పోతన లో తాను -6 –చివరి భాగం
— ”పుట్టి నేర్చెనో ,పుట్టక నేర్చెనో ?–చిట్టి బుద్దు లిట్టి ,పొట్టి వడుగు
పొట్ట నున్న పిల్ల ,బూమెలునని నవ్వి -యెలమి ధరణి ,దాన మిచ్చె నపుడు”
అన్న పద్యం లో అంతర్లీనం గా ,కవితా వ్యాప్తి వుందని ఒక బుధ వరేన్యుడు అన్నారు .శైలికి ఉదహరించ వలసి వస్తే ,భాగవతం అంతా ఉదాహరించాల్సి ఉంటుందని ,నన్ను ఆకాశానికి ఎత్తిన వారూ వున్నారు .సమభావం తో చూడమనే నేను విన్న విన్చుకొంతున్నాను .వాగ్భూషణం భూషణమే ,అయినా అది మోతాదు ను మించ రాదు .
”భూషణములు వాణికి నఘ –పేషనములు ,మృత్యు చిత్తి భీషణములు,హృ
త్తోష ణములు ,కళ్యాణ వి -శేషణములు హరి గుణోపచిత భాషణ ముల్
రాసలీల శ్రీ కృష్ణ పరమాత్త్మ అద్భుత లీల .అదొక కమనీయ దృశ్య కావ్యం .ఎప్పుడో రామావ తారం లో ఋషులు ”పుమ్సామోహనుడు ,ఏక పత్నీ వ్రతుడు ,అయిన శ్రీ రామ చంద్ర మూర్తిని ,”పరిష్వంగ సుఖం ”కోరారు .వారికి ఆ అవకాశం ”బహుపత్నీ రూప జీవితాతరుడు గా ,ప్రభవించ నున్న శ్రీ కృష్ణావ తారం లో లభింప జేశారు పరమాత్మ .ప్రాకృత మాధుర్య స్పర్శ పొందిన గోపికలు ,మాధుర్య దర్శనానికి ప్రతీక లై నిలిచారు ”అని చక్కని అనుభూతిని కల్గించారు అంతరార్ధం తెలిసిన మహనీయులు .
వేణు గానం చేత ఆకర్షిమ్పబడి ,క్రమంగా రాస మండల నృత్యం లో భాగ స్వామినులై ,కాత్యాయినీ దీక్షా వ్రతులై ,శ్రీ కృష్ణుణ్ణి భర్త గా పొందాలని కోరుకొన్నారు .ఆయన్నే సర్వాత్మనా శరణు పొందితే కాని ,ఆ అదృష్టం లభించదు .ఇదే అర్జునునికి ఆ తర్వాత కురు క్షేత్ర సంగ్రామం లో గీతా చార్యునిగా ”సర్వ ధర్మాన్ పరిత్యజ్య ,మామేకం శరణం వ్రజా”అని ఉపదేశించ టానికి ”బీజం ”.నదులు ,సముద్రాలు ,ప్రకృతి స్వరూపాలు .వీరు ,వీరికి స్వస్వరూప కేంద్రాలుగా వుండే స్థానాల్లో లీనం కావటం ,ఒక అనాచ్చాదిత సహజ సమ్మేళనం .అక్కడ నదులు సాగారాలలో ,గ్రహ ,తారాదులు ,సూర్యునిలో ,ఆకాశం వాయువుతో ,వాయువు అగ్నితో ,ఇలా జరిగే ఏ సంగామానికైనా ,దిక్కులే అంబరాలు .ఆ సంగమమే ప్రళయం -అంటే ప్రకృష్ట లయం .ఇక్కడ కూడా ,గోపికలు శ్రీ కృష్ణుణ్ణి పోనడటం లో ,దిక్కులు అమ్బరాలుగా కలిగి వుంటారు .వారు కోరింది పరిష్వంగ సుఖం .ఆయన ఇచ్చింది ముక్తి కాంతా పరిష్వంగ సుఖం .అదే జన్మ చరితార్ధమైన అపూర్వ సన్ని వేశం .ఆత్మ పరమాత్మ లో కలిసే అద్భుత దృశ్యం .పులకించిన తనువులతో ,వీక్షించాల్సిన పునీత విషయం, విశేషం .
”గోపజనము లందు ,గోపిక లందును –సకల జంతువు లందు సంచరించు
నా మహాత్మునకు ,బరాన్గన లెవ్వరు –సర్వ మయుడు లీల సల్పె గాక ”.
”ఎవ్వని చే జనించు ,జగమెవ్వని లోపల నుండు లీలమై
ఎవ్వని యందు డిందు , బరమేశ్వరుడే వ్వడు ,మూల కారణం
బెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు ,సర్వము దానయైన వా
డెవ్వడు ,వాని ,నాత్మభవు ,నీశ్వరునే శరణంబు వేడెదన్ ”
అని సృష్టి ,స్తితి ,లయ కారకుడైన పర బ్రహ్మాన్నిసంస్మరిస్తున్నాను .
లీలా మానుష విగ్రహుడైన శ్రీ కృష్ణ భగవానుని ,ప్రవర్తనం ,సంభాషణం ,స్తవనీయమే .లోక సంగ్రహార్ధం అతిధి ని యెట్లా సత్కరించాలో ,బాల్య స్నేహితులను ఎలా ,సంబావిన్చాలో ,శ్రీ కృష్ణుడు ”కుచేలో పాఖ్యానం ”లో ఆచరించి చూపాడు .అది ఆయన ప్రవర్తనమే .నేనేమో నిమిత్త మాత్రుడిని .ఆయన రాయిస్తున్న ఆయన చరిత్రం ,ఔచితీయుతం గా కాక ఇంకేలాగా వుంటుంది ?
ఆంద్ర మహా బాగవతం లో శిల్ప రహశ్యాలన్నీ మీకు కరతలా మలకాలే .వాటిని మళ్ళీ వివరిస్తూ మిమ్మల్నిఇబ్బంది పెట్టను .కొన్ని విశేషాలను మాత్రం వివ రించాలి- తప్పదు .
రుక్మిణీ కళ్యాణ ఘట్టం లో శ్రీ కృష్ణ పరమాత్మ పాంచ జన్య శంఖాన్ని పూరించే సందర్భం లో
”పూరించెన్ హరి పాంచ జన్యము ,క్రుపామ్భోరాసి ,సౌజన్యమున్
భూరి ద్వానా చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారో దార సిత ప్రభాచకిత ,పర్జన్యాది రాజన్యమున్
దూరీ భూత విపన్న దైన్యమును ,నిర్ధూత ద్విషత్సైన్యామున్ ”
”శంఖానికి పూరించితం సార్ధకతను ”పూరించెన్ ”అనే మాట తో ,శార్దూల విక్రేడిత పద్యం లో విక్రీడితమైంది .శంఖ ధ్వని ”భం ,భం ”అని విని పించాటానికి ”భకారాం ”అయిదు సార్లు ప్రయోగించటం జరిగింది .పాంచజన్యం కనుక ”అయిదు భకారాలు” చోటు చేసుకొన్నాయి .దానితో వీర రస స్పోరకం గా పద్యం సాక్షాత్కరించింది .ధ్వనికి అనుకరణం గా ”సౌజన్య ,చైతన్య ,దైన్య ,సైన్య ,”శబ్దాలతో సాధింప బడింది ”అని ఒక సహృదయుడు చాలా బాగా విశ్లేషించాడు .పూరించిన వాడు పరమాత్మ కనుక ,ఆ శబ్దాలు ,అర్ధాలు అంతగా ఒదిగి పోయాయి .ప్రతిధ్వనించాయి .అరి వీర భయంకర మైనాయి .
గజేంద్ర మోక్ష ఘట్టం లో ”అల వైకుంఠ పురంబులో ”అనే పద్యం మొదలు పెట్టి ,కొంత నడిచే సరికి నాలో అహం అడ్డు వచ్చిందేమో ,ఆగి పోయింది .అహం తగ్గి ,మళ్ళీ పరమేశ్వర ధ్యాన నిమగ్నుడను కాగానే ,పరమాత్మ స్వయం గా వచ్చి ,ఆ పద్యాన్ని పూరించిన సంగతి మీకు అందరికీ తెలుసు .ఈ పద్యం ,ఎత్తు గడ ”మత్తేభ విక్రీడితం ;;లో .ఆ తర్వాత ,”సిరికిం జెప్పడు ”ఆ తర్వాత ”తన వెంటన్ సిరి ,లచ్చి వెంట నవ రొద వ్రాతము’ ,;ఆ తర్వాత ”తన వేంచేయు పధం బు ,”ఆ పిమ్మట ”చనుదెంచెన్ ఘనుడల్ల వాడే ”,అనే పద్యం ,చివరికి ”కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె ”ఆ ఘట్టం లోని చివరి పద్యం దాకా ,అన్నీ మత్తేభాలే .ఇదొక వింత స్తితి .గజేంద్రుడు ”రావే వరద ,సంరక్షించు భద్రాత్మకా ‘అని వేడి కోలు చేశాడు .శ్రీ హరి ”మత్తేభ రక్షణా యత్త చిత్తుడై ”హడావిడి గా పరుగెత్తు కొంటు వచ్చేశాడు .ఆయన హృదయం లో అడుగడుగునా ”మత్తేభ వృత్తాంతమే ”మెదులు తున్నది .ఆయన మనసు తన భక్తుడైన ”మత్తేభ ”మయమయింది .అందుకే ,అలా మత్తేభాలు పద్యాల్లో పరిగెత్తాయి .కరి అంటే ఏనుగు అది వేగానికి ప్రసిద్ధం .అందుకే పరమాత్మ అంత త్వరగా రాగలి గాడు దీనుడైన భక్తుని ”కుయ్యి ”ఆలకించి ..అందుకే శ్రీ హరికి ”ఏనుగు అంబారి ”కూర్చాను పద్యాలలో .అదొక దివ్య మైన ఊహా సంచారమే .నా మానస మత్తేభాన్ని అధిరోహించి ,ఆజ్ఞా పించేది ఆ ఇభ రాజ వరదుడే .
శ్రీ మన్నారాయణ చరితామృత పానాన్ని ,రుచి చూప వలసినది పోయి ,నా సోది విని పించానేమోఇంత వరకు .ఆ అఘ ప్రక్షాళనకు హరినామ సంకీర్తనం చేసి ,తరిద్దాం
”శ్రీ కృష్ణా ,యదు భూషణా ,నరసఖా ,శృంగార రత్నాకరా
లోక ద్రోహి నరేంద్ర వంశ దహనా ,లోకేశ్వరా ,దేవతా
నీక బ్రాహ్మణ గోగ ణార్తి హరణా ,నిర్వాణ సంధాయకా
నీకున్ మ్రొక్కెద ద్రుమ్పవే ,భవ లతల్ ,నిత్యాను కంపానిదీ ;”
మరి ”అమ్మ ”లేనిది ఇహ పర సౌఖ్యాలు లేవు కదా .ఆమెను ఒక సారి స్మరిస్తా .
”హరికిం బట్టపు దేవి ,పున్నెముల పోవర్ధంపు ,బెన్నిక్క చం
దురు ,తో బుట్టువు ,భారతీ గిరి సుతల్ ,దొనాడు పూబోడి ,తా
మర లందున్ డేడి ,ముద్దరాలు ,జగముల్ మన్నించు నిల్లాలు ,భా
సురతన్ ,లేములు వాపు ,దల్లి ,సిరి యిచ్చున్ ,నిత్య కల్యాణముల్ ”
హరి హరులకు భేదం లేదనే విషయం ముందే మనవి చేశాను మీకు .అందుకే మా కులదైవం భోళా శంకరుడు —
”వాలిన భక్తీ మ్రొక్కెద నవారిత తాండవ కేళి కిన్ ,దయా
శాలికి ,శూలికిన్ ,శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌలికి ,గపాలికి ,మన్మధ ,గర్వ పర్వతో
న్మూలికి ,నారదాది ,ముని ముఖ్య మనస్సరసీ రుహాళికిన్ ”
అలాగే లక్ష్మీ దేవికీ ఉమాదేవికీ భేదం లేదని కదా ఉపనిషత్తులు ,పురాణాలు ఘోషిస్తున్నాయి .అందుకే అమ్మ వారికో దండం పెట్టు కొందాం
”అమ్మల గన్న యమ్మ ,ముగురమ్మల మూల పుటమ్మ ,చాల పే
ద్దమ్మ ,సురాసురులమ్మ ,కడు పారడు పుచ్చిన యమ్మ ,తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల ,మనమ్ముల నుండెడి యమ్మ ,దుర్గ ,మా
యమ్మ ,కృపాబ్ది ఈ వుత ,మహత్వ ,కవిత్వ పటుత్వ సంపదల్ ”
దాదాపు 500 ల సంవత్సరాలు అయినా ,తెలుగు భాగవతం మీ అందరి నాలుకలపై ,నర్తిస్తూనే వుంది .ఎందరెందరో పరిశీలన ,పరిశోధనా చేస్తూనే వున్నారు .శ్రీ వెంకటేశ్వర పాద పద్మాల చెంత ,నాపై ఒక అధ్యన కేంద్రం వుందట .”ఈ అన్న ”పై మీకు ఎంత ఆదరం వుందో నాకు తెలుస్తోంది .మీ సహృదయతకు నా నమో వాకాలు .ఇది నా భాగ్యం ,నా అదృష్టం .నాకు ఈ అదృష్టాన్ని కల్పించింది నా నాలుక పై నర్తించే శ్రీ శారదా మాత .ఆ యమ్మ అనుగ్రహ ప్రసాదమే ఈ వ్యాప్తికి కారణం
”శారద నీరదేందు ఘన సార పటీర ,మరాళ ,మల్లికా
హార ,తుషార ,ఫేన రజతాచల కాశ ఫణీశ ,కుంద మం
దార ,సుధా పయోధి ,సిత తామర సామర ,వాహినీ శు
భా కారత ,నొప్పు ,మది గానగ నెన్నడు గల్గు భారతీ ”
బుధ జన విదేయుదనై ,మీకు నా నమస్కరాన్జలులు సల్పు తున్నాను .మీ యెదలో పదిలం గా కల కాలం ,నిల వాలని ,కోరు కొంటున్నాను .ఆ భాగ్యాన్ని ప్రసాదించి ,మిమ్ములను సుఖ శాంతులతో జీవించే ట్లు ,దీవించ వలసినది గా ,శ్రీ హరిని
”ఒక సూర్యుండు సమస్త జీవులకు ,తానోక్కోక్కడై ,తోచు ,పో
లిక ,నే దేవుడు ,సర్వ కాలము ,మహా లీలలన్ ,నిజోత్పన్న ,జ
న్య కదంబంబుల హ్రుత్సరోరుహలన్ ,నానా విధా నూన రూ
పకుడై ,యోప్పుచు నుండు ,నట్టి ,హరి నే, ప్రార్ధింతు శుద్దుం డనై ”
అని ప్రార్ధిస్తూ ,ఆంద్ర సాహితీ లోకానికి సంక్రాంతి శుభా కాంక్ష లంద జేస్తూ మీ వద్ద సెలవు తీసు కొంటున్నాను .
మీ –బుధ జన విధేయుడు –పోతన్న -మీ అనుంగు అన్న .
సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గ ప్రసాద్ –07 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com