పోతన లో తాను –5 ముగ్గురు భక్తి కవి రాజులు —
”గుడులు కట్టించే కంచర్ల గోప రాజు –రాగములు గూర్చె కాకర్ల త్యాగ రాజు పుణ్య కృతి చెప్పె బమ్మెర పోత రాజు –రాజులీ ముర్వురు ,భక్తీ రాజ్యము నకు ” అన్నారట ఎవరో మహా కవి రాజు .వారి మోజులకు నా జాజుల అంజలి .భాగవతాన్ని భూమిలో పాతినా ,”బాల రసాలమై ”పైకి లేస్తుందట .పోతన్న భాగవతం ఎప్పుడు చూసినా ,”అప్పుడే తీసిన వెన్న లా” ఉంటుందట .అందుకే దాన్ని వదలి పోడు చిన్ని కన్నయ్య ”అన్నారు
ముద్దు ముద్దు గా ,కొందరు .నా పద్యాలు పాలు తాగిన లేగ దూడల్లాగా పరుగెత్తు తాయట .వెన్నెల్లో ఆడు కొనే కన్నె పిల్లల్లాగా గంతు లేస్తాయిఅట. .లలిత రసాల పల్లవాల్లా మెత్త మెత్త గా చిత్తానికి హత్తు కొంటాయత .నిర్మల మందాకినీ వీచికలై జల జలా ప్రవహిస్తాయి అట .మందార మకరందాలై చవు లూరిస్తై అట..అమ్మో ఇంత అందం గా ఉన్నాయా నా పద్య కన్యా మణులు ? ,.అవును -నేను మనసు లో ,మాటలో ,పాటలో ,పద్యం లో ,నుడికారం లో ,ఆచారం లో ,వెలుగులా ,వెన్నెలలా ,మలయ మారుతం లా ,కలిసి పోయాను మీలో .తెలుగు వారి నిత్య జీవితం లో ,నిండు గుండెలో ,ఉచ్చ్వాస నిస్స్వాసాలలో ,నిండి వున్నాను .నిజం -నిజం -నిజం – ”ఉదయ భానుని కిరణాలలో ,యదు కిశోరుని మృదు చరణాలలో ,చల్లలమ్మే గొల్ల భామల్లో ,,విల్లు పట్టిన ,సత్య భామల్లో ,కుచేలుని అటుకుల్లో ,కనక చెలుని కిటుకుల్లో ,పల్లె వాన్గనల వలపులలో ,పిల్లన గ్రోవి పిలుపులలో ,కని పిస్తాను ”అట,విని పిస్తాను అట ఔను ,ఔనౌను .సహజ సుందర శయ్యా సౌభాగ్యం లో ,ఉయ్యాలలు ఊగాయి,నా తియ్యని పద్యాలు .అది నా సౌబ్భాగ్యం .మీ అందరి సుమనో హృదయం .ఈశ్వర సంకల్పం .నా పురాకృత ఫలం .అంటే నేనెప్పుడు నిమిత్త మాత్రున్నే .పలికించిన వాడు వాడే ,పలికింది వాడిని గురించే కదా మరి అలాగే వుంటాయి వుండాలి,వున్నాయి . . , ,. ”త్రిజగన్ మోహన నీల కాంతి తను ఉద్దీపింప ,ప్రాభాత ,నీ రజ ,బంధు ప్రభ మైన ,చేలము ,పయిన్ రంజిల్ల ,నీలాలక వ్రజ సంయుక్త ,ముఖార విందమతి సేవ్యంబై ,విజ్రుమ్భింప ,మా విజయుం జేరెడు వన్నె కాదు ,మది నావేశించు నెల్లప్పుడున్ ” ఈ పద్యం లో శయ్యా సౌభాగ్యం ఉందీ అంటే ,అది ఆ ఆది శేషయ్య పై పవళించిన ,రమా వల్లభుని కరుణా పాంగమే . ”చిత్రంబులు ,త్రైలోక్య ప -విత్రంబులు ,భావ లతా లవిత్రంబులు ,,స న్మిత్రంబులు ,ముని జన వన –చైత్రంబులు ,విష్ణు దేవు చారిత్రంబుల్ ” ఈ పద్యం లో ని మృదు మధుర పద బంధం -కూడా భవ బంధ హారి కృపా విశేషమే . ”భూసురుడవు ,బుద్ధి దయా –భాసురుడవు ,శుద్ధ వీర భట సందోహా గ్రేసరుడవు ,శిశు మారణ –మాసుర క్రుత్యంబు ధర్మ మగునే తండ్రీ ” ” ”ఉద్రేకంబున రారు ,సహస్ర ధారులై ,యుద్ధావనిన్ లేరు ,కిం చిద్రోహంబును నీకు జేయఋ ,బలోత్చేకంబు తో ,జీకటిన్ భద్రాకారుల ,చిన్ని పాపల ,రానా ప్రౌధి క్రియా హీనులన్ , నిద్రా సక్తుల ,సంహరింప నకటా నీ చేటు లేట్లాదేదేనో ” అని ద్రౌపదీ మాత తన శిశువులఊచ కొత్త కు దుఃఖిస్తూ ,అశ్వత్థామ తో అన్న మాటలు .ఇవి నన్నయ్య గారి ఒరవడి లో నడిచిన పద్యాలు . ”వీరేవ్వరు ?శ్రీ కృష్ణులు –గారా !ఎన్నడును వెన్న గాన రట కదా చోరత్వంబించు కయును –నేరరట ,ధరిత్రి నిట్టి ,నియతులు గలరే ” అని యశోదా దేవి బాల కృష్ణుని తో ,అంటుంది భాగవతం లో .ఇది తల్లి -కొడుకును గౌరవించటం గా భావించటం గా భావించారట పాపం కొందరు .ఇక్కడ కూడా నాకు భట్టారకు ల వారే మార్గ దర్శకులు .–ఆయన అనలేదా –”వీరెవ్వ రయ్య ద్రుపద మహా రాజులే ” ఈ పద్యమే నాకు శిరో దార్యం . అయితే ,అర్ధం చేసు కోలేని వారికి మాత్రం ,ఒక కవి అన్నట్లు ”అరసికాయ ,కవిత్వ నివేదనం ,శిరసి మాలిఖ ,మాలిఖ ,మాలిఖ ”అనేంతటి వాడిని కాను .వారికీ ఓ నమస్కారం . గజేంద్ర మోక్షం ,భీష్మ స్తవం ,గోపికా గీత ,రుక్మిణీ కల్యాణం ,లోని పద్యాలు తెలుగు వారి నాలుకలపై ,ఎల్లప్పుడు నర్తిస్తాయి అట .అది సహృదయుల అవ్యాజాను రక్తీ ,శ్రీ కృష్ణ లీలా తరంగం పై గల నిర్నిద్ర భక్తీను .. మరిన్ని సంగతులు మరో మారు సశేషం —-మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –07 -01 -12 . గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com
మా విజయుం జేరెడు వన్నెకాడు.
సవరించగలరు.ఇంకా ఒకటి రెండు స్ఖాలిత్యాలను కూడా సవరించండి.
ఇక్కడ ఓసారి వీలైతే చూడండి.
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B5%E0%B0%A4%E0%B0%AE%E0%B1%81-%E0%B0%A6%E0%B0%B6%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%82%E0%B0%A7%E0%B0%AE%E0%B1%81
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B0%A8%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%B5%E0%B0%A4%E0%B0%AE%E0%B1%81-%E0%B0%A6%E0%B0%B6%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%82%E0%B0%A7%E0%B0%AE%E0%B1%81