దివ్య ధామ సందర్శనం –6

దివ్య ధామ సందర్శనం –6

                                             కేదార్ నాద్ దర్శనం
”గుప్త కాశి ” లోనే మా అందరికి వంట వాడు తలో నాలుగు పొట్లాలు పాక్ చేసి ఇచ్చాడు .అందులో పులిహోర ,ఆరపు బూంది వగైరాలున్నాయి .అయితే వాటిని తిన బుద్ధి కాలేదు .కడుపు నిండి నట్లే వుంది .వీలైనప్పుడు కాఫీ మాత్రమే తాగాం .దారి లోను ఏమీ తిన లేదు .వాళ్ళు ఇచ్చిన ఆహారం రెండు రోజులకు సరి పడ .చలి మల వింత వల్ల ఆకలి మాటు మాయం .సాయంత్రం అయిడునరకు ,కాళ్ళు ,చేతులు కడుక్కొని ,కేదార్ నాదున్ని దర్శించ టానికి బయలు దేరాం .కాళ్ళకు బూట్లు వేసుకోన్నాం .పది నిముషాలు నడిచి ఆలయం చేరాం .దారిలో మంచు దిబ్బలు,కరిగిన మంచు .మంచుని నరికి ,చేసిన దారి .దేవాలయం చాలా సుందరం గా వుంది .ఆలయం ముందు చాలా ఎత్తైన నంది .స్తోత్రాలు చదువు కొంటు ఆలయం లోకి ప్రవేశించాం .కేదార నాధుడైన శివుడు సాయం కాలపు వేల సర్పాలన్కారం తో శోభిస్తాడు ,కేదారాక్ నాధుని దివ్య దర్శనం చేసు కొన్నాం .అక్కయ్య ,ప్రభ చలికి ఆగ లేక ,హోటల్ కు తిరిగి వచ్చే శారు .నేను -పాంట్ ,షర్టు ,మఫ్లర్ ,శాలువా ,స్వేట్టార్ తో నే వున్నాను ఆలయం లో .శివునికి ఎదురుగా ఆలయం లో కొంచెం పక్క న కూర్చున్నాను .భక్తులతో ఆలయం కిక్కిరిసి పోయింది .విపరీతం గా జనం వస్తున్నారు .ఇంత దూరం ఎలా నడిచి వస్తున్నారో ఆశ్చర్యమే .ఆ ఆకర్షణ అలాంటిది .అతి ముసలి వాళ్ళు ,చిన్న పిల్లలు ,అన్ని వయసుల వారు వున్నారు భక్తుల్లో .14 కి.మీ.నడిచే వచ్చే వారు ఇందులో ఎక్కువ శాతం వున్నారు .ఆ భక్తీ ప్రపత్తు లకు జోహార్లు .ఆరు నెలలు మాత్రమే దర్శనం గల క్షేత్రం ఇది .అంటే కాదు స్వరగా రోహానానికీ తగిన పుణ్య క్షేత్రం .అందుకే అంత గాఢ విశ్వాసం .చాలా భక్తీ తో వినయం తో స్వామిని స్తుతిస్తూ ,నమస్సు లర్పించాను .
ఈ హిమాలయాల్లో నే దేవతలు ,మహర్షులు ,వెద పథనం చేసి దీని పవిత్రత ను పెంచారు .శ్రీ శంకర భగవత్పాదుల వారు ఎన్నో స్తోత్రాలు రాసి తాను తరించి ,మనల్నీ తరింప జేశారు .ఏదో పూర్వ జన్మ సంస్కారం వల్ల ,నాలుగు సంస్కృతం మాటలు అబ్బాయి .కనుక సార్ధకం చేసుకొని ,ఈ హిమ శృంగాల మధ్య ,స్వామి సన్నిధిలో వెద ,ఉపనిషత్తులను నోరారా పతించి ,ప్రతి ధ్వని తో ఆనందాను భూతి పొందాలని అని పించింది .అంతే –స్వామి ఎదురు గా వున్న ద్వారం దగ్గర ,కూర్చున్నాను .శ్రీ నారాయణ ఉపనిషత్తు ,వెద మంత్రాలు ,తిట్టి రీయ ఉపనిషత్తు ,నమక ,చమకాలు ,శివానంద లహరి ,మొదలైనవి అయిడునర నుంచి ఎనిమిదిన్నర వరకు అంటే మూడు గంటల పాటు అవిచ్చిన్నం గా ,అనర్గళం గా ,అత్యుత్చాహం గా ,ఆనంద పార వశ్యం తో పతించాను .నా జన్మ తరించింది అని పించింది .మాత్రు ,పితృ దేవ ,రుషి గణం రుణాన్ని ఈ విధం గా తీర్చుకోన్నానని సంతృప్తి పొందాను .ఆలయం లో ఎడమ వైపు,”నర నారాయణుల ”విగ్ర హాలున్నాయి .అంటే ,శివ కేశవులకు భేదం లేదని అడుగడుగునా తెలియ జేస్తున్నారన్న మాట .అదే మన సంస్కృతి .ఎక్కడైనా విపరీతపు పోకడలు వుంటే ఉండ వచ్చు .చాలా అద్భుతానందం అనుభ వించాను .దివ్య విభూతి పొందాను .
రాత్రి ఏడు గంటలకు స్వామికి హారతి ని ఇచ్చారు .ఇక్కడా కరెంటు లేక పోయినా,generator  ద్వారా పవర్ అందిస్తున్నారు .ఆలయమంతా భక్తుల జయ జయ ద్వాఆలతో మార్మోగి పోతోంది .అశేష జన సందోహం .ఈ ఆలయాలు దర్శనం చేతనే మోక్షం ఇచ్చేవి .కారణం-ఇక్కడ స్నానం చేయటం అతి కష్టం .గడ్డ కట్టే చలి జివ్వుమనే చన్నీళ్ళు .ఆ మంచు నీతి లో మునిగి స్నానం చేయటం మనకు కష్ట మైన పనే .అయినా ఆ చలిని భరిస్తూ ,ఆ హిమ నదీమ తల్లి లో స్నానం చేస్తూనే వున్నారు భక్తులు ..
బావ నడిచి రావటం వల్ల అలసి పోయి దర్శనానికి రాలేదు .ఎనిమిదిన్నరకు ఆలయం కట్టేసే సమయం దాకా వుంది ,మాలీ మళ్ళీ దర్శనం చేస్తూ ,భక్తీ పులకాంకిత హృదయం తో ,,ఆనంద బాష్ప ధారల మధ్య కన్నులు పూడి పోయి ,రాలేక ,రాలేక ఆలయం నుండి బయటకు వచ్చాను .హిమాలయం పై వెద పథనం చేయాలన్న చిర కాల వంచ ఈ విధం గా నెర వేర్చాడు పర మేశ్వరుడు .మా అమ్మ భావానమ్మ ,మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గార్లు ఇచ్చిన ఈ జన్మ ను చరితార్ధం చేసుకొన్నాను .వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలను అర్పించు కొన్నాను .పరమేశ్వరానుగ్రహం తోడైంది .లేక పొతే ఈ దివ్య విభూతి కల్గెడి కాదు .మా కుటుంబం లో ఎవరూ చూడని ఈ క్షేత్రాసాన్ని సందర్శించి ,మేము నలుగురం పావిత్రులమయ్యాం .అన్న తృప్తి కల్గింది .అంత కంటే కావల సిన్దేమిటి ?అని పించింది .మా వంశం వారందరికీ ఈ పుణ్యాన్ని అందించాను అన్న భావం సంతోషాన్ని  ఇచ్చింది .మంచు పై నడుస్తూ ,,హోటల్ రూం కు చేరాను .అంతా పడుకొన్నారు .నేనూ పక్క పైకి చేరా .అలసటకు పెద్ద గా నిద్ర రాలేదు .ఆక్సిజన్ కూడా చాలా తక్కువ గా వుంటుంది కదా ఈ ప్ర దేశం లో .తలుపులు తీసు కొనే పాడు కొన్నాం .వణుకుతూ ,కలత నిద్ర పోతూ విశ్రా మించాం .
04 -05 -98 –సోమ వారం -నాలుగవ రోజూ —
రజాయి లో దూరి పాదుకొన్నా ,విపరీత మైన చలి వల్ల ,కొత్త వాతావరణం లో ,ఇమడ లేక పోయినందున ,నిద్ర పట్టటం లేదు .గత రాత్రి బావ కు పన్నెండు గంటలకు మెలకువ వచ్చి ,”ఏమైనా తింటే బాగుంటుంది ”అన్నాడు .తినాలని వున్నా మాకు లేవ బుద్ధి కాలేదు .ఏమీ తిననూ లేదు .ఖాళీ కడుపు తో అలానే తెల్లారే దాకా గడిపాం .
తెల్ల వారింది .సోమ వారం వచ్చింది .ఆ చీకటి లోనే లేచాం .కరెంటు లేదు .ఎక్కడ ఏమి వుందో తెలీయటం లేదు .అలాగే చీకటి లో చిందు లేస్తూ కాల కృత్యాలు తీర్చు కొన్నాం .పంపుల్లో నీళ్ళు ”కొరికే టంత చల్లగా వున్నాయి ”.వాటి తోనే సరి పుచ్చు కొన్నాం .వేడి నీళ్ళ ఏర్పాటు ఇంకా రాలేదు .స్నానం చేయటం అసాధ్యం అని పించింది .పండిత్జీ కూడా చేయ లేదు .చాలా మంది అంటే .మేము అంటే .”అపవిత్రః పవిత్రోవా ”అణు కొంటు ,నేను గంగా జలం చల్లు కోని ,అందరి పైనా చల్లాను .ఇదే స్నానం అందరికీ .పండిత్జీ వచ్చి ,ఆ రోజూ పూజ ,అభిషేకం ,గుది మూసే రోజూ కు పూజా కలిపి 150 రూపాయలు తీసు కొన్నాడు .ఆరు నెలల తర్వాత గుది మూసే రోజున మళ్ళీ అభిషేకం చేసి ,పూజ చేసి ,ప్రసాదం ఇంటికి పంపు తాడట .సరే నన్నాం .ఏడు గాక్న్తలకు దేవాలయానికి తీసుకొని వెళ్తానన్నాడు .అందరం కలిసి ,ఆయన తో బయల్దేరాం .సోమ వారం అవటం తో భక్తులు బాగా ఎక్కువ గా వున్నారు .సందడే సందడి .”జై భోలా నాద్ కి జై ,జై కేదారేశ్వార్ కి జై ”అని భక్త సందోహం ,పరవశం గా అంటున్నారు .బయట పెద్ద క్యూ వుంది .లోపలి వచ్చిన తర్వాత ,తాను కలిసి పూజాదికాలు నిర్వ హిస్తానని పండిత్జీ చెప్పాడు .మమ్మల్ని లైను లో ప్రవేశ పెట్టాడు శాస్త్రీజీ .
దేవాలయం చుట్టూ మంచు దిబాలు .కొంత పగల కొట్టి ,ప్రదక్షిణ చేయ టానికి వీలు కల్పించారు .ఎదురెదురు గా మంచు తో నిండిన హిమ నాగాలు అత్యున్న తం గా దర్శనమిస్తున్నాయి .వెనకా ,ముందు ,ప్రక్కనా ,అన్నీ మంచు కొండలే .హిమం కరిగి ప్రవ హించే జల దారాలే .ఇక్కడి నుంచే ”మందాకినీ ”నది ,జన్మించి ,ప్రవహిస్తుంది .”మందాకినీ సలిల చందన చర్చి తంగ ”అని శంకర భగవత్పాదులు కేదారేషుని స్తుతించారు .మొత్తం మీద ఒక గంట తర్వాతా ఆలయం లో కి ప్ర వేశించాం .స్వెట్టరు ,శాలువా ,మఫ్లరు ,కాళ్ళ కు సాక్స్ తో ఆలయం లోకి చేరాం .పండిత్జీ కూడా అంటే .పూజారులు ,భక్తులు అందరు అంతే .ఇక్కడి వాతావర నానికి ఈ డ్రెస్ తప్పదు .శాస్త్రీజీ మాతో కలిసి ,జంటలు జంటలుగా కేదారేషుని పూజ చేయించారు .అభిషేకమూ చేయించారు .కేదారం లో అభిషేకం చేస్తే ,మోక్షమే నట .వాళ్ళు సారిగా చేయరని ,నేను ”నమక ,చమ కాలు ”చదువు తూనే వున్నాను .శివ అస్తోత్తరం కూడా చదువు తున్నాను .పూజారులు నా వైపు కొంచెం గుర్రు గా చూశారు .ఎవరేమని అనుకుంటే నాకేంటి  ?మంత్రం లేక పొతే మనకు తోచదు కదా .అలవాటు పడ్డా ప్రాణం .స్వామికి ఇప్పుడు ఏ అలంకారాలు లేవు .చాలా ఆర్తితో భక్తీ తో ,ఆనందం తో ,శంకర స్వామిని అర్చిన్చాము .శిరస్సు తో లింగాన్ని తాకి తనువుకు పవిత్రత ఆపాదించు కొన్నాం .
 కేదారేశ్వరుని మహాత్మ్యం –ఉత్తర భారతం లో ”ఉత్తరా ఖండ యాత్ర ”చాలా ముఖ్య మైంది .దీనినే ”చార్ ధం యాత్ర ”అంటారు .కేదార్ నాద్ ,బద్రీ నాద్ ,గంగోత్రి ,యమునోత్రి లను దర్శించటమే ఈ యాత్ర .ఇవే నాలుగు ధామాలు .ఇందు లో కేదార్ యాత్ర చాలా ముఖ్య మైంది .స్కంద పురాణం లో ”కేదార ఖండం ”ఒక ప్రత్యెక భాగం .దీని లో కేదార్ ,బద్రీ లు వస్తాయి .శివుడు పార్వతీ దేవికి ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని వివ రిస్తాడు .”కేదార భవనానికి దక్షిణం లో రేతః కుండం వుంది .ఇక్కడి నీళ్ళు తాగితే ,శివ స్వరూపుడు అవుతాడు .ఇక్కడే శివ కుండం వుంది .అక్కడ ఏడు రోజులు వ్రతం చేస్తే ,కైలాస ప్రాప్ప్తి కలుగు తుంది .ఆ తర్వాత ముక్తి లభిస్తుంది .అదే కేదారేశ్వర వ్రత కధ.
దీనికి రెండు మైళ్ళ దూరం లో ”యెర్ర రంగు ”తో ప్రవహించే జల ప్రవాహం వుంది .ఆ నీళ్ళ లో లోహాలన్నీ ”బంగారం ”గా మారటాయత .ఉత్తరం వైపు ”స్ఫటికా కార శివ లింగం ”వుంది .ఇక్కడ ”అత్యుష్ణపు నీరు ”మంచు గా మారుతుంది దీన్ని అగ్ని తీర్ధం అంటారు ..ఇక్కడ నేతి తో హారతులు ఇస్తే కోరిన కోర్కె నెర వేరు తుందని నమ్మకం .దానికి ఉత్త రాన ,పర్వతాగ్రాల నుండి ,జలం దూకు తూ వుంటుంది .ఆ నీటి బిందువులు కింద పడి ”ముత్యాలు ”గా మారతాయి .ఇక్కడే భీమ సేనుడు శివుని ముత్యాలతో పూజించాడని ఇతిహ్యం .దీనినే ”గంధ మాదన పర్వతం ”అంటారు .ఇక్కడేహనుమంతుని నివాసం .  .ఇక్కడ అనేక రకాల పుష్పాలు పూస్తాయి .శ్రావణ మాసం లో ఈ ప్రాంతం అంతా ,”కలువ పూలు ”తో నిండి ,మనోహరం గా ఉంటుందట .అప్పుడు ,ఆ కలువల తో శివున్ని అర్చించి ,చరితార్దులవు తారట .దీనికి దగ్గర ”బ్రహ్మ తీర్ధం ”వుంది .పాండవులు యజ్ఞం చేసిన గుహ ఇక్కడే వుంది .గోధుమలు ,నువ్వులు ఇక్కడ పండు తాయి .,
బ్రహ్మ తీర్దానికి దక్షిణం లో ”బుడగల ”వంటి సముద్ర జలం వుంది .దీనికి ఎడం వైపు ,ఇంద్రుడు శివున్ని పూజించిన పురందర పర్వతం వుంది .అక్కడి శివ లింగాన్ని దర్శిస్తే మోక్షమే నట .ఇక్కడికే బ్రహ్మ దేవుడు హంస రూపం లో వచ్చి శివున్ని అర్చించారని చెబుతారు .
 పాండవుల స్వర్గా రోహణం —కురు క్షేత్ర యుద్ధం తర్వాత కొంత కాలమ్ పాండవులు రాజ్యం చేసి ,తాము చేసిన ”సగోత్ర హత్యా పాపం ”నుండి ,విముక్తులు అవటానికి స్వర్గా రోహణం చేయ ప్రారంభించారు .శివుడు వారికి దారి చూపిస్తూ ,కేదారం వరకు తెచ్చాడు .కేదారం లో శివుడు అదృశ్య మైనాడు .పాండవులు ఆయన కోసం వెతకటం ప్రారంభించి భీముడికి ఆ బాధ్యత అప్ప గించారు .భీముడు రెండు పర్వ తాల మీద కాళ్ళు పెట్టి వచ్చే పోయే జంతువు లనన్నిటినీ పరి శీలించాడు .వాటి మధ్య శివుడు కని పించాడు .పట్టు కొన బోతే ,భూమిలో దూరాడు శివుడు .భీముడు శివుని ,వీపు పట్టు కోని ,ఆపేశాడు .పాండవుల అకున్తిత దీక్ష కు శివుడు మెచ్చి ,వారికి స్వర్గా రోహాణకు అను మతినిచ్చాడు .అందుకే ”కేదారేశ్వరుడు ”మామూలు శివ లింగం రూపం గా కాకుండా ,”వంగిన నడుము గల శివ లింగం ”గా కని పిస్తాడు .అదీ ఇక్కడి ప్రత్యేకత .ఆ లింగాని తాకి పాండవులు సగోత్ర హత్యా పాపం ను పోగ్గొట్టు కొన్నారు .ఇక్కడ స్వామిని స్పర్శించి అందరు తరిస్తారు .స్పర్శ మాత్రం తోనే మోక్షం ఇచ్చే దేవుడు కేదారేశ్వరుడు .
శివుని శిరస్సు నేపాల్ దేశం లో ”పశు పతి నాద ”ఆలయం లో వుంది .కేదారం లో వీపు ఆకారం లో వున్న శివ లింగం ను నెయ్యి తో మర్దించి ,చాతీని తాకించి ,సర్వ పాపాలు పోగొట్టు కుంటారు భక్త జనం .మేమూ అలాగే చేశాం . ప్రవరుని తో సిద్ధుడు  కూడా ”కేదారేశు భజించితిన్,శిరమునన్ కీలించితిన్ ,హింగుళా పాదాం  భోజములన్ ”
అంటాడు .పాండవులు స్వర్గా రోహణ ము చేసిన ప్రాంతం కనుక ఈ క్షేత్రాన్ని ”స్వర్గ లోక యాత్ర ”అనీ అంటారు .
సశేషం

—                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

1 Response to దివ్య ధామ సందర్శనం –6

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.