భారత భూభారం మోసే ”సహస్ర ఫణ్ ” —కవిత
అతడు భారతీయుడు నూరు పైసలా
అతడు విశ్వ మానవుడు అన్ని విధాలా
అతని అవగాహన కు మించిన విషయమే లేదు
అతడు స్పృశించి వన్నె తేని పదవే లేదు
ఇంతింతై ఎదిగిన మనీషి
భాషా పర శేష భోగి
కాకలు తీరిన యోద్ధ
విద్యా వినయ సంస్కార మూర్తి
అందరి మనసులు చూర గొన్న వాడు
నొప్పించక ,తానొవ్వక వర్తించే విధానం
నమ్ముకున్న వారి ప్రాపుకై నిలిచే ధైర్యం
”అమ్మ ”ఆశయాలను ,”రాజీవుని ”దీక్షను
అమలు జరిపే అపూర్వ అక్వకాశం పొందిన ఆదర్శ మూర్తి
నలభై ఒక్క సంవత్స రాల భారత దేశ చరిత్రలో
వింధ్యకు దక్షిణాన వరించిన ప్రధాన పదవి
అందునా ఆంధ్రులకు మొట్ట మొదట దక్కిన వరం అది
భారత సువర్ణాధ్యాయం లో వన్నె కెక్కిన పుట
అందరి మనస్సులో ఆనందపు తేట
వేయి పడగల విశ్వ నాదునికి అంతే వాసి
వేయి పడగలతో భూభారం మోసే ఆదిశేషుని
మనో నిబ్బరం ,ధైర్యం ,సహనం ఉన్న వాడు
నేడు భారత భూభారాన్ని పైకెత్తు కున్న వాడు
డెబ్భై వ ఏట ఎత్త రాని భారమే అయినా
అందరి మన్నన ,సహకారం తో అవలీల గా ఎత్త గలదు .
భాషా సౌన్దర్యాలకే వన్నె తెచ్చే పలుకు
హుందా తనానికి పీఠం వేసే వ్యక్తిత్వం
మనవాడు ,మనసున్న వాడు ,మా మంచి వాడు
ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిన విద్యా వేత్త ,
దౌత్య వేత్తలలో వన్నె కెక్కిన మహోన్నతుడు
అతడే మన నరసింహా రావు పాముల పర్తి
అందరి ఎడలా సమతూకం లోప్రవర్తించే సమ వర్తి
క్లిష్ట సమయం లో భారత కేతనం చేత ధరించి
ముందుకు,మును ముందుకు సాగే వృద్ధ వీరుడు
అతనికి మన అందరి అండ దండలు ,సహకారం
భగవంతుని ఆశీస్సు లభిస్తుందని ఆశిద్దాం .
రచన —గబ్బిట దుర్గా ప్రసాద్ —
రచనా కాలం —23 -06 -91 –శ్రీ ఫై.వి.నరసింహారావు భారత ప్రధాని అయిన సందర్భం గా రాసిన కవిత .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
PVNR ni rojuu talachukuni dandam pettukovalandi… desanni kevalam malupu tippina vaadu matrame kadu… oka rakamgaa rakshinchina vaadu. samasyala visha phootkaralu chestunna baadhyatala bhujangaalanu sahasra phanulu chesi desaniki godugu pattina vaadu.
nice.it is a fitting tribute to reminisce the great leader, almost forgotten by one and all.one may differ with his foul and unscrupulous practices to stick at any cost to the seat of power, but none
can forget his valuable services to the nation in giving it a new dimension in terms of welfare and development.he made our visions a reality through powerful economic reforms.
Muthevi Ravindranath, Tenali.