అలంకార శాస్త్ర కర్త- విద్యానాద కవి చంద్రుడు
విద్యా నాధుని గురించి రాయ వలసినది గా ఎవరో కోరారు .సమాచారం సేకరించ టానికి కొంత సమయం పట్టటం వల్లే రాయటం ఆలస్య మైంది .అయినా పూర్తి సమాచారం లభించ లేదు .దొరికిన సమాచారాన్ని మీ ముందుంచు తున్నాను .
విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రాతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు ”గా భావిస్తున్నారు .విద్యానాధుడు కాకతీయ చక్ర వర్తి ప్రతాప రుద్రుని ఆస్థాన కవి .జీవిత కాలమ్ క్రీ.శ.1292 నుంచి 1323 వరకు గా తెలుస్తోంది .ప్రతాప రుద్రీయం లో ”ఔన్నత్యం యది వర్ణ్యతే ,తత్వం వర్ణ ఇతుం -బిభేమి యదివా ,జాహాస్త్మ్య గస్త్య స్తితిస్త్వత్సా ,ర్మ్యే -గుణ రత్న రోహిణి గిరే శ్రీ వీర భద్ర ప్రభో ”అని తాను అగస్త్యుడనే భావాన్ని తెలియ జేశాడు విద్యా నాధుడు .ఈ అలంకార గ్రంధాన్ని ప్రతాప రుద్ర మహా రాజుకు అంకితం ఇచ్చాడు .అద్భుతమైన ,పాండిత్యం వల్లనే అగస్త్యుడికి విద్యా నాధుడు అనే పేరు వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు .
అయితే ఆంద్ర దేశం లో విద్యా నాధుడు గానే చలా మణి అయాడు .”సౌగందికాపహరణం ”రాశాడు .ఇందులో అగస్త్యుడు తన మేన మామ అని చెప్పు కొన్నాడు .విద్యానాధుని శిష్యురాలు గంగా దేవి అనే కవయిత్రి .ఈమె ”మధురా విజయం ”అనే ”వీర కంప రాయల”చరిత్రను రాసింది .ఇందులో ఈమె ,అగస్త్యడు గొప్ప కవి అనీ ,74 గ్రంధాలు రాశాడని
తెలియ జేసింది .అందులో విద్యానాధుడు ”బాల భారతం ”అనే మహా కావ్యం రాశాడని చెప్పింది .దీన్ని ఆధారం గా చేసుకొని తమిళ కవి ”విల్లి పుత్తు రాన్ ”తమిళ భారతం రాశాడుతెలిపింది ..
విద్యా నాధుని రెండో రచన –”కృష్ణ చరిత్ర ”అనే గద్య కావ్యం .మూడవ రచన –”నల కీర్తి కౌముది ”అనే 24 సర్గల కావ్యం .ఇందులో రెండు సర్గలు మాత్రమే లభించటం దురదృష్టం .
విద్యా నాధుడు చాలా స్తోత్రాలు రాసి నట్లు తెలుస్తోంది .అందులో ముఖ్యమైనవి .దశావ తార స్తోత్రం ,లక్ష్మీ స్తోత్రం ,శివ స్తవం ,శివ సంహిత ,లలితా సహస్ర నామం ,మణి పరీక్ష .సకలాధి కారం విశ్వనాధ క్రుతులుగా ప్రచారం లో వుంది .ప్రతాప రుద్ర మహా రాజు మణి, మాణిక్య ,వజ్రాలను పరీక్షించటం లోగొప్ప నేర్పున్న వాడు అని చరిత్ర చెబుతోంది .వేదం వెంకట రాయ శాస్త్రి గారు రాసిన ”ప్రతాప రుద్రీయ నాటకం ”లో ఈ విషయం వుంది .అంతే కాదు శాస్త్రి గారు ,ఆ నాటకం లో ”విద్యా నాదుడిని ”ఒక పాత్ర చేసి మంచి ప్రాముఖ్యాన్ని చ్చారు .రుద్రుడిని బందీ చేసి ధిల్లీ తీసుకొని ప్పోతున్నప్పుడు ముందుగా బ్రాహ్మణ వేషం లో నది లో మునిగి పోతున్నట్లు నటించి ,ముస్లిం పాలకుల సాను భూతి చూర గొని ,వారి కోరిక మీద ప్రతాప రుద్రున్ని తీసుకు వెళ్తున్న ఓడ లో ఎక్కాడు .రాజు తో పరిచయం చేసు కొన్నాడు ..రాజు బందీ అయిన సమాచారాన్ని యుగంధర మంత్రికి ,జనార్దన మంత్రికి తెలియ జేశాడు .చాకలి పేరి గాడికి సభా మర్యాద లను నేర్పి నట్లు వేదం వారు నాటకం లో చూపించారు .ఇతని పాత్రను చాలా ఉదాత్తం గా చూపించటమే కాదు ,అతనిలోని దేశ ,రాజ భక్తికి పట్టం కట్టారు వేదం వారు .
విద్యా నాధుడు ”అగస్త్య నిఘంటువు ”రాశాడని ”ఘనశ్యాముడు ”అనే కవి తన ”ఉత్తర రామ చరిత్ర వ్యాఖ్యానం ”లో చాలా సార్లు ఈ నిఘంటువు గురించిన ప్రస్తావన చేశాడు . .చాలా శబ్దాలను ఘన శ్యామ కవి ఇందులోనుంచి ఉదహరించినట్లు తెలుస్తోంది .అయితే ఇది అలభ్యం అవటం ఆంద్ర సరస్వతి చేసు కొన్న దురదృష్టం .
అగస్త్యుడయితేనేమి ,విద్యా నాదుడయితే నేమి మహా ఆలన్కారికుడు ,ప్రతాప రుద్ర యశోభూషణ కర్త విద్యానాధుడు .అతని పూర్తి చరిత్ర కూడా లభ్యం కాక పోవటమూ,బాధ గానే వుంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
దుర్గాప్రసాద్ గారూ! విద్యానాథుడి గురించి రాయమని మిమ్మల్ని కోరింది నేనే. 🙂 శ్రద్ధగా వీలైనన్ని వివరాలు సేకరించి ఇలా టపా రాసినందుకు కృతజ్ఞతలు!
నా ఓరియంటల్ హైస్కూలు తరగతుల్లో సంస్కృత గ్రంథం ‘ప్రతాపరుద్రీయం’ పాఠ్యాంశంగా ఉండేది. అప్పుడు చదివానీ పుస్తకాన్ని. దానిలో అలంకార శాస్త్రం గురించి వివరిస్తూ నాయక లక్షణాలను గురించి చెప్పేటపుడు అవన్నీ ప్రతాపరుద్రుడిలో ఉన్నట్టు కవి ఉదాహరణలిస్తుంటాడు!
ప్రతాపరుద్రీయం నెట్ లో లభ్యమవుతుందా? ఎవరైనా సహాయం చెయ్యగలరా? తెలుగు లిపిలో ఉన్నది కావాలి.దేవనాగరి లిపిని అనుసరించటం నాకు కష్టంగా ఉంటుంది.