .పరుపులు ,కప్పు కోవటానికి ఉన్ని రగ్గులు ఇచ్చారు .దిగిన దగ్గర్నించీ ప్రభావతి చలికి గజ గజ వణికి పోతూనే వుంది .ఇంకో అర గంటకు అక్కయ్య పోనీ కూడా వచ్చింది .సుమారు నాలుగున్నర గంటలు పట్టింది గౌరీ కుండు నుంచి కేదార్ నాద్ చేరా టానికి .ఏడు గంటలు నడిచి బావ రాత్రి ఏడున్నరకు వచ్చాడు .అందరం పూర్తి గా అలిసి పోయాం .మహా రాష్ట్ర కాంటీన్ వాళ్ళు పది రూపాయలకు మంచి కప్పు కాఫీ ఇచ్చారు .హాయిగా ఆనందం గా తాగాం . రూములో కాసేపు విశ్రాంతి తీసు కొన్నాం .కేదార్ నాద్ ఆలయం తెరిచి ఇవాల్టికి మూడు రోజులే అయింది .ఒళ్లంతా శాలువా స్వెట్టరు మఫ్లరు వున్నా క్లైమేట్ change వల్ల వణుకు వస్తోంది .తట్టు కోవటం చాలా కష్టం గానే వుంది .ప్రభావతి అసలు తట్టు కో లేక పోతోంది .ఇంకా ఈ ప్రాంతం లో కరెంట్ రాలేదు .ఇప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు .కటిక చీకటి .కొవ్వొత్తి మాత్రమే గతి .
మిగిలిన విషయాలు తర్వాత తెలియ జేస్తాను
సశేషం —మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ –22 -12 -11 —-ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

1 Response to దివ్య ధామ సందర్శనం –5

  1. I am feeling the presence of the holy places which you are mentioned above, while reading the post thanks again for this

    ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.