ముక్కోటి ప్రాముఖ్యత ఏమిటి ?

          ముక్కోటి ప్రాముఖ్యత ఏమిటి ?

ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి

            పుష్య శుద్ధ ఏకాదశి ని  ముక్కోటి ఏకాదశి అంటారు .దీనికే వైకుంఠ ఏకాదశి అనీ ,హరి వాసరమనీ పేరు .మన పండగలు ,పబ్బాలు అన్నీ నక్షత్ర గమనం మీద ఆధార పడి వుంటాయి .ఈ రోజున విష్ణు నక్షరం పూర్తిగా అంటే ఆపాద మస్తకం గా  తెల్ల వారు ఝామున సూర్యోదయానికిపూర్వమే   ఆకాశం లో దర్శనం ఇస్తుంది .ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారనీ ,దక్షిణాయన కాలమ్ లో ఇప్పటి వరకు చని పోయిన వారంతా ఇప్పుడు పరమ పదం లో కి ప్రవేశిస్తారని భావన .అందుకే దీన్ని స్వర్గ ద్వారం అనీ అంటారు .కనుక విష్ణు మూర్తి లేక ఆయన అవతార మూర్తులను ఈ రోజూ తెల్ల వారు ఝామునపూజాదికాలు  అయిన తర్వాత ఉత్తర ద్వారం నుండి దర్శిస్తారు .అదే మోక్షానికి దారి అని నమ్మిక .అసలు పండగ కలియుగ వైకున్థం అయిన తమిళ నాడు లోని శ్రీ రంగం లో మహా వైభవం గా జరుగు తుంది . మహా విష్ణువు అవతారమైన శ్రీ రంగానాధుని భక్తితో ముక్కోటి దేవతలు  ఉత్తర ద్వారం ద్వారా దర్శించి తరిస్తారని పురాణాల కధనం .అందుకే ముక్కోటి అనే పేరు వచ్చింది . .ఇప్పుడు తిరుమల లోను ,భద్రాచలం లోను విశేషం గా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వాములను దర్శించి తరిస్తున్నారు .దేశం లోని అన్ని విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారా దర్శనం వుంది .

        దీనికి భవిష్యోత్తర  పురాణం లో  ఒక కధ వుంది .ఏకాదశి అంటేనే హరి వాసరం అని పేరు ..విష్ణువుకు ఏకాదశి ప్రీతి కరమైన రోజూ .కృత యుగం లో చంద్రావతి అనే నగరాన్ని రాజధాని గా చేసుకొని ,”మురాసురుడు” పరి పాలిస్తున్నాడు .సహజ లక్షణం గా ఎప్పుడు దేవతలపై యుద్ధాలు చేయటం ,వాళ్ళను బాధించటం చేస్తున్నాడు .దేవతలంతా కలిసి విష్ణు మూర్తిని శరణు కోరారు .ఆయన వీరి మొర విని వైకున్థం నుంచి భూమికి వచ్చాడు .మురాసురుడి తో భీకర యుద్ధం చేసినా ,వాడిని జయించ లేక పోయాడు .విష్ణుమూర్తి అలసి పోయి సింహ వతి అనే గుహలోకి చేరి నిద్ర పోయాడు .  .తన మనస్సంకల్పంగా ”ఏకాదశి ”అనే కన్యను సృష్టించి ,గుహకు కాపలా పెట్టాడు .మురుడు వెతుక్కుంటూ గుహ దగ్గరకు చేరాడు .ఏకాదశి కన్య మురుడి తో యుద్ధం చేసి వాడిని సంహరించింది .నిద్ర లేచిన విష్ణు వు,విషయం తెలిసి ఆమె ప్రతాపానికి మెచ్చి వరం కోరుకో మన్నాడు .ఆమె ”ఏకాదశి తిది నాడు భక్తీ తో ఉప వాసం చేసిన వారికి మోక్షం ప్రసాదించండి ”అని కోరింది .తధాస్తు అన్నాడు విష్ణుమూర్తి .మురాసుర సంహారం పుష్య శుద్ధ ఏకాదశి నాడు జరిగింది .ఈ రోజే వైకున్థం లో వుండే విష్ణువు భూమి మీదకు వచ్చి ,దుష్ట రాక్షస సంహారం చేశాడు కనుక వైకుంఠ ఏకాదశి అనే పేరు దీనికి వచ్చింది .అందుకే ముక్కోటిని  ”మోక్ష ద్వారం ”గా భావిస్తారు .
మనకు  ముఖ్యమైనవి 24 ఎకాదశులు వున్నాయి .ఆకాశం లోని విష్ణు నక్షత్ర గమనాన్ని ఇవి తెలియ జేస్తాయి .
మొదట గా వచ్చేది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీన్నే ”తొలి ఏకాదశి ”అంటారు .సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ రోజూ ధ్రువ నక్షత్రానికి  సప్తర్షి మండలానికి ఉత్తరం గా  పైన ఉన్న విష్ణుపదం అనే నక్షత్ర రాసి శ్రీ మహావిష్ణువు శయనించి నట్లు కని పిస్తుంది అందుకని ”శయన ఏకాదశి ”అని పిలుస్తారు .ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ”చాతుర్మాశ్యం ”అంటారు .పీతాదిపతులు ,స్వాములు  ఈ నాలుగు నెలలు ఒక్క చోటే వుండి దీక్ష చేస్తారు .కదలరు . ఈ నాలుగునెలలు విష్ణువుకు నిద్ర.
భాద్ర పద శుద్ధ ఏకాదశిని” పరి వర్తన ఏకాదశి”అంటారు .పరివర్తనం అంటే మార్పు .విష్ణువు నిద్ర ప్రారంభించిన రెండు నెలల తర్వాత  ఎడమ వైపు నుంచి కుడు వైపుకు తిరుగు తాడు . రెండు నెలలకు ఒక సారి ప్రక్కలకు తిరిగి పడు కుంటాడు .అప్పటి దాకా సూర్యాస్తమయం పడమరకు వాలిన విష్ణు నక్షత్రం ,అప్పటి నుంచి ,పడమర అస్తమించి ,కార్తీక మాసం లో తూర్పున ఉదయిస్తుంది .ఇలా పడమటి నుంచి ,తూర్పు నుంచి ,విష్ణు నక్షత్రాలు మరలటం లో వచ్చే మార్పే ”పరి వర్తనం ”
ఇంతకీ విష్ణు నక్షత్రాలు అంటే ఏమిటి ?అని అనుమానం వస్తుంది మనకు .స్వాతి నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రం వరకు వున్న నక్షత్రాలను విష్ణు నక్షత్రాలు అంటారు ఇదే ”విష్ణు పదం ”.
కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధ ఏకాదశి అంటారు .ఈ రోజూ విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు .ఈ రోజూ సూర్యోదయానికి ముందే విష్ణు నక్షత్రం ఆకాశం లో ఉదయిస్తుంది .దీనితో చాతుర్మాస  దీక్ష పూర్తి అయి యతులు మళ్ళీ ప్రయాణాలు మొదలు పెడ తారు .ఈ రోజూ విష్ణుని శిరో నక్షత్రాలు కని పిస్తాయి .అంతకు ముందు అంటే వారం ముందు కార్తీక శుద్ధ చవితి ని నాగుల చవితి అంటారు .సూర్యోదయానికి పూర్వమే తూర్పున  ఈ రోజూ ఆది శేషుని పడగలైన నక్షత్రాలు దర్శనం ఇస్తాయి .శేషుని శిరో నక్షత్ర దర్శనం అయిన వారానికే ఏకాదశి నాడు విష్ణు శిరో నక్షత్ర దర్శనం అవుతుందని తెలుస్తోంది .
మార్గ శిర శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు .తూర్పున విష్ణు నక్షత్ర శరీరం లో ”కటి ప్రదేశం ”వరకు ఊర్ధ్వ దేహం కని పిస్తుంది .ఈ రోజే శ్రీ కృష్ణుడు అర్జునునీ భగవద్గీత ను బోధించాడు కనుక గీతా జయంతి గా పేరు వచ్చింది .
మాఘ శుద్ధ ఏకాదశి ని ”భీష్మ ఏకాదశి ”అంటారు .
ఫాల్గుణ,చైత్ర  శుద్ధ ఏకాదశి  నాడు అర్ధ రాత్రికే విష్ణు నక్షత్రం ఉదయిస్తుంది .
ఈవిదం గా నక్షత్రాల ననుసరించి మనకు ఆకాశం లోని విశేషాలను బట్టి భూమి మీద పండుగలను చేసుకొంటాం .వీటి లోని పర మార్ధం ఇదే .
వైశాఖ మాసాన్ని ”మాధవ మాసం ”అంటారు .రాదామాసమనీ పేరు .విష్ణు నక్షత్రానికి ముందే విశాఖ  నక్షత్రం ఉదయిస్తుంది .సూర్యోదయానికి విష్ణు ,రాదా నక్షత్ర సంయోగం అవుతుంది .అదే కార్తీక దామోదర పూజ .
కలియుగ వైకున్థం అయిన తిరుమల లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ప్రవేశించి శ్రీ వేంకటేశ్వరుని దర్శించి తరిస్తారు .మర్నాడు ద్వాదశి నాడు కూడా ఈ ద్వారం తెరిచే ఉంచు తారట .దీనికో కధ వుంది మధువు ,కైతభుడు అనే ఇద్దరు రాక్షసులు విష్ణు మూర్తి తో యుద్ధం చేసి సంహరిమ్పబడ్డారు .వారు చివరి కోరిక గా ”పరమ పద నివాసం ‘కోరారట .భక్త సులభుడు ప్రసాదించాడు .పుష్య శుద్ధ ఏకాదశి నాడు వైకున్థం లోని ఉత్తర ద్వారాన్ని తెరిపించి ,ఆ మార్గం గుండా వారికి ప్రవేశం కల్పించి ,వైకుంఠ లోక ప్రాప్తి కల్గించాడు మధుకైటభారి ,హరి .ఇదీ ముక్కోటి విశిష్టత .తెలుసుకొని అనుసరించి చరితార్దులం అవుదాం .
మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ .05 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.