చేమ కూర కవి విజయ విలాసం
సాధారణం గా ధీర లలితులు అనే వారికి వర్తించే మాట ”విలాసం ”.అలాగే శృంగార చేష్టలకూ విలాసం అనే పేరుంది .విజయుడు అయిన అర్జునుడు ముగ్గురు స్త్రీ లతో విలాసం గా ప్రవర్తించిన సంఘటనల మాల ”విజయ విలాసం ”.దీనికే ”పిల్ల వసు చరిత్ర ”అనే పేరు వుంది .వసు చరిత్ర కారుడు రామ రాజ భూషణుడు రాసిన వసుచరిత్ర ,కంటే ,ప్రత్యెక మైన శబ్దాలను ఒడుపుగా ,ఒయ్యారం గా ,వెంకట కవి ప్రయోగించాడని విశ్లేషకుల భావన .అసలు ఆనాడు తంజా వూరే శృంగార విలాసానికి కేంద్రం .కవిపండితులు ,నాట్య కారిణులు ,కవయిత్రులు శృంగార నిధులే ఆ కాలం లో .మంచి నేపధ్యం దొరికింది కవికి .దాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుత కావ్యాన్ని రాసి సత్తా చూపించాడు .
”ప్రతి పద్య చమత్కృతి ”చేమ కూర వారి సొత్తు .అయితేనేమి సమ కాలీనులు మెచ్చ లేదు .అందుకే బాధ తో ”ఏ గతి రచించి రేని ,సమ కాలము వారు మెచ్చారు కదా ?””అని వాపోయాడు .”యమక చక్ర వర్తి ”అనే పేరు సంపాదించాడు .చేమ కూర పాకాన పడటం అంటే ఇదే .
ఈ కావ్యం లో ముగ్గురు నాయికలున్నారు .”ఉలూచి ”అర్జునున్ని ,స్వయం గా వరించిన ప్రౌఢ .దీన్నే SETTLED MARRIAGE అంటాం మనం .చిత్రాంగదను అర్జునుడే వరించాడు .ఇదే ARRANGED MAARRIAGE .ఈమె ముగ్ధ .ఇక సుభద్రార్జును లకు ఒకరిపై ఒకరికి గాడాను రాగం ,ప్రేమ వున్నాయి .దీనికి మించి బంధుత్వము వుంది .దగ్గర కావాలనే తపనా వుంది .నవోద అయిన సుభద్ర అర్జునున్ని చూడ గానే ప్రౌఢ గా మారింది .ఆమె ను ”మధ్యమ నాయిక ”అంటారు .
కవి శృంగార మర్మజ్ఞుడే .ఉలూచి ,చిత్రాంగద ,సుభాద్రాలు కామ శాస్త్ర సూత్రాలకు లక్ష్యాలుగా మలిచాడు .సుభద్ర లో శృంగారం తప్ప మిగిలిన భావాలు మనకు కన్పించవు .అదే భారతం లో సుభద్ర అన్ని EMOTIONS కు నిలయం అయింది .
శ్లేష కావ్య రచనలో చివరిది ”విజయ విలాసం .”పెద్దన తో ప్రారంభమైన ప్రబంధ రచనా చైతన్యం ,రామ రాజా భూషణుని శ్లేష తో సమన్వయము చేసుకొని ,”విజయ విలాసం ”గా వెలువడింది .శ్లేష తో పాటు ,చక్కని ,చిక్కని రస పోషణ చేసి చేమ కూర కవి మన్నన పొందాడు ”అన్ని డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారి అన్న మాటలు అక్షర సత్యాలు .
అర్జునుడు ముగ్గురు నాయికల ఆలింగాన ,రతి సౌఖ్యాలు అనుహవించిన కధ కనుక ”విజయ విలాసం ”తగిన పేరే .ముగ్ధ ,ప్రౌఢ గా మారటానికి ఎక్కువ కాలమ్ పడుతుంది .మధ్య -క్షణాల మీద మారి పోతుంది .ఇదే సుభద్ర లో జరిగిన మార్పు .మాటల ఒడుపుల్లో ,విరుపుల్లో ,కదుపుల్లో చమత్కారాలు ప్రతి పద్యం లో కన్పిస్తాయి .”హృదయాల్లో సిని వ్యాఖ్య ”లో శ్రీ తాపీ ధర్మా రావు గారు తెలుగు ప్రజల పెరట్లో చేమ కూర పెంచి ,వండి ,వడ్డించి ,తెలుగు వారి జిహ్వ కు మంచి రుచి చూపించారు .
” శ్లేష కు పట్టం కట్టిందీ కావ్యం .ఇందులో శబ్దార్దాలు ,శ్లేషలు పండాయి .శ్రీ కృష్ణార్జునుల ప్రవ్రుత్తి లో శ్లేష .శ్రీ కృష్ణుడు అన్న గారితో ఒక రకంగా ,అర్జునాదులతొ ఇంకోరకం గా ప్రవర్తిస్తాడు .అర్జునుడు యోగిగా ,ప్రేమ యోగిగా ద్విపాత్రాభినయం చేశాడు .సుభద్రార్జునుల వివాహమూ రెండు సార్లు జరుగుతుంది .శబ్ద రూపమైన సుభద్రకు ,కృష్ణార్జునులు ఫల సిద్ధి కల్గించారు .శబ్ద శ్లేష అనే రూపం గల అర్జునుడు రధం లో వుంటే ,సు శబ్ద స్వరూపిణి సుభద్ర రధ సారధి .విజయుని విజయం శ్లేష కు కలిగిన విజయమే .వారిద్దరి వివాహం, శబ్దార్ధాలకు ఏర్పడిన సమ ప్రాధాన్యం ”అని డాక్టర్ జి వి.అమోఘ మైన విశ్లేషణ చేశారు .ఆయనే ఈ కావ్యాన్ని ”శ్లేష చమత్కార ప్రధాన మైన శబ్దార్ధ ఉభయ ప్రధాన మైన శ్లేష ”అని కీర్తి కిరీటం పెట్టారు .
”కామాది స్ఫురనమ్ము లెల్ల నడగంగా జేసి ,ధన్యాత్ములౌ స్వాముల్ వీరలు ”అని శ్రీ కృష్ణుడు అర్జున యతి ని సుభద్ర కు పరిచయం చేస్తాడు .ఈ పద్యం లో శ్లేష చమత్కారాన్ని శ్రీ విశ్వ నాద సత్య నారాయణ చక్కగా వివ రించారు .కామ క్రోధాదులను జయించిన వాడు అని యోగి పరం గా ,అర్ధం .కాముని మొదటి రూపాన్నే జయించాడని అంటే ,కాంత ,జయంత ,వసంతా దులను అండం లో జయించాడని అర్జునుని పరం గా అర్ధం అన్నారు కవి సామ్రాట్ .
”చిత్తజు డల్గి ,తూపు మొన జేసిన జేయగ నిమ్ము ,పై ధ్వజం బెట్టిన నెత్త నిమ్ము ,వచియిన్చెద ,గల్గిన మాట గట్టిగా ,నత్తరలాయతెక్షణ కటాక్ష విలాస రస ప్రవాహముల్,కుత్తుక బంటి దామరలకున్ ,దలమున్కలు గండు మీలకున్ ”అన్నది అతి చమత్కారం అయింది .మన్మధుని బాణం తామర పువ్వు .జెండా చేప .రెండూ,నీటిలో ఉండేవే .రెంటినీ కళ్ళ తో పోలుస్తారు .మన్మధుడికి కోపం వచ్చి తన బాణాన్నే వాడి గా చేస్తే చేయ నివ్వు ,కొంచెం పొడుగు అవుతుంది అంతే .జెండా ఎత్తి తే ఎత్తనీ .ఎంత చేసినా ,ఆమె కంటి చివరి రస ప్రవాహాలు తామర తూడులకు మెడ దాకా వస్తాయి .చేపలు మునిగే పోతాయి .
”కన్నులు దీర్ఘముల్ ,నగు మొగం బవురా ,తలకట్టు ,తమ్మి పూ
పున్నమ చంద మామలకు ,బొక్కిలి చక్కదనంబు జెప్పగా
నున్నదె !మేలు బంతులు పయోధరముల్ ,మరి కౌను శూన్య యౌ
నెన్నిక కెక్కు వ్రాత ఫల మివ్వర వర్నినికిన్ ,నిజంబు గన్ ”
”సైకము నడుము ,విలాస రాసికము నెమ్మొ –గము ,దీని మృదు మధురోక్తుల్
పైకము (కోయిల సమూహము )దేగడున్ ,నవలా పైకములో –నెల్ల మేలు బంతిది బళిరా ”
అన్న పద్యం అందరు ఉదహరించే గొప్ప చమత్కారానికి శ్లేషకు ప్రతీక .
”అంగనల పొందు రోసి సన్యాసి యగుట –గద ,యుచిత మెండు -నా నవ మదన మూర్తి
అంగనా మణి గోరి సన్యాసి అయ్యే” –ఇందులో మనో భావం ,లోక రీతి స్పష్టం గా కానీ పిస్తుంది .
”చేసే జపమతడు కాదు విశ్వాసము ,చెలి –చూపు బెడిసలపై నిగుడన్
జేసినది జపమున్ ,మరి వేసినది –గాల మనుట వృధ గాకుండన్ ”
ఈ పద్యం లో మా మంచి చమత్కారం వుంది .
ఉలూపి ప్రేమ కదా వృధా అయింది .చిత్రాంగద అర్జునునికి దక్క లేదు .సుభద్ర ప్రేమే నిజమయింది .అదే పూర్తీ గా దక్కింది .మూడు శృంగార కధ లను ముప్పిరి గోనే శృంగారం తో పేని ,బలంగా జిగి తగ్గని ,రచన తో ,తెలుగు వారికి విందు భోజనం పెట్టాడు చేమ కూర కవి .ఆయన చెప్పుకున్న పద్యమే దీనికి ముగింపు ముక్తాయింపు గా వుంటే బాగుంటుందని తెలియ జేస్తున్నా
”తా రస పుష్టి మై ,బ్రతి పదంమున ,జాతియు వార్త యుం ,జమ
త్కారము ,నర్ద గౌరవము ,గలగ ననేక కృతుల్ ,ప్రసన్న గం
భీర గతిన్ ,రచించి ,మహి మించినచో ,నిక ,శక్తులెవ్వ ,ర
య్య ,రఘునాధ భూప ,రసికా గ్రణి కిం ,చెవి సోక జెప్పినన్ ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
తాపీ ధర్మారావు గారి విజయ విలాసం – హృదయోల్లాస వ్యాఖ్యను దగ్గరుంచుకొని చదివితే — ఎంత బాగుంటుందో చెప్పలేను.