సాహితీ బంధు వులకు 2012 కొత్త సంవత్సర శుభాకాంక్షలు .
సరసభారతి ఉయ్యూరు సాంస్కృతిక సంస్థ గా ఉయ్యూరు లో ప్రారంభం అయ్యి వివిధ సంగీత, సాహిత్య సభలతో ఉయ్యూరు గ్రామ వాసులకు చేరువయ్యింది. ఆ విశేషాలు అందరికి అందిచాలనే ఆలోచనతో సరసభారతి బ్లాగ్ (ఉసుల గూడు) గా ప్రారంభం.
ప్రత్యెక కృతజ్ఞతాభి నందనలు
సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి గారి కర్తవ్య దీక్షకు ,సహకారానికి ,తోడ్పాటుకు ,
సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,ఆమె కుటుంబ సభ్యులు ,సభా నిర్వహణ లో ఇస్తున్న తోడ్పాటుకు ,సరస భారతి కార్య క్రమాలను విజయ వాడ radio లో ;”;వార్తా విపంచి” ”ద్వారా శ్రోతలకు ప్రతి నేలా తెలియ జేస్తున్న ఆకాశ వాణికి,వారి నిర్వాహకులకు, సరస భారతి కార్య క్రమ వివరాలను చక్కగా ప్రజలకందిస్తున్న ఉయ్యూరు లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు ఉయ్యూరు లోని అన్ని పత్రికల విలేకరులకు ,వారి యాజమాన్యానికి ,రసజ్ఞు లైన సంగీతా సాహిత్యాభి మానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో కృతజ్ఞతలు అందజేస్తున్నాం
సరస భారతి ని సంవత్సరం నుంచి(జనవరి 2011 లో ప్రారంభం) అభిమానిస్తూ ,మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు .పోస్ట్ మీకు చేరీ సమయానికి వీక్షకుల సంఖ్య 28500 వుండటం ఆనంద దాయకం గా వుంది .’ఐదు వంద’నాల (495 పోస్ట్ ) ల చేరువలో ఇంత అభిమానాన్ని చూపించటం ఆశ్చర్యం కూడా వేసింది .సరస భారతి మీ అందరిది అని అనిపించుకొన్నది .అది చేబట్టే కార్య క్రమాలు అందరి అభిమానాన్ని పొందు తున్నాయి .చదువరుల నుంచి మంచి స్పందన వస్తోంది . 100 పోస్ట్స్ రాయటమే కష్టం అనుకొన్న మేము 500 చేరువలో ఉన్నాము.
నేను రాసిన(ఆర్టికల్స్) నేను చదివిన (రేడియోలో), నేను చూసిన (ప్రదేశాలు, సినిమాలు ), నేను పాల్గొన్న (సభలు , సమావేశాలు),నేను చదివిన( పుస్తకాలలో, వార్తా పత్రికలలో ). నాకు ఈమెయిలు ద్వారా చేరిన విషయాలు (సేకరణలు ) ఎప్పటికి అప్పుడు మీ కు అందించాము.
దీన్ని ఇంత అద్భుతం గా తీర్చి దిద్ద టానికి మా కుటుంబ సభ్యుల ప్రోత్చాహం మరువ లేనిది వుయ్యూరు లో నేను రాసిన దానికి గొప్ప richness ఇస్తూ వర్డ్ ప్రెస్ లో మా అబ్బాయి శర్మ బెంగళూర్ నుండి సరి దిద్దుతూ ఫొటోస్ సేకరిస్తూ ఉంటే ,రాయ టానికి వత్తాసు నా శ్రీమతి ప్రభావతి ఇస్తుంటే ,అమెరికా లోని మా అమ్మాయి విజయ లక్ష్మి చదివి ,తప్పులు దిద్ది వన్నె పెడుతుంటే ,మా పెద్దబ్బాయి శాస్త్రి హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు చదివి అభినందిస్తుంటే మా నాలుగో వాడు రమణ కావాల్సిన వివరాలన్నీ సమకురుస్తుంటే మూడవవాడు మూర్తి మా మనవడుచరణ్ కు మనవ రాలు రమ్యకు చదివి విని పిస్తుంటే ,ఇది ఇలా జరిగి పోతోంది . ఆర్ధిక వేత్త ప్రేమ చంద్ గారు ,నా అభిమాని మైనేని గోపాల కృష్ణ గారు ,మా బావ మరది ఆనంద్, ఛి .,డాక్టర్ యాజీ చదివి ఆనందిస్తూ ప్రోత్సహిస్తున్నారు .
శ్రీ సువర్చలాంజనేయ వర్డ్ ప్రెస్ కూడా బాగా పొపులర్ అయింది(శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం ) .దానిలో” శ్రీ హనుమ కధా నిధి” పేర 42 కధలను రాశాను .ఇవన్నీ ఒక పుస్తకం గా తెద్దామని అనుకోగానే అమెరికా లో వున్న మా అమ్మాయి స్నేహితురాలు మాధవి తెలుసు కోని ముద్రనకుఅయే ఖర్చు ఆమె ,ఆమె భర్త సుధీంద్ర లు తామే భరిస్తామని చెప్పి వెంటనే స్పందించారు . .వారు ఆ కధలను బాగా చదివి. ,ఆనందించారు .అందుకే ఇలా ముచ్చట పడ్డారు .వారికి మనసారా అభినందనలు ,ఆశీస్సులు .అలాగే ‘నేను రాసిన ”దర్శనీయ క్షేత్రాలు ”భక్తీ సుధా లో మూడేళ్ళు ధారా వాహికం గా వచ్చింది .వారిని వాటిని నేను అచ్చువేయ టానికి పర్మిషన్ అడగ్గానే ఇచ్చారు .వాటినీ పుస్తక రూపం లోకి తెస్తాను అని చెప్ప గానే శ్రీ మార్తి సత్య నారాయణ గారు ,ఛి .చతుర్వేదుల మధుసూదన మూర్తి ,వేలూరి రామ కృష్ణ గార్లు స్పందించి ముందుకు వచ్చారు . .వారికి మనసారా కృతజ్ఞతలు .ఈ రెండు పుస్తకాలు త్వరలోనే ప్రచురించటానికి మా ఇలవేలుపు శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప మా మీద ఎల్లప్పుడు వుండాలని కోరు కుంటున్నాము .ఏదో దైవ బలం తప్ప మా వల్ల ఆయ్యే పనులు కావు ఇవి అని మా ధృఢ విశ్వాసం .వినయం తో చెప్పే మాటలే ఇవి .
కొత్త సంవత్సరం లో ముక్కోటి సందర్భం గా ”మున్నీట పవళించిన శేష శయనుడు ”అనేది ,ఆలోచనాత్మక వ్యాస పరంపర ,,”పోతన లో తాను ”అనే భాగవత సందర్భ ధారా వాహికం మీకు అందించటానికి సిద్ధం అవుతున్నాను .అడపా దడపా మధ్యలో కొన్ని విశేషాలు అందిస్తూనే వుంటాను .మీ అండా ,దండా మాకు ,మనకు ఎల్లప్పుడు లభించాలని కోరుకుంటున్నాను .
మరొక్క సారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు తున్నాను .
ఈ రిపబ్లిక్ నాటి కైనా ”వెండి తెర వాల్మీకి ”,చిత్ర రచనా మేటి అయిన ”బాపు ”గారికి పద్మ లో అత్యున్నత పురస్కారం లభించాలని కోరు కుంటున్నాను .మీరూ నాతొ పాటే అదే ఆలోచన లో వున్నారని భావిస్తున్నాను .మన ఆకాంక్ష నెర వేరు తుందని నమ్ముతున్నాను -.
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —31 -12 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
— ప్రవీణ్ శర్మ
శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,
నమస్కారములు.
సరస భారతి లో మీరు రాస్తున్న కధనాలు కొన్ని చదువుతున్నాను.
మాది గండిగుంట; ప్రస్తుతం వుండటం హైదరాబాద్ లో.
వుయ్యూరు గురించి చదివినప్పుడు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చి ఎంతో ఆనందంగా వుంటున్నది.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కోటీశ్వర రావు