సదా సంచారి సాంకృత్యాయన్

సదా సంచారి సాంకృత్యాయన్

             రాహుల్ సాంకృత్యాయన్ అంటే అందరికి గుర్తు వచ్చేది ”వోల్గా సే గంగా ”అనే పుస్తకం .దీనితో పాటు చాలా గ్రంధాలు రాసి ప్రసిద్ధి చెండాడు .నిత్య సంచారి .కొత్త విషయం ఎక్కడ వున్నా తెలుసు కోని చరిత్ర కు ఎక్కించే దాకా నిద్ర పోడు .అలసట అంటే ఏమిటో తెలీని జీవితం గడిపిన స్కాలర్ .పరిశోధకుడు .చరిత ను తవ్వి తీసి చరిత్ర పుటల్ని నింపిన మేధావి .అతను ఆంధ్రుడే అని నమ్మకం కలిగిస్తాయి ఆయన రచనలను తెలుగు లో చదివితే .అంతగా చొచ్చుకు పోయాయి ఆయన పుస్తకాలు తెలుగు దేశం లో .ఇది ఆ అనువాదకుల గొప్పతనం. అంత సరళ సుందర మైన ఆంధ్రీ కరణం చేశారు మన అను వాదకులు

—    

ఉత్తర ప్రదేశ్ లో అజాం ఘడ్ జిల్లా లో ”పాండహా ”అనే చోట రాహుల్ సాంకృత్యాయన్ 1893 లో ఏప్రిల్ తొమ్మిది న జన్మించాడు .చరిత్ర తత్వ శాస్త్ర్తం ,జీవిత చరిత్ర కళలు ,ఖగోళ శాస్త్రం ,ఆరోగ్యం ,భూగోళ శాస్త్రం ,మొదలైన వన్నీ చదివి జీర్ణం చేసుకొన్నాడు .అనేక దేశాలు పర్య టించాడు .ఇరాన్ ,ఇరాక్ ,రష్యా ,యూరప్ ,చైనా ,జపాన్ ,శ్రీ లంకా  మొదలైన దేశాలను l సందర్శించాడు .అయితె అతనికి అత్యత పేరు తెచ్చిన యాత్రలు మాత్రం టిబెట్ యాత్రలు .టిబెట్ కు నాలుగు సార్లు వెళ్ళాడు .అందుకే ఆయన్ను సంచార చక్ర వర్తి అనీ ,దేశ దిమ్మరుల ఆచార్యుడనీ ,అంటారు .1929   లో నేపాల్ వెళ్ళాడు .చేతిలో పాస్ పోర్ట్ లేదు .తన కున్న పరిచయాలతో వెంటనే దాన్ని పొందాడు .16000 టిబెటన్ పదాలు సేకరించాడు .అతని కోరిక ఒక్కటే బౌద్ధ గ్రంధాలను సంస్కృతం లోకి అనువాదం చేయించటం దొరికిన పుస్తకాలన్నిటినీ సేకరించాడు .తన దగ్గరున్న పుస్తకాలు వస్తువులు వారికి కానుకలు గా అంద జేశాడు అరుదైన ”కాన్జూర్ ,టాన్జూర్ ,గ్రంధాలను కొన్నాడు .130 వర్ణ చిత్రాలు ,1600 కు పైగా వ్రాత ప్రతులు సేకరించి వాటిని 18 కంచర గాడిదల పై ,39 రోజులు ప్రయాణం చేసి డార్జిలింగ్ దగ్గరున్న కాళీ  పాంగ్ చేరాడు .. .
యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తర్వాత ఇంత భారీగా సేకరించిన వారెవరు లేరని చరిత్ర కారుల అంచనా .వీటినన్నిటినీ శ్రీ లంక ,పాట్నా ,మ్యూజియం లలో భద్ర పరిచాడు .అమ్మమని ఎంతో మంది బ్రతిమి లాడినా ససేమిరా అన్నాడు  .అవసర మైతే ఫోటోలు తీయించి ఉచితం గా అంద జేశాడు .అంత నిక్కచ్చైన మనిషి .కలకత్తా లోని మహా బోధి సొసైటీ ,లండన్ బుద్ధిష్ట్ సొసైటీ ఆయన ఆసక్తి గమనించి ఆయన్ను వారి ఖర్చులను భరించి యూరప్ అమెరికా దేశాల్లో సాన్క్రుత్యాన్ ను బౌద్ధ మత వ్యాప్తి కోసం పంపించాయి .తన సహచరుడు గా కౌసల్యానందన్ ను తోడూ తీసుకొని వెళ్ళాడు .
టిబెట్ యాత్ర ను గురించి ”టిబెట్ లో పది నెలలు ”పుస్తకం రాశాడు .దీన్ని యాత్రా సాహిత్యం లో గొప్పది అంటారంతా .1934 ,36 ,38 లో కూడా టిబెట్ యాత్ర చేశాడు .అరుదైన బౌద్ధ గ్రంధాలను సేకరించి తెచ్చాడు .ఆయన భాషా సాహిత్య సేవలకు అభినందించి ,ఒరిస్సా బీహార్ రిసెర్చ్ societee లు రాహుల్జీ ని ఘనం గా సన్మానించాయి .ఆయన టిబెట్ నుంచి తెచ్చిన పుస్తకాలలో మాఘుడు రాసిన శిశు పాల వధ కావ్యం పై ,భావదత్తుడు రాసిన టీకా ,బుద్ధ శ్రీ జ్ఞాన్ రాసిన ”ప్రజ్ఞా దీపావళి ”ఉనాయి .అఆగే వాద న్యాయం ,శత సాహశ్రిక ,గ్రంధాలను సేకరించి తెచ్చాడు .38 కట్టలు గా వున సంస్కృత గ్రంధాలు ,ధర్మ కీర్తిరాసిన పుస్తకాలు ,ప్రమాణ వార్హిక సేకరించాడు .8000 శ్లోకాలున్న అనంగుడు రాసిన ”యోగ చార భూమి ‘,చంద్ర వ్యాకరణం ,తర్క రహశ్యం ,మొదలైన అపూర్వ గ్రంధ సేకరణ చేశాడు సాంకృత్యాయన్ .తన అన్ని యాత్రలపైనా  విపుల మైన సమాచారాలతో పుస్తకాలు రాశాడు .
రాహుల్ సాంకృత్యాయన్ మొత్తం మీద 127 గ్రంధాలు రాశాడు .అందులో యాత్రా పుస్తకాలే ఇరవై రెండు .ఆయన మొదటి  టిబెట్ యాత్ర పై రాసిన పుస్తకమే ”నా లడక్ యాత్ర ”.యాత్రలు చేసే వారికి కర దీపిక గ ,మార్గ దర్శి గా ”లోక సంచారి ”అనే పుస్తకం రాశాడు .


”దేశాటనం చాలా మంచిది .కళా   ప్రాభవాన్ని ,సత్య ధర్మాలను సద్భావనలు చాటేందుకు చేసే మహా ప్రస్తానమే యాత్ర ”అంటాడు రాహుల్ .లోక సంచారి ప్రపంచాన్ని ప్రేమిస్తాడనీ ,మృత్యువుకు భయపడడని ,అతనికి పరిచయం అయిన వారందరి పైనా అనంత మైన స్నేహ భావాన్ని కురిపిస్తాడని ,ఈ స్నేహ భావనలే  అతనికి నిత్యమ్ మధుర  స్మృతులు కల్గిస్తాయని అంటాడు సాంకృత్యాయన్ .
సాంకృత్యాయన్ కు  హిందీ సంస్కృతం ,పాళీ భోజ్పురి ,ఉర్దూ ,పెర్షియన్ ,అరబిక్,తమిల్ కన్నడ ,సిన్హలి ,ఫ్రెంచ్ ,రష్యన్  మొదలైన ఎన్నో భాషలు వచ్చు .ఆయన మార్క్సిస్ట్ భావ జాలం వున్న రచయిత .ఇరవయ్యవ ఏట రచన ప్రారంభించాడు .సోషియాలజీ ,హిస్టరీ ,ఫిలాసఫి ,బుద్ధిజం ,టిబెటాలజీ ,లేక్సికోగ్రఫి గ్రామర్ లపై పుంఖాను పుంఖాలుగా పుస్త కాలు రాశాడు .భారత దేశమంతా తిరిగాడు .ప్రపంచయాత్ర్ చేశాడు .జానపద ,శాస్త్ర ,నాటక ,రాజకీయాలపై ఎన్నో వ్యాసాలు రాశాడు .
ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంధం ”వోల్గా సే గంగా ”లో ఆర్యులు యూరేశియా నుంచి రష్యా లోని వోల్గా నదీ తీరానికి చేరారని అక్కడి నుంచి హిందూ కుష్ పర్వతాలు ,హిమాలయాలు దాటి గంగా తీర మైదానం చేరారని రాశాడు .క్రీ.పూ.ఆరు వేల ఏళ్ళ కిందస్తి నుంచి ,1947  వక్రకు జరిగిన నాగరకతా వ్యాప్తిని సమగ్రం గా ,ఆయన వ్యక్త పరిచాడు .ఇది చదువు తుంటే ఒక చరిత్రో సాంకేతిక పద జాలం తో కూడిన వేరే ఏదో చదువు తున్నట్లు అని పించదు .ఒక నవల చదువు తున్నంతహాయిగ్సా  వుంటుంది .అదీ దీని ప్రత్యేకత .నిత్య సంచారం చేస్తూ విషయ సేకరణ చేస్తూ ,గ్రంధాలు గ వాటిని నిక్షిప్తం చేస్తూ ,అన్ని విషయాల మీదా సాదికారికం గా  రాశాడు సాంకృత్యాయన్ .భావం మార్క్స్ ది అయినా హృదయం భారత దేశానిదే .మనం గర్వించ దగిన మహా రచయితా, మహా యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ .

డార్జీలింగ్ లో రాహుల్ సమాధి

డార్జీలింగ్ లో రాహుల్ సమాధి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —28 -12 -11 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

2 Responses to సదా సంచారి సాంకృత్యాయన్

 1. ఈ టపా చాలా బాగుంది…రాహుల్‌జీ గురించి చాలా చక్కగా వివరించారు

 2. muthevi ravindranath says:

  As you said, it is true that the translators who rendered the works of Rahuljee into Telugu Language actually enhanced the value of his original works in Hindi, and could create a feeling in the minds of the readers that Rahuljee himself was originally a Telugu writer.The same was the case with the Bengalee works of Sarath Chandra Chatterjee. So great were the translations.We are greatly indebted to Translators like Alluri Satyanarayana Raju (Olgaa Nunchi Gangaa Theeram),
  Mikkilineni Subbarao(Rigveda Aaryulu),Aluri Bhujanga Rao (Almost all other works of Rahuljee) for their brilliant work.In the same way, Translators like Chakrapani and Bondalapati Siva Rama Krishna endeared Sarath to the Telugu readers and by their lucid style, brought him closer to the hearts of the Telugus
  Anyhow it is great to reminisce once again a versatile genius like Kedarnath Pande ,popularly
  known as Rahul Sankruthyayan(Rahuljee)
  Muthevi Ravindranath, Tenali.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.