మున్నీటి పై నారాయణుడు –2

మున్నీటి పై నారాయణుడు –2

            శేష శయన నారాయణుని దగ్గర వున్నాం మనం .ఆది శేషుని శరీరం పై మూడున్నర ముడుతలు వుంటాయి .అయిదు శిరస్సులుంటాయి .దీని భావమేమిటో తెలుసు కొందాం .ఇప్పుడు జరుగుతున్నది” వైవస్వతమన్వంతరం ”.బ్రహ్మ గారి ఒక రోజుకు 14 మన్వంత రాలు .అందులో మనం ఏడవ మన్వంతరం లో వున్నాం .అయితే భగవద్గీత ఏమి చెప్తోందంటే ”మహర్షయః సప్త పూర్వే ,చత్వారో మానవస్తదా –మద్భావా ,మానసా జాతా యేషాం లోక ఇమః ప్రజాః ”దీని అర్ధం –సప్త ఋషులు ,నలుగురు మనువులు ,తన సంకల్పం లోంచి జన్మించిన వారే ననీ ,వారి నుండి ఈ సృష్టి జరిగిందనీ ”భగవాన్ శ్రీ కృష్ణుడు చెప్పినట్లు భావం .ఆది శేషుని శరీర  చుట్టలు కాలానికి ప్రతీకలే .ప్రతి చుట్టా పూర్తి అయిన కాల వ్యవధికి ప్రతీక .మూడు యుగాల కాలమ్ పూర్తి అయి ,నాల్గవ యుగం అయిన కలియుగం లో ,ఏడవ మనువైన వైవస్వత మన్వన్థరక్మ లో ఉన్నాము అని తెలియ జేస్తుంది .ఈ చివరి యుగం అయిన కలి యుగం లో 28 మహాయుగాలు గడిచి పోయాయి .ప్రతి మన్వంత రానికీ 71 మహా యుగాలు వుంటాయి .ప్రతి మహాయుగానికి నాలుగు యుగాలుంటాయి .అవే కృత ,త్రేతా ,ద్వాపర ,కలి యుగాలు .కనుక మనం ఇప్పుడు నాల్గవ చుట్ట అయిన కలి యుగం లో ,28  మహా యుగాలు దాటాం అన్న మాట .అంటే 28 /71  దాటాం .బ్రహ్మ గారి రోజూ లెక్కల్లో3  2 8 /71  అంటే 3 2/5 చుట్లు పూర్తి చేసుకోన్నాం అని అర్ధం .అందుకే ఆది శేషునికి మూడు చుట్లు పూర్తి అయి భిన్న రూపం లో నాల్గావదాన్ని చూపించారన్న మాట .ఇంతటి లెక్క ఆ స్వామి పడక సీన్ లో దాగి వుంది .
ఆది శేషుని శరీర చుట్లు విప్పుకోన్నాం కనుక ఇప్పుడు ఆయన పడగల దగ్గరకు వద్దాం .”సహస్ర  ఫణి ”గా ఆదిశేషుడు పురాణ ప్రఖ్యాతుడు .ఏమిటి దీని సంబంధం ?మనకు సప్త ద్వీపాలు వున్నాయి .మనది జంబూద్వీపం .ఒక్కొక్క ప్రళయం లో ఒక్కొక్క ద్వీపం జల సమాధి అవుతుంది .సృష్టి లో ఇంకో ద్వీపం ఉద్భవిస్తుంది .ఇలాఇప్పటికి   నాలుగు ద్వీపాలు పుట్టి ,నశించాయి .ఇప్పుడు అయిదవది అయిన జంబూద్వీపం లో ఉన్నామని ఆది శేషుని అయిదు శిరస్సులు సంకేతం గా తెలియ జేస్తున్నాయని భావం .కలియుగం అంతం ఆవ గానే ఈ జమ్బూద్వీపమూ ,నశిస్తుంది .ఆరవ ద్వీపం కొత్త సృష్టి లో ఏర్పడుతుంది .ఇలా అయిదు సార్లు సృష్టి జరిగి నట్లుగా  ,ఆ  పడగలు  మనకు  సాంకేతికం  గా  తెలియ జేస్తున్నాయి . ,
శ్రీమన్నారాయణుని చక్రం -చేతనకు ,శంఖం -పదార్ధానికి ప్రతీకలు గా ముందే తెలుసు కొన్నాం .అవే -పురుష ,ప్రకృతి లు .చక్రం తిరుగు తున్నట్లే మన ఆలోచనలూ ,నిరంతరంభ్రమణంచెందుతూనే వుంటాయి . శంఖం శబ్దాన్ని ఇస్తుంది .పంచ భూతాలు ,పదార్ధాలను ఏర్పరుస్తాయి .అందు లో ఆకాశం ఉత్రుస్ట మైనది .ఆకాశం లో శబ్ద తన్మాత్ర వుంటుంది .ఇదే పదార్ధాన్ని ఇచ్చేది .అందుకే శంఖం పదార్ధానికి చిహ్నం గ భావిస్తారు .పురుషుడు చైతన్య వంతుడు .ప్రకృతి నిరాకార వ్రుత్తి కలది .అందుకే చక్రం కుడి వైపు ,శంఖం ఎడమ వైపు నారాయణ మూర్తి కి వుంటాయి .ప్రకృతి ,పురుషులను  వేరు చేయ లేము అని అర్ధం .
ఇప్పుడు నారాయణుడి నాభి దగ్గరకు చేరుదాం .నాభిలో కమలం వుందని చెప్పు కొన్నాం కదా .ప్రాణ నాడియే తామర తూడు .దాని నిండా రంద్రాలే .దాని నుంచి ,సృష్టి కార్యం చేయ టానికి బ్రహ్మ గారికి మహా విష్ణువు ప్రాణ శక్తి ని పంపిస్తాడు అని భావం .మన భాష లో అన్డానికీ (అండం ),కమలానికీ ప్రాముఖ్యత వుంది .బ్రహ్మ గారి గుడ్డు ను బ్రహ్మాండం అంటాం .అదే కమలం .కమలానికి సహస్ర దళాలు వుంటాయి .ప్రతి దళం ఒక్కొక్క లోకానికి ప్రతీక .కమలం యెర్ర గా వుంటుంది .కారణం అది రజో స్వభావానికి గుర్తు అంటే కామ ప్రవ్రుత్తి అన్న  మాట .ఇదే సృష్టికి బీజం అని అందరికి తెలిసిన విషయామే .అది స్వచ్చమై ,సత్వ గుణం తో తెల్లగా వుంటుంది .బ్రహ్మను కూడా ఎరుపు రంగు కలవాడిగా చిత్రిస్తారు .దానికికారణం కూడా పైన చెప్పిందే .చతుర్ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు .వేదం అంటేనే శబ్దం అని అర్ధం .వేదం అంతా శబ్ద ప్రకంపనల మయమే కదా .ఉదాత ,అనుదాత్త ,స్వర ప్రస్తారమే  వేదానికి ప్రాణం .హెర్బర్ట్ స్పెన్సర్ అనే చింతనా పరుని ద్రుష్టి లో ప్రపంచం” నాలుగు ఆవర్తనాల” (rhythm  )మయం .బహుశా  అయిదవ  ఆవర్తనం  వస్తే  ”పంచ  ముఖ   బ్రహ్మ  ”యేర్పడ వచ్చు .
కనుక ,పైన చెప్పిన వన్నీ ,ప్రతీకలు మాత్రమే కాదు చిహ్నాలు కూడా (emblems ).వీటిని జన హృదయం లో చొప్పించాలి .మానవుడిని కింది స్తాయి నుంచి పై స్తాయికి తీసుకొని వెళ్ళ టానికి ఇవన్నీ తోడ్పడు తాయి .మహా మహా చదువు కున్న పండితోత్తములు కూడా ఈ రకమైన అంత రార్ధాలను వివ రించి చెప్పక పోవటం విచారకరం .అందుకే మన దేశం లో భక్తీ ఉన్నత స్తాయికి చేరటం లేదు .భౌతిక భావనలు కొంత వరకే పని చేస్తాయి .ప్రతిమ ,విగ్రహ పూజా కింది స్థాయి వరకే .అక్కడి తో ఆగి పోరాదు .దాని లోని అంత రార్ధం తెలుసు కోవాలి ..ఆ ఉన్నత భావ లహరి లో సంచారం చేయాలి .అప్పుడే స్థాయి పెరుగు తుంది .
స్తూలం నుండి సూక్ష్మానికి ప్రయాణం చేయాలి .విగ్రహారాధన చేయ రాదనీ ఎవరి అభిప్రాయమూ కాదు .అలా చేస్తే కింది స్తాయి వారి విశ్వాసమే దెబ్బ తింటుంది .వారిని వివేక వంతుల్ని చేస్తూ ,ఎదిగే టట్లు చేయటమే మనందరి కర్తవ్యమ్ .ప్రతి మనిషికీ మనసు ,శరీరం రెండు వుంటాయి.శరీరం స్తూలం .మనసు సూక్ష్మం .మొదటిది సగుణం .రెండోది నిర్గుణం .”నారాయణ విగ్రహ భావం ”తొలి భావం .అందు లోనుంచి నిర్గుణ బ్రహ్మ వైపు ఆలోచించేట్లు చేయాలి .అప్పుడే విగ్రహారాధన సార్ధకం అవుతుంది.పరి పూర్ణత లభిస్తుంది .జీవాత్మ ,పరమాత్మ ల సంబంధం తెలుస్తుంది .జీవ బ్రహ్మఇక్యానికి   దారి ఏర్పడుతుంది .దీనికే ప్రతి సాధకుడూ ,ప్రయత్నించాలి .ఆ పరమ ఉత్కృష్ట స్థితి ని పొందాలి .అప్పుడే మన పురాణాలకు ,ఉపనిషత్తు లకు సార్ధకత కల్గుతుంది .ప్రాధమిక స్తాయి నుంచి ,ఉన్నత స్తాయికి చేర్చే మార్గమే భక్తీ మార్గం .దాని పరమార్ధాన్ని చక్కగా తెలిసి ,ఆచరించాలని ,మహర్షుల ,మహనీయుల తపన .ఆ మార్గాన్ని అందు కొందాం .ఈ ముక్కోటి ఏకాదశి నాడు ,ఆ భావన లను మనసు అంతా నింపుకొని శ్రీ మహావిష్ణుని దివ్య రూప సందర్శనాన్ని ఉత్తర ద్వారా సందర్శనం చేసి మన జీవితాలను సాఫల్యం చేసు కొందాం .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -03 -01 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.