దివ్య ధామ సందర్శనం –12

దివ్య ధామ సందర్శనం –12

    07 -05 -98 -గురువారం (ఏడవ రోజూ )

—              పీపల్ కోట్ నుంచి యధా ప్రకారం అన్నీ పూర్తి చేసుకొని ఉదయం అయిదు గంటలకే బస్ లో బయల్దేరాం .రాత్రి అంతా విపరీత   మైన వర్షం పడింది .ప్రమాద భరిత మైన రోడ్డు .వర్షం ఇంకా పడుతూనే వుంది .అతి జాగ్రత్త గా బస్ ను నడుపు కుంటు ,చాలా వేగం గా రుద్ర ప్రయాగ చేర్చాడు డ్రైవర్ .అక్కడి నుంచి ఇది వరకు వచ్చిన ఘాట్ రోడ్ లోనే ప్రయాణం వెనక్కి వెళ్లి పోతున్న పవిత్ర క్షేత్రాలు .ముందుకు దూకుతున్న కారు .ఆకాశం అంచులు చూసే హిమాలయ శ్రేణులు ,అంత ఎత్తూ ఉన్నాయా అని పించే పచ్చని వృక్ష శ్రేణి ,నిరంతరం ఆపర్వతాగ్రాల నుండి దుమికే జల పాతాలు  ,చల్లని గాలి ,వికశించిన పూల పరీమళం ,ముగ్ధ మనోహర దృశ్యాలు చూస్తూ వెనక్కి వస్తున్నాము .నాన్ స్టాప్ గా ఏడు గంటలు ప్రయాణం చేసి మధ్యాహ్నం 12 -30 కు ఋషీకేశ్ లో గంగ ఒడ్డున బస్ ఆగింది .ఆ ఆనందాన్ని తింటూ ,తాగుతూ ,పులిహోర లాంటి పదార్ధాన్ని అందించగా అందరం తిన్నాం .బావకు ఒళ్ళు నొప్పులు ,వికారం ,కొంచెం జ్వరం వుండటం వల్ల ఏమీ తినలేదు .డ్రైవర్ కూడ ఏమీ తిన లేదు .మాకు సహించింది బాగానే తిన్నాం .ఇలా ఇష్ట పడి తిని చాలా రోజూ లయిందని పించింది .
పర్వతాలపై నుండి వచ్చే జల ప్రవాహానికీ ,రేకో ,గొట్తమో అడ్డం పెట్టి ,ప్లాస్టిక్ గొట్టాల ద్వారా ,హోటళ్ళలో ఇళ్ళలో నీళ్ళు వాడు కుంటున్నారు .ఇది ఈ పర్వత ప్రాన్తమంతటా సర్వ సామాన్యం .ఎంత వాడినా తరగని జలం .ఎవరికీ డబ్బు కట్టక్కర లేదు .బదరి లో ”నీల kantha పర్వతాన్ని ”నిన్న సాయంత్రం అద్భుతం గా ఫోటో తీశాను .పరమాద్భుత దృశ్యం అది .ఫోటో తీయ గానే మబ్బు కమ్మేసి ,ఆ శిఖరం అసలు కన్పించనే లేదు .దారిలో వీలైన చోట్లల్లా ఫోటోలు తీశాం .అందరం కలిసి ఫోటోలు దిగాం .
పీపల్ కోట్ నుంచి హరిద్వారం దాకా వర్షం వుంది .అంటే కేదార్ ,బద్రీ లలో విపరీతం గా వర్షం అడిందన్న మాట .కొండ చరియలు విరిగి పడే ప్రమాదం వుంది .మధ్యాహ్నం రెండు గంటలకు హృషీ కేష్ ,తెహ్రీ ల మీదు గా ”హరిద్వార్” చేరాం .తెహ్రి నుంచి అన్ని వైపులకు రైల్ మార్గం వుంది .
గంగ   ఒడ్డున బస్ ఆపారు .రాత్రి తొమ్మిదిన్నర వరకు సమయం ఇచ్చాడు .హరిద్వారం దగ్గరే గంగ భూమార్గం పట్టింది అంటే peetha భూమి పై ప్రవహించటం ప్రారంభించింది .ప్రవాహం చాలా ఉద్ధృతం గా వుంది .విశాల మైన సిమెంట్ ఒడ్డ్లు ,రేవులు ,భద్రత కోసం గొలుసులు ,ఈ వైపు ,ఆ వైపు మహాభక్త జన సందోహం .గంగలో హాయిగా సంతృప్తి గా  స్నానం చేశాం .ఇక్కడే ఈ నదికి ”గంగ ”అని పేరు వచ్చింది .ఈ క్షేత్రాన్ని ”మాయా పూరి ”అని కూడా పిలుస్తారు .బట్టలు ఆరేసుకోన్నాం మంచి బట్టలు కట్టు కొన్నాం .శర్మ ఇచ్చిన వాటర్ కాన్ నిండా గంగా జలం పట్టు కొన్నాం .వంతెన మీదుగా ,అవతలి ఒడ్డుకు  చేరాం .”గంగ ద్వారం ”అని కూడా దీనికి పేరు .భగీరధుడు తన పూర్వీకులకు ఉత్తమ గతి కల్పించ టానికి ఆకాశ గంగాను  ,శివుని తలపై చేర్చి ,హిమాలయం పైకి దింపి ,అక్కడి నుంచి భూమార్గం పట్టించాడు . ఇక్కడే తమపూర్వీకులకు పుణ్య లోక ప్రాప్తి కగించాడు .పితృ ఋణం తీర్చుకొన్నాడు .అందుకే ఇది చారిత్రాత్మకం గా ప్రసిద్ధి చెందింది .”ఆకాశంబున నుండి ,శంభుని శిరంబందుండి ”అన్న భార్త్రు హరి సుభాషిత పద్యం జ్ఞాపకం వస్తుంది .
ఈ క్షేత్రానికి ఉత్తరం గా వున్న భూమిని ఋషులు ”స్వర్గ భూమి ”అన్నారు .”భోగభూమి”  ‘కూడా ఇదే .ఈ ప్రదేశాన్ని ”స్వర్గ ద్వారం ”అనీ పిలుస్తారు .”హరికే పౌరీ ”అంటారు హిందీ లో .ఇక్కడి నుంచే విష్ణు స్వరూపుడు బదరీ నారాయనున్ని ,శివ స్వరూపుడు కేదారేశుని దర్శించ టానికి  యాత్ర  ప్రారంభిస్తారు కనుక ”హరిద్వారం  -”హరద్వారం ”అంటే హరిహర ద్వారం అయింది .
గంగకు అవతల ఒడ్డున వున్న ”మానసా దేవి ”ని దర్శించాం .దీనికి rope వే వుంది వెళ్ళటానికి .దీన్నే హిందీ లో ”ఉరన్ ఖటోలా ”అంటారు .ఈ పేరు తో హిందీ లోసినేమా కూడా వచ్చింది .రాను పోను మనిషికి ఇరవై రూపాయలు .దీనిపై వెళ్తుంటే థ్రిల్లింగ్ గా వుంది .మొత్తం సిటీ అంతా స్పష్టం గా కని పిస్తుంది .ఒక్కో బాక్స్ లో నలుగురు కూచునే వీలు .అంత ఎత్తు నుంచి ఫోటోలు తీశాం .మానసా దేవి అమ్మ వారిని దర్శించి ,నమస్కరించాం .ఇక్కడ బొట్లు అమ్ముతారు .వాటిని ఆలయం గోడల మీద అంటిస్తే కోరికలు తీరు తాయని నమ్మకం .మేమూ అలానే చేశాం .దీనికి దగ్గరలో చండీ ఆలయం ,దక్ష ప్రజాపతి ఆలయం ,భోలా గిరి ఆలయం ,శాంతి కుంజ్ ,వ్యాసుని గుడి ,సప్తర్షి ఆశ్రమం వున్నాయట . .మేము చూడ లేదు .rope వే నుంచి దిగి షాపింగ్ చేశాం .ఘద్వాల్ నేత వస్తువులపై అమ్మకం   పన్ను లేదు .కనుక చవక .ప్రభావతికి స్వెట్టరు ,చీరలు ,నేనొక స్వెట్టరు శాలువా కొనుక్కున్నాం .కాశిరంగు   తువ్వాళ్ళు కొన్నాం . బావా వాళ్ళు రుద్రాక్షలు కొన్నారు .కాఫీ తాగాం .బజార్లన్నీ తిరిగాం  .మళ్ళీ గంగ ఒడ్డుకు చేరాం .పర్వతాలలో మంచునీటి తో స్వచ్చంగా వున్న గంగా జలం  భూమికి చేరికల్మశాలతో   సర్వ కలుషాంత రంగ అయింది-మన పాపాలన్నీ మోస్తూ .
రాత్రి ఏడయింది ,.గంగమ్మకు భక్తీ శ్రద్ధ లతో హారతి ఇచ్చే సమయం .లక్షలాది మంది పడవ ఆకారం గా వున్న బుట్టలు పూల మధ్య ప్రమిదను పెట్టి ,ఒత్తి వేసి వెలిగించి ,గంగకు హారతి గా దిగువ ప్రవాహం లో ఒదులు తారు .భక్తీ శ్రద్ధలతో నమస్కరిస్తారు .రెండు వైపులా అనంత జ్యోతులు వెలిగి గంగమ్మకు వింత శొభ్కను ఇస్తాయి .ఆ తల్లి నీళ్ళు తాగి ,ఆ జలంతో సేద్యం చేసి,బంగారం పండించు కుంటున్నందుకు నదీమ తల్లికి సమర్పించే భక్తీ కానుక ఈ హారతి .దివ్యం గా నయనాండం గా ,మనోహరం గా వుంది .పూజారులు పెద్ద జ్యోతి ని వెలిగిస్తారు .ఆలయాలలో జేగంటలు మొగి దివ్య నాదం లా విని పిస్తాయి .చక్కని సమయం లో ఇక్కడ వునాం జన్మ ధన్యం చేసు కొన్నాం .మా వాళ్ళు గంగకు హారతి పట్టారు .
గంగ ఒడ్డునే ”గంగా దేవి గుడి ”వుంది .అందులో భగీరధుని విగ్రహమూ వుంది .అన్నీ చూశాం .నెమ్మది గా నడుచు కొంటు వంతెన దాటి ,అనూరాధా పోద్వాల్ అమర గానం గంగా హారతి కర్ణ పేయం గావింతున్నాం .  ఆమె భక్తీ పారవశ్యం తో తన్మయం గా పాడుతుంది .ప్రముఖ దర్శకుడు విశ్వ నాద్ ”శృతి లయలు ”సినిమా ను ఇక్కడే తీసి అందాలన్నీ కెమెరా లో బంధించాడు .
కుక్ మోహన్ వేడి వేడి గా పూరీలు చేస్తున్నాడు .బంగాళా దుంప కూర అందులోకి .రెండు చాలా బాగా కుదిరాయి .ఒక్కొక్కళ్ళం దాదాపు పదేసి పూరీలు లాగించాం .చాలా రోజుల తర్వాత కడుపు నింపుకొని బ్రేవున త్రేన్చాం .అందరు తనకు సహకరించి నందుకు అతను కృతజ్ఞతలు చెప్పాడు .మేమూ అతని వంట మెచ్చు కొన్నాం .ఈ వారం రోజుల్లో మేము వెంట తెచ్చుకొన్న ఊర గాయాలు ,వక్కపోడీ అందరికీ ఇచ్చాం .చాలా బాగున్నాయని రోట్టలు వేసుకొంటూ తిన్నారు అందరు కుక్ తో సహా,.
08 -05 -98 -శుక్ర వారం –ఎనిమిదవ రోజూ

——————————-

రాత్రి పది గంటలకు బస్ బయల్దేరింది .గంగకు నమస్కరిస్తూ ,పుణ్యం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపు కొంటు సెలవు తీసు కొన్నాం .తెల్ల వారు ఝామున మూడు గంటలకు ధిల్లీ చేరాం .నాలుగింటికి రావు ట్రావెల్స్ కు వచ్చాం .దారిలో అందరు దిగి పోయారు .ఆరింటికి రావు గారి తమ్ముడు వచ్చి కారులో   , మమ్మల్ని ”కన్నడ భవన్ ”లో దింపాడు .రూం తీసుకొని బడలిక తీర్చుకోన్నాం .కింద వున్న ఉడిపి హోటల్ లో కాఫీ తాగాం .స్నానాల తర్వాత పక్కనే వున్న రాఘ వేంద్ర స్వామి ఆలయం దర్షించాము .వాళ్ల దగ్గరే ఇరవై రూపాయలిచ్చి భోజనం చేశాం .ఆ ఎంగిళ్ళ మధ్య కూచొని తినటం దారుణం గా వుంది .అక్కడ రాజ మండ్రి తెలుగు వాళ్ళు కన్పించారు .జి వి ఎల్ నరసింహారావు కు ,శిష్యుడు చంద్ర శేఖర్ ఒదినకుధిల్లీ వచ్చి నట్లు ఫోన్ చేశాం .మేమున్నది రామ కృష్ణా పురం 12 సెక్టార్ .
సాయంత్రం బావ వాళ్ల బంధువుల ఇంటికి వెళ్దామని జనక్ పూరి కి  బయల్దేరా దీశాడు.నడిచీ నడిచీ కాళ్ళు వాచీ పోయాయి .చివరికి ఆయన ఒక్కడే ఇల్లు చూసి వచ్చి ,వాళ్ళు లేరని చెప్పాడు .రాత్రి కింద హోటల్లో భోజనం .33 రూపాయలు బాగుంది
09 -05 -98 శని వారం –తొమ్మిదో రోజూ —కార్ అద్దెకు తీసుకొని ధిల్లీ అంతా తిరిగి చూశాం .  10 –05 -98 -ఆది వారం -పదోరోజు –విశ్రాంతి తీసుకొన్నాం .ఆ రోజూ రాత్రి కార్ అద్దెకు తీసుకొని జైపూర్ బయల్దేరాం
11 -05 -98 –సోమ వారం .పదకొండవ రోజూ –ఉదయం జైపూర్ చేరాం .అక్కడ మాన్ సింగ్  కోట,శిలాదేవి ఆలయం ,జంతర్ మంతర్ ,హవా మహల్ చూశాం .
12 -05 -98 -మంగళ వారం –పన్నెండో   రోజూ.పొద్దున్నే బయల్దేరి ఫతేపూర్ సిక్రీ ,ఆగ్రా తాజమహల్ ,శికందర్ మధుర శ్రీ కృష్ణాలయం ,బృందావన్ లను చూసి రాత్రి పన్నెండిటికి  ధిల్లీ చేరాం .
13 -05 -98 -బుధ వారం –పదమూడవ రోజూ -ధిల్లీ లో కన్నాట్ సర్కస్ కు వెళ్లి సూట్ కేసు కొన్నాం .ఉయ్యూరు దుర్గా స్టూడియో ఫోటోగ్రాఫేర్ చలం కొడుకు ,నా శిష్యుడు అప్పా రావు ఆంధ్రా భవన్ లో కన పడీ మా అందరికిడబ్బు లేకుండా భోజనం పెట్టించాడు . భోజనం చాలా రకాలతో చాలా బాగుంది .రావు ట్రావెల్స్ వాళ్ళు కారు పంపిస్తే ఎక్కి రాత్రి ఏడు గంటలకు ”హజ్రత్ నిజాముద్దీన్ ”చేరాం .ఎనిమిదిన్నరకు దక్షిణ ఎక్ష్ప్రెస్స్ ఎక్కి పడుకోన్నాం .మర్నాడు  14 -05 -98 గురువారం పద్నాలుగో రోజూ – సాంచీ మీదు గా ప్రయాణం .
15 -05 -98 -శుక్రవారం –సికంద్రా బాద్ చేరాం .అశోక్ కారు రెడీ  గా పెట్టాడు .బావా వాళ్ల ఇంటికి చేరాం .భోజనాలు చేసి ఎవరి సామాన్లు వాళ్ళం తీసుకొన్నాం .రాత్రి మేమిద్దరం శర్మ వాళ్ళింటికి చేరాం .శాస్త్రి,సమతా  సంకల్ప లు మా కోసం అక్కడికే వచ్చారు .
17 -05 -98 ఆది వారం రాత్రి బయల్దేరి 18 ఉదయం ఉయ్యూరు చేరాం .21 న శ్రీ హనుమజ్జయంతి .పూజా ,కల్యాణం బాగా జరిగింది .
ఈ విధం గా మా ”దేవ లోక యాత్ర ”అనే ‘దివ్య ధామ సందర్శనం ”దిగ్విజయమైంది .అక్కా బావల స్ఫూర్తి ,సహకారం తో బాగా జరిగింది .డబ్బు విషయం లో పేచీ కాని ,మాటలో తేడా కాని లేకుండా అవగాహన తో బావ పకడ్బందీ ప్లాన్ తో,భగవానుని అనుగ్రహం తో  యాత్ర సర్వమూ సంపూర్నమైంది .
ఇన్ని రోజులు గా మాతో పాటు మీరు యాత్రలో పాల్గొని మా అనుభవాలను ఆస్వాదించి నందుకు కృతజ్ఞతలు .

దివ్య ధామ సందర్శనం –11

దివ్య ధామ సందర్శనం –10

దివ్య ధామ సందర్శనం –9

దివ్య ధామ సందర్శనం —8

సంపూర్ణం            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.