ఆకాశ దేవర –ఆకాశం గగనం శూన్యం
నమస్తే మధు సూదన రావు గారు —.మొన్న ”ఆకాశ దేవర”కధా పుస్తకా విష్కరణ పెద్ద ఎత్తున జరిపి నందుకు సంతోషం .ఇప్పుడే చదవటం పూర్తి చేశాను .బహుశా రెండేళ్ళ క్రితం బాపు గారు ఒక సినిమా తీశారు .పేరు జ్ఞాపకం లేదు -”సుందర కాండ” అనుకొంటా – ,..కాని అందులో” చార్మి” హీరోయిన్ ,ఆమెకో తండ్రి -ఒక జమీందార్ .వాళ్ళిద్దరికీ కనెక్షన్ కట్ అయింది తల్లిని దొంగ పెళ్ళో ,వుంచుకోవటమో వల్ల .ఆ తర్వాత తండ్రి కోసం ఈమె వెతుకు లాట .మొత్తం మీద తండ్రిని ,ఆమె అతని కూతురని చెప్పకుండా ఏదో సందర్భం గా అతన్ని రక్షించి దగ్గరకు చేరు తుంది .విలన్ కోట శ్రీని వాస రావు .అతన్నీ బుట్టలో వేసి ,రాజా కీయం నేర్పుతుంది .ఒక అడవిలో రాత్రికి రాత్రి ఒక విగ్రహం దొరికి నట్లు ,ప్రచారం చేసి ,స్తలాన్ని కబ్జా చేయించి అర్జంట్ గా గుడీ కట్టి ,దుకాణాలు ,పూజలు ,పునస్కారాలు ,తండోప తండాలుగా జనం .మొక్కు బళ్ళు అన్నీ సాగుతాయి .”ఆకాశ దేవర” చదవంగానే నాకు ఆ సినిమా జ్ఞాపకం వచ్చింది ‘
అంటే -నా ఉద్దేశ్యం లో కదేమీ కొత్తది కాదు .నగ్నముని రాశాడు కనుక గొప్పది చేసినట్లని పించింది ..ఏ విషయం లోను నాకు నూతనత్వం కని పించ లేదు .జ్ఞాపకం చేసు కోవటానికి ఒక్క వాక్యమూ లేదు .ఒక్క మాటా inspiring గా లేదు ..కధనం చాలా దెబ్బతింది .దీన్ని కధ అనటం కంటే ”కదోపన్యాసం ”అంటే ఖచ్చితం గా బాగుంటుంది .దీనికోసం సుబ్బా రావు గారు కాఫ్కా ,దాస్తో విస్కీ దాకా వెళ్ళారు .అంత సీన్ లేదు .అలానే సశ్రీ ఆవేశ పడి ,మంచి నీళ్ళు తాగి గొంతు చిన్చుకోవాల్సిన పదార్ధము లేదు .సాదా సీదా కధ .ఒక డాక్యు మెంట్ అంటే .ఇది సంఘం లోజరుగు తున్నదే .దీనికి విలోమ కధ అనటం ,ఆ పేరు తో ఊరేగించటం అవసరం లేదు .ఆంద్ర జ్యోతి శ్రీనివాస్ అన్నట్లు ””ప్రయోగ శీలత చూపించక పోవటం” పెద్ద లోటు గా కని పిస్తుంది .నగ్న ముని రాయాల్సిన విధానం గా ,రాయాల్సినంత గొప్ప గా లేదని నాకు అనిపించింది .సాదా సీదా గా వుండటం బాధ పెట్టింది .అంతే కాదు అంతా వాచ్యం అవటం లో పట్టు లేకుండా పోయింది .మీరు పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం లేక పోవటం విచార కరం .అయితె నగ్న ముని చివరలో మాట్లాడిన మాటలు ,ఆయన సంఘాన్ని చూసిన చూపు నాకు చాలాఆనందాన్ని కల్గించాయి .అంతటి స్థిత ప్రజ్నత్వం ఆయన సాధించారంటే ఆశ్చర్యమేసింది .పాత నగ్న మునేనా ?అని సందేహమూ వచ్చింది .ఏమైనా ,మీరైనా నేనైనా ,నగ్నముని గారైనా ,ఎవరైనా ,వ్యవస్థ హైజాక్ అవుతుంటే ప్రేక్షకుల మాదిరి అయి పోతున్నాం .మాటల్లో తప్ప చేతల్లో ఏమీ చేయ లేని స్తితి .గొంగట్లో తినటం లాంటిదే మనం చేస్తున్నది .ఆ వెంట్రుకల్ని ఏరేసి ముందుకు సాగటమే .ప్రజల కనీస అవసరాలు తీర్చ లేని పరిస్తితుల్లో ప్రభుత్వాలు వున్నాయి .ప్రభుత్వాల్ని నడిపించేది ,కుర్చీ లో కూర్చోబెట్టేది విధాన నిర్ణయాలు చేసేది కార్పోరేట్ సంస్థలే .ఈ విషయాలన్నీ ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ (అమెరికా )2010 రాసిన Cotemporary India and governance ” అన్న పుస్తకం లో విస్తృతం గా చర్చించారు .దానిపై radio లో నేను ప్రసంగం చేశాను కూడా .నగ్నముని చెప్పినవన్నీఆయన ఎప్పుడో చాలా relevent గా చర్చించి ,చెప్పారు .బహుశా నాకు కొత్తదనం కని పించ క పోవటానికి అదీ కారణమేమో కూడా .ఈ పుస్తకం మీద విస్తృత చర్చ జర గాలన్న మీ అందరి అభిలాష తీరాలని ఆశిస్తున్నాను .నన్నూ మీలో ఒకడిని చేసి నందుకు కృతజ్ఞతలు .
ఏది ఏమైనా నిన్ననే ”ఆకాశ దేవర ”పుస్తకం ఫ్రంట్ ,అండ్ బాక్ పేజీలను ,మీరు సిర్క్యులర్ చేసిన కాగితాన్ని మొత్తం నాలుగు పేజీలు స్కాన్ చేసి” సరసభారతి” లో పెట్టాం.
ప్రజలు కూడా చాలా తమాషా గా వుంటారు ,ఆలోచిస్తారు .నిన్నా మొన్నా లిబియా ఉదంతం చూస్తె ఆశ్చర్యం వేస్తుంది .గడాఫీ నియంతే అయినా ,కోట్లు సంపాదించుకొని కొడుకులకు ఇచ్చినా ,దాచుకొన్నా ప్రజలకు maaximum ,సేవలందించాడు .ఉచిత విద్య ,ఉచిత ఇల్లు ,కారు కొంటె సగం ఖర్చు ప్రభుత్వానిదే ,వైద్యం ఇంటా ,బయటా ఫ్రీ .వ్యవ అసాయాం చేస్తానంటే పొలం ఇచ్చి అన్ని వసతులు కల్పించి ,సాయం చేస్శాడు .ఎడారి లో పంటలు పండించాడు .కరెంట్ బిల్ లేదు .ఉద్యోగం కోసం ఏ దేశానికి లిబియా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేశాడు . అన్ని సౌకర్యాలు కల్పిస్తే విద్యార్ధులంతా ఏకమై,అవినీతి పేరు చెప్పి దేశం నుంచి గెంటేశారు .ఇది చూస్తె ,వింటే ,చదివితే ఆశ్చర్యం. .మనకేమో పావలా చేతి లో పెట్టి పది కోట్లు నొక్కేసిన ఘనులను నెత్తి మీద ఇంకా ఆ బ్రాండ్ పేరు తో మోస్తూనే వున్నాం . ఆ ప్రజలు తెలివి గల వారా ?,మనమా ?అని సందేహం వస్తోంది .అక్కడా వ్యూహం అంతా అగ్ర రాజ్యానిదే .అస్తిరత్వం వాళ్ల కు వరం .ఇప్పుడు మనమీదకు వల విసురు తున్నారు .పాకిస్తాన్ మీద ద్వేషం అనే పేరు తో మన సరిహద్దులకు చేరి మనల్ని పావులుగా వాడుకొనే అతి ప్రమాద పరిస్తి తి లో భారత దేశం వుంది .అందరు ఆలోచించాల్సిన అవసరం కల్పిస్తున్న విచిత్ర స్తితి .పాక్ మీద కోపం పేరుకే ,పాగా వేయటం కోసమే ఇదంతా .వాళ్లకు మనకు ఉభయ భ్రస్టుత్వమే. . అక్షర లక్షలు చేసే ”శ్రీ రమణ మిధునం ”చదివింతర్వాత ”ఆకాశ దేవర” చదివితే ”ఆకాశం ,గగనం ,శూన్యం ”అని పించింది .ఒక రకం గా ఆయన రాసిందీ అంతే శూన్యం లోనే గారడీ చేసి ఆకాశ హర్మ్యం కట్టాడు కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com