ఇలను వీడిన ఇలపావులూరి

ఇలను వీడిన ఇలపావులూరి

           ఒక్కో సాహితీ నక్షత్రం రాలి పోతోంది మొన్నీ మధ్య మధురకవి మల్లె మాల అస్తమిస్తే మొన్న భారతీయ భాషా సాహిత్యాలను కొత్త దృక్పధం తో లోకానికి అందించిన అశేష ప్రజ్ఞా దురంధరుడు ,భారతీయ ఆత్మకు ప్రతినిధి ,మహా మహోన్నతుడు ఇలపావులూరి పాండు రంగ రావు గారు ఎనభైరెందేళ్ళ నిండు జీవితాన్ని పండించుకొని ,జ్ఞాన ఫలాలను మనకు   అందించి ,పండిన పండు లా రాలి పోయారు .ఒక జ్ఞాన చుక్క మింటికి ఎగసింది అని పించుకున్నారు .చదివింది హిందీ ,చేసిన ఉద్యోగామేమో ధిల్లీ లో ,ప్రవ్రుత్తి మాత్రం భారతీయ సాహిత్య ,సంస్కృతుల మీదఅధ్యయనం . .అంతవరకే కాదు ,వాటిని తరు వాతి తరాలకు వరాల మూటలుగా అందించిన జ్ఞాన ఖని .ఎన్నెన్ని భావాలు ఎలా ఎగసి పడి అంతరింద్రియం తో దర్శించి ,వెలు వర్చారో ఆశ్చర్యం వేస్తుంది .భార తీయ భాషలు అన్నీ ఆయన సేవకు రుణ పడి వుంటాయి .ఆ అశేష ప్రజ్ఞా నిధి దివ్య విభూతిని దిగ్మాత్రం గా దర్శిద్దాం .

       ప్రకాశం జిల్లా చీమలకుర్తి మండలం లో ”ఇలా పావులూరు ‘లో జన్మించారు .అక్కడే కొంత కాలమ్ లెక్కల మాస్టారు గా పని చేశారు .తర్వాత హిందీ భాషా సాహిత్యాల మీద పరిశోధన చేస్సి డాక్త రేట్ సాధించారు .రాజమండ్రి లో హిందీ లెక్చరర్ గా కొంత కాలమ్ పని చేశారు .సంస్కృతం ,బెంగాలీ ,ఇంగ్లీష్ మొదలైన భాషా సాహిత్యాలను మధించి అవగతం చేసు కున్నారు .వాటిలో మంచి ప్రావీణ్యం సంపాదించారు .సాధికారత సాధించారు .స్వయం గా 60 కి పైగా పుస్తకాలు రాశారు

.దాదాపు నలభై కి పైగా అనువాదాలు చేశారు .ప్రఖ్యాత మలయాళీ రచయిత తక్కాళి శివ శంకర పిల్లే రాసిన ”ఎనిప్పాదిల్ ”నవలను సరళమైన తెలుగు లో ”మెట్టు కు పై మెట్టు ”పేరుతొ అనువదించారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొన్నారు .ముప్పాళ్ళ రంగనాయకమ్మ   రాసిన ”పేక మేడలు ”నవలను హిందీ లోకి నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కోసం తర్జుమా చేశారు . ప్రఖ్యాత హిందీ రచయిత జయ శంకర ప్రసాద్ రచించిన ”కామాయిని ”నవలను తెలుగు లోకి అనువాదం చేశారు .దీనికి మంచి పేరు వచ్చింది .


యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్ లో లో భాషా విభాగం డైరెక్టర్ పని చేసి ఆయా భాషల్లో పరీక్షలు రాసే వారికి గొప్ప సాయం చేశారు .వారెవరూ పాండు రంగా రావు గారి సేవలను మరిచి పోలేరు .అనేక సంవత్సరాల పాటు భారతీయ జ్ఞాన peetha పురస్కార సంఘం లో సభ్యులు గా పని చేసి ఆ అవార్డ్ కు అర్హులైన వారిని ఎంపిక చేయటం లో తన వంతు కృషిని చేసి, ప్రశంసలు పొందారు .కలకత్తా లోని ”భారతీయ భాషా పరిషత్ ”డైరెక్టర్ గా పని చేసి సమర్ధతను చాటు కున్నారు .బహుభాషా పండితుడు,మన తెలుగు వాడు మాజీ ప్రధాని పీ.వి.నరసింహారావు కు ,బహుముఖ విద్యా వేత్త ,మాజీ రాష్ట్ర పతి శంకర్ దయాళ్ శర్మ కు ,కాశ్మీర్ మహారాజు ,ప్రజ్ఞా నిధి ,శేముషీ దురంధరుడు,మాజీ కేంద్ర మంత్రి  సర్దార్ కరణ్ సింగ్ కు పాండు రంగా రావు అత్యంత ఆప్తుడు .ఆంద్ర ప్రదేశ్ ఎన్నికల అధికారిగా సమర్ధ వంతం గా పని చేసి నిర్మోహ మాటం గా వ్యవహరించి ,నిర్దుష్టం గా ఎన్నికలు నిర్వహించిన I.v..సుబ్బారావు గారు పాండురంగ తనయుడే .తండ్రి నుంచి మంచి లక్షణాలను వారసత్వం గా పొందిన వారు .ఈయన ఇప్పుడు పారిస్ లో యునెస్కో లో ఉన్నతాధి కారి గా పని చేస్తున్నారు .
ఇల పావులూరి పాండు రంగా రావు గారి మొత్తం రచనలను ఆధ్యాత్మిక లహరి ,సాహిత్య విమర్శ లహరి ,కవితా లహరి ,అనువాద లహరి గా  మనం గుర్తించి అధ్యయనం చేయ వచ్చు .ఇవన్నీ ఆత్మానందాన్ని ఇచ్చేవే కనుక ఈ మొత్తాన్ని ఆత్మానంద లహరి అనుకొందాం .


ఆధ్యాత్మిక లహరి —ఇందులో ఆదిత్య హృదయం ,శ్రీ లలితాంరుత లహరి ,సత్యం పరం ధీమహి ,ఆది శంకరులు -అద్వైతం ,గేయం -గీతా నామ సాహస్రం వున్నాయి
విమర్శ లహరి –లో వాల్మీకి సృష్టి -ద్రుష్టి ,కవిత్రయం -మహా భారతం ,పోతన భాగవతం ,”కలప వృక్ష మహా శిల్పే విశ్వ నాదో విశిష్యతే ” ,భారతీయ భాషా సాహిత్యాలు ,భారతీయ వాగ్దేవి ,,జ్ఞాన పీథ భారతి  ‘అద్భుత మైన రచనలు .
కవితా లహరి –లో త్యాగ రాజా స్మృతి ,మన భారతి–మను భారతి ,ఆది లక్ష్మీ కామేశ్వరి ,పునర్జన్మ మహోన్నత రచనలు
అనువాద లహరి –లో గీతాంజలి ,గీతాంజలి గేయం -గురువాణి ,ఆరాధన
వీరి అనుదిన రామాయణం -సాధారణ మనిషి నుంచి ,అన్ని హోదాలలో వున్న వారికీ రామాయణం లోని విశేషాలు నిత్య జీవితం లో ఎలా ఉపయోగ పడ తాయో మహత్తరం గా తెలియ జేశారు .
విష్ణు సహస్ర నామాల లోని విశేషాలను ”సహస్ర ధార ”గా రచించారు .కొత్త చూపు ఇందులో మనకు కని పిస్తుంది .ఆ నామ ఔచిత్యాన్ని ఇంత కంటే గొప్ప గా నాకు తెలిసి నంత వరకు ఎవరు రాయలేదు .అదో మహత్తర లోకం .అందు లో ప్రవేశిస్తే మళ్ళీ బయటికి రాలేము .విష్ణు సహస్ర ధార అంటే ఒక ప్రవాహం ,ఒక కత్తి పదును .రెంటినీ మహత్తరం గా ఆఇశ్కరిన్చారు .ఆధునికులు తప్పక చదివి దివ్యాను భూతిని పొందే రచన .రంగా రావు గారి చూపే వేరు .అది అలౌకిక మార్గానికి సుగమ మార్గం .అందు లోని అంతర్యం హృదయ గత మవుతుంది .విష్ణు సామీప్యాన్ని పారమ్యాన్ని పొందుతాం .ఇదొక్కటి చాలు వారి శేముషీ వైభవాన్ని తెలియ జేయ టానికి .అలాగే లలితా సహస్ర నామం లోని నామ విశేషాలను ”శ్రీ సహశ్రిక ” వెలువ రించారు .ఈ రెండిటి లోను,ఆ నామాల అర్దాల, భావాల continuity  ని ఇంత విశేషం గా తెలియ జెప్పిన వారు లేనే లేరు .లేరు .లేరు . ఎవరు చెప్పినా వ్యాఖ్యానం చేసినా ఏ నామానికి ఆనామ తీసుకొని వ్యాఖ్యానించారు కాని తరువాతి నామానికి వున్న అనుబంధాన్ని వివరించిన మహత్తర రచన చేశారు ఇల పావులూరి .చదివి ఆ ఆనందాన్ని ఎవరికి వారు అనుభ విన్చాల్సిందే.
,          రామాయణ రచనలో వాల్మీకి మహర్షి  లోకోత్తర దృష్టిని ”వాల్మీకి ”పేర మహాద్భుతం గా ఆవిష్కరించారు పాండు రంగా రావు గారు .చిన్న పుస్తకమే కాని వాల్మీకి హృదయాన్ని రామాయనాన్తర్గత విశేషాలను మానవాళికి మహర్షి ఇచ్చిన సందేశాలను మహత్తరం గా విశ్లేషించిన పుస్తకం ఇది .
విష్ణు సహస్ర నామాలను ఇంగ్లీష్ లోకి అనువదించి వాటిపై కామెంటరి రాసిన మహాను భావుడు, ఉభయ భాషా రవి రంగా రావు .శంకరాద్వైతం పై మహా పట్టు వున్న వాడు .ఉపనిషత్తు లపై సాధికారం గా వివ రించే మహా ప్రజ్ఞా వంతులు ఇల పావులూరి .రామాయణం మీద సత్యసాయి   చేసిన ప్రసంగాలను కాసెట్లు గా తెచ్చిన ఘనత పాండు రంగా రావు గారిది .
రంగా రావు గారు ఏది రాసినా ,”ఏకత్వ భావన ”అనే ధ్యేయం తోనే రాయటం మరువ రాని విషయం .భారతీయ ఆత్మ్సను అత్యద్భుతం గా దర్శించిన వారు పాండు రంగా రావు గారు .
.        ఇంత అశేష శేముషీ దురంధరుడు అయిన పాండు రంగా రావు గారు గత కొన్నేళ్ళు గా ”ఆల్జీమర్స్ ”వ్యాధితో బాధ పడటం బాధాకరం . అత్యంత మహాజ్ఞానులకు ఇదిఒక శాపం గా మారుతోంది .అమెరికన్ తత్వ వేత్త ఎమెర్సన్ ,నిన్నటి  ఇంజనీర్ వేణుగోపాల రావు ,జార్జి ఫెర్నాండెజ్లు దీని బారిన పడ్డ వాళ్ళే ..
ఇలపావులూరి మాటలో సౌజన్యం మూర్తీభవిస్తుంది .ఆకారం లో ఆహార్యం లో భారతీయత దర్శన మిస్తుంది .వ్యక్తిత్వం లో మన మహర్షులు కని పిస్తారు .సౌహార్దాత ఆయనకుఆలవాలం   .సహృదయతకు నిలు వెత్తు దర్పణం .భారతీయ సాహిత్యాన్ని సు సంపనం చేసినవిద్వాంసుడు .  .భారతీయ సాహిత్య పరమార్ధాన్ని కుత్తుక బంటి దాకా గ్రోలి జగానికి అందించిన విశ్లేషకులు .సంగీత సాహిత్యాలను సమానం గా .అధ్యయనం చేసి లోతులు తరచి వెన్న లా అందించిన జ్ఞాని .భారతీయ తత్వ రహశ్యాలను పూర్తిగా ఆకళింపు చేసు కోని ,ప్రపంచానికి తెలియ బరచిన విజ్ఞాని .శబ్ద శాస్త్ర సారం తెలిసిన వారు ,కవితా రసాస్వాదన వున్న వారు.ఎంత సంప్రదాయ మనస్కులో అంత ఆధునికులు భావాలలో .విశ్వ నాద ఎంత ఇష్టమో గురజాడనూ అంతగా ఆరాధించిన సంస్కారి .అన్ని భాషా సాహిత్యాలతో ,కవులతో పరిచయం పెంచుకొని ,అవగాహన చేసుకొన్నా వారు  ,ఆయన రాసింది ఏదిఅయినా చదివితే  బుద్ధి వికసిస్తుంది ,హృదయం ఆర్ద్ర మవుతుంది .వికాస వంత మవుతుంది .
ధార్మిక చేతన తో ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వారు .ఆయన తో పాటు ఇదే భావాలతో ప్రభావితం చేసిన మహా కధకుడు   ,దార్శనికుడు,విశ్లేష కుడు  ,భారతీయ అంతరాత్మను దర్శించిన వాడు వాకాటి పాండు రంగా రావు గారు .,ఇల  పావులూరి పాండు రంగా రావు గారు ,వాకాటి పాండు రంగా రావు గార్లు మన భారతీయత కు ఎత్తిన పతాకలు .వాకాటి ముందే వెళ్లి పోయారు .ఇప్పుడు ఇల పావులూరి .ఇద్దరు  పాండు రంగా రావు లు కూడా మహోన్నత మూర్తులు . భారతీయ ఆధ్యాత్మికతకు” ,తెలుగువారైనాభారతీయులని పించుకున్న వారు .వారిద్దరూ భారత భారతీ పదార్చకులు ”అన్న డి.చంద్ర శేఖర రావు గారి మాటలు అక్షర సత్యాలు.. ఆ పాండు రంగ ద్వయానికి  సహస్ర వందనాలతో కై మోడ్పు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -12 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

2 Responses to ఇలను వీడిన ఇలపావులూరి

  1. phaneendra says:

    Loss of Sri Ilapavuluri is a great loss to the small sect of religious critical scholars. He used to come to the house of my uncle sri puranapanda radhakrishnamurty in rajahmundry. I was very small in age to talk to him, but have a few memories of his lectures.

  2. sunamu says:

    It’s a great tribute to Sri I Panduranga Rao. Very comprehensive and written with passion.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.